Can online education be made accessible to all?

ఆన్‌లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉందా? : ఎంతవరకూ సాధ్యం?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోవిడ్ 19 వల్ల వచ్చిన లాక్ డౌన్ తో భారతదేశవ్యాప్తంగా 300 మిలియన్ల మంది విద్యార్థులను ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ తో స్కూల్స్, కాలేజెస్, యూనివర్శిటీస్ ఇలాఅన్ని విద్యాసంస్థలు మూత పడ్డాయి. దీంతో విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసెస్ ప్రారంభించినప్పటికీ ఆ క్లాసులను అందుకోలేని విద్యార్ధులు చాలాంది ఉన్నారు.

ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం లేని విద్యార్ధులు
భారతదేశంలోని 1.2 బిలియన్ జనాభాలో..600 మిలియన్ల మందికి మాత్రమే ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది. ఈ క్రమంలో ఆన్ లైన్ విద్య అనేది ఎంత వరకూ సాధ్యం అనే ప్రశ్న తలెత్తింది. ఆన్ లైన్ క్లాసులు సౌకర్యం కావాలంటేవిద్యార్ధులందరికీ స్మార్ట్‌ఫోన్‌లు తప్పనిసరి. అలాగే ఇంటర్ నెట్ సౌలభ్యం కూడా చాలా అవసంర.కానీ ఆ సదుపాయం అందరికీ లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు ఆన్‌లైన్ విద్యను పొందటానికి ఇది ఆటంకంగా మారింది.దీంతో ఇంటర్ నెట్ సదుపాయం లేని విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు కూడా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వీడియో క్లాసులను వినటానికి 4 జి అందుబాటులో లేకపోవటం కూడా ఒక ఆటంకంగా మారింది.

ఆన్ లైన్ విద్యలో తీసుకోవాల్సిన పద్ధతులు
ప్రాథమిక ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న విద్యార్థుల కోసం, ఉపాధ్యాయులు వారి క్లాసులను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అలా విద్యార్ధులు ఆఫ్‌లైన్‌లో చూసుకోవటానికి వీలుగా వీడియోల లింకులను విద్యార్ధులకు ఇమెయిల్ చేయవచ్చు. దీనికి స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అవసరం లేదు. కొన్ని ప్రాంతాలలో దూరదర్శన్ లో కూడా క్లాసెస్ లను నిర్వహిస్తున్నారు.అలాగే మామూలు ఫోన్ లలో కూడా కాన్ఫరెన్స్ కాల్ ఫెసిలిటీస్ తో ఆడియో క్లాసెస్ చేయవచ్చు.

ఆన్ లైన్ విద్య కోసం విద్యార్ధులకు స్మార్ట్ ఫోన్స్ డేటాప్లాన్ సరఫరా అవసరం
ఏది ఏమైనా..భారత ప్రభుత్వం అందరికీ ఆన్‌లైన్ విద్యను నిజంగా..చిత్తశుద్దితో అందుబాటులోకి తేవాలని అనుకుంటే..గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సదుపాయాలు ఉన్నవారికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు,డేటా ప్లాన్‌లను సరఫరా చేయాలి.

విద్యార్ధుల్లో చాలామందికి సమస్యగా మారిన ఇంగ్లీష్
ఆన్‌లైన్ విద్యకు మరొక ఆటంకం ఏమిటంటే..ఇంగ్లీషు రానివారికి అంటే నెట్ లో అందుబాటులో ఉండే వీడియోలు, యానిమేషన్లు,డేటాలు వంటివి ఇంగ్లీషులోనే ఉంటాయి. వీటిని భారతీయ జనాభాలో 10% మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలరు.అలాకాకుండా భారతదేశంలోని ప్రధాన భాషలలో ఆయా రాష్ట్రాల్లో ఉండే విద్యార్ధుల కోసం ఆయా భాషల్లో కంటెంట్ అందుబాటులోకి తీసుకురావాలి.

టీచింగ్ ల్లో వచ్చిన మార్పులు..రావాల్సినమార్పులు
బ్లాక్ బోర్డ్, క్లాస్ టెస్ట్ బుక్స్ ల్లోని లెసన్లను క్లాసెస్ గా చెప్పేందుకు చాలామంది టీచర్లు మంది అలవాటు పడ్డారు. ఇంకా కొంతమంది అలవాటు పడుతున్నారు. కానీ విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్‌ విద్యపై ఏమాత్రం ఇంట్రెస్ట్ గా ఉండటంలేదని తెలుస్తోంది.కాబట్టి టీచర్లు ఆన్‌లైన్ క్లాసుల కోసం పద్ధతులను మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం 45 నిమిషాలు టీచర్లు ఏకథాటిన మాట్లాడుతుంటే విద్యార్ధులు బోర్ ఫీలవుతున్నారు. ఆ క్లాస్ లోని లెసన్ పై ఏమాత్రం కంటెంట్ ను అర్థం చేసుకోలేరు.విద్యార్థులకు ఇంట్రెస్ట్ కలిగేలా ఫ్యాకల్టీ పద్ధతి మార్చుకోవాలి.

READ  ముహూర్తం ఫిక్స్ : 27న సీఎంగా ప్రమాణస్వీకారం

కాబట్టి..కోవిడ్ 19 లాక్డౌన్ తో సంబంధం లేకుండా, ప్రతి భారతీయ విద్యార్ధికి ఆన్‌లైన్ విద్యను సులభతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం, ఎన్జీఓలు, ఎడ్టెక్ కంపెనీలు,విద్యా సంస్థల సంయుక్త ప్రయత్నాలతో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

Read Here>>ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రుల అవస్థలు.. 

Related Posts