Categories
71684 71715

యువతి ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ప్రొఫెసర్ వేధింపులు

అతడు ఓ ప్రొఫెసర్. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాడు. గురువు అంటే దైవంతో సమానం.

అతడు ఓ ప్రొఫెసర్. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాడు. గురువు అంటే దైవంతో సమానం. విద్యార్థులకు క్లాస్ పాఠాలు చెపాల్సిన ఆ ప్రొఫెసర్ కీచకుడయ్యాడు. ప్రేమ పేరుతో కాలేజీలో చదువుతున్న యువతి వెంటపడ్డాడు. ఆమె కాదనేసరికి వేధించడం స్టార్ట్ చేశాడు. అసభ్యకర మేసేజ్ లు పంపాడు. యవతి ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేశాడు. వాటిని కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించాడు. చివరకు యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఆ కీచక ప్రొఫెసర్ కటకటాల్లోకి వెళ్లాడు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఎంటెక్‌ విద్యార్థిని వేధిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కొన్ని రోజులు ఫోన్లు, చాటింగ్ లు.. తర్వాత వేధింపులు:
కరీంనగర్‌ అచ్చంపల్లి ప్రాంతానికి చెందిన కోలా హరీష్‌ ఉప్పల్‌ విజయపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడు ఘట్ కేసర్ లోని ఓ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో చదువుకుంటున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. కొద్ది రోజులు ఫోన్లు, చాటింగ్‌లు చేసుకున్నారు. తర్వాత తనను ప్రేమించాలని వెంటపడ్డాడు.

మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్:
అయితే ఆ యువతి ప్రేమకు నో చెప్పింది. హరీష్ ను దూరం పెట్టింది. పలుమార్లు ఫోన్‌ చేసినా, మెసేజ్‌ చేసినా స్పందించ లేదు. తనను దూరం పెడుతుందని భావించిన హరీష్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. వేధింపులు స్టార్ట్ చేశాడు. అసభ్యకరంగా ఉన్న ఫొటోలను ఆమెకు, ఆమె కుటుంబసభ్యులకు వాట్సాప్‌లో పంపాడు. తనతో స్నేహంగా ఉండాలని లేకపోతే ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. కీచక ప్రొఫెసర్ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా హరీ‌ష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలించారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి నీచపు పనికి పాల్పడిన ప్రొఫెసర్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Read: సహోద్యోగి భార్యతో సంబంధం….బెడ్ రూంలో దొరికిపోవటంతో..

Categories
71684 71721

లాక్ డౌన్ కారణంగా టీవీ నటుడు ఆత్మహత్య

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న వారిలో సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా చాలామందే ఉన్నారు.

సినిమా షూటింగ్ లు ఉన్న సమయంలో ఎలాగోలా గడిచిన చిన్న స్థాయి ఆర్టిస్టుల జీవితం..ఇప్పుడు కెమెరాల స్విచ్చ్ లు ఆగడిపోవడంతో కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ టీవీ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదత్ సే మజ్బూర్ మరియు కుల్దీపక్ వంటి షోస్ లో కనిపించిన టీవీ యాక్టర్ మన్మీత్ గ్రీవాల్(32) ముంబైలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఏరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న మన్మీత్..శుక్రవారం రాత్రి నేవీ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. లౌక్ డౌన్ కారణంగా లోన్ లు చెల్లించలేక ఆర్థిక కష్టాలను ఎదుర్కుంటూ కొన్ని రోజులుగా మన్మీత్  తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

బెడ్ రూంలో ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించిన మన్మీత్ ను చూసిన ఆయన భార్య షాక్ కు గురై,సృహ తప్పి పడిపోయిందని మన్మీత్ సన్నిహితులు తెలిపారు. పంజాబ్ కు చెందిన మన్మీత్…లాక్ డౌన్ కు ముందు వెబ్ సిరీస్ లు,కొన్ని కమర్షియల్ ప్రాజెక్టులలో పనిచేస్తున్నట్లు సమాచారం. బెడ్ రూంలో ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించిన మన్మీత్ ను చూసిన ఆయన భార్య షాక్ కు గురై,సృహ తప్పి పడిపోయిందని మన్మీత్ సన్నిహితులు తెలిపారు.

Read Here>> నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే : పవర్ స్టార్ పై ప్రగ్యా ప్రశంసలు

Categories
71684 71715 71750

కరోనాతో జాగ్రత్త : లాక్‌డౌన్‌లో యథేచ్చగా ‘హలీమ్’ హోం డెలివరీ!

