Home » ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లీ కొత్త రికార్డు.. @12వేలు
Published
2 months agoon
By
vamsiVirat Kohli New Record: ఆసీస్‌తో టూర్లో సిరీస్ కోల్పోయింది భారత్.. అయితే చివరిదైన మూడవ వన్డేలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు టీమిండియా కెప్టెన్ కోహ్లీ. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో వేగంగా 12వేల పరుగుల మార్క్ దాటిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను దాటి మేటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును చేరుకోగా.. కోహ్లీ కేవలం తన 251 మ్యాచ్‌ల్లో 241 ఇన్నింగ్స్‌లలో 12వేల వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 309 మ్యాచ్‌ల్లో 300 ఇన్నింగ్స్‌లలో 12వేల వన్డే పరుగుల మైలురాయి చేరుకున్నాడు . 2003 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై సెంచూరియన్‌లో ఆడిన 98 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో టెండూల్కర్ ఈ రికార్డును అధిగమించాడు. ఈ రికార్డు క్రియేట్ చేసిన ఆటగాళ్లలో విరాట్ ఆరవ వ్యక్తి. భారతదేశం నుంచి 12వేల వన్డే పరుగులు చేసిన రెండవ ఆటగాడు విరాట్. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీకి 12వేల పరుగుల కోసం 23 పరుగులు చేయవలసి ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 78బంతుల్లో 63పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్.. టెండూల్కర్ తరువాత మూడవ స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర, సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే కూడా వన్డేల్లో 12వేల పరుగులు సాధించారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లలో కోహ్లీ మాత్రమే ఈ రికార్డు చేసినవారిలో ఉన్నాడు.
వేగవంతమైన వన్డే రన్ స్కోరర్లు:
విరాట్ కోహ్లీ (ఇండియా) Vs ఆస్ట్రేలియా, కాన్బెర్రా, 2 డిసెంబర్ 2020
మ్యాచ్‌లు: 251, ఇన్నింగ్స్: 242, తేదీ: ఆగస్టు 18, 2008
సచిన్ టెండూల్కర్ (ఇండియా) Vs పాకిస్తాన్, సెంచూరియన్, 1 మార్చి 2003
మ్యాచ్‌లు: 309, ఇన్నింగ్స్: 300, తేదీ: 18 డిసెంబర్ 1989
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) Vs ఇంగ్లాండ్ , సెంచూరియన్, 2 అక్టోబర్ 2009
మ్యాచ్‌లు: 323, ఇన్నింగ్స్: 314, తేదీ: 15 ఫిబ్రవరి 1995
కుమార్ సంగక్కర (శ్రీలంక) Vs పాకిస్తాన్ , దుబాయ్, 20 డిసెంబర్ 2013
మ్యాచ్‌లు: 359, ఇన్నింగ్స్: 336, తేదీ: 5 జూలై 2000
సనత్ జయసూర్య (శ్రీలంక) Vs ఆస్ట్రేలియా , బ్రిడ్జ్‌టౌన్, 28 ఏప్రిల్ 2007
మ్యాచ్‌లు: 390, ఇన్నింగ్స్: 379, తేదీ: డిసెంబర్ 26, 1989
మహేలా జయవర్ధనే (శ్రీలంక) Vs ఇండియా , హైదరాబాద్, 9 నవంబర్ 2015
మ్యాచ్‌లు: 426, ఇన్నింగ్స్: 399, తేదీ: జనవరి 24, 1998
వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో టీంఇండియా ఆటగాళ్లు ఇద్దరు ఉండగా, ఆస్ర్టేలియా నుంచి రికీ పాంటింగ్, శ్రీలంక నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.
12000 ODI runs for King Kohli 👑
He’s the fastest to achieve this feat 🔥🔥#TeamIndia pic.twitter.com/5TK4s4069Y
— BCCI (@BCCI) December 2, 2020