cabinet approves surrogacy bill

వితంతువులు కూడా గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు!: సరోగసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సరగసీ.. అద్దె గర్భం పర్వంలో ఇది కొత్త వివాదం. ఇల్లు అద్దెకిచ్చినట్లుగా గర్భాన్ని అద్దెకివ్వటమేంటి? కన్నపేగుకు వెలకట్టటమేంటి? వంటి ఎన్నో వివాదాలు…విమర్శలు ఎన్నో..ఎన్నెన్నో.సరోగసిపై భిన్నవాదనలు ఉన్నాయి. సరోగసీ ద్వారా బిడ్డల్ని మరో కడుపులో పెంచి పుట్టిన తరువాత ఆ బిడ్డల్ని తీసేసుకుని డబ్బుతో బిడ్డల్ని కొనుక్కుంటున్న దందాలు కూడా లేకపోలేదు. డబ్బు ఆశతో పేద మహిళలు తమ గర్భాన్ని అద్దెకిచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కొద్దో గొప్పో డబ్బు వస్తోంది కదా అని సరిపెట్టుకుంటున్నారు.

కానీ ఈ అద్దె గర్భాలను ఆసరాగా చేసుకుని ఓ మాఫియానే తయారైంది. పేద మహిళల్ని టార్గెట్ చేసుకుని  ఈ మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ అంశంపై కొన్ని కేసులు కోర్టు మెట్లు కూడా ఎక్కాయి. ఈ క్రమంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 

మహిళలు తమ ఇష్టపూర్వకంతో తమ గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై బుధవారం (ఫిబ్రవరి 26,2020) కేంద్ర కేబినెట్‌ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ కూడా  తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ ఈ బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో చెప్పారు.

సరోగసీని వ్యాపారంగా కాకుండా..మంచి ఉద్దేశమైతే సరొగసీకి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యాలని మంత్రి చెప్పారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. భారత్‌కు చెందిన దంపతులు మాత్రమే ఈ బిల్లులోని అంశాలను పరిగణలోకి తీసుకుని సరోగసి చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. 

కాగా..సరోగసీ చట్టాలను సవరిస్తూ గత ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. కానీ సరోగని విషయంలో దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై పలు  విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. సూచనలు చేసింది. ఈ బిల్లును బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 

See Also>>ఇండియా అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన మ్యాక్స్ వెల్!

బిల్లులోని ముఖ్యాంశాలు
కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో జాతీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు
అద్దెకు గర్భాన్ని ఇచ్చే మహిళకు చేసే బీమా మొత్తాన్ని 36 నెలలకు పెంచారు.
మానవ పిండాలు, గామేట్స్‌ (బీజం) కొనుగోలు, విక్రయాలపై నిషేధం. నైతిక సరోగసికి మాత్రమే అనుమతి. భారతీయ దంపతులు, భారతీయ సంతతి దంపతులు, 35–45 ఏళ్ల వితంతు మహిళ లేదా విడాకులు పొందిన మహిళలకే సరోగసి అనుమతి లభిస్తుంది. 

READ  చిరుతపులి చెంపలు వాయించేసిన బల్లి..!! : తరువాత ఏం జరిగిందో చూడండీ..

Related Posts