హలీమ్.. అంటే హైదరబాదీలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రుచికరమైన హాలీమ్ లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. మహానగరమైన హైదరాబాద్‌లో హాలీమ్‌కు ఫుల్ మార్కెట్ ఉంటుంది. లాక్ డౌన్ అయినప్పటికీ అండర్ గ్రౌండ్ మార్కెట్లో హాలీమ్ సేల్స్ జోరుందుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో నిబంధనల ప్రకారం.. ఎలాంటి సేల్స్, కుకింగ్ ఫుడ్ డెలివరీని నిషేధించింది. అయినాసరే అక్రమంగా హాలీమ్ డిష్‌ విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. చాలామంది అమ్మకందారులు ఫోన్ల ద్వారానే ఆర్డర్లు చేస్తున్నారు.

కొంతమంది మాత్రం కస్టమర్లకు నేరుగా హాలీమ్ ఆర్డర్లు అందిస్తున్నారు. మరికొంతమంది కాస్తా అదనంగా జోడించి ఇంటికే హోం డెలివరీ చేస్తున్నారు. ఒక్కో హాలీమ్ ఖరీదు దాదాపు రూ.300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ అయితే మాత్రం రూ.1000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. బంజారా హిల్స్ నుంచి ఓ కుటుంబం.. మే 15నుంచి హాలీమ్ విక్రయిస్తోంది. అప్పటినుంచి తమకు భారీ మొత్తంలో కస్టమర్ల నుంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. 

వ్యాపారం మొదలైనప్పటి నుంచి రోజుకు 30 వరకు ఆర్డర్లు వస్తున్నట్టు తెలిపారు. ఖలిందా ( పేరు మార్చాం) అనే వ్యక్తి ఈ హాలీమ్ సేల్ నడుపుతున్నారు. సికింద్రాబాద్ వరకు హాలీమ్ డెలివరీ చేస్తున్నట్టు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఇలా విక్రయించడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించగా.. ‘అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకుంటన్నాం. కుకింగ్, ప్యాకింగ్, డెలివరీ విషయంలో నాణ్యతతోపాటు పరిశుభ్రత ఉండేలా జాగ్రత్త పడుతున్నాం. ఎవరి నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు’ అని వారు చెప్పుకొచ్చారు. కస్టమర్లకు హాలీమ్ డెలివరీ చేసేందుకు ఖలిందా ఫ్యామిలీ తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆపరేట్ చేస్తోంది. టోలి చౌకీ నుంచి ఓ మహిళ కూడా తన ఇంటి నుంచే చాలా రోజులుగా హాలీమ్ డిష్ అమ్ముతోంది. 

కానీ, ఆమె ఎవరి నుంచి క్యాష్ పేమెంట్లను అనుమతించడం లేదు. కేవలం ఆన్ లైన్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇతర పేమెంట్స్ మోడ్ ద్వారా అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నట్టు పేర్కొంది. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వారి కోసం పరిమితంగా ప్రతిరోజు హాలీమ్ విక్రయిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీనియర్ జీహెచ్ఎంసీ అధికారులు కస్టమర్లలా వెళ్లి ప్రశ్నించగా ఆమె పై విధంగా బదులిచ్చింది. సోమాజిగూడలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కూడా మే మొదటివారం నుంచే హాలీమ్ విక్రయిస్తున్నట్టు సమాచారం ఉంది. తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్లో ఫోన్ నెంబర్ కూడా పోస్టు చేశారు. ఆ ఫోన్ కాల్ ఎత్తిన ఆ హోటల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయడంలేదు. నిత్యావసర సర్వీసులు అందించేందుకు తమ దగ్గర పాస్ ఉంది. మేం ఫుడ్ డెలివరీ చేయొచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చాడు. 

ఈ వాదనను పోలీసు అధికారులు ఖండించారు. తమ స్టేషన్ పరిధిలో హలీమ్‌తో సహా ఆహారాన్ని విక్రయించే వ్యక్తులపై ఇటీవల చర్యలు తీసుకున్న మొఘల్‌పురా పోలీసు స్టేషన్ హౌస్ కార్యాలయం ఎ. రవి కుమార్ మాట్లాడుతూ.. వండిన ఆహారాన్ని అమ్మడం చట్టవిరుద్ధమని, నేరస్థులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. హలీమ్ తయారీకి మాంసం ఉపయోగించే జంతువులను జియాగుడ వంటి ప్రదేశాలలో నగరంలోకి రవాణా చేస్తారు. ఇక్కడ చాలా కోవిడ్ -19 కేసులు ఉన్నాయని అందరికి తెలుసు. అక్కడి నుండి జంతువులు కబేళాలకు వెళ్లి మాంసం వంటశాలలకు చేరుకుంటాయి. వీటిన్నింటిని తనిఖీ చేయడం అసాధ్యం. ఇది చాలా ప్రమాదకరమేనని అంటున్నారు. 

Read Here>> కరోనా మహిళ డబ్బు డ్రా చేసింది, బ్యాంకు మొత్తం ఖాళీ అయ్యింది, బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త

Categories
71684 71715

పచ్చని కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు

అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు జరుగుతాయి. పచ్చని సంసారాలు నాశనం అవుతాయి. పిల్లలు అనాథలుగా మారతారు. మనుషులు క్రిమినల్స్ అవుతారు, జైలు పాలవుతారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అక్రమ సంబంధాలు వద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నారు. అయినా ఇంకా మార్పు రావడం లేదు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త సుఖాలు వెతుక్కుంటున్నారు. చివరికి చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వివాహేతర సంబంధం ఓ పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. అనైకి బంధం గురించి ప్రశ్నించిన భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న కూడ్లు సమీపంలో ఆదివారం(మే 17,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. ఏఎఫ్‌సీఎల్‌ లేఔట్‌లో బీహార్‌కు చెందిన మనీష్‌ కుమార్‌(38), సంధ్యా(33) దంపతులు రెండేళ్ల క్రితం బెంగళూరు వచ్చి ఎఫ్‌సీఎల్‌ లేఔట్‌లో నివాసం ఉంటున్నారు. మనీష్‌కుమార్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

మరో మహిళతో భర్త అఫైర్:
ఈ విషయం భార్యకు తెలిసింది. భర్తను నిలదీసింది. పద్ధతి మార్చుకోవాలని చెప్పింది. ఈ విషయమై దంపతులు నిత్యం గొడవపడేవారు. ఎంత చెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో తన భర్త వ్యవహారాన్ని సంధ్య తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో మనీష్ కోపంతో ఊగిపోయాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో ఉన్న మనీష్ భార్య గొంతు నులిమి హత్య చేశాడు. విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. రెండు రోజులుగా కూతురి నుంచి ఫోన్‌ రాకపోవడంతో సంధ్య తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఏం జరిగిందో అని భయపడ్డారు. వారు ఆదివారం నగరానికి వచ్చారు. 

భార్యను చంపి భర్త సూసైడ్:
అత్తమామలు ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న మనీష్‌ భయపడ్డాడు. తాను చేసిన నేరం బయటపడిపోతుందని ఆందోళన చెందాడు. తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంధ్య తల్లిదండ్రులు వచ్చి చూడగా ఇంట్లో సంధ్య మృతదేహం, బయట మనీష్‌ మృతదేహం కనిపించాయి. దీంతో వారు షాక్ తిన్నారు. ఇటు కూతురిని అటు అల్లుడిని విగతజీవులుగా చూసి కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. రంగంలోకి దిగిన పరప్పన అగ్రహార పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Read Here>> టిక్ టాక్ లో పరిచయం, ఆపై అత్యాచారం.. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

Categories
71684 71715

గుప్త నిధుల ఆశ చూపి బాలికపై రేప్

మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం

మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. కొందరి అత్యాశ, అజ్ఞానం కేటుగాళ్లకు వరంగా మారుతోంది. సైన్స్ బాగా డెవలప్ అయిన ఈ రోజుల్లోనూ ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఆ నమ్మకాలే ప్రజల కొంప ముంచుతున్నాయి. హత్యలు, అత్యాచారాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిలాల్లో అలాంటి ఒక దారుణం చోటు చేసుకుంది. గుప్త నిధుల పేరు చెప్పి ఓ నీచుడు బాలికను అత్యాచారం చేశాడు.

