Categories
71671 71715

విశాఖ గ్యాస్‌ లీక్ బాధితుల ఖాతాల్లోకి రూ.20 కోట్లు, ఎల్జీ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే

విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకు సీఎం జగన్ పరిహారం విడుదల చేశారు. సోమవారం(మే 18,2020) బాధితులతో

విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకు సీఎం జగన్ పరిహారం విడుదల చేశారు. సోమవారం(మే 18,2020) బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో బటన్ నొక్కిన సీఎం జగన్…. ఒకేసారి సుమారు 20వేల మంది గ్యాస్‌ లీకేజీ బాధితుల అకౌంట్లలో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 కోట్లు జమ చేశారు. 

గ్యాస్ లీక్ బాధ్యులను వదిలిపెట్టేది లేదు:
ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనకు బాధ్యులను వదలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం జగన్ చెప్పారు. నివేదికలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి వారైన విడిచిపెట్టబోమని తేల్చిచెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వేగంగా స్పందించారని.. రెండు గంటల్లోనే ప్రభావిత గ్రామాల నుంచి తరలించామని అధికారులను ఆయన ప్రశంసించారు. మృతులకు కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చామని.. అవసరమైతే వారికి గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు సీఎం. విశాఖ వంటి దుర్ఘటనలు జరిగితే గత ప్రభుత్వాలు ఎలా స్పందించాయో చూశానన్నారు.

2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు:
ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో..  నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయారు. ఆ ప్రమాదంలో ప్రమాదంలో సంస్థ రూ. 20 లక్షలు,.. కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం 2 లక్షలు అందించాయి. ఘటన జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటామని.. కంపెనీలకు హెచ్చరిక ఉండేలా ప్రభుత్వాలు స్పందించాలి. ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని కోరాను. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ నాకు అదే గుర్తొచ్చింది. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కలెక్టర్, కమిషనర్‌తో పాటు 110 అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. 2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు స్పందించిన తీరును అభినందనీయం’’ అని ప్రశంసించారు.

ఏ ప్రభుత్వం కూడా ఇలా స్పందించలేదు, రూ.కోటి పరిహారం ఎక్కడా ఇవ్వలేదు:
”మన ప్రభుత్వం స్పందించినంత వేగంగా ఎక్కడా స్పందించి ఉండరు. బాధితులకు రూ.కోటి పరిహారం ప్రకటించడం కూడా ఎక్కడా జరగలేదు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా కమిటీలు వేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో మూడు కమిటీలు వచ్చి పరిశీలించాయి. కంపెనీని ప్రశ్నించాల్సిన అంశాలన్నీ తయారు చేసి వారం సమయం ఇస్తాం. కంపెనీ నుంచి కూడా పూర్తి వివరాలు తీసుకుని కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితులకు ప్రత్యేక హెల్త్‌ కార్డులు ఇవ్వాలని సూచించాం. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి సంబంధించి ఈ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వమే ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఘటనకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలిపెట్టేది లేదు” అని జగన్ అన్నారు.

మే 7న విశాఖలో మహా విషాదం:
మే 7న విశాఖ నగరంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి స్టైరీన్ అనే గ్యాస్ లీక్ అయ్యింది. ఈ విషవాయులు కారణంగా 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేస్తామని తెలిపారు.

Read : ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం, ప్రైవేట్ ట్రావెల్స్ కూ అనుమతి, కొత్త నిబంధనలు ఇవే

Categories
71671 71715

ఇంటి దగ్గరే పరీక్షా కేంద్రాలు, పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల

కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించబోతుంది. విద్యార్థుల ఇళ్ల సమీపంలోనే ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పట్టణాలు, నగరాల్లో హాస్టల్స్ లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులు లాక్ డౌన్ తో స్వస్థలాలకు వెళ్లారు. ప్రస్తుతం వారంతా అక్కడే ఉంటున్నారు. చదివిన పాఠశాల ప్రకారం ఎగ్జామ్ సెంటర్స్ ను కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి వారం పాటు ఉండాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలా సమస్య కానుంది. ఇందులో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు, విద్యార్థుల సౌకర్యార్థం వారి నివాసానికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. మార్చి నెలాఖరులో జరగాల్సిన పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

పరీక్షల షెడ్యూల్:
జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్
జులై 11న సెకండ్‌ లాంగ్వేజ్
జులై 12న ఇంగ్లీష్
జులై 13న గణితం(మ్యాథ్స్)
జులై 14 సామాన్య శాస్త్రం(సోషల్)
జులై 15న సాంఘీక శాస్త్రం(సోషల్)

Read Here>> రాష్ట్రం లోపలే కాదు హైదరాబాద్‌కూ..బస్సులు నడపేందుకు అన్నీ రెడీ : మంత్రి పేర్ని నాని

Categories
71671 71715

తిరుమల శ్రీవారి భక్తులకు మరోసారి నిరాశే, అప్పటివరకు దర్శనాలు నిలిపివేత

తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే

తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే 31వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేశారు. కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఏపీ ప్రభుత్వం కూడా మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న ఆలయంలో దర్శనాన్ని అప్పటివరకు ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత దర్శనాల విధివిధానాలపై ఈ నెల 28న టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భక్తులకు దర్శనాల ఏర్పాట్లపై బోర్డు సభ్యులు చర్చించనున్నారు. కాగా, లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు టీటీడీకి రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే 18వ తేదీ నుంచి లాక్ డౌన్ 4 అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ 4 నిబంధనలకు అనుగుణంగా తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు. మతానికి సంబంధించి ఏ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కేంద్రం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారమే ఏపీలోనూ ఆదేశాలు కొనసాగనున్నాయి. 

ఇదిలా ఉండగా, దర్శనాలను కొనసాగిస్తే భక్తులు భౌతికదూరం పాటించేలా రెండు రోజుల కిందట క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్‌ చేయించిన విషయం తెలిసిందే. క్యూలైన్లలో మార్కింగ్, స్టిక్కర్లు అంటించే సరికి దర్శనానికి అనుమతి ఇచ్చినట్లేనని వార్తలొచ్చాయి. కానీ, లాక్ డౌన్ 4 నిబంధనలకు అనుగుణంగా మరోసారి దర్శనాలు నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Read Here>> అర్థరాత్రి వలస కూలీలకు స్వయంగా వండి పెట్టి ఆకలి తీర్చిన ఎస్పీ : అమ్మతనం అంటే అదే

Categories
71671

అర్థరాత్రి వలస కూలీలకు స్వయంగా వండి పెట్టి ఆకలి తీర్చిన ఎస్పీ : అమ్మతనం అంటే అదే

కరడు కట్టిన ఖాకీ దుస్తుల మాటన ఆడతనం పెల్లుబికింది. ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా..ఆడవారిలో ఎప్పుడూ అమ్మతనం పేగు కదులుతునే ఉంటుందని మరోసారి నిరూపించారు విజయనగరం ఎస్పీ రాజకుమారి. ‘ఆకలేస్తోందమ్మా..మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..కడుపు కాలిపోతోంది అర్థరాత్రి సమయంలో  వలస కూలీలు అడగటంతో చలించిపోయారు. కదిలిపోయారు. కన్నీటి పర్యంతమమైన ఏపీలోని విజయనగరం ఎస్పీ రాజకుమారి తన సహజమైన అమ్మతనాన్ని చాటుకున్నారు. 

వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన 11 మంది వలస కూలీలు నెల్లూరు జిల్లాలో పనుల కోసం వెళ్లారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వారు అక్కడే చిక్కుకుపోయారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో కొన్ని రోజుల పాటు కడుపు నింపుకున్నారు. తరువాత చేతిలో పైసా కూడా లేకుండా పోయింది. దీంతో ఆకలితో అలమటించిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కాలినడకన సొంతూరికు బయలుదేరారు. కడుపు కాలుతున్నా.. ఎండ మాడుతున్నా… లెక్కచేయకుండా నడక సాగించారు.  ప్రాణాలతో తమ జిల్లాకు చేరుకుంటే పిడికెడు అన్నం దొరుకుతుందని ఆశపడ్డారు. అలా అలా కాళ్లీడ్చుకుంటూ విజయనగరం జిల్లా చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ  ఆహారం ఉంటుందనుకున్న వారి ఆశ నిరాశే అయింది.

అలా చెక్ పోస్టు వద్దకు చేరుకున్న ఆ 11 మందిని పోలీసులు తీసుకెళ్లి క్వారంటైన్ లో పెట్టారు. ఓ వైపు ఆకలి పేగుల్ని మెలిపెట్టేస్తోంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మహిళ తనకు తెలిసిన ఓ మీడియా ప్రతినిధికి ఫోన్ చేయటంతో ఎస్పీ బి.రాజకుమారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ కు ఫోన్ చేసిన ఓ వలస కార్మికురాలు అమ్మా ఆకలేస్తోంది. మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు అంటూ అభ్యర్థించింది. 

