Categories
71680 71723

స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు

కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్పటికే తమ ఉద్యోగులలో13 శాతం మందిని తొలగించినట్లు ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రకటించగా,ఇప్పుడు అదే బాటలో స్విగ్గీ చేరింది.

దేశవ్యాప్త లాక్ డౌన్ 4.0 ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సమయంలో స్విగ్గీ నుంచి ఉద్యోగులకు ఈ బ్యాడ్ న్యూస్ వచ్చింది. రాబోయే కొన్ని రోజుల్లో 1,100మంది(14శాతం)ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ సోమవారం(మే-18,2020)ప్రకటించింది. ఊహించనివిధంగా ఉద్యోగాల తగ్గింపు ప్రక్రియను చేపట్టాల్సి రావడం…ఈ రోజు స్విగ్గీకి విచారకరమైన రోజులలో ఒకటి అని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు,సీఈవో శ్రీహర్ష మజీతీ.. తమ ఉద్యోగులకు ఇవాళ పంపిన ఈ మెయిల్ లో తెలిపారు.

చాలా అస్థిరంగా ఉన్న లేదా చాలా సందర్భోచితంగా ఉండని సమీప వ్యాపారాలను రాబోయే 18 నెలల పాటు మూసివేయనున్నట్లు స్విగ్గీ CEO తెలిపారు. కరోనా కారణంగా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.  ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుందో ఎవ్వరికీ తెలియదని, అయితే తక్కువ కాలం దీని ప్రభావం స్విగ్గీపై దీని ప్రభావం తక్కువ కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో స్విగ్గీ సీఈవో తెలిపారు.

Read: రెడ్ జోన్లలోనూ ఈ కామర్స్ ‘నాన్-ఎసెన్షియల్స్’ డెలివరీకి అనుమతి

Categories
71680 71715 71723

రెడ్ జోన్లలోనూ ఈ కామర్స్ ‘నాన్-ఎసెన్షియల్స్’ డెలివరీకి అనుమతి 

కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందుకు అనుమతి  ఉండేది. ఇప్పటినుంచి రెడ్ జోన్లలో కూడా నిత్యావసరేతర సరకుల డెలివరీకి అనుమతినిచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోనూ నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమితినిచ్చింది. దేశవ్యాప్తంగా మూడోసారి లాక్ డౌన్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 

ఈ లాక్ డౌన్ అన్ని జోన్లకు వర్తించనుంది. దేశంలో కరోనా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆన్ లైన్ సేల్స్ విషయంలో కఠినమైన ఆంక్షలు అలానే కొనసాగనున్నాయి. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతి ఉన్న జోన్లలో కూడా ఇదే తరహా ఆంక్షలు వర్తించనున్నాయి. కంటైన్మెంట్ జోన్లను కఠినంగా నిర్వహించనున్నారు. అత్యవసర వైద్య సాయం, నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి మినహా ఇతరులు ఎవరూ బయట తిరగడానికి అనుమతి లేదు. ప్రత్యేకించి నిషేధించిన సర్వీసులు మినహా అన్ని కార్యకలాపాలను రెడ్, గ్రీన్, ఆరెంజ్, బఫర్ జోన్లలోనూ నిర్వహించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేసింది. 

కంటైన్మెంట్ జోన్లలో మినహా ఇతర అన్ని జోన్లలో సెలూన్లు తెరుచుకోవచ్చు. అది కూడా ఆయా రాష్ట్రాలు అనుమతినిస్తే అనే విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏదిఏమైనా సెలూన్లు, మాల్స్ తెరిచేందుకు అనుమతి లేదు. మూడో దశ లాక్ డౌన్ సమయంలో బార్బర్ షాపులు, సెలూన్లను కూడా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో తెరిచేందుకు అనుమతి ఉంది. మార్చి 25 లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి ఉంది. నాన్ ఎసెన్షియల్ వస్తువులకు డెలివరీ చేసేందుకు ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు అనుమతి లేదు. 

Read Here>>సాఫ్ట్ బ్యాంకు బోర్డు నుంచి అలీబాబా జాక్‌మా రిజైన్

Categories
71680 71715 71723

ఇంత సంక్షోభంలోనూ..జీతాలు పెరిగాయి

కరోనా వైరస్ ఎంతో మందిని కష్టాల పాల్జేసింది. ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేసింది. ఇంకా వైరస్ విస్తరిస్తునే ఉంది. దీని కారణంగా..లాక్ డౌన్ ప్రకటించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. పరిశ్రమలు, దుకాణాలు, చిన్న చిన్న పరిశ్రమలకు తాళాలు పడ్డాయి.

ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. తీవ్ర నష్టాన్ని కలుగ చేశాయి. ఆర్థిక రంగం కుదేలు కావడంతో.. భారీ కంపెనీలు సైతం నష్టాల పయనించాయి. దిగ్గజ పారిశ్రామిక వేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలో రిలయెన్స్ కు సైతం కష్టాల పాలు చేసింది. 

కానీ ఓ పరిశ్రమ మాత్రం..తమ దగ్గర పనిచేస్తున్న వారికి వేతనాలు పెంచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపేందుకు తాము వేతనాలు పెంచడం జరిగిందని ఏషియన్ పెషేంట్స్ ప్రకటించింది. కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రూ. 35 కోట్లు భారీ విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాలకు రూ. 40 కోట్లను బదిలీ చేయడం విశేషం. 

అమ్మకాల విభాగం..సిబ్బందికి బీమాతో పాటు దవాఖానా ఖర్చులకు సాయమందిస్తోంది. సంస్థలో పనిచేసిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చేపట్టిన చర్యలన్నింటినీ..ఎప్పటికప్పుడు..తమ బోర్డు డైరెక్టర్లకు వివరించి..వారి ఆమోదం పొందామని ఏషియన్ పెయింట్స్ ఎండీ, సీఈవో అమిత్ సింగ్డే వివరించారు. 

Read Here>> జొమాటోలో 500పైగా ఉద్యోగుల తొలగింపు…6నెలలు 50శాతం జీతం కట్

Categories
71680 71706 71715

ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ కాబోతున్న జెఫ్ బెజోస్, ఆ తర్వాత ముకేష్ అంబానీ

కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.

కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇక ప్రపంచ కుబేరులపైనా కరోనా ప్రభావం చూపింది. పలువురి ఆస్తులు తరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కుబేరులంతా లక్షల కోట్లు కోల్పోతుంటే.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(62) మాత్రం కరోనా కారణంగా మరింత పైకి వెళ్తున్నాడు. కరోనా కారణంగా అమెజాన్ సంస్థకు చెందిన సర్వీసులపై ఆధారపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అమెజాన్ సంస్థల నికర ఆస్తుల విలువ అమాంతం పెరుగుతూ పోతోంది. 

పెరుగుతూనే ఉన్న బెజోస్ ఆస్తుల విలువ:
2017 నుంచి ఇప్పటివరకు జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోనే కొనసాగుతూ వస్తున్నాడు. ఏప్రిల్ 12న 125 బిలియన్ డాలర్లుగా ఉన్న జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం 143 బిలియన్ డాలర్లకు చేరింది. నెల రోజుల్లోనే దాదాపు 20 బిలియన్ డాలర్ల నికర ఆస్తుల విలువ పెరిగింది. ఇదిలా ఉండగా.. అమెరికాకు చెందిన కంపారిసన్(comparisun) అనే బిజినెస్ అడ్వైజ్ ప్లాట్‌ఫామ్ న్యూయార్క్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌లోని 25 హై వాల్యూడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అనలైజ్ చేసింది. ఆయా కంపెనీల గత ఐదేళ్ల అభివృద్ధిని రానున్న ఐదేళ్లతో పోల్చి చూసింది. 

2026 నాటికి ట్రిలియన్ డాలర్లు:
ఈ లెక్కల బట్టి జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 2026 సంవత్సరానికి ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. 179 దేశాల జీడీపీ కంటే జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువే ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయిన ఘనతను జెఫ్ బెజోస్ దక్కించుకోనున్నాడు.

2033లో ట్రిలియనీర్ కానున్న అంబానీ:
ఇక ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ బెజోస్ కంటే దాదాపు ఒక దశాబ్దం తర్వాత ట్రిలియనీర్ హోదా పొందగలడని సంస్థ అంచనా వేసింది. జుకర్‌బర్గ్ ప్రస్తుత రేటు పెరుగుదల విలువ 1 ట్రిలియన్ డాలర్లు. అప్పటికి అతడి వయసు కేవలం 51 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక భారత దేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ 2033లో 75 ఏళ్ల వయసులో ట్రిలియనీర్ అవ్వగలడని కంపారిజన్ సంస్థ చెబుతోంది. చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జు జియాయిన్ 2027 లో ప్రపంచంలో రెండవ ట్రిలియనీర్‌గా అవతరించడానికి బెజోస్‌ను అనుసరిస్తాడంది.

అలీబాబా యొక్క జాక్ మా 2030 లో ట్రిలియనీర్ కావచ్చని అంచనా. అప్పటికి అతడి వయసు 65 సంవత్సరాలు. సంస్థ విశ్లేషించిన 25మంది వ్యక్తుల్లో పదకొండు మందికి మాత్రమే వారి జీవితకాలంలో ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఇటీవలి సంపద వృద్ధి రేటు ఆధారంగా.

ట్రిలియనీర్లు అయ్యే వారి జాబితాలో ఉన్న ఇతర వ్యక్తులు
* టెన్సెంట్ హోల్డింగ్స్ ఛైర్మన్, CEO మా హువాటెంగ్
* బెర్నార్డ్ ఆర్నాల్ట్, మోయిట్ హెన్నెస్సీ పేరెంట్ LVMH CEO
* మాజీ మైక్రోసాఫ్ట్ CEO స్టీవ్ బాల్మెర్
* డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్
* గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్.

Read Here>> విమానాల్లో పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌ లకు కొత్త డ్రెస్సులు..

Categories
71680 71715 71723

ఆర్థిక సంక్షోభానికి.. నగదు ముద్రణే పరిష్కారం!

దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్‌-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. నిధుల్లో రూ.6.8 లక్షల కోట్లను నగదు ముద్రణ ద్వారా సమకూర్చాల్సిందిగా కేంద్రం ఆర్బీఐని కోరే అవకాశమున్నదని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ (BOFA) తెలిపింది.

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోడీ సర్కార్‌ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు 10 శాతం విలువైన ఉద్దీపనలను ప్రకటించింది. ఈ 10 శాతంలో 7.3 శాతం నిధులను కేంద్రం వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకోగలదు. మిగిలిన 2.7 శాతం (రూ.6.8 లక్షల కోట్ల) నిధులను కేంద్రానికి సమకూర్చేందుకు రిజర్వు బ్యాంకు నగదును ముద్రించాల్సిన అవసరముందని భావిస్తున్నాం’ అని BOFA ఒక ప్రకటనలో తెలిపింది. LTRO (లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌), TLTRO (టార్గెటెడ్‌ లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌), క్యాష్‌ రెపోరేట్‌ (CRR‌) కుదింపు, రుణ మార్గాల ద్వారా రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఈ మొత్తంలో పావు భాగం (250 బేసిస్‌ పాయింట్ల) నిధులను కేంద్రానికి సమకూర్చిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం రూ.4.2 లక్షల కోట్ల విలువైన అదనపు రుణాలను పొందేందుకు వెసులుబాటు ఉన్నట్టు తెలిపింది. ఈ రుణాల విలువ జీడీపీలో 110 బేసిస్‌ పాయింట్లగా తెలిపారు. పీఎస్‌యూ బాండ్లను జారీచేసే అవకాశం  ఉన్నదని, విలువ జీడీపీలో 50 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంటుందని అన్నారు. చిన్న, మధ్యతరహా సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)లకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వమిచ్చే క్రెడిట్‌ గ్యారంటీలు జీడీపీలో 150 నుంచి 200 బేసిస్‌ పాయింట్లకు సమానమని అన్నారు. మిగిలిన 270 బేసిస్‌ పాయింట్లకు సమానమైన నిధులను కేంద్రానికి సమకూర్చేందుకు ఆర్బీఐ నగదును ముద్రించాల్సిన అవసరముందని తెలిపారు. జీడీపీలో 80 బేసిస్‌ పాయింట్లకు సమానమైన నిధులను సంక్షేమ చర్యలకు వెచ్చించినట్టు తాజా ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ఆర్బీఐ ప్రధాన విధి. అదనపు నగదు ముద్రణతో రూపాయి విలువ మరింత క్షీణించి ధరలు పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం హద్దులు దాటి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమై ముప్పు వాటిల్లుతుంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు 1994లో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే నగదు ముద్రణ విధానానికి స్వస్తి పలికింది. కానీ, కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం నగదు ముద్రణ కోసం ఆర్బీఐని ఆశ్రయించక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్బీఐ నగదును ముద్రించి తక్కువ వడ్డీతో కేంద్రానికి ఇవ్వడాన్ని హెలిప్టర్‌ మనీ అంటారు.

