లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

తిండి పెట్టి జీతం ఇచ్చే ఉద్యోగం – రుచి చూసి చెప్తే గంటకు రూ,1700 జీతం

Published

on

candy fun house candyologist jobs notification : పొద్దుట్నించి సాయంత్రం దాకా కష్టపడితేనే యజమాని నెలాఖరున ఉద్యోగికి జీతం ఇస్తాడు. కొంత మంది దినసరి కూలీలు ఉంటారు. వారు ఏరోజు లెక్క ఆరోజు తీసుకుంటారు. గంటలెక్కన సంపాదించే వాళ్లు ఉంటారు. ఇలాగ ప్రపంచంలో 90 శాతం ప్రజలు తిండి కోసం, బతకడం కోసం ఉద్యోగమో, వ్యాపారమో, వృత్తో చేసి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు.

కానీ ఊరికే కూర్చోపెట్టి తింటూ డబ్బులు సంపాదించే ఉద్యోగం చేస్తే అందరూ ముందుంటారు. ఏ ఒక్కరికో కానీ ఆ అదృష్టం రాదు. దానికోసం ఎదురు చూసే వాళ్లు ఉన్నా, వారిని వరిస్తుందో లేదో చెప్పలేము….. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశాన్ని కెనడాకు చెందిన ” క్యాండి ఫన్ హౌస్ ” అనే క్యాండీలు తయారు చేసే సంస్ధ ఆఫర్ చేస్తోంది.

‘ క్యాండి ఫన్‌హౌస్‌’’ అనే క్యాండీల తయారీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. క్యాండీ, చాక్లెట్‌ టేస్ట్‌ టెస్టర్‌ జాబ్స్‌కు దరాఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 15వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది. ఫిబ్రవరి15కు ఇంకా చాలా టైముంది కదా అని ఆలస్యం చేయకుండా ముందు మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. సదరు కంపెనీ తయారు చేసే పదార్ధాలను రుచి చూసి వాటి టేస్ట్ చెప్పే ఉద్యోగుల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది.

గంటకు 30 కెనడియన్‌ డాలర్లు( దాదాపు 1700 రూపాయలు) ఇస్తామంటోంది. ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిందల్లా ఆ కంపెనీ తయారు చేసే 3,000 క్యాండీలు, చాక్లెట్లను రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పాలి.