లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

‘అతనికి 27 మంది భార్యలు..ఒకొక్క ఇంట్లో ఇద్దరు..’ పిల్లలెంతమందంటే..

Published

on

canadian teen tiktok on world largest polygamist cult: ఎవరన్నా ఒకటీ రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుంటారు.మహా అయితే పది పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి గురించి కూడా వార్తలు చదివే ఉంటాం. కానీ ఏకంగా 27మంది భార్యలు ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసా? అంటే నోరెళ్లబెడతాం..ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతాం. కానీ ఇది నిజమే. స్వయానా ఆ 27మంది భార్యలున్న వ్యక్తి కొడుకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా..‘ మా నాన్నకు 27మంది భార్యలు’ అంటూ వెల్లడించాడు.

 

కెనడాకు చెందిన మెర్లిన్ బ్లాక్ మూర్ అనే 19 నవ యువకుడు ‘ మా నాన్న విన్‌స్టన్‌(64) కు 27మంది భార్యలు’ అంటూ తన టీకా‌టాక్ వీడియో ద్వారా తెలియజేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే లేని పోని చికాకులు, సమస్యలు వస్తాయని..వింటే ఎవరన్నా నవ్వుతారేమోనని..ఇప్పటి వరకూ మెర్లిన్ బ్లాక్ ఈ విషయాన్ని చెప్పలేదట. కానీ ఇప్పటికైనా చెప్పాలని అనిపించి వారి కుటుంబం ఫోటోను షేర్ చేస్తు వెల్లడించాడు.

‘మా నాన్నకు 27 మంది భార్యలు.. ఒక్క ఇంట్లో ఇద్దరు..’ అంటూ తన కుంటుంబం గురించి మెర్లిన్ బ్లాక్ మూర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యావత్ ప్రపంచంలో ఇంతమంది భార్యలున్న ఓకే ఒక వ్యక్తి ఇతడేనా అనే పేద్ద డౌటనుమానం వచ్చేసింది నెటిజన్లలకు. ఈ వీడియో ద్వారా మెర్లిన్ చాలా విషయాలు చెప్పాడు. తాము సొంత తల్లిని ‘మామ్’ అని పిలుస్తామని..మిగతా తల్లుల్ని ‘మదర్’ అని పిలుస్తామని తెలిపాడు. తనకు టీనేజ్ వయసులో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 150 మంది ఉన్నారని..వీరందరినీ ఓ ప్రత్యేక భవనంలో తన తండ్రి ఉంచుతాడని..చెప్పుకొచ్చాడు. అంతేకాదు..తన తండ్రి తన 27మంది భార్యల్లో ఇద్దరు భార్యలకు ఓ ఇంటి చొప్పున కేటాయించాడని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం మెర్లిన్‌తో పాటూ అతడి ఇద్దరు అన్నలూ కూడా తమ కుటుంబానికి దూరంగా అమెరికాలో ఉంటున్నారు. తమ కుటుంబం గురించి తెలియజేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా…కానీ ఇన్నాళ్టికి చెప్పానని అన్నాడు. ఇక మా అతి పెద్ద కుటుంబం గురించి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది’ అని మెర్లిన్ తన వీడియోలో తెలిపాడు.

ఇంత పెద్ద కుటుంబం కావడంతో తమకు తినటానికి భారీగా సరుకులు కావాల్సి వచ్చేవి. దీంతో తమ పంటను తామే పండించుకునేవారమని, వ్యవసాయానికి సంబంధించి పిల్లలు పలు బాధ్యతలు తీసుకునే కష్టపడి పనిచేసేవారని తెలిపాడు. మెర్లిన్ కుటుంబంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తన తండ్రికి ఉంన్న ఈ 27 మంది భార్యల్లో సొంత అక్కచెళ్లెల్లు కూడా ఉన్నారట…!!