వస్తు, సేవల కొనుగోలులో ప్రజలకు అసాధారణ రీతిలో సాధికారతను కల్పించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ‘హెలికాప్టర్‌ మనీ’ తోడ్పడుతుంది. హెలికాప్టర్‌ మనీతో కరెన్సీ నోట్ల సంఖ్య పెరిగి మార్కెట్లోకి మరింత నగదు వస్తుంది. ప్రభుత్వ బాండ్లను కొనుగోలుచేసి ఆర్బీఐ నిధులను సమకూర్చడాన్ని క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అంటారు. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలంపాటు బాండ్లను సమీకరించేందుకు రిజర్వు బ్యాంకు అనుమతిస్తుంది. 

అమెరికా, జపాన్‌, యూరప్‌లోని మరికొన్ని ధనిక దేశాలతోపాటు టర్కీ, ఇండోనేషియా లాంటి దేశాలు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీపై దృష్టిసారించాయి. నగదు ముద్రణతో తమ ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దుకొనేందుకు చర్యలు చేపడుతున్నాయి. యూరోజోన్‌లోని దేశాల నుంచి కొనుగోలుచేసే బాండ్లపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు పరిమితిని ఎత్తేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ తమ ప్రభుత్వానికి తాత్కాలికంగా రుణాలను అందజేసేందుకు సిద్ధమైంది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ అపరిమితంగా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. 

Read Here>>> దేశమంతా ఒకే కనీస వేతనం.. ఆగస్టులో వన్‌ నేషన్ – వన్ రేషన్

Categories
71680 71715 71723

దేశమంతా ఒకే కనీస వేతనం.. ఆగస్టులో వన్‌ నేషన్ – వన్ రేషన్

ఎట్టకేలకు వలస కార్మికుల సంక్షోభ సమస్యను ప్రభుత్వం చేపట్టిందని, రెండో విడత చర్యలు చిన్న రైతులు, వీధి వ్యాపారులు, వలస కార్మికులపై దృష్టి సారించిందని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఎక్కువ మంది వలస కార్మికులు ఇప్పుడు తమ సొంత రాష్ట్రాల్లో MNREGA కింద ఉపాధి పొందవచ్చునని ఆమె చెప్పారు. కార్మికుల వేతన రేటును కూడా రూ .182 నుంచి రూ .202 కు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వలస కార్మికులు, చిన్న రైతులపై కేంద్రీకృతమై ఉందని తెలిపారు.

ఆగస్టు వరకు వన్ నేషన్ వన్ రేషన్ అమల్లో తెస్తామని మంత్రి నిర్మల తెలిపారు. రేషన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చునని అన్నారు. 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మంది లబ్దిదారులకు వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు అందుతుందని ఆమె స్పష్టం చేశారు. వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామన్నారు. ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధములు, కేజీ కందిపప్పు ఇస్తామని చెప్పారు. ఈ పథకం కోసం రూ.3,500 కోట్లు కేటాయించినట్టు నిర్మల తెలిపారు.

వచ్చే రెండు నెలల పాటు వలస కూలీలకు రేషన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. వలస కూలీల రేషన్ బాధ్యత రాష్ట్రాలదేనని నిర్మల స్పష్టం చేశారు. 8 కోట్ల మంది వలస కూలీలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. రేషన్ కార్డులేనివారికి 10 కేజీల బియ్యం, కిలో శనగలు అందించనున్నట్టు తెలిపారు. వలస కార్మికులు, పట్టణ పేదల కోసం తక్కువ అద్దెలకు ఇళ్లు అందిస్తామని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తామన్నారు. 

రాబోయే విలేకరుల సమావేశాలలో ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటిస్తుందని MoS అనురాగ్ ఎస్ ఠాకూర్ తెలిపారు. దేశమంతా ఒకే కనీస వేతనం ఉండేలా చూస్తామన్నారు. వార్షిక ఆరోగ్య పరీక్షలు కార్మికులందరికి తప్పనిసరి చేస్తున్నామన్నారు. వలస కూలీల పునరావాసం కోసం రూ.11వేల కోట్లు ఇచ్చామన్నారు. కరోనా సమయంలో 7,200 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంఘాల ద్వారా 1.20 లక్షల లీటర్ల శానిటైజర్ ఉత్పత్తి జరిగిందని నిర్మల తెలిపారు. 

క్రెడిట్ హామీలు, ఒత్తిడికి గురైన చిన్న వ్యాపారాలకు మూలధన ఇన్ఫ్యూషన్ అంశాలపై ప్రస్తావించారు. చిన్న వ్యాపారాలు పెద్దవిగా ఉండటానికి వాటి కోసం ఉద్దేశించిన ప్రయోజనాలకు అర్హత సాధించడానికి వీలు కల్పిస్తుంది. ఈ చర్యలు 2 లక్షల MSMEలకు సహాయం చేయడానికి ఉద్దేశించినవి. ఇప్పుడు రూ .1 కోట్ల వరకు పెట్టుబడి ఉన్న కంపెనీలు మైక్రో ఎంటర్ప్రైజెస్ పరిధిలోకి వస్తాయి. 

రూ. 200 కోట్ల వరకు ప్రభుత్వ సేకరణ టెండర్లు గ్లోబల్ టెండర్లకు వెళ్లవద్దని నిబంధనలు చేసింది. రూ. 200 కోట్ల వరకు ప్రభుత్వ సేకరణ టెండర్లు గ్లోబల్ టెండర్లకు వెళ్లవద్దని నిబంధనలు చేసింది. కరోనావైరస్ లాక్ డౌన్ పతనానికి అడ్డుకట్ట వేయడానికి, భారతదేశాన్ని స్వావలంబన ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సహాయపడటానికి ప్రభుత్వం రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని రూపొందిస్తోందని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి విదితమే. 

Read Here>> ప్యాకేజీ 2.0 : 9 రంగాలకు ఉద్దీపన చర్యలు.. వ్యవసాయానికి ప్రత్యేక ప్యాకేజీ : నిర్మల

Categories
71680 71715 71723

ప్యాకేజీ 2.0 : 9 రంగాలకు ఉద్దీపన చర్యలు.. వ్యవసాయానికి ప్రత్యేక ప్యాకేజీ : నిర్మల

‘ఆత్మ నిర్భర్ భారత్’లో రెండో ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా 9 రంగాలకు ఉద్దీపన చర్యలను ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 9 రకాల ఫార్ములాను నిర్మల ప్రకటించారు. వ్యవసాయానికి ఊతంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు నిర్మల. వలస కూలీలు, వీధి వ్యాపారాలు, చిన్న రైతులను ఆదుకునేలా రెండో ప్యాకేజీ ఉంటుందని ఆమె తెలిపారు. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను అందించామని చెప్పారు. కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. 3 కోట్ల మంది రైతులకు రాయితీపై రుణాలు అందించామని చెప్పారు. క్రాప్ లోన్ దారులకు వడ్డీ రాయితీ గడువు మే 31 వరకు పొడిగించినట్టు చెప్పారు. ఇప్పటివరకూ రైతులకు రూ.4 లక్షల కోట్లు రుణాలు అందాయన్నారు. దాదాపు రూ.11వేల కోట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా అందించామని తెలిపారు. 

రెండో ప్యాకేజీలో మొత్తం 9 అంశాలను చేర్చగా.. రైతులను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీలో రెండు అంశాలను చేర్చినట్టు నిర్మల స్పష్టం చేశారు. మిగిలిన ప్యాకేజీల్లో రైతులకు సంబంధించి మరిన్ని అంశాలు వస్తాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ.6,700 కోట్ల వర్కింగ్ కేపిటల్ అసిస్టెన్స్ అందిస్తామన్నారు. మార్చిలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.4,200 కోట్లు రుణాలిచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు రూ.11వేల కోట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా అందించినట్టు నిర్మల పేర్కొన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 30 మధ్య 63 లక్షల మంది రైతులకు రూ.86,600 కోట్ల రుణాలు ఇచ్చినట్టు తెలిపారు. రూ.25వేల కోట్ల నాబోర్డు రుణాలను రీఫైనాన్స్ చేశామన్నారు. సొంతూళ్లలో వలస కార్మికులకు ఎలాంటి ఉపాధి ఉండకపోవచ్చునని అన్నారు. 

వలస కార్మికులను ఆదుకునేందుకు 14.62 కోట్ల పనిదినాలను గ్రామీణ ఉపాధి హామీ కింద కల్పిస్తున్నామని చెప్పారు. వలస కార్మికులకు గ్రామీణ ఉపాధి హమీ కింద పనులు కల్పించాలని రాష్ట్రాలని కోరుతున్నామని చెప్పారు. వలస కార్మికులతో మొక్కల పెంపకం, హార్టి కల్చర్, షెడ్ల నిర్మాణం పనులు చేయించుకోవచ్చునని తెలిపారు. కనీస వేతన హక్కును కార్మికులందరికి కల్పిస్తామని నిర్మల హమీ ఇచ్చారు. 

