9 నెలల గర్భంతో పరుగుపందెం.. 5నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తిన మహిళ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

California woman runs 5:25 mile at 9 months pregnant : గర్భం ధరించిన మహిళలు చిన్న చిన్న వ్యాయామాలు తప్ప పరుగులు పెట్టకూడదనీ..కనీసం పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడవకూడదనీ..బరువులు ఎత్తకూడదనీ..ఇలా డాక్టర్లు చాలా జాగ్రత్తలు చెబుతారు. ముఖ్యంగా పరుగులాంటి నడక కూడా గర్భిణిలకు ప్రమాదమేనంటారు డాక్టర్లు. నెలలు గడిచేకొద్దీ గర్భిణిలు మరింత జాగ్రత్తగా ఉండాలి. తొమ్మిది నెలలు వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి.కానీ 9 నెలల గర్భంతో ఓ మహిళ ఏకంగా పరుగును పూర్తి చేసింది.


వివరాల్లోకి వెళితే..యూఎస్ఏలోని కాలిఫోర్నియాకు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ మాకెన్నా మైలర్ గర్భంతో ఉన్నారు. ఆమె తన రోజువారీ ఫిట్ నెస్ లో భాగంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతీరోజు వ్యాయామం చేస్తుంటారు. ఈక్రమంలో గర్భంతోఉన్నంత మాత్రాన తాను ఎందుకు పరుగు పెట్టకూడదు..గర్భంతో ఉన్నంత మాత్రాన సుకుమారంగానే ఉండాలా? పరుగు పెట్టకూడదా? అని అనుకున్నారు. అదే మాట తన భర్తతో చెప్పగా అతను కూడా ప్రోత్సహించాడు. నీకూ నాకు పందెం..ఈ పరుగు కంప్లీట్ చేస్తే నీకు మంచి గిఫ్టు ఇస్తానంటూ ప్రోత్సహించాడు. దీంతో మాకెన్నా ఈ పందెంలో నెగ్గాలనుకుంది.


దీంతో ఆమె తన సహజమైన ఫిట్ నెస్ తో పరుగు ప్రారంభించింది. సాధారణ వ్యక్తులకు సైత 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తిచేయాలంటే 9 నుంచి 10 నిమిషాలు పడుతుంది. కానీ మాకెన్నా మాత్రం 1.6 కిలోమీటర్లను కేవలం ఆరు నిమిషాల్లోపు అంటే 5 నిమిషాల 25 సెకల్లో పూర్తిచేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. మాకెన్నా పరుగు పెడుతుంటే ఆమె భర్త వీడియో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టటంతో ఆమె పరుగు ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.


పరుగు పందెంలో పాల్గొన్న ఆమె ఓ సాధారణ వ్యక్తి ఎలా పరిగెడతారో..గర్భంతో ఉన్న మహిళా కాకుండా అలాగే పరుగు పెట్టిందామె. ఈ విషయంపై మాకెన్నా మాట్లాడుతూ..గర్భంతో ఉన్న నేను ఈ పరుగును పూర్తి చేస్తానని అనుకోలేదనీ..ఓ గర్భిణీగా వారం వారం పాటించాల్సిన అన్ని ఆరోగ్య నియమాలను పాటిస్తున్నాననీ..ఫిట్ నెస్ ఉంటే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు మాకెన్నా.


తొమ్మిది నెలల గర్భంలో ఈ పరుగు పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందనీ..మొదట తాను నా బేబీ గురించి ఆలోచించాను…కానీ ‘నేనెందుకు చేయలేను?’ అనే ప్రశ్న వేసుకుని సాధించగలననే నమ్మకంతూ ఈ పరుగును పూర్తిచేశానని తెలిపారు.


కాగా ఫిట్ నెస్ కోసం అంకితమైన మాకెన్నా గర్భం ధరించాక కరోనా వైరస్ బారిన పడ్డారు. కానీ తన ఫిట్ నెస్ తోను తగిన జాగ్రత్తలు తీసుకంటూ మహమ్మారిని సైతం జయించటం మరో విశేషం. కాగా మాకెన్నా పరుగు ప్రపంచ రికార్డు అయి ఉంటుందని దీన్ని గమనించాలని కోరుతున్నారు పలువురు.

Related Tags :

Related Posts :