తాయత్తులు కట్టేందుకు వచ్చి అఘాయిత్యం:
ఇంట్లో గుప్త నిధులున్నాయని.. అవి దక్కాలంటే బాలికతో కలిసి పూజలు చేయాలని నమ్మించి ఆమెపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం మాచవరానికి చెందిన విష్ణువర్ధన్ రోగాలు నయం చేస్తానని తాయత్తులు కడుతుంటాడు. దొనకొండ మండలం రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో ఇటీవల పరిచయమైంది. కొందరికి తాయత్తులు కట్టేందుకు విష్ణువర్ధన్ ను రామాంజనేయులు గ్రామానికి పిలిపించాడు. తెలిసిన వారింట్లో బస ఏర్పాటు చేశాడు.

పూజల పేరుతో బాలికపై పలుమార్లు అత్యాచారం:
ఈ క్రమంలో ఇంటి యజమాని కుమార్తెపై విష్ణు కన్నుపడింది. దీంతో ఓ పథకం రూపొందించాడు. మీ ఇంట్లో గుప్తనిధులున్నాయని ఇంటి యజమానితో చెప్పాడు. బాలికతో పూజలు చేయిస్తే వెలికితీయొచ్చని అతడిని నమ్మించాడు. విష్ణు మాయలో పడి కళ్లుమూసుకుపోయిన రామాంజనేయులు అతడి మాటలు గుడ్డిగా నమ్మేశాడు. గుప్త నిధులు పేరు వినగానే అతడిలో అత్యాశ మొదలైంది. వెంటనే విష్ణు చెప్పిన దానికి అంగీకరించాడు. పూజలకు ఏర్పాటు చేశాడు. బాలికను గదిలోకి పంపాడు. ఇదే అదనుగా విష్ణు రెచ్చిపోయాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విష్ణు తీరుపై గ్రామస్తులకు అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్నాయని అంతా భయపడ్డారు. దీంతో విష్ణుని నిలదీశారు. అప్పుడు అత్యాచార విషయం బయటపడింది. దీంతో అంతా కలిసి అతనికి దేహశుద్ధి చేశారు.

గుప్తనిధులు అవాస్తవం:
గుప్త నిధులు అనే మాట అవాస్తవం అని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అలా ఎవరైనా చెబితే వారు మోసగాళ్లు అనే విషయం తెలుసుకోవాలంటున్నారు. అత్యాశకు పోయి అనర్థాలు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. గుప్త నిధుల పేరుతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Read Here>> టిక్ టాక్ లో పరిచయం, ఆపై అత్యాచారం.. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

 

Categories
71684 71715

టిక్ టాక్ లో పరిచయం, ఆపై అత్యాచారం.. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

టాక్ టాక్ కొంపముంచుతోంది. ఎంజాయ్ మెంట్ మాటేమో కానీ జీవితాలను నాశనం చేస్తోంది. అత్యాచారాలు,

టాక్ టాక్ కొంపముంచుతోంది. ఎంజాయ్ మెంట్ మాటేమో కానీ జీవితాలను నాశనం చేస్తోంది. అత్యాచారాలు, అక్రమ సంబంధాలకు కేరాఫ్ గా మారుతోంది. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తోంది. వ్యక్తులను హంతకులుగా మారుస్తోంది. టిక్ టాక్ లో ఏర్పడిన పరిచయ్యం అత్యాచారానికి దారి తీసింది. హైదరాబాద్ లో ఈ దారుణం జరిగింది. 

ఇంటికి పిలిపించి అత్యాచారం:
టిక్ టాక్ లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె జీవితం నాశనం చేసి పారిపోయాడు. పాతబస్తీలో నివసించే ఓ యువతికి(27) తలాబ్ కట్టలో నషేమన్ నగర్ లో నివసించే అక్బర్ షా(34) అనే వ్యక్తితో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఓ రోజు యువతికి మాయమాటలు చెప్పిన అక్బర్..ఆమెను టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి పిలిచాడు. అక్కడే ఆమెను రేప్ చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని కొంతమంది పెద్దల సమక్షంలో మాటిచ్చాడు. మరోసారి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నారు:
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. సదరు వ్యక్తికి గతంలోనే పెళ్ళయిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం అక్బర్ షా పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సోషల్ మీడియాతో జాగ్రత్త, కొత్త వారితో పరిచయాలు ప్రమాదకరం:
ఇటీవల కాలంలో ఆన్ లైన్ ప్రేమలు ఎక్కువైపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా పరిచయం.. ఆ తర్వాత మాటలు కలవడం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం.. చివరికి నట్టేట మునిగిపోవడం. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు టార్గెట్ గా కొందరు నీచులు దారుణాలకు ఒడిగడుతున్నారు. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని వదిలేస్తున్నారు. ఇలాంటి స్నేహాల జోలికి వెళ్లొద్దని, సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, కొత్త వారితో పరిచయాలు వద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా కొంతమంది అడ్డంగా బుక్కవుతూనే ఉన్నారు.