దేశమంతా ఒకే కనీస వేతనం ఉండేలా చూస్తామన్నారు. వార్షిక ఆరోగ్య పరీక్షలు కార్మికులందరికి తప్పనిసరి చేస్తున్నామన్నారు. వలస కూలీల పునరావాసం కోసం రూ.11వేల కోట్లు ఇచ్చామన్నారు. కరోనా సమయంలో 7,200 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంఘాల ద్వారా 1.20 లక్షల లీటర్ల శానిటైజర్ ఉత్పత్తి జరిగిందని నిర్మల తెలిపారు. ఈ సంఘాల 3 కోట్ల మాస్క్ లు తయారు చేశాయని వెల్లడించారు. 

Read Here>> నిర్మలా సీతారామన్ స్పీచ్ హైలెట్స్

Categories
71680 71715 71749

మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నిత్యావసరేతర వస్తువులు డెలివరీ 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా లేటెస్ట్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు రిలీఫ్ ఇచ్చింది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతినివ్వగా.. తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రెడ్ జోన్లలో మాత్రం నిత్యావసర వస్తువుల్లో కిరాణా సరుకులు, మెడికల్, చిన్నారులకు సంబంధించి వస్తువలపై పరిమితంగా డెలివరీ చేసేలా అనుమతి ఇచ్చింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రజలకు అవసరమైన వస్తువులను సురక్షితంగా డెలివరీ చేసేందుకు ప్రభుత్వం తమకు అనుమతినిచ్చేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపాయి. మిలియన్లలో చిన్న, మధ్య వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని నిర్వహించేందుకు అనుమతి లభించినట్టు ఈ కామర్స్ దిగ్గజం ఈమెయిల్ స్టేట్ మెంట్ లో పేర్కొంది.

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నివసించే వినియోగదారులు మే 4 నుంచి నాన్ ఎసెన్షియల్ వస్తువుల కేటగిరీ కింద స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ సహా ఇతర గాడ్జెట్లు, ఇతర ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు. ఈ జోన్లలో ఉండే వినియోగదారులకు మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ ఫాంలు నాన్ ఎసెన్షియల్ ఆర్డర్లను అంగీకరించనున్నాయి. 

Also Read | ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలకు అనుమతి

Categories
71680 71749

లాంచ్ చెయ్యకుండానే లీకైన యాపిల్ ధరలు

కరోనా దెబ్బకు ప్రపంచం ఆగిపోయింది. ఎక్కడా కూడా వ్యాపారాలు జరగని పరిస్థితి. ఇటువంటి స్థితిలో కరోనా మహమ్మారితో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినా ఐఫోన్‌12 సిరీస్‌ని ఈ ఏడాది తీసుకురావాలని ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఆపిల్‌ భావిస్తోంది.

ఐఫోన్‌12 సిరీస్‌ కోసం యాపిల్‌ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయంలో లాక్‌డౌన్ ప్రకటనకు అంతరాయం కలిగించింది. ఇటువంటి పరిస్థితిలో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ లాంచ్‌ తేదీలను ముందుగానే తెలిపిన జోన్‌ ప్రోసర్‌, ఇప్పుడు ఐఫోన్‌ 12 ధరలను కూడా తన ట్విటర్‌ ఖాతాలో లీక్ చేశారు.

జోన్‌ ప్రోసర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఐఫోన్‌12 సిరీస్‌ ధరలు:

5.4 ఐఫోన్‌ 12 డీ52జీ
ఓఎల్‌ఈడీ/5జీ
రెండు కెమెరాలు
649 డాలర్లు( రూ.48,754)

6.1 ఐఫోన్‌ 12 డీ53జీ
ఓఎల్‌ఈడీ/5జీ
2కెమెరాలు
749డాలర్లు( రూ.56,266)

6.1 ఐఫోన్‌ 12 ప్రో డీ53పీ
ఓఎల్‌ఈడీ/5జీ
3 కెమెరాలు+ లిడార్‌
999 డాలర్లు( రూ.75,047)

6.7 ఐఫోన్‌ 12 ప్రో మాక్స్‌ డీ54పీ
ఓఎల్‌ఈడీ/5జీ
3 కెమెరాలు+ లిడార్‌
1099 డాలర్లు(రూ.82,573)