Home » ‘కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్’ ఫస్ట్ లుక్..
Published
1 month agoon
Cantonment Post Office: టాలెంట్ ఉన్న యూత్‌కి ఆడియెన్స్‌కి మధ్య వారధిలా నిలుస్తూ.. ప్రతిభగల వారిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి డిజిటల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు.. ఓటీటీల పుణ్యమా అని సినిమా అంటే ప్యాషన్ ఉన్నవారు తాము చెప్పాలనుకున్న కథలను ప్రేక్షకులకు చేరువయ్యేలా మరింత అందంగా చెప్పగలుగుతున్నారు. అదే కోవలో అలెగ్జాండర్ కింగ్ దర్శకత్వంలో ‘కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్’ అనే వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా.. ఇప్పటివరకు వెబ్ ఫిల్మ్స్‌లో రాని డిఫరెంట్ పాయింట్‌తో.. చక్కటి సందేశంతో ‘కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్’ మూవీ తెరకెక్కుతోంది.. మంచాల అంజయ్య సమర్పణలో.. అలెగ్జాండర్ కింగ్ రచన, దర్శకత్వంతో పాటు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ‘కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వ భాషా మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ విడుదల చేశారు.
తను ఎంచుకున్న పాయింట్‌ని మంచి బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు అలెగ్జాండర్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ వేదికగా ‘కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ మూవీకి సంగీతం : అల్లాన్ ప్రీతమ్, కెమెరా : ప్రవీణ్ కె బంగారి, ఎడిటింగ్ : రేవంత్.