లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

నితిన్ కళ్యాణంపై కరోనా ఎఫెక్ట్ – పెళ్లి అక్కడా.. ఇక్కడా..

కరోనా ఎఫెక్ట్- హీరో నితిన్ వివాహంపై సందిగ్ధత నెలకొంది..

Published

on

Carona Effect on Hero Nitin's Wedding

కరోనా ఎఫెక్ట్- హీరో నితిన్ వివాహంపై సందిగ్ధత నెలకొంది..

కరోనా ఎఫెక్ట్ శుభకార్యాలపైనా పడుతోంది. గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే విడుదలవాల్సిన, విదేశాల్లో షూటింగులు జరుపుకోవాల్సిన పలు సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా యంగ్ హీరో నితిన్ పెళ్లి కూడా వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాళ్లోకి వెళ్తే.. హీరో నితిన్ నిశ్చితార్థం షాలినితో ఫిబ్రవరి 15న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెండు దశాబ్దాలుగా ప్రగతి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డా.సంపత్ కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినీని నితిన్ మనువాడబోతున్నాడు.

ఇటీవలే హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్లో నితిన్, షాలినీల వివాహ వేడుక నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇటీవల కంచి, చెన్నైలో వధూవరులు పెళ్లి దుస్తులు కూడా కొనుగోలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అరబ్‌ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో దుబాయ్‌లో జరగాల్సిన నితిన్‌ వివాహంపై సందిగ్ధత నెలకొంది.

అప్పటికి కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వస్తే దుబాయ్‌లో.. లేకుంటే హైదరాబాద్‌లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌ శివారులోని ఒక ఫామ్‌హౌజ్‌లో వివాహం జరిపించేందుకు వధూవరుల బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. రాబోయే 15 రోజుల్లో పరిస్థితిని బట్టి వివాహం దుబాయ్‌లో నిర్వహించాలా? లేదంటే హైదరాబాద్‌లోనా అనే విషయాన్ని ఫైనల్‌ చేయనున్నారు. పరిస్థితులు అనుకూలించకపోతే పరిమితమైన బంధువులు, సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్‌ శివారులో పెళ్లి జరిపించి ఏప్రిల్‌ 21న హైటెక్స్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *