Home » CAAకు వ్యతిరేకంగా కేంబ్రిడ్జ్ తీర్మానం
Published
12 months agoon
By
madhuభారతదేశంలో CAA ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తుతున్నాయి. ఇతర దేశాల్లో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదవుతున్నాయి. తాజాగా కేంబ్రిడ్జ్ సిటీ కౌన్సెల్ 2020, ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం సీఏఏకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. దేశ లౌకిక రాజ్యాంగాన్ని సమర్థించాలని భారత పార్లమెంట్‌కు సూచించింది.
2019, డిసెంబర్ 11వ తేదీన భారత పార్లమెంట్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించింది. మతం అనేది ప్రమాణంగా ఉపయోగిస్తుందని నగర కౌన్సెల్ దృష్టికి వచ్చిందని తీర్మానంలో వెల్లడించారు. మోడీ ప్రభుత్వం..అణిచివేత విధానాలు, విలువలకు విరుద్దంగా ఉందని తెలిపింది. అమెరికాలోని మండలిలో ఒకటైన సీటెల్ ఇదే విధమైన తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. సీఏఏ, ఎన్నార్సీలను కౌన్సెల్ ఏకగ్రీవంగా తిరస్కరించింది.
సీఏఏ వంటి చట్టాలు నాటి నాజి జర్మనీని గుర్తు చేశాయని రాచెల్ వ్యోన్ వెల్లడించారు. 1930లో జరిగిన ఘటనలను గుర్తుకు తెచ్చుకోవాలని, సీఏఏ, ఎన్ఆర్సీ రాజ్యాంగ విరుద్ధమన్నారు. అట్టడుగు వర్గాలను అణగదొక్కడానికి రూపొందించబడ్డాయన్నారు. పాక్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన అధిక మంది ముస్లింలు భారతదేశానికి 2015 కంటే ముందు వచ్చారని, పౌరసత్వ సవరణ చట్టం..లౌకిక రాజ్యంగాన్ని ఉల్లంఘిస్తోందంటూ..సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తు చేసింది.
ఈ చట్టం రావడంతో..భారతదేశ ముస్లిం మైనార్టీల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దేశంలోని 1.3 బిలియన్ జనాభాలో వీరు 15 శాతం ఉన్నారని అంచనా. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు, ఆమ్నేస్టీ, హ్యూమన్ రైట్స్ వాచ్ సీఏఏ చట్టంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదొక వివక్షగా అభివర్ణించారు యూఎన్ మానవ హక్కుల కమీషనర్.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనలు విదేశాలకూ పాకాయి. అమెరికాలోని 30 రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఈక్వాలిటీ ల్యాబ్స్, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ తదితర సంస్థలు ప్రదర్శనలకు నేతృత్వం వహించాయి.