car falls from bharath nagar bridge

హైదరాబాద్‌లో మరో ఘోర ప్రమాదం : బ్రిడ్జి పైనుంచి పడిన కారు.. ఒకరు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. భరత్‌నగర్ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్‌వైపు కింద పడిపోయింది.

బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. భరత్‌నగర్ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్‌వైపు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని సోహెల్‌గా గుర్తించారు. గాయపడిన వారిని బోరబండ పండిట్ నెహ్రూ నగర్ కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ AP 11 R 9189.

30 అడుగుల పైనుంచి పడింది:
కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వస్తుండగా కారు అదుపు తప్పింది. భరత్ నగర్ బ్రిడ్జిపై కింద పడింది. దాదాపు 30 అడుగుల పైనుంచి కిందపడటంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జి కింద ఎక్కువమంది జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

హాలీవుడ్ సినిమాల్లోని స్టంట్ సీన్ తలపించింది:
యాక్సిడెంట్ లో చనిపోయిన సొహైల్.. నిన్న(ఫిబ్రవరి 17,2020) రాత్రి 10.30 గంటల సమయంలో తన బంధువులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. మంగళవారం(ఫిబ్రవరి 18,2020) తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం హాలీవుడ్ సినిమాల్లో స్టంట్ సీన్ ను తలపించిందని.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో కారు వేగం 100 కిలోమీటర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి.. బ్రిడ్జి పైనుంచి పల్టీలు కొడుతూ కిందపడింది. కాగా.. కారు పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. కారు పడిన ప్రదేశానికి 10 నుంచి 20 మీటర్ల దూరంలో కొందరు కూలీలు పని చేస్తున్నారు. ఒకవేళ కారు కనుక వారి మీద పడి ఉంటే.. ఊహించని రీతిలో ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. కారు పైనుంచి కింద పడటాన్ని కళ్లారా చూసిన కూలీలు.. భయంతో పరుగులు తీశారు. వారి ఒళ్లు జలదరించింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పారు.

కూలీలపై కారు పడి ఉంటే..
కారు ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అంత ఎత్తు నుంచి కారు కిందపడటంతో షాక్ కి గురయ్యారు. ఎవరి మీద అయినా పడి ఉంటే.. ఘోరం జరిగేదన్నారు. కొన్ని రోజుల క్రితం(2019 నవంబర్ 23) గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనా ఇదే తరహాలో కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓవర్ స్పీడ్ తో కారు నడిపాడు. అదుపు తప్పిన కారు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడింది. కింద రోడ్డుపై నిల్చున వ్యక్తులపై కారు పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులకు ఏమీ కాలేదు. రోడ్డుపై నిల్చున్న అమాయకుల్లో ఓ మహిళ చనిపోవడం అందరిని బాధించింది. కొందరు తీవ్ర గాయాలతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కారు ప్రమాదం పలువురు అమాయకుల జీవితాల్లో తీరని విషాదం నింపింది.

నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ యాక్సిడెంట్:
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పై అతివేగంతో కారు సృష్టించిన బీభత్సం హైదరాబాద్ ప్రజలను వణికించింది. ఆ భయానక దృశ్యాలను నగరవాసులు ఇప్పటికీ మర్చిపోలేదు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై మలుపులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రమాదకర రోడ్డుపై వాహనాలు అతి వేగంతో దూసుకెళ్తుంటాయి. ఇక రోడ్డు ఏ మాత్రం నిర్మానుష్యంగా కనిపించినా వందకు మించిన స్పీడ్‌తో వెళ్తుంటాయి. ఆ రోజున ప్రమాదానికి అతి వేగమే కారణం. అతి వేగంతో దూసుకెళ్లడంతో మలుపు దగ్గర డ్రైవర్ కారుని కంట్రోల్ చేయలేకపోయాడు. లెఫ్ట్ సైడ్ రెయిలింగ్‌ను కారు ఢీకొట్టి.. అమాంతం గాల్లో ఎగరుతూ వెళ్లి కింద రోడ్డుపై పడింది. ఆ సమయంలో ఫ్లైఓవర్ కింద ఆటో కోసం వేచి చూస్తున్న సత్యవాణి అనే మహిళ ఈ ప్రమాదంలో స్పాట్ లోనే మృతిచెందింది. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. 

2

1

CAR

Related Tags :

Related Posts :