ఖమ్మం జిల్లాలో రూ.10.5 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

cannabis seized, 4 held, in khammam district : ఖమ్మం జిల్లాలో కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు మంగళవారం ఉదయం జిల్లాలోని తిరుమలాయపాలెం, కొక్కిరేణి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కారును ఆపి సోదాలు చేయగా కారులో తరలిస్తున్న రూ.10.5లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా గంజాయి తరలిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరు పాడు మండలం గురువాగు తండాకు చెందిన హళావత్ శివా,భూక్యాకిషన్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కు చెందిన ప్రతాప్, ఒడిషాకు చెందిన పూర్ణాలను అదుపులోకి తీసుకున్నారు. వీరు గంజాయిని తొర్రూరుకు తరలిస్తున్నట్లు అంగీకరించారు.కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేస్తున్నారు.


Related Tags :

Related Posts :