Categories
71706 71715 71716

కొవిడ్-19 ఔషధ అభివృద్ధి రేసులో రెండు జపాన్ డ్రగ్స్ 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేపట్టాయి. ఇప్పటికే భారత్ అనుబంధంతో కొన్ని దేశాల్లోని సైంటిస్టులు కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కొన్ని క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉండగా, మరికొన్ని హ్యుమన్ ట్రయల్స్ దిశగా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనాలు నెలకొన్నాయి. కరోనా చికత్స కోసం జరుగుతోన్న గ్లోబల్ హాంట్‌లో ఇప్పుడు జపాన్ కూడా వచ్చి చేరింది. ఏకంగా రెండు కరోనా మెడిసిన్స్ జపాన్ సైంటిస్టుల దృష్టిని ఆకర్షించాయి. ‘Avigan’ అనే పిలిచే జపనీస్ యాంటివైరల్ మెడిసిన్‌కు ఇప్పటికే ఆ దేశ ప్రధాని Shinzo Abe నుంచి ప్రశంసలు అందాయి. 

అంతేకాదు.. 128 మిలియన్ల డాలర్ల నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. మరో జపాన్ మెడిసిన్ Camostat.. ఒసాకా ఆధారిత సంస్థ Ono Pharmaceutical Co రూపొందించిన ప్యాంక్రియాటైటిస్ డ్రగ్. జపాన్, విదేశీ సైంటిస్టులను సైతం ఈ Camostat డ్రగ్ ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా డ్రగ్ అభివృద్ధిపై పోటీ నెలకొన్న తరుణంలో జపాన్‌కు చెందిన ఈ రెండు డ్రగ్స్ కూడా రేసులోకి చేరాయి. ఇప్పటికే కరోనా డ్రగ్ డెవలప్ చేసేందుకు డజన్లకొద్ది ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ డ్రగ్ ప్రయోగాలన్నింటిలో Gilead Science Inc కంపెనీకి చెందిన Remdesivir అనే డ్రగ్ ముందు వరసలో నిలిచింది. కరోనా చికిత్సకు Remdesivir ప్రారంభ ట్రయల్స్ సానుకూల ఫలితాలు రావడంతో అమెరికా, జపాన్ దేశాల్లో అత్యవసర ఆమోదం లభించే పరిస్థితి కనిపిస్తోంది. 

ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు Remdesivir డ్రగ్ బాగా పనిచేస్తోందని, తక్కువ సమయంలోనే కోలుకుంటున్నట్టు ఫలితాలు కనిపిస్తున్నాయి. Avigan డ్రగ్ కూడా కరోనా చికిత్సకు బాగా పనిచేస్తుందని చైనా అధికారి చెప్పిన తర్వాత గత మార్చిలో దీనిపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఇప్పుడు కనీసంగా 14 వరకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఈ నెలాఖరులోగా Avigan డ్రగ్ కరోనా చికిత్సకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు ప్రధాని అబే తెలిపారు. Avigan డ్రగ్‌ను సాధారణంగా favipiravir అని పిలుస్తారు. దీన్ని 1990లో ఒక కంపెనీ డెవలప్ చేసింది. ఆ తర్వాత Fujifilm సంస్థ ఈ డ్రగ్ ను కొనుగోలు చేసింది. Avigan డ్రగ్‌ను ఒక పిల్ రూపంలో తీసుకోవచ్చు. ఇది Gilead’s remdesivir కంటే మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. వైరస్ లపై పనిచేసే మెకానిజంలో Avigan సమర్థవంతగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అనేక వైరస్ లపై పరీక్షించిన తర్వాతే 2014లోనే Avigan డ్రగ్‌కు జపాన్‌లో ఆమోదం లభించింది. 

మరో జపాన్ డ్రగ్.. camostat mesylate.. క్లినికల్ గా నిరూపితం కాలేదు. దీన్ని Ono Pharmaceutical డెవలప్ చేసింది. Opdivo cancer డ్రగ్‌గా ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రోటీజ్ ఇన్హిబిటర్‌గా పిలిచే camostat డ్రగ్‌ను SARS-Cov-1 చికిత్సకు ప్రధానంగా వినియోగిస్తారు. ఈ camostat ఔషధం.. కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించేందుకు అవసరమైన ఎంజైమ్‌ను బ్లాక్ చేస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ డ్రగ్ తో కరోనా చికిత్స కోసం ట్రయల్స్ నిర్వహించేందుకు Vinetz ప్రయత్నిస్తోంది. జపాన్ దేశంలో Camostat ఔషధాన్ని Foipan అని పిలుస్తారు. 1985లో దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, శస్త్రచికిత్స పోస్టు రిఫ్లక్స్ ఎసోఫాగిటిస్ చికిత్స కోసం వినియోగిస్తారు. జపాన్ సహా విదేశాల్లోని COVID-19 అధ్యయనాల కోసం కంపెనీ ఇప్పుడు ఔషధాన్ని సరఫరా చేస్తోందని ప్రతినిధి Yukio Tani తెలిపారు. 

Read Here >> చైనాలో కరోనా పూర్తిగా ఖతం…యాక్టివ్ కేసులు 91 మాత్రమే

Categories
71706 71716 71744

కరోనావైరస్‌ను గుర్తించగానే.. ఈ ఫేస్ మాస్క్‌ల్లో లైట్లు వెలుగుతాయి!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను గుర్తించాలంటే టెస్టులతోనే సాధ్యం. కరోనా సోకగానే వెంటనే గుర్తించేలేని పరిస్థితి. అందుకే కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ను గుర్తించేందుకు కొత్త రకం మాస్క్‌లు రాబోతున్నాయి. సాధారణ మాస్క్ ల మాదిరిగా కాకుండా ఇందులో సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్ల ఆధారంగా కరోనా వైరస్ బాధితులను వెంటనే గుర్తించవచ్చు. తద్వారా వైరస్ ఇతరులకు సోకకుండానే ముందుగానే జాగ్రత్త పడొచ్చు అంటున్నారు హార్వర్డ్, MIT రీసెర్చర్లు. ఇప్పడు కరోనా వైరస్ ను వెంటనే గుర్తించే మాస్క్ లను డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. గత ఆరేళ్లుగా బయో ఇంజినీర్లు జికా వైరస్, ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్‌లను గుర్తించే సెన్సార్లను డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త కరోనా వైరస్‌ను గుర్తించేందుకు సెన్సార్లతో కూడిన ఫేస్ మాస్క్ లను డెవలప్ చేస్తున్నట్టు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, తుమ్మినా లేదా దగ్గినప్పుడు వెంటనే ఈ ఫేస్ మాస్క్‌లోని సెన్సార్ల సిగ్నల్స్ ద్వారా లైట్లు వెలుగుతాయి. 

2014లోనే అమెరికన్ రీసెర్చర్ Jim Collins తన బయో ఇంజినీరింగ్ ల్యాబరేటరీ అయిన MITలో సెన్సార్లను డెవలప్ చేయడం ప్రారంభించారు. ఈ సెన్సార్ల ద్వారా ఎబోలా వైరస్ ను సులభంగా గుర్తించడం సాధ్యపడింది. ఒక పేపర్ ముక్కపై సెన్సార్ల ద్వారా గుర్తించారు. దీనికి సంబంధించి రీసెర్చ్‌ను MIT, హార్వర్డ్ కు చెందిన కొంతమంది చిన్న శాస్త్రవేత్తల బృందం ప్రచురించింది. ఆ తర్వాత జికా వైరస్ ముప్పుపై కూడా సెన్సార్లను డెవలప్ చేసింది ఈ బృందం.. ఇప్పుడు ఇదే బృందం తమ సెన్సార్ టూల్స్ సవరించి కరోనా వైరస్ కేసులను గుర్తించే పనిలో పడింది.

కరోనా వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, తుమ్మడం, దగ్గినప్పుడు fluorescent సిగ్నల్ ఉత్పత్తి చేసే ఫేస్ మాస్క్ లను డెవలప్ చేస్తోంది ఈ బృందం. ఒకవేళ ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే.. టెంపరేచర్ చెకింగ్ వంటి ఇతర స్క్రీనింగ్ పద్ధతులతో సంబంధం ఉన్న లోపాలను పరిష్కరించగలదని అంటోంది. ఎయిర్ పోర్టుల నుంచి ఆస్పత్రుల వరకు అన్నిచోట్ల ఈ టూల్స్ ద్వారా స్ర్కీనింగ్ చేయొచ్చునని అంటున్నారు. కరోనాను గుర్తించేందుకు ల్యాబరేటరీకి ఎలాంటి శాంపిల్స్ పంపాల్సిన అవసరం లేకుండానే ఉన్నచోటనే కరోనా బాధితులను సులభంగా గుర్తించవచ్చునని రీసెర్చర్ Jim Collins అంటున్నారు. 

ప్రస్తుతం ఈ ల్యాబ్ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని కాలిన్స్ చెప్పారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా, అతని బృందం చిన్న లాలాజల నమూనాలో కరోనావైరస్‌ను గుర్తించే సెన్సార్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. కరోనా లాంటి వైరస్ లను గుర్తించేందుకు మొదట్లో తాము తేలికైన కాగితంపై సెన్సార్లను అమర్చి విశ్లేషించినట్టు కాలిన్స్ తెలిపారు. ఇప్పుడు ఈ టూల్స్ ప్లాస్టిక్, క్వార్జ్, వస్త్రాలపై కూడా పనిచేస్తుందని నిర్ధారించినట్టు తెలిపారు. వైరస్‌ను గుర్తించే సెన్సార్లను జన్యు పదార్థం DNA, RNA లతో కలిసి ఉంటుందని అన్నారు. 

లైయోఫిలిజర్ అని పిలిచే యంత్రాన్ని ఉపయోగించి వస్త్రంపై ఉండే పదార్థం స్తంభింపచేస్తుంది. ఇది జన్యు పదార్ధం నుండి తేమను చంపకుండా పీల్చుకుంటుంది. ఇది చాలా నెలలు గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటుంది. సెన్సార్లను యాక్టివేట్ చేయడానికి రెండు విషయాలు అవసరం. మొదటిది తేమ, మన శరీరాలు శ్లేష్మం లేదా లాలాజలం వంటి శ్వాసకోశ కణాల ద్వారా ఇస్తాయి. రెండవది వైరస్ జన్యు క్రమాన్ని గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ టెస్టులకు 24 గంటల వరకు సమయం పడుతోంది. పేషెంట్లకు టెస్టు ఫలితాలు కూడా చాలా రోజులు పడుతోంది. ఏదిఏమైనా ఈ సమ్మర్ ముగిసేనాటికి సెన్సార్ ఫేస్ మాస్క్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కాలిన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read Here >> కావాలనే కరోనా వైరస్ అంటించుకున్న అమెరికా ఖైదీలు..విడుదల కావటానికి ప్లాన్

Categories
71701 71715 71716

ఇంట్లో నుంచి పనిచేసేవారిలో మానసిక ఆరోగ్యాన్నిచ్చే ఈ 10 టిప్స్ తెలుసుకోవాల్సిందే

కరోనా పుణ్యామని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకునేవారంతా ఇంటినుంచే పనిచేయాల్సిన పరిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తితో స్వీయ నియంత్రణకు అలవాటు చేసుకోవాల్సిన అవసరం. సాధారణంగా ఇంట్లోనుంచి పనిచేయాలంటే సవాల్ తో కూడుకున్నపనిగా చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆఫీసుల్లో మాదిరిగా ఇంట్లో సరైన సౌకర్యాలు ఉండకపోవచ్చు. దీనికారణంగా చాలామందిలో మానసికపరమైన సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. స్వీయ నియంత్రణ లేకపోవడం.. పనిపై ఏకాగ్రత కోల్పోవడం, నిర్లీప్తత ఎక్కువగా కనిపిస్తుంటుంది. 

ఎందుకంటే.. వృత్తిపరమైన హెల్త్ సైకాలజీ రీసెర్చ్ ప్రకారం.. సెల్ఫ్ కంట్రోల్ విషయంలో ఒక విషయాన్ని సూచిస్తోంది. ఆలోచనలు, ప్రవర్తన శైలి, భావోద్వేగాలను అణచివేయగల సామర్థ్యం అనేవి మీ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించవు. స్వీయ నియంత్రణకు తప్పనిసరిగా మానసిక శక్తి అవసరమని సూచిస్తుంది. దీనిపై ఎంతో సాధన చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంటి నుంచి పనిచేయడానికి గణనీయమైన స్వీయ నియంత్రణ అవసరం. మీరు ఉండే ప్రదేశంలోని వాతావరణం మీ మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంది. 

ఆఫీసుల్లో పనిచేసినప్పుడు వర్క్ సమర్థవంతంగా పూర్తిచేయడానికి వీలుంటుంది. చాలామంది ఉద్యోగులకు ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండదు. మన వాతావరణంలో మార్పులకు అనుగుణంగా స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమైనది. లాక్ డౌన్ సమయంలో స్వీయ నియంత్రణ కోసం ఉద్యోగులు తమ మానసిక వనరులను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి. ఇంటి నుండి పనిచేసేటప్పుడు మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం.. 

1. మీ పని కోసం సరైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి. సాధ్యమైనంతవరకు పరధ్యానం నుంచి బయటపడండి. 
2. షెడ్యూల్‌ను డెవలప్ చేయండి. సాధ్యమైనంతవరకు పనిలో విరామాలకు సంబంధించి స్పష్టత ఉండాలి. 
3. వీలైతే, పిల్లలు, పెంపుడు జంతువుల సంరక్షణకు అవసరమైన సమయాన్ని కేటాయించండి. 
4. మీ ఇమెయిల్ కమ్యూనికేషన్‌ను పెంచుకోండి. ఇమెయిల్‌లకు ప్రతిస్పందించడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించండి.
5. కాఫీ విరామం లేదా మీ పని దినాన్ని సులభమైన దినచర్యతో ప్రారంభించండి. 
6. పని, విశ్రాంతి కోసం ప్రత్యేక సమయాలను ఏర్పాటు చేయండి. అదే సమయాలకు కట్టుబడి ఉండండి.
7. పనిని పూర్తి చేయడానికి గడువుగా ముందస్తు లక్ష్యాలను మానుకోండి.
8. మీరు మీ విశ్రాంతి సమయాన్ని గడిపే గది కాకుండా వేరే గదిలో పని చేయండి. ముఖ్యంగా మీ పడకగదిలో పని చేయొద్దు. 
9. పని చేయని సమయంలో అన్ని రకాల పని సంబంధిత విషయాలకు దూరంగా ఉండండి.
10. అన్ని పనుల్లో పాల్గొనడం ద్వారా మీ పూర్తి దృష్టిని ఆకర్షిస్తుంది. వ్యాయామం, వంట, సంపూర్ణ ధ్యానం లేదా మీ పిల్లలు లేదా పెంపుడు జంతువులతో ఆడుకోవడం వంటివి చేయాలి. 

Read Here >> మనలో డేటింగ్, రిలేషన్‌షిప్ ఫీలింగ్స్‌ను లాక్‌డౌన్ ఇలా మార్చేస్తోందా?

Categories
71715 71716 71744

మాట్లాడటం ద్వారా కూడా కరోనావైరస్ వేగంగా సోకుతుంది : సైంటిస్టుల హెచ్చరిక

కరోనా వైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది అనేదానిపై ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దగ్గు, తుమ్మడం ద్వారా కరోనా వైరస్ నీటి బిందువుల ద్వారా వ్యాప్తిచెందుతుందని తెలుసు. శ్వాసతో పాటు ఇప్పుడు మాట్లాడటం ద్వారా కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందగల సామర్థ్యం ఉందని అంటోంది పరిశోధకుల అధ్యయనం. మాట్లాడే సమయంలో ఏర్పడే సూక్ష్మ నీటిబిందువుల ద్వారా గాల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెంది దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటాయని స్టడీ వెల్లడించింది. దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి మాట్లాడటం ద్వారా కూడా కొవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతుందని National Institute of Diabetes and Digestive and Kidney Diseases (NIDDK) పరిశోధకులు చెబుతున్నారు. 

ఒక మూసివేసిన బాక్సులో ఒక వ్యక్తిని ఉంచి 25 సెకన్ల పాటు ‘స్టే హెల్తీ’ అనేపదాన్ని గట్టిగా పదేపదే చెప్పమన్నారు. అదే పెట్టెలో ఒక లేజర్ కూడా ఉంచారు. ఆ సమయంలో అతడి నోటి నుంచి విడుదలైన నీటి తుంపర్లను లేజర్ ద్వారా గుర్తించారు. ఎంత పరిమాణంలో తుంపర్లు బయటకు వచ్చాయో లెక్కించారు. తుంపర్లు సగటున 12 నిమిషాలు గాలిలో ఉండిపోయినట్టు గుర్తించారు. 

దీనికి సంబంధించి అధ్యయనాన్ని  journal Proceedings of the National Academy of Sciences (PNAS)లో ప్రచురించింది. లాలాజలంలో ఉండే కరోనావైరస్ పరిగణనలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు.. ప్రతి నిమిషం బిగ్గరగా మాట్లాడటం వలన దగ్గరగా ఉన్న ప్రదేశంలో ఎనిమిది నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గాలిలో ఉండిపోయే సామర్థ్యం  ఉందని గుర్తించారు. మాట్లాడినప్పుడు 1,000 కంటే ఎక్కువ వైరస్ కలిగిన నీటి తుంపర్లను ఉత్పత్తి చేయవచ్చని సైంటిస్టులు అంచనా వేశారు.

పదుల నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు గాల్లోనే ఉండిపోయాయి. పరిమిత ప్రదేశాలలో వైరస్ వ్యాప్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అని పరిశోధకులు తేల్చారు. అదే బృందం తక్కువ బిగ్గరగా మాట్లాడటం తక్కువ నీటి తుంపర్లను ఉత్పత్తి చేస్తుందని,  New England Journal of Medicineలో ఏప్రిల్‌లో ప్రచురించింది. మాట్లాడటం ద్వారా COVID-19 అంటువ్యాధి స్థాయిని నిర్ధారించగలిగితే.. చాలా దేశాలలో ఫేస్ మాస్క్ ధరించడమనేది తప్పనిసరిగా సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు… వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో కూడా అధ్యయనం వివరణ ఇచ్చింది. 

Read Here>> కరోనావైరస్ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యమంటున్న సైంటిస్టులు

Categories
71701 71715 71716

మనలో డేటింగ్, రిలేషన్‌షిప్ ఫీలింగ్స్‌ను లాక్‌డౌన్ ఇలా మార్చేస్తోందా? 

కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో వైరస్ పూర్తిగా సమసిపోదని తెలుసు. కొవిడ్- 19 లాక్ డౌన్ ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రపంచంలో కరోనా మార్పును తెచ్చింది. మానవుని మనుగడ కోసం కరోనా మార్పులకు అనుగుణంగా జీవించడం అలవాటు చేసుకుంటున్నారు.

బంధాలు, అనుబంధాలు అన్నింటిలోనూ కొత్త మార్పులను తీసుకొచ్చింది కరోనా. ఇప్పటివరకూ సమాజంలోని కొన్ని అంశాలపై కూడా లాక్ డౌన్ అధిక ప్రభావం చూపిందనే చెప్పాలి. ప్రత్యేకించి డేటింగ్, రిలేషన్ షిప్‌లపై భావనను కూడా మార్చేస్తుందా కరోనా అంటే.. అవుననే చెప్పాలి.  COVID-19 లాక్ డౌన్ సమయంలో డేటింగ్, సంబంధాల భావనను మారుస్తుందా అనేదానిపై చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.. అవేంటో ఓసారి లుక్కేయండి.. 

1. డేటింగ్.. కొత్తవారితో కష్టమే మరి :
డేటింగ్.. కొత్తగా డేటింగ్ చేస్తున్న వారు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. చాలామంది డేటింగ్ ప్రారంభంలో లాక్ డౌన్ సమయాన్ని కష్టంగా గడిపేస్తుంటారు. అందుకే లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారా? ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ, డేటింగ్ చేయబోయే కొత్త వ్యక్తి విషయంలో కాస్తా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డేటింగ్ చేయబోయే వ్యక్తికి కరోనా వైరస్ లేదని ఎలా నిర్ధారించుకోవడం.. అంటే.. లక్షణాలు కనిపించని వారెందరూ ఉంటారు. వీరిలో కరోనా వైరస్ ఉంటే అది డేటింగ్ చేసేవ్యక్తికి కూడా సోకే ప్రమాదం ఉంటుంది. కొత్త వ్యక్తితో డేటింగ్ చేయడమంటే బిగ్ ఛాలెంజ్ కదా మరి.. 
love

2. ఒకే వ్యక్తితో ఎక్కువ రోజులు గడపడం కష్టమే :
లాక్ డౌన్ సమయంలో ఒకే వ్యక్తితో ఎక్కువ రోజులు గడపడం కూడా కష్టమేనని అంటున్నారు ఒక వ్యాపారవేత్త జాటిన్ యాదవ్. నెల రోజులకు పైగా తన భార్యతో కలిసి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. ఇన్ని రోజులు ఇంట్లోనే గడిపిన తర్వాత.. ఒకరినొకరు ఇన్ని రోజులు ఎలా గడపడం ఎంత సులభమో గ్రహించానని తెలిపారు. ఒకేచోట కలిసి ఉంటే గొడవలు కామన్. సాధారణ సమయంలో అయితే ఇలాంటి గొడవలను ఎవరూ గుర్తించలేరు. లాక్ డౌన్‌లో తన భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో ఎక్కువ సమయం గడిపితే అది ఎంత రొమాంటిక్ గా ఉంటుందో లాక్ డౌన్ నిరూపించిందని అన్నారు. అవును.. కరోనా వైరస్ జీవితం, బంధాలకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్పిందని అభిప్రాయపడ్డారు. 
lock down

3. లాక్‌డౌన్‌లో రిలేషన్ షిప్ బలపడుతుందా? :
అస్సాంలో లాక్ డౌన్ ప్రారంభానికి ముందు తన భార్య ఆమె తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లింది. ఒక్కసారిగా అప్పటినుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అతడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. సాగర్ జైన్ అనే వ్యక్తి మాత్రం ఢిల్లీలో ఒంటరిగానే ఉంటున్నాడు. అస్సాంకు వెళ్లక ముందు తన భార్యతో తరచూ గొడవపడేవాడు. లాక్ డౌన్ సమయంలో తన భార్య విలువ ఏంటో తెలుసొచ్చిందని అన్నాడు. తనను మిస్ అయ్యాననే భావన ఎక్కువగా ఉందనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారిని ఎదురించి జీవించగలిగితే తమ బాంధవ్యం కూడా బలపడుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. 
Strong relations

4. బంధాలన్నీ ఎంతో విలువైనవి :
‘చెన్నైలో  వయస్సు పైబడిన నా తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. నేను నా భర్తతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాను. లాక్ డౌన్ సమయంలో ఒకటే ఆందోళనగా ఉండేది. ఒకవేళ తల్లిదండ్రులకు అత్యవసర వైద్య సాయం ఉంటే నేను వారిని చేరుకోలేను. నా భర్త.. నేను మా తల్లిదండ్రులను హోంటౌన్ లోనే వదిలేసి ఉద్యోగాల కోసం ఢిల్లీ వచ్చాం. తల్లిదండ్రులను వదిలేసి మేం ఇక్కడే ఉండిపోవడం సరైనేదా? అనిపిస్తుంటుంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాం’ అని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎస్ రేవతి తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. 
parents

5. భవిష్యత్తులో డేటింగ్.. ఆన్‌లైన్‌లోనే :
కరోనా.. లాక్ డౌన్‌కు ముందు.. ఇప్పుడు డేటింగ్ ట్రెండ్ మారిపోయింది. ఆన్ లైన్ డేటింగ్ మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. క్వారంటైన్ సమయంలో ఇప్పటికే చాలామంది ఆన్ లైన్ డేటింగ్ సర్వీసులను వినియోగించుకుంటున్నారని చాలా నివేదికలు వెల్లడించాయి. లాక్ డౌన్ సమయంలో ఎక్స్ ట్రా మెరిటల్ డేటింగ్ (అక్రమ సంబంధాలు) సర్వీసు ప్రొవైడర్లకు ఎక్కువ సంఖ్యలో సబ్ స్ర్కైబర్లు పెరిగిపోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఎవరూ ఒప్పుకున్నా లేకున్నా ఆన్‌లైన్ డేటింగ్ భవిష్యత్ అంటూ హరికేష్ తివారీ అనే విద్యార్థి అభిప్రాయపడ్డారు. 
online dating

Read Here>> లాక్‌డౌన్ లవ్.. పడక గదిలో మెరవాలంటే సైన్స్ చెప్పిన ఈ టిప్స్ పాటించాల్సిందే

Categories
71701 71715 71716

పురుషుల్లో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఇదే!

మహిళల్లో కంటే పురుషుల్లోనే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఓ యూరోపియన్ అధ్యయనం తేల్చేసింది. పురుషుల్లో కరోనా వైరస్ తీవ్రతకు గల కారణాలను వెల్లడించింది. అందులో పురుషుల్లోని రక్తంలో అత్యధిక స్థాయిలో ఎంజైమ్‌లు ఉండటమే ఇందుకు కారణమని గుర్తించింది. కొవిడ్-19 వైరస్ ఇన్ఫెక్షన్లకు మగవారే ఎందుకు ప్రభావితం అవుతారు అనేదానిపై అధ్యయనం వివరణ ఇచ్చింది. మగవారి జీవనశైలితో పాటు మహిళల్లో సాధారణంగా ఉండే అధిక రోగనిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు సాగాయి. 

పురుషుల్లో గుండె, కిడ్నీలు, ఇతర అవయవాల్లో Angiotensin-converting enzyme 2 (ACE2) అనే ఎంజైమ్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీని సాయంతోనే కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన యూనివర్సిటీ మెడికల్ సెంటర్ (UMC) అధ్యయనంలో గుర్తించింది. ఈ ఎంజైమ్ మహిళల కంటే పురుషుల రక్తంలో అధికంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలింది. అందువల్లే కరోనా వైరస్ ప్రభావం మగవారిలో అధికంగా ఉన్నట్లు విశ్లేషించారు. ఈ మేరకు అధ్యయనాన్ని యూరోపియన్ హార్ట్ జనరల్‌లో ప్రచురించారు. 

కొవిడ్-19తో మరణిస్తున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉండడంతో ఈ కోణంలోనూ అధ్యయనం చేయడంతో ఏసీఈ2 వల్లేనని గుర్తించామన్నారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, మూత్రపిండాల సంబంధిత వ్యాధిలో ఏసీఈ సాంధ్రతను నియంత్రించడానికి వాడే ACE ఇన్ హిబిటర్స్ లేదా Angiotensin రిసెప్టర్ బ్లాకర్లు (ARBs) అనే డ్రగ్స్‌.. కొవిడ్-19 రోగులకు ఇవ్వొచ్చని అధ్యయనంలో సూచించారు. తద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించొచ్చని అంచనా వేశారు. 

ACE2 ఎంజైమ్ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లో ఉంటుందని.. వీటికంటే కూడా పురుషుల వృషణాల్లో అధికంగా ఉంటుందని నెదర్లాండ్స్ లోని Groningenలో ఉన్న University Medical Center (UMC)కి చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ Adriaan Voors తెలిపారు. దీనివల్లే ఈ ఎంజైమ్ పురుషుల్లో అధికంగా ఉందని అంటున్నారు. కరోనా వైరస్ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణమవుతోందని వెల్లడించారు.

ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే కారణమవుతుందని తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. 11 యూరోపియన్ దేశాల నుంచి వేలాది మంది పురుషులు, మహిళల్లో 3,500 మందికిపైగా హార్ట్ ఫెయిలర్ పేషెంట్ల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో కూడా ACE2 ఎంజైమ్‌ పరిమాణాన్ని వూర్స్ బృందం నిశితంగా విశ్లేషించింది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరించడంతో ఇప్పటివరకూ 4 మిలియన్ల మంది బారినపడ్డారు. దాదాపు 2 లక్షల 77 వేల మంది మరణించినట్టు రాయిటర్స్ టాలీ పేర్కొంది. మహిళల్లో కంటే పురుషుల్లోనే తీవ్ర అనారోగ్య సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉందని, వారిలోని వ్యాధినిరోధకతను బట్టి తీవ్రతలో మార్పులు ఉంటాయని తెలిపింది. 

Read More:

అధిక బరువున్నవారే కరోనాతో ఎందుకు చనిపోతారంటే? 

కరోనావైరస్ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యమంటున్న సైంటిస్టులు

Categories
71701 71715 71716

అధిక బరువున్నవారే కరోనాతో ఎందుకు చనిపోతారంటే? 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టు తెలిపింది. అధిక బరువు కలిగినవారిలోనే కొవిడ్-19 ముప్పు అత్యధికంగా ఉంటుందని పేర్కొంది.

న్యూయార్క్ కు చెందిన రిపోర్టు ప్రకారం.. ప్రతి ఐదుగురిలో ఇద్దరిలో శ్వాసనాళాలకు సంబంధించిన సమస్యలు ఉంటున్నాయని తెలిపింది. ఫ్రాన్స్‌లో కరోనా సోకిన తక్కువ బరువు ఉన్నవారితో పోలిస్తే.. అధిక బరువు ఉన్నవారిలో దాదాపు 90శాతం మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అవసరం తప్పక ఉంటుందని తెలిపింది. కరోనా సోకిన ఒబిసిటీ బాధితులు ఎక్కువగా ఇంటెన్సివ్ కేర్ (ICU) యూనిట్లోనే ఎందుకు చేరుతున్నారంటే అందుకు చాలా కారణాలుగా చెప్పవచ్చు. 

అవసరమైతే వీరికి ఇన్వేసివ్ వెంటిలేషన్ కూడా పెట్టాల్సి వస్తుందని రిపోర్టు వెల్లడించింది. ఛాతిలో అధిక స్థాయిలో కొవ్వు, పొట్టపై బెల్లీ ప్యాట్ కారణంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా అధిక స్థూలకాయం ఉన్నవారిలో శ్వాసపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో కొవిడ్-19 వ్యాధి సోకితే శ్వాసపరమైన సమస్యలతో శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని మరింత తగ్గిపోతుంది. అధిక బరువు ఉన్నవారిలో కూడా ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. వీరికి అధికంగా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. స్థూలకాయంతో బాధపడే కొందరి రోగుల్లో శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. 

శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందక శ్వాస రుగ్మతతో బాధపడుతుంటారు. ఈ కారణాలతో గుండె, ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ తగిన మోతాదులో సరిపోదు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. వీరిలో వ్యాధి తీవ్రత ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించలేని విధంగా ఉంటుంది. కొవిడ్ సోకిన స్థూలకాయుల్లో తీవ్ర అనారోగ్యంతో పాటు మరణానికి దారితీసే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొవిడ్ కారణంగా ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒబెసిటీ ఉన్నవారిలో సాధారణంగా వ్యాధినిరోధక శక్తి కూడా తగినంత స్థాయిలో ఉండదు. రక్త సరఫరా కూడా అధిక స్థాయిలో ఉంటుంది. ఫలితంగా రక్తపోటు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

Read More:

కరోనావైరస్ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యమంటున్న సైంటిస్టులు

*  కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 76శాతం తగ్గిన గుండెజబ్బులు

Categories
71706 71715 71716

కరోనావైరస్ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యమంటున్న సైంటిస్టులు

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. కరోనా అనేక మార్గాల్లో వ్యాపిస్తుందని తెలుసు.. ముక్కు, నోటి ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. ఇప్పుడు కళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యంగా ప్రాణాంతక వైరస్ దాడి చేస్తుందని గుర్తించినట్టు సైంటిస్టులు చెబుతున్నారు.

కరోనావైరస్‌ను శాస్త్రీయంగా SARS-CoV-2 అని పిలుస్తారు.  ACE-2 గ్రాహకాలపై పనిచేస్తుంది. శరీరంలోని కణాలలోకి ‘గేట్‌వే’ అని పిలుస్తారు. ఈ గ్రాహకాలు శ్వాస మార్గము నుంచి ఊపిరితిత్తులలో ప్రవేశిస్తాయి. ఇక్కడే వైరస్ మొదట కణాలతో, ఇతర అవయవాలలోకి చొచ్చుకుపోతుంది. Johns Hopkins University School of Medicine నేతృత్వంలోని బృందం ఇప్పుడు కళ్ళు ACE-2ను ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తించాయి. ఈ కణాలు వైరస్‌కు లక్ష్యంగా మారినట్టు తెలిపారు. 

వైరస్ సోకిన వ్యక్తి తుమ్ము లేదా దగ్గు నుండి నీటి తుంపర్ల ద్వారా కంటి ఉపరితలంపైకి వస్తే.. వైరస్ అక్కడ కణాలలోకి చొరబడటం ప్రారంభిస్తుంది. కొంతమంది రోగులు కండ్ల కలకను ఎందుకు అనుభవించినట్టు గుర్తించారు. తద్వారా కంటి వాపు అది ఎర్రగా మారి సోకినట్లు మారుతుంది. వైరస్ కళ్ళ ద్వారా శరీరంలోకి ప్రవేశించడమే కాదు.. కన్నీళ్లు ద్వారా కూడా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. బాల్టిమోర్‌లోని జాన్స్‌ హాప్‌కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఆప్తాల్మాలజీ విభాగానికి చెందిన Lingli Zhou ఈ పరిశోధక బృందానికి నాయకత్వం వహించారు. ACE2 (angiotensin-converting enzyme 2) వ్యక్తీకరణ కోసం COVID-19 తో మరణించిన వ్యక్తుల్లో పదివరకు పోస్ట్ మార్టం కళ్ళను విశ్లేషించారు. 

ఎక్కువ ACE-2 గ్రాహకాలు ఉన్న ఎవరైనా పెద్ద వైరల్ లోడ్‌కు ఎక్కువ అవకాశం ఉందని సూచించింది. కనురెప్పల లోపలి భాగాన్ని conjunctiva అని పిలుస్తారు,  వైరస్ ప్రధానంగా లాలాజల బిందువులు లేదా ముక్కు ద్వారా సోకిన వ్యక్తి నుండి మరొక వ్యక్తి ముక్కు లేదా నోటి లోపలికి ప్రవేశిస్తుంది. కంటి ద్వారా కరోనా వైరస్ ప్రవేశించటం పూర్తిగా సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. COVID-19 కండ్లకలకకు కారణమవుతుందని నివేదికలు సూచించాయి.

ఇది ఒక అధ్యయనంలో 30 శాతం మంది రోగులలో లక్షణంగా గుర్తించారు. వైరస్ శ్వాసకోశ నుండి కళ్ళకు ప్రయాణించడం వల్ల కావచ్చు అని పరిశోధకులు వివరించారు. పాండమిక్ ఫ్రంట్‌లైన్‌లోని వైద్యులు వారి కళ్ళను రక్షించుకోవడానికి గాగుల్స్ లేదా ఫేస్ విజర్స్ ధరించాలి. చైనాలో కళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందినవారిలో కేవలం 26 మంది మరణించారు. 

Read More :

కరోనా వైరస్ వారికి రెండోసారి సోకదు: సైంటిస్టులు తేల్చేశారు!

కరోనా నుంచి రక్షంచుకోవటానికి , ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఈ విటమిన్స్ తీసుకుంటే చాలు

Categories
71684 71715 71716

లాక్‌డౌన్‌లో భార్యలకు నరకం చూపిస్తున్న భర్తలు!

లాక్‌డౌన్‌ సమయంలో భర్తలు భార్యలను చితకబాదారు. తమను కాపాడాలంటూ బాధిత మహిళలంతా డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ షీటీమ్స్‌ అండగా నిలబడ్డాయి. బాధిత మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మేము ఉన్నామంటూ భరోసా కల్పించాయి. లాక్‌డౌన్‌లోని 47 రోజుల్లో సైబరాబాద్‌ పరిధిలోనే 790 మంది మహిళలు గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులందాయి. మద్యం షాపులు తెర్చుకున్న ఒక రోజులో దాదాపు 50మంది మహిళలు వారి మొగుళ్ల చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. 

భార్యాభర్తలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరికి వారు స్మార్ట్‌ ఫోన్‌‌లో మునిగిపోయారు. ఓ రోజు భర్త ఫోన్‌ హిస్టరీని చూడగా మరో యువతితో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. వెంటనే ఆమె నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన భర్త ఆమెను చితకబాదాడు. ఆమె భరించలేక డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. తనను కాపాడాలని కోరింది. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆమె పరిస్థితిని గమనించి షీటీమ్స్‌ను సమాచారం ఇచ్చారు. షీటీమ్స్‌ ఇంటికి చేరుకున్నాయి. భర్తను తీవ్రంగా మందలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

మరో సాఫ్ట్‌వేర్‌ కుటుంబంలో ఇలాంటి పరిస్థితే ఉంది. భార్య ఫోన్‌ను తనిఖీ చేసిన భర్తకు ఆమె దొంగచాటు ప్రేమాయణం తెలిసింది. వెంటనే ఆమెను ప్రశ్నలతో సూటిపొటి మాటలతో చితకబాదాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ మహిళ డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. స్థానిక పోలీసుల సహాయంతో షీటీమ్స్‌ దర్యాప్తునకు దిగి విషయాన్ని పరిశీలించాయి. తాను ఇక్కడ ఉండలేనని తన పుట్టింటికి తీసుకువెళ్లాలని ఆమె చెప్పడంతో ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆమెను అమ్మగారింట్లో దించేశారు. 

లాక్‌డౌన్‌తో ఇద్దరు ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో పనులు చేయాల్సిందిగా భార్య భర్తను కోరింది. ఇంటి పని చెప్పుతావా అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. మరోసారి ఇలాంటి పనులు చెబితే చంపేస్తానంటూ హెచ్చరించాడు. భార్య తనను కాపాడాలంటూ డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. షీటీమ్స్‌ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి బాధిత మహిళను పుట్టింటికి తరలించారు. 

కుటుంబంలో పూల్‌గా తాగిన భర్తను ప్రశ్నించినందుకు బాగా కొట్టాడు. ఇంట్లో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉండాలని నాకే సూచిస్తావా అంటూ భార్యపై ఎగబడ్డాడు. దెబ్బలకు తాళలేక భార్య డయల్‌ 100లో షీటీమ్స్‌ను సంప్రదించింది. లాక్‌డౌన్‌ సమయంలో భార్యలను చితకబాదిన సంఘటనలు దాదాపు 70వరకు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌లో సైబరాబాద్‌ పరిధిలో మొత్తం 790 మంది మహిళలు గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. 

Read More :

మద్యం మత్తులో మహిళా పంచాయతీ కార్యదర్శిపై యువకులు దాడి

లాక్ డౌన్ లో ఘోరం, భార్య చెల్లిపై భర్త అఘాయిత్యం

Categories
71716

టాట్టూలతో ఉండే లేడీస్ సెక్స్‌లో ఓపెన్‌! సైన్స్ ఏం చెప్పింది?

జుట్టుకు డై, టాక్సిక్‌లు పెట్టుకునే  లేడీస్ పై కొందరిలో వేరే ఆలోచనలు ఉండొచ్చు. వారు నిజానికి సెక్స్ లో చాలా ఓపెన్ గా ఉంటారట. కెనడాలోని క్వాంట్లెన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రీసెర్చర్లు చేసిన స్టడీ ప్రకారం.. టాట్టూలు వేసుకునే మహిళల్లో ఓపెన్ గా ఉండే స్వభావం ఎక్కువ ఉంటుందని వెల్లడైంది. 

ఈ స్టడీ ముఖ్య ఉద్దేశ్యం టాట్టూలు వేసుకునే వారు ఎక్కువ థ్రిల్ కోరుకుంటారు.. లేదా ఎంజాయ్ మెంట్ ఎక్కువగా ప్రదర్శిస్తారా అనేది తేల్చుకోవడం కోసం కాదు. సెక్స్‌లో అందరూ సమానంగానే ప్రవర్తిస్తారా లేదా ఏమైనా తేడాలున్నాయా అనే దానిపై స్టడీ నిర్వహించారట. 

టూట్టూలు వేసుకునేవారు ప్రతి విషయంలోనూ సమానత్వం కోరుకుంటారట. కలయిక వల్ల వచ్చే లాభాల కోసం వారెంత వరకూ కాంప్రమైజ్ అవుతారనే దానిపై సైంటిస్టులు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. కెనడా లేడీస్ పై ఈ పరిశోధన జరిపారు. 

814మంది మహిళల్లో టాట్టూలు వేసుకున్న వారు, వేసుకోని వారిపై ఈ రీసెర్చ్ నిర్వహించారు. టాట్టూలు వేసుకున్న వారిలో ఎటువంటి ఒప్పందాలు లేకుండా సెక్స్ లో పాల్గొనడంపై ఇంట్రస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. టాట్టూలు లేని మహిళలతో పోలిస్తే వీరిలో సమానత్వం కోరుకునే లక్షణాలు ఎక్కువ. 

ఈ టాట్టూలు సెక్సువల్ గా ఓపెన్ స్వభావాన్ని ప్రతిబింబిస్తాయని తేల్చారు. మహిళావాదం, సెక్స్ విషయాలపై వారికి పూర్తి అవగాహన ఉంటుందని వెల్లడించారు. రీసెర్చర్లు సోషల్ మీడియాలో షేర్ చేసి యూజర్ల పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. 

Also Read | కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 76శాతం తగ్గిన గుండెజబ్బులు!