car accident in banjara hills

హోటల్‌‌లోకి దూసుకెళ్లింది.. బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారు ప్రమాదాలు జరిగాయి. అవి మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం(ఫిబ్రవరి

హైదరాబాద్ నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారు ప్రమాదాలు జరిగాయి. అవి మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం(ఫిబ్రవరి 23,2020) ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ఓ హోటల్ కి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదం తర్వాత అందులో ఉన్న యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా యువకులను గుర్తించే పనిలో ఉన్నారు. వీకెండ్ కావడంతో ఫుల్లుగా తాగి రోడ్డు మీదకు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిసున్నా.. తాగి వాహనాలు నడిపే వారిని జైలుకి పంపిస్తున్నా.. ఇంకా మార్పు రావడం లేదు. కొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయటమే కాకుండా.. అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. 

ఫిబ్రవరి 19న..మియాపూర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రెండు వాహనాలను ఢీకొట్టి హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్ లో ఉన్న వ్యక్తి ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి  గాయాలయ్యాయి. బైక్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని బీహెచ్ఈఎల్ కి చెందిన అఫ్సర్ గా గుర్తించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సంతోష్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు.

అటు నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర జరిగిన మరో కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అతి వేగంగా వస్తున్న కారు ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారులో ఉన్న యువకులు మద్యం సేవించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇలా వరుసగా జరుగుతున్న కారు బీభత్సాలు.. నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

Related Tags :

Related Posts :