అసలే లాక్ డౌన్ రోజులు నడుస్తున్న క్రమంలో  పొద్దున్నే లేచి విధులకు వెళ్లి ఏ అర్థరాత్రికో ఇంటికి చేరి కాస్తంత కునుకు తీసే సమయంలో అటువంటి ఫోన్ వస్తే ఎవరైనాసరే విసుక్కుంటారు. కానీ రాజకుమారి అలా విసుక్కోలేదు. ఈ సమయంలో ఫోన్ చేసింది ఎవరాని ఆలోచించారు. వెంటనే ఫోన్ తీయటంతో ‘అమ్మా ఆకలేస్తోందంటూ ఓ మహిళ దీనంగా అడిగేసరికి ఆమెకు నిద్ర మాయం అయిపోయింది. ఆకలేస్తోందమ్మా అని కన్నబిడ్డ అడిగితే తల్లి ఎలా స్పందిస్తుందో ఆమెకూడా అలాగే స్పందించారు. 

అలా ఫోన్ చేసిన మహిళ తాము 11 మంది ఉన్నామని అందరూ అదే దుస్థితిలో ఉన్నారని చెప్పింది. అంతే..ఆమెలో అమ్మతనం కదిలిపోయింది. వెంటనే పోలీసు అధికారులకు ఫోన్ చేసి  తినడానికి ఏమైనా దొరుకుతాయా? అని అడిగారు. ఈ అర్థరాత్రి  సమయంలో బ్రెడ్ మాత్రం తీసుకురాగలమని  చెప్పారు. మూడు రోజులుగా ఏమీ తినకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వారికి, బ్రెడ్ పెట్టటానికి ఆమెకు మనస్సు ఒప్పలేదు. 

వెంటనే ఎస్పీ సూర్యకుమారి స్వయంగా అన్నం వండారు. ఇంట్లో ఉన్న నిమ్మకాయలతో లెమన్ రైస్ కలిపారు. వాటిని పొట్లాలు కట్టారు. ఆ పొట్లాలను తీసుకుని వచ్చి వలస కూలీలకు ఇచ్చారు. అప్పటికి రాత్రి ఒంటిగంట అయింది.

అర్ధరాత్రి ఫోన్ చేశారని విసుక్కోకుండా ఓ ఎస్పీ స్వయంగా వంట చేసి ఒంటి గంట సమయంలో స్వయంగా తీసుకొచ్చి తమకు అందించడంతో ఆ వలస కూలీలకు కన్నీళ్లు ఆగలేదు. చేతులెత్తి దండం పెట్టారు. మా ప్రాణాలు నిలబెట్టావమ్మా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. గోడు అంతా చెప్పుకున్నారు. 

కానీ తొందరపడి ఎవరూ తొందరపడి ఇళ్లకు వెళ్లవద్దని ఆమె వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వం వారికి క్వారంటైన్ స్టాంపులు వేసిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తానని..అధికారులు వెళ్లమని చెప్పేవరకూ ఇళ్లకు వెళ్లవద్దని సూచించారు ఎస్పీ రాజకుమారి.

Read Here>> వలస కూలీలకు సీఎం జగన్ ఆసరా : సొంతూళ్ల వరకు ఫ్రీగా ప్రయాణం..భోజనం..షెల్టర్

Categories
71671 71744

ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మే 18,2020) కరోనా కేసులపై బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన వాటితో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 2వేల 282కి చేరింది. ఇప్పటివరకు 1,527 మంది కోలుకున్నారు. 705 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 50మంది చనిపోయారు.

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు:
చిత్తూరు 15
కృష్ణా 15
నెల్లూరు 7
తూ.గో 5
కర్నూలు 4
కడప 2
ప.గో. 2
విజయనగరం 1
విశాఖ 1

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:

CORONA

Read Here>> ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు

Categories
71671 71761

ఎంఫాన్ అలర్ట్ : ఏపీ వైపు దూసుకొస్తున్న ఎంఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాను మరింతగా బలపడింది. ఇది ఏపీ వైపు తీవ్రమైన వేగంతో దూసుకొస్తోంది. గంటలకు 150 కిలోమీటర్ల పెను గాలుల వేగంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఎంఫాన్ పెను తుఫానుగా మారుతోంది. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తుఫాను… వాయువ్య దిశలో వెళ్తూ… బుధవారం బెంగాల్‌లోని సాగర్ దీవులు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎంపాన్ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రా, రాయలసీమల్లో ఓ మోస్తరుగా వర్షాకుల కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈక్రమంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. 