Read Here>> ఛీ..ఛీ..వీడు తండ్రేనా..కన్నకూతురిని తల్లిని చేశాడు

Categories
71684 71715

కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్, ప్రియురాలి నగ్న వీడియోలు లీక్ చేసిన ప్రియుడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ ‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ ‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని మోసం చేశాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీశాడు. ఆ తర్వాత కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేశాడు. లేదంటే నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత అన్నంత పనీ చేశాడు. అయినా బెదరని ప్రియురాలు మీడియాను ఆశ్రయించి ఆ నీచుడికి బుద్ధి చెప్పింది.

యువతికి తెలియకుండా వీడియోలు తీసిన యువకుడు:
మహారాజ్ గంజ్ జిల్లాలో నివాసం ఉండే యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శారీరకంగా కూడా దగ్గరయ్యారు. యువతికి తెలియకుండా ఆ యువకుడు ఏకాంతంగా కలిసిన సమయంలో వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడిపోయారు. దూరంగా ఉంటున్నారు. మళ్లీ కొద్దీ రోజులుగా ఆ యువకుడు ప్రియురాలి వెంట పడటం మొదలు పెట్టాడు. తన లైంగిక కోరికలు తీర్చాలని వేధించడం స్టార్ట్ చేశాడు. లేకపోతే వీడియోలను బయటపెడతానని బెదిరించాడు.

యువతి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు:
అతడు ఎంత బెదిరించినా ఆ యువతి లొంగలేదు. దీంతో ఆ కామాంధుడు మరింతగా రెచ్చిపోయి, ఆ యువతి పరువు తీయాలన్నా కోపంతో ఏకాంతంగా ఇద్దరూ కలిసిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు స్పందించ లేదు. యువతి మీడియాను ఆశ్రయించింది. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు అప్పుడు స్పందించాల్సి వచ్చింది. వెంటనే నిందితుడిపై బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపుల, బెదిరింపులు కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read Here>> భార్య సహకారంతో కన్నకూతురిని రేప్ చేసిన తండ్రి, అరెస్ట్ చేసిన పోలీసులు

Categories
71684 71715

భార్య సహకారంతో కన్నకూతురిని రేప్ చేసిన తండ్రి, అరెస్ట్ చేసిన పోలీసులు

సభ్యసమాజం తలదించుకునే దారుణం ఇది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే

ఇంటి బయటే కాదు ఇంట్లోనూ ఆడపిల్లకు రక్షణ కరువైంది. అండగా ఉండాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు. యుక్త వయస్సుకు వచ్చిన కూతురిపై కామంతో కన్నేశాడు. ఆమెపై రెండు సార్లు అత్యాచారం చేశాడు. తల్లి కూడా భర్తకే వంతపాడింది. కూతురు కేకలు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంది. కూతురి నోట్లో గుడ్డలు కుక్కి నోరు కట్టేసింది. కూతురిని మంచానికి కట్టేసి అమానుషంగా అత్యాచారం చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయింది. బాలిక ఎలాగో తప్పించుకుని బంధువుల ఇంటికి పారిపోతే వెంటాడి తెచ్చి మరీ మరోమారు రేప్ చేశాడా కసాయి తండ్రి. చివరికి అక్క సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

కూతురు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కిన తల్లి:
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మోరెనా జిల్లాలోని పోర్సా పట్టణంలో జరిగింది. కన్నకూతురినే రేప్ చేసిన ఆ నీచుడు ఓ టీచర్ కూడా. అతడి వయసు 55ఏళ్లు. కూతురి వయసు 18. మార్చి 26న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూతురిని లాక్కెళ్లి బెడ్‌రూమ్‌లో పడేసి తాళ్లతో చేతులు కాళ్లు కట్టేశాడు. ఆ తర్వాత కూతురి నోట్లో తల్లి గుడ్డలు పెట్టింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు.
 

అక్క సాయంతో బయటపడిన బాధితురాలు:
తల్లి, తండ్రి రూమ్‌లో ఉన్నప్పుడు బయట వైపున గడియ పెట్టి అక్కడి నుంచి కూతురు తప్పించుకొని తన అత్తమ్మ వాళ్లంటికి వెళ్లింది. కూతురుని అత్తమ్మ ఇంటి నుంచి తన ఇంటికి తీసుకొచ్చిన ఆ కసాయి తండ్రి ఏప్రిల్ 10న మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి విషయం తెలుసుకున్న బాధితురాలి అక్క 1098 పోలీస్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితురాలని కాపాడారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. 

కూతురు చెప్పింది అబద్దమన్న తల్లిదండ్రులు:
కాగా, బాధితురాలి తల్లిదండ్రులు కూతురు చెప్పిదంతా అబద్ధమని కొట్టిపారేశారు. యువకుడితో ప్రేమ వ్యవహారం వద్దని చెప్పినందుకు తమపై ఆరోపణలు చేస్తోందన్నారు. అయితే బాధితురాలి ఒంటిపై ఉన్న గాయాలు చూసి పోలీసులు వారి మాటలు నమ్మలేదు. మేజిస్ట్రేట్ ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. స్కూల్ డేస్ నుంచి తన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన తెలిసి స్థానికులు షాక్ కి గురయ్యారు. కన్నతండ్రే ఇలాంటి దురాఘతానికి పాల్పడటం తట్టుకోలేకయారు. గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉంటూ ఇంత నీచానికి ఒడిగట్టిన ఆ తండ్రిని, అతడికి సహకరించిన తల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Here>> భార్య నగ్న చిత్రాలు స్నేహితులకు పంపిన భర్త, ఆ తర్వాత నీచమైన కోరిక

Categories
71684 71715

భార్య నగ్న చిత్రాలు స్నేహితులకు పంపిన భర్త, ఆ తర్వాత నీచమైన కోరిక

జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. అన్ని సమయాల్లో అండగా

జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. అన్ని సమయాల్లో అండగా ఉంటానన్నాడు. అగ్నిసాక్షిగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చెప్పినట్టుగానే ఏడాది పాటు భార్యను బాగా చూసుకున్నాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆ భర్త నిజస్వరూపం బయట పడింది. రాక్షసుడిలా మారాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. భార్య నగ్న చిత్రాలను స్నేహితులకు పంపి పైశాచిక ఆనందం పొందాడు. అంతేనా, వారి లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు.

భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య:
భర్త నీచమైన మనస్తత్వం, వేధింపులను భరించలేకపోయిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త దారుణాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేసి జైల్లో వేశారు.

స్నేహితుల కోరిక తీర్చాలని టార్చర్:
రాజస్తాన్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అతడి పేరు రాజు. ఆమె పేరు అనిత. ఏడాది కిందట వివాహమైంది. కొద్దికాలం బాగానే చూసుకున్న భర్త క్రమంగా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. భార్య నూడ్ ఫొటోలను ఫ్రెండ్స్ కి పంపడం వారి కోరికలు తీర్చాలని వేధించడం. కొన్నాళ్లు భర్త వేధింపులను భార్య భరించింది. భర్తలో మార్పు వస్తుందేమో అని ఆశించింది. కానీ లాభం లేకపోయింది. రోజురోజుకి అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కుమిలిపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే భర్త దురాగతాలను పేపర్‌పై పెట్టి ప్రాణాలు తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నీచుడిని అరెస్ట్ చేశారు. పెళ్లయిన ఏడాదికే కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read Here>> అమానుషం, రూ.20 కోసం చిన్నారి దారుణ హత్య

Categories
71684 71715 71750

పెళ్లి పేరుతో ఆన్ లైన్ లో ఘరానా మోసం, రూ.12 లక్షలు పొగొట్టుకున్న యువతి

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. కొంతమంది అమాయకులు వారి ఉచ్చులో పడి అడ్డంగా మోసపోతున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, అప్రమత్తంగా ఉండాలని నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మన కక్కుర్తి కేటుగాళ్లకు వరంగా మారుతోంది. వరుసగా ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ ఆన్ లైన్ మోసం హైదరాబాద్ లో వెలుగుచూసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి ఓ యువతి నుంచి రూ.12 లక్షలు నొక్కేశాడు కేటుగాడు.

మ్యాట్రిమోనీ సైట్ ద్వారా యువతి వివరాలు సేకరణ:
బోరబండలో నివాసం ఉండే యువతికి ఆన్ లైన్ ద్వారా హ్యారీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఓ మ్యాట్రిమోనీ సైట్ లో యువతి వివరాలు చూసి ఆమెను సంప్రదించాడు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. అలా అలా పరిచయం పెరిగింది. ఆ తర్వాత లవ్ లో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని హ్యారీ ప్రపోజ్ చేశాడు. దానికి యువతి కూడా అంగీకరించింది.

కాస్ట్లీ గిఫ్ట్ పేరుతో మోసం:
ఓ రోజు గిఫ్ట్ పంపిస్తున్నానని యువతికి ఫోన్ చేశాడు హ్యారీ. బంగారు గొలుసు, బంగారు వాచి, నెక్లెస్ ఫొటోలను యువతికి ఫోన్ కి వాట్సాప్ చేశాడు. ఆ మరుసటి రోజు కొరియర్ ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీకు ఖరీదైన నగలు వచ్చాయి, వాటిని పొందాలంటే కస్టమ్స్ డ్యూటీ కింద రూ.12 లక్షలు చెల్లించాలని అన్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదని.. ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేస్తే సరిపోతుందని కూడా చెప్పాడు.

ఆన్ లైన్ లో రూ.12లక్షలు పంపిన యువతి:
ఖరీదైన వస్తువులు వస్తున్నాయని నమ్మేసిన యువతి ఏమీ ఆలోచించ లేదు. వెంటనే ఆన్ లైన్ లో చెప్పిన అకౌంట్ కు దశలవారీగా రూ.12 లక్షలు ట్రాన్సఫర్ చేసింది. అంతే.. ఆ తర్వాత ఎన్ని రోజులైనా గిఫ్ట్ రాలేదు. హ్యారీ ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయింది. దీంతో తను మోసపోయానని గ్రహించిన యువతి లబోదిబోమంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, గడిచిన వారం రోజుల్లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఇలానే ఆన్ లైన్ మోసాలకు బలయ్యారు. కేటుగాళ్లు ఆన్ లైన్ ద్వారా రూ.30 లక్షల వరకు దోచుకున్నారు.

మద్యం అమ్మకాల పేరుతో ఆన్ లైన్ చీటింగ్:
‌లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేయటంతో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. క్యూఆర్‌ కోడ్‌, లేదా లింక్‌ పంపటం దానికి నగదు పంపిన వెంటనే మీ ఆర్డర్‌ మీ ఇంటి ముందుకే ఉంటుంది అంటూ సైబర్‌ నేరగాళ్లు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ముందుగా, కొంత మొత్తం చెల్లిస్తే మిగిలిన సొమ్ము ఆర్డర్‌ డెలివరీ సమయంలో ఇస్తే సరిపోతుంది అంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో ప్రకటనలు చూసి ఆకర్షణకు గురైన వారు, ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్ చేసి మోసపోయారు.

రూ.51వేలు పొగొట్టుకున్న మందుబాబు:
హైద‌రాబాద్ లోని ఫేమ‌స్ బగ్గా వైన్స్ పేరుతో.. క్యూ ఆర్ కోడ్ పంపించి.. దానికి అమౌంట్ పంపిస్తే అర గంటలో మందు మీ ఇంటికి పంపిస్తామంటూ మెసేజ్ లు పంపారు మోసగాళ్ళు. ఈ మెసేజ్ ను న‌మ్మిన‌ గౌలిపురాకి చెందిన రాహుల్ ఆన్ లైన్ లో రూ.51 వేలు ట్రాన్సఫ‌ర్ చేశాడు. మద్యం ఇంటికి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

రూ.30వేలు పొగొట్టుకున్న మందు ప్రియుడు:
ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం కోసం వెతికాడు. ఆ వ్యక్తికి ఆన్‌లైన్‌లో ఓ ఫోన్‌ నెంబర్‌ లభించటంతో ఆ నెంబర్‌ కు కాల్ చేసి మద్యం కావాలన్నాడు. అవతలి వ్యక్తి ఆన్ లైన్ లో నగదు చెల్లిస్తే వెంటనే మీకు మద్యం అందుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి మోసగాడు చెప్పిన అకౌంట్‌ కు రూ.30వేలు ట్రాన్సఫర్ చేశాడు. అయితే ఎంతకీ తను చేసిన ఆర్డర్‌ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో, మీ అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష అని పోలీసులు చెబుతున్నారు.

Read Here>>లాక్ డౌన్ లో పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య.. నెల రోజుల్లో ప్రేమజంటకు ఏం జరిగింది