ఒంటె విశ్వాసం : ఎడారిలో 100కి.మీటర్లు ప్రయాణించి అమ్మేసిన యజమాని దగ్గరకు తిరిగి వచ్చేసిన ఒంటె

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జంతువులలో విశ్వాసానికి మారు పేరు అనగానే ఎవ్వరికైనా కుక్క గుర్తుకు వస్తుంది. ఈ విషయం ఎన్నో సార్లు జురువైంది.కానీ..విశ్వాసంలో నాకేం తక్కువ అని ఓ ఒంటె నిరూపించింది. ఓ యజమాని ఎంతో ప్రేమగా పెంచుకున్న ఒంటె ముసలిదైపోయిందని మరొకరికి అమ్మేశాడు. అలా తాను కొనుక్కున్న ఒంటెను తీసుకెళ్లిపోయాడతను.

అంతకాలం తనకు సేవలు చేసిన ఒంటెను అమ్మేసినా..పాత యజమానిపై విశ్వాసాన్ని ఆ ఒంటె మరిచిపోలేదు. పాత యజమానిని విడిచి ఉండలేకపోయింది. ఎనిమిది నెలల తరువాత ఏడు రోజుల పాటు ఎడారిలో ఒంటరిగా ప్రయాణించి తన పాతయజమాని దగ్గరకు వచ్చేసింది. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన దంపతులకు ఓ ఒంటె ఉంది. అది ముసలిదైపోయింది. దీంతో వాళ్లు 2019 అక్టోబర్ లో పశువుల సంతలో ఆ ఒంటెనుఅమ్మేశారు. అలా ఆ ఒంటెను కొనుక్కున్న వ్యక్తి దాన్ని తీసుకువెళ్లిపోయాడు. కానీ పాత యజమానిపై ఆ ఒంటె బెంగపెట్టుకుంది. తిండి తినేదికాదు..మనుష్యులాగనే కళ్లవెంట నీరు కారుస్తూ దిగులుగా ఉండే.

అలా పాత యజమానిపై బెంగతోనే దిగులుగా ఉండేది. ఆ ఒంటెను అమ్మిన ఎనిమిది నెలల తరువాత పాత యజమానికి వెతుక్కుంటూ ఎడారిలో ఏడు రోజుల పాటు ఏకబిగిన 100 కిలోమీటర్లు ప్రయాణించి పాతయజమాని దగ్గరకువచ్చేసింది. ఒళ్లంతా గాయాలతో ఉన్న ఆ ఒంటెను చూసిన ఆ దంపతులు ఆశ్చర్యానందాలకుగురయ్యారు.

కొన్న ఒంటె కనిపించకపోయేసరికి కొత్త యజమాని దాని కోసం పశువుల కాపరితో వెతికిస్తుండగా అది పాతయజమాని దగ్గరకు చేరుకుందని తెలిసింది. దాంతో అతన్ని సంప్రదించగా..మాపై ఈ ఒంటెకు ఉన్న ప్రేమను మేం వదులుకోలేం. కాబట్టి మా దగ్గర ఉన్నమరో ఆడ ఒంటెను ఇస్తానని చెప్పాడు. దానికి అతనుకు ఒప్పుకోవటంతో ఒంటె బెంగ తీరిపోయింది. చక్కగా పాత యజమాని దగ్గరే ఉండిపోయింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


దీనిపై నెటిజన్లు ఎంతో ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. ఆ ఒంటెను మరోసారి అమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొందరు ఈ ఒంటె విశ్వాసానికి మారు పేరుగా ఉండే కుక్కలను మించిపోయిందని అంటున్నారు.

Related Posts