 ఏపీలో ఇది తీరం దాటేలా లేకపోయినా… దీని ప్రభావం మాత్రం కనిపిస్తోంది. ఆదివారం ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చంటున్నారు. ఏపీ కంటే ఒడిశా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ భారీ వర్షాలు కురవొచ్చంటున్నారు.  ఏపీలో ఇది తీరం దాటేలా లేకపోయినా… దీని ప్రభావం మాత్రం కనిపిస్తోంది. ఆదివారం ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చంటున్నారు. ఏపీ కంటే ఒడిశా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంటుందని అంచనావేశారు.

ఏపీలో ఇది తీరం దాటేలా లేకపోయినా… దీని ప్రభావం మాత్రం కనిపిస్తోంది. ఆదివారం (మే 17,2020)న ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చంటున్నారు. ఏపీ కంటే ఒడిశా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ భారీ వర్షాలు కురవొచ్చంటున్నారు. 

 తెలంగాణలో కూడా సోమ, మంగళవారం అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులతో చిన్న పాటి వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఆకాశంలో మేఘాలు అటూ ఇటూ కదులుతూ ఉంటాయనే అంచనా ఉంది. అయినప్పటికీ వేడి మాత్రం ఎక్కువగానే నమోదు కానుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైనే ఉండొచ్చంటున్నారు. తెలంగాణలో కూడా సోమ, మంగళవారం అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులతో చిన్న పాటి వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. 

Read Here>> బంగాళాఖాతంలో అల్ప పీడనం.. 24 గంటల్లో Amphan తుఫాన్

Categories
71671

ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.  రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49 మంది మృతి చెందారు. 1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 803 మందికి చికిత్స కొనసాగుతుంది. 

ఇవాళ నమోదైన కేసుల్లో గుంటూరు 9, నెల్లూరు 9, కర్నూలు 9 చిత్తూరు 8, కృష్ణా 7, విశాఖ, 4, కడప1, పశ్చిమగోదావరి 1 కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు ఇప్పటివరకు 608 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 413,  కృష్ణా జిల్లాలో 367 మంది కరోనా బారిన పడ్డారు. 

ఏపీలోని కొన్ని జిల్లాలో దాదాపుగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు ఐదు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగతా జిల్లాల్లో కోయంబేడు నుంచి వచ్చినటువంటి వారికి టెస్టులు చేయగా వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని జిల్లాలో 9, 8,7 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదైతే దాంట్లో దాదాపు 31 కేసులు కోయంబేడు నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా పాజిటివ్ కేసులుగా తేలింది. కేవలం 17 కేసులు మాత్రమే ఏపీలో ఉండి ఇక్కడున్నవంటి వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్ల నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో గడిచిన 24 గంటల్లో కరోనా ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 49కి చేరింది. 

ఇప్పటివరకు 9628 శాంపిల్స్ తీస్తే దాంట్లో కేవలం 48 మందికి మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 15 రోజులుగా క్రమేపి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. కోయంబేడు నుంచి వచ్చిన వారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో వారికి మాత్రమే పాజిటివ్ కేసులు సంఖ్య ఆ విధంగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో 803 మంది చికిత్స పొందుతున్నారు. 

గడిచిన 24 గంటల్లో 101 మంది పూర్తి స్థాయిలో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వెళ్లారు. 1353 మంది పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి వెళ్లారు. కేవలం నాలుగు జిల్లాల్లో మాత్మే కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఐదు జిల్లాల్లో ఒక కేసు కూడా మనోదు కాకపోవడం కొంత ఆశాజనకమైన పరిణామం. ఆయా ప్రాంతాల్లో పఠిష్టమైన చర్యలు, లాక్ డౌన్ అమలు, రెడ్ జోన్ల ఏరియాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడమే దీనికి కారణమని భావిస్తున్నారు.

Read Here>> ఏపీలో కరోనా @ 2,205 : కర్నూలులో 608, గుంటూరులో 413

Categories
71671 71715

ఏపీలో కరోనా @ 2,205 : కర్నూలులో 608, గుంటూరులో 413

ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం కొత్తగా 48 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్‌ కేసుల సంఖ్య 02 వేల 205 కు చేరుకుంది.

ఇందులో వేయి 353 మంది డిశ్చార్జ్ చేశారు. 49 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 803 గా ఉందని..ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కర్నూలు జిల్లాలో 608 కేసులు చేరగా..కృష్ణాలో 367, గుంటూరులో 413 అత్యధికంగా కేసులు నమోదయ్యాయని తెలిపింది. 

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో కర్నూలు 09, నెల్లూరులో 09, చిత్తూరులో 08, విశాఖపట్టణం 02, గుంటూరు 01,  కడప 01, వెస్ట్ గోదావరి 01 నమోదయ్యాయి. తమిళనాడు నుంచి మొత్తం 31 మంది వచ్చారని హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 

జిల్లాల వారీగా : అనంతపురం 122. చిత్తూరు 173. ఈస్ట్ గోదావరి 52. గుంటూరు 413. కడప 102. కృష్ణా 367. కర్నూలు 608. నెల్లూరు 149. ప్రకాశం 63. శ్రీకాకుళం 07. విశాఖపట్టణం 72. విజయనగరం 07. వెస్ట్ గోదావరి 70. ఇతరులు 70. 

కోవిడ్ పరీక్షలు : గడిచిన 24 గంటల్లో 09 వేల 628 శాంపిల్స్ పరీక్షించగా..48మందికి పాజిటివ్ ఉందని తేలింది. 

డిశ్చార్జ్ అయిన వివరాలు : గడిచిన 24 గంటల్లో 101 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. కర్నూలులో 47, అనంతపూర్ లో 37, కృష్ణాలో 05, తూర్పుగోదావరి 03, ప్రకాశం 03, పశ్చిమ గోదావరి 03, కడపలో 02, విశాఖలో 01 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ చేయబడిన వారి సంఖ్య 1353కి చేరింది. 

రాష్ట్రంలో కొత్తగా నమోదైన మరణాలు : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కర్నూలులో ఒక్కరు చనిపోయారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 49కి పెరిగింది.  

Read Here>> ఏపీలో మరో 57 కరోనా కేసులు

Categories
71671

సైకిళ్లపై వెళ్తున్న వలసకూలీలపై లాఠీఛార్జ్

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తిండిలేక పట్టణంలో బతకలేక ఇంటిదారి పట్టిన వలసకూలీలను రోడ్లపై పరుగులు పెట్టించారు పోలీసులు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. వారంతా నడుచుకుంటూ స్వస్థలాలకు పయనం అవగా, అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఏపీ సీఎస్ నీలం సాహ్ని వారిని చూసి ఆగి వివరాలు తెలుసుకున్నారు. 

అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడి నుంచి స్వస్థలాలకు పంపాలని ఆదేశించారు. సీఎస్ ఆదేశాలతో వలస కూలీలందరినీ అధికారులు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించగా.. ఉదయం వారందరికీ అల్పాహారం అందజేవారు. ఈ క్రమంలోనే సైకిళ్లపై వచ్చిన దాదాపు 150 మంది కూలీలు టిఫిన్ చేసి తిరుగుముఖం పట్టారు.

వీరంతా విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు చూసి అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. దీంతో కూలీలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. అనంతరం వారిందరినీ పట్టుకుని తిరిగి విజయవాడ క్లబ్‌కు తరలించారు. 

Read Here>> ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం…11మంది కూలీలు మృతి

Categories
71671 71723

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. 24 గంటల్లో Amphan తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో భారీ తుఫానుగా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఒడిశాలో ఉన్న 12తీరప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోని లోతట్టు తీర ప్రాంతాలకు హెచ్చరికలు అందజేశారు. 

వాయువ్యదిశలో ఆరంభమై మే 17వరకూ కొనసాగుతుందని.. మళ్లీ మలుపు తీసుకుని ఉత్తర వాయువ్య దిశలో కొనసాగుతూ మే18-20తేదీల్లో బంగాళాఖాతం తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాలను మరో ఐదారు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

శుక్రవారం ఒడిశాలోని అన్ని జిల్లా కలెక్టర్లు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చూడాలని చెప్పారు. దక్షిణ ప్రాంతంలోని, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలోని మత్స్య కార్మికులు వేటకు మే 15నుంచి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు. 

Read Here>> monsoon rains బ్యాడ్ న్యూస్ : ఆలస్యంగా రుతు పవనాలు