Categories
71721 71757

పానీపూరి కోసం టీవీ ముందు నిలబడి అడుక్కుంటున్న బిగ్‌బాస్ భామ: ఏం పాట్లురా బాబూ..

బిగ్ బాస్-3 నటి హిమజ తన స్మార్ట్ టీవీ ముందు నిలబడి.. టీవీలో పానీపూరి బండివాడిని పిలుస్తూ తనకు కూడా పానీపూరి వేయమని అభ్యర్థిస్తోంది. కాదు కాదు ఆ అడిగే తీరు చూస్తే..దాదాపు అడుక్కుంటోందో అన్నట్లుగా ఉంది. ఈ వీడియో చూసే ముందు ఆ సంగతులేంటో తెలుసుకుందాం..

పానీ పూరి పేరు చెబితే చాలు నోట్లో నీళ్లు ఊరిపోతాయి. పానీ పూరి కావాలంటే పానీ పూరి బండి దగ్గరకెళ్లాలి. కానీ  టీవీ ముందు నిలబడి..ప్లీజ్..నాకూ పానీ పూరి ఇవ్వవా? అంటూ బండి అబ్బాయిని  అడిగితే ఎలా ఉంటుంది? ఇదేంటీ..ఎంత స్మార్ట్ టీవీ అయితే మాత్రం పానీపూరీలను ఇస్తుందా ఏమిటీ? ఇది మరీ చోద్యంగా ఉంది అని అనిపిస్తోంది కదూ..మరి బిగ్ బాస్ సీజన్-3లో వచ్చిన నటి హిమజ ఏంటీ.. తన స్మార్ట్ టీవీ ముందు ఓ బౌల్ తో  నిలబడి ‘‘ప్లీజ్..పానీ పూరీ బండి అబ్బాయ్..నాక్కూడా పానీ పూరీ  ఇవ్వవా..ఆకలేస్తోంది’ అంటూ  అడుగుతోంది.

కాదు కాదు అలా అడుగుతున్న తీరు చూస్తే అడుడుక్కుంటున్న లెవల్ కి పడిపోయినట్లుగా ఉంది…ఈ సిత్రం ఏటో మీరు లుక్కేయండి..తన ఇన్ స్టాగ్రామ్ లో హిమజ షేర్ చేసిన ఈ వీడియో ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టేసుకుంటోంది. కాగా..కరోనా కల్లోలంతో పానీపూరీ షాప్స్ పూర్తిగా బంద్ అయిపొయినా..బిగ్ బాస్ ఫేమ్ హిమజ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#cravings #panipuri #food #hungry #tiktokindia #telugutiktok #funny #fun #smile #teluguactress

A post shared by Himaja Mallireddy (@itshimaja) on

Read :  సంఘవి కూతురు ఫొటో వైరల్

Categories
71715 71721

ఓ మనిషిని చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు.. పీవీపీ ట్వీట్ పై హరీశ్ శంకర్

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్‌ ట్యాలెంట్‌ను

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య జరుగుతున్న వివాదంలోకి మరో ప్రముఖ నిర్మాత పీవీపీ ఎంటర్ అయ్యారు. బండ్ల గణేష్ పై ఫైర్ అయిన పీవీపీ దర్శకుడు హరీష్ కి సపోర్ట్ పలికారు. హరీష్ కి అనుకూలంగా ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ను బ్లేడ్ బాబు అని సంబోధిస్తూ ట్వీట్ లో చెలరేగారు. బండ్లను టార్గెట్ చేస్తూ హరీష్ ను సపోర్ట్ చేస్తూ పీవీపీ చేసిన ట్వీట్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ వివాదాన్ని ఇంకొంచెం పెంచినట్టు అయ్యింది.

హరీష్ పై పీవీపీ ప్రశంసల వర్షం:
ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్‌ ట్యాలెంట్‌ను అభినందించారు పీవీపీ. ఎంతో మంది నిర్మాతలు హరీష్ తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్‌. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్‌. తమ్ముడు స్టార్ట్‌‌ యూవర్‌ కుమ్ముడు’ అని ట్వీట్ చేశారు.

“ఫైటే” అక్కర్లేదు… “ట్వీటే” చాలు:
పీవీపీ చేసిన ట్వీట్ పై హరీశ్ శంకర్ స్పందించారు. ట్వీట్ ద్వారా రియాక్ట్ అయ్యారు. “మీ ‘భాష, భావం రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి “ఫైటే” అక్కర్లేదు… “ట్వీటే” చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు సార్” అంటూ ట్వీట్ చేశారు.

గబ్బర్ సింగ్ తో మొదలైన గొడవ:
కాగా, మే 11తో గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్‌ను గుర్తుచేసుకుంటూ హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశాడు. అందులో పవన్ కళ్యాణ్, దేవీశ్రీ ప్రసాద్, ఇతర సిబ్బంది థ్యాంక్స్ చెప్పాడు. అయితే అందులో బండ్ల గణేష్ పేరు మిస్సయింది. జరిగిన పొరపాటును గుర్తించిన హరీష్‌ మరో ట్వీట్‌లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించాడు. అయితే అప్పటికే బండ్ల గణేష్ ఫైర్ మీదున్నాడు. లేఖలో తన పేరుని హరీష్ మిస్ చేయడాన్ని బండ్ల జీర్ణించుకోలేకపోయాడు. సోషల్ మీడియా వేదికగా హరీష్‌పై ఫైర్ అయ్యాడు. హరీష్‌కు తను అవకాశం ఇవ్వకపోతే సినిమాలే లేవని కామెంట్‌ చేశాడు. రీసెంట్ గా ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ డైరెక్టర్ హరీష్ పై బండ్ల నిప్పులు చెరిగాడు. తీవ్ర విమర్శలు చేశాడు. ఇలా కొన్ని రోజులుగా బండ్ల, హరీష్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. రీసెంట్ గా ఈ వివాదంలోకి పీవీపీ కూడా ఎంటర్ అయ్యారు. బండ్లను ఏకిపారేసిన పీవీపీ హరీష్ ను సపోర్ట్ చేయడం విశేషం. చివరికి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Read : లాక్ డౌన్ కారణంగా టీవీ నటుడు ఆత్మహత్య

 

Categories
71684 71721

లాక్ డౌన్ కారణంగా టీవీ నటుడు ఆత్మహత్య

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న వారిలో సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా చాలామందే ఉన్నారు.

సినిమా షూటింగ్ లు ఉన్న సమయంలో ఎలాగోలా గడిచిన చిన్న స్థాయి ఆర్టిస్టుల జీవితం..ఇప్పుడు కెమెరాల స్విచ్చ్ లు ఆగడిపోవడంతో కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ టీవీ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదత్ సే మజ్బూర్ మరియు కుల్దీపక్ వంటి షోస్ లో కనిపించిన టీవీ యాక్టర్ మన్మీత్ గ్రీవాల్(32) ముంబైలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఏరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న మన్మీత్..శుక్రవారం రాత్రి నేవీ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. లౌక్ డౌన్ కారణంగా లోన్ లు చెల్లించలేక ఆర్థిక కష్టాలను ఎదుర్కుంటూ కొన్ని రోజులుగా మన్మీత్  తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

బెడ్ రూంలో ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించిన మన్మీత్ ను చూసిన ఆయన భార్య షాక్ కు గురై,సృహ తప్పి పడిపోయిందని మన్మీత్ సన్నిహితులు తెలిపారు. పంజాబ్ కు చెందిన మన్మీత్…లాక్ డౌన్ కు ముందు వెబ్ సిరీస్ లు,కొన్ని కమర్షియల్ ప్రాజెక్టులలో పనిచేస్తున్నట్లు సమాచారం. బెడ్ రూంలో ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించిన మన్మీత్ ను చూసిన ఆయన భార్య షాక్ కు గురై,సృహ తప్పి పడిపోయిందని మన్మీత్ సన్నిహితులు తెలిపారు.

Read Here>> నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే : పవర్ స్టార్ పై ప్రగ్యా ప్రశంసలు

Categories
71721

నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే : పవర్ స్టార్ పై ప్రగ్యా ప్రశంసలు

నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే అంటూ అందం..నటన కలబోసిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపించింది. అందం, నటన..కలబోసిన ఈ అందాల బొమ్మకు మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. 
‘కంచె’ సినిమా తప్ప చెప్పుకోవటానికి పెద్దగా సినిమాల్లేని ప్రగ్యామాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీనే నా ఇల్లు అని చెప్పుకుంటుంది. 

ఈ క్రమంలో నెటిజిన్లతో కాసేపు ముచ్చటించిన ప్రగ్యా పవన్ స్టార్ పై ప్రశంసలు కురిస్తూ..నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాట్‌లో సమాధానమిచ్చింది. వీటిలో రెండు ప్రశ్నలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఒకటి మీకు ఇష్టమైన దర్శకుడు లేదా మీరు నటించాలని అనుకుంటున్న దర్శకుడు ఎవరు? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ రాజమౌళి సార్,సంజయ్ లీలా భన్సాలీ సార్’ అని సమాధానమిచ్చింది.  రెండో ప్రశ్న : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక్క పదం చెప్పండి అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘నిజమైన నాయకుడు (ట్రూ లీడర్)’ అని ప్రగ్యా సమాధానమిచ్చింది. ఇంకేముందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగే చేసుకుంటున్నారు. కాగా చాలామంది సినీ నటుల్ని  నెటిజన్లు ఇదే ప్రశ్న వేస్తుంటారు. అలాగే ప్రగ్యానుకూడా అడగటంతో పవన్ గురించి తన అభిప్రాయాన్ని చక్కగా చెప్పింది ఈ అందాల నటి ప్రగ్యా. 

Read Here>>  ఆ నటుడిని చూసిన ప్రతిసారి నా ఒళ్లు గగుర్పొడుస్తుంది

Categories
71715 71721

ఆ నటుడిని చూసిన ప్రతిసారి నా ఒళ్లు గగుర్పొడుస్తుంది

తమిళ హీరో సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు నటి మంచు లక్ష్మి. సూర్య నటనను ఆకాశానికి ఎత్తేశారు.

తమిళ హీరో సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు నటి మంచు లక్ష్మి. సూర్య నటనను ఆకాశానికి ఎత్తేశారు. సూర్య గ్రేట్ అని, సూపర్ స్టార్ అని కితాబిచ్చారు. తాను ఎక్కువగా అభిమానించే నటుల్లో సూర్య అందరి కన్నా ముందు ఉంటారని చెప్పారు. హీరో సూర్యను చూసిన ప్రతిసారీ తన ఒళ్లు గగుర్పొడుస్తుందని మంచు లక్ష్మి అన్నారు. ఓ తమిళ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి సూర్య గురించి ప్రస్తావించారు.

”సూర్య ఓ గొప్ప నటుడు. అతడ్ని చూసిన ప్రతిసారీ నా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రతి పోస్టర్ కొత్తగా ఉంటుంది. తను ఓ సూపర్ స్టార్ కాబట్టి.. ప్రతి సినిమాకు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఆయనకు క్రేజ్ ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్, విజయ్ ఇలా అందరూ నాకిష్టమే. కానీ సూర్య విషయానికి వచ్చే సరికి.. వావ్ ఈసారి ఎలా చేశాడు, ఎలా కనిపించబోతున్నాడు అనే ఆతృత నాలో ఉంటుంది. ఆయన కోసం సినిమా చూస్తుంటా” అని లక్ష్మి చెప్పారు.

ఇప్పటికే పలు సందర్భాల్లో ట్విటర్ వేదికగా మంచు లక్ష్మి.. సూర్య గురించి ముచ్చటించారు. ఆయన తన అభిమాన నటుడని అన్నారు. ఆమె, జ్యోతిక, సూర్య స్నేహితులు కూడా. మంచు లక్ష్మి 2018లో కాట్రిన్ మొళి చిత్రంలో కనిపించారు. బాలీవుడ్ హిట్ తుమ్హారి సులుకి తమిళ రీమేక్ ఇది. జ్యోతిక ప్రధాన పాత్ర పోషించారు. ఆమె స్నేహితురాలిగా మంచు లక్ష్మి నటించారు.

Read  More:

*  నిత్యా మీనన్ ‘డిజైనర్ డ్రెస్’ వేలం.. కరోనా సాయం!

చార్మి బర్త్ డేకు ఎమోషనల్‌గా పూరీ జగన్నాథ్ 

Categories
71715 71721

నిత్యా మీనన్ ‘డిజైనర్ డ్రెస్’ వేలం.. కరోనా సాయం!

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా గ్రామీణవాసుల నుంచి వలస కార్మికుల వరకు ఉపాధి కోల్పోయారు. కరోనా కష్టకాలంలో ఆకలితో బాధపడేవారికి సాయం చేసేందుకు సినీప్రముఖులు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. తమ అభిమానులను కూడా సాయం చేయమని వారిని ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పుడు హీరోయిన్ నిత్యా మీనన్‌ కూడా పెద్ద మనస్సును చాటుకుంది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందరిలా కాకుండా వినూత్నమైన దారిని ఎన్నుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్‌ షో కోసం తాను వేసుకున్న డిజైనర్‌ డ్రెస్‌ని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు నిత్యా మీనన్. ఈ వేలంలో వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్‌ ద్వారా పలు గ్రామాలకు నిత్యా మీనన్ కరోనా సాయం చేయనున్నారు. 

Read Here>> జూ.ఎన్టీఆర్ బర్త్ డేకు RRR team surprise

Categories
71721

మాస్కుల ముసుగుల్లో పెళ్లి అవ‌స‌ర‌మా? వీళ్లు సంసారాలు చేస్తారా?: నటి వ్యాఖ్యలు హాట్ టాపిక్

నటి మాధ‌వీల‌త వ్యాఖ్యలు ఎప్పుడూ ఆసక్తికంగానే ఉంటాయి. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పే మాధవీలత తాజాగా లాక్ డౌన్ లో జరిగే పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేసిందారామె.
 
లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో నిఖిల్..దిల్ రాజు స‌హా మ‌రికొంత మంది సినిమా వాళ్లు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మాధ‌వీల‌త త‌న‌దైన స్టైల్లో కామెంట్స్ చేసారు. మాస్కుల ముసుగులతో పెళ్లిళ్లా? ‘‘ముహూర్తం మ‌ళ్లీ రాదా? పిల్ల దొర‌క‌దనా? లేక  పిల్లోడు మారిపోతాడనా? అలా మారిపోయే మ‌నుషుల‌తో..మార్చుకునే నిర్ణయాలతో బంధాలు ఎందుకు? మాస్కుల ముసుగులో పెళ్లి అవ‌స‌ర‌మా?  లాక్ డౌన్ అర్థం ఏంటో వీళ్లకు తెలుసా? కొన్నాళ్లు ఆగ‌లేని వాళ్లు అసలు సంసారాలు చేస్తారా?’’  అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

ఇది నా  అభిప్రాయం. నా భావాల‌ను చెప్పే హ‌క్కు నాకుంది’’ అంటూ ఓ మరోసారి తనదైన శైలిలో మెలికలాంటిది ఏడ్ చేసారు మాధవీలత.మెళిక పెట్టింది. 

Read Here>> ఎక్కడకు వెళుతున్నారు : నాగ చైతన్య, సమంత బైక్ ఫొటో వైరల్

Categories
71715 71721

ఎక్కడకు వెళుతున్నారు : నాగ చైతన్య, సమంత బైక్ ఫొటో వైరల్

టాలీవుడ్ లో మన్మథుడు నాగార్జున తనయుడు నాగ చైతన్య, కోడలు సమంతలు సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి సందడిగానే ఉంటుంటారు. ముఖ్యంగా సమంత…తనకు సంబంధించి..ఇతరత్రా విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత..సినిమాలతో బిజీగా మారిపోతున్నారు. చైతూకు బైక్ రైడింగ్ అంటే ఎక్కువ ఇష్టమనే సంగతి తెలిసిందే. తాజాగా…సమంత పోస్టు చేసిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

సుధీర్ఘకాలం ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. సినిమాలతో బిజీగా గడిపేవారు. అయితే చాలాకాలం తర్వాత కరోనా కారణంగా గ్యాప్ రావడంతో వీరిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఎంజాయ్ చేస్తున్న ఈ యువజంట.. ఖాళీ స‌మ‌యాన్ని సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా గడుపుతున్నారు. 

బైక్ పై ముందు నాగ చైతన్య కూర్చొగా..వెనుక సమంత కూర్చొని ఉంది. సమంత హెల్మెట్ పట్టుకోగా..నాగ చైతన్య..హెల్మెట్ ధరించి ఉండడం కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు..కదా..ఈ సమయంలో వీరిద్దరూ ఎక్కడకు వెళుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. చూడముచ్చటగా ఉన్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో సమంత ఇటీవలే కొన్ని పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. యాక్టింగ్ నేర్చుకుంటున్నానని, జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నానని వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ట్రైనర్ సందీప్ రాజ్ సూచనలతో వర్కవుట్స్ వీడియోను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పొగడ్తలతో ముంచెత్తారు. సమంత ఈ ఏడాది ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సీజన్‌తో పలకరించబోతుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

?

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Read Here>>  దటీజ్ ఉపాసన: పేడ ఎత్తుతూ..కుడితి కలుపుతూ..లాక్ డౌన్ లో బిజీ బిజీ

Categories
71721 71723

మేకప్ మ్యాన్ దగ్గర అప్పు తీసుకున్న నటి

‘కూర్చొని తింటే కొండలు అయినా కరిగిపోతాయ్’ అన్నట్లుంది పరిస్థితి ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని. కోట్లకు పడగెత్తిన వారి పరిస్థితి ఏమో కానీ, చిన్నాచితక ఆర్టిస్టులకు చేయిజాచడం తప్పడం లేదు. లాక్‌డౌన్ అని చెప్పి మెయింటైనెన్స్ ఆగదు కదా.. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న టీవీ ఆర్టిస్టుకు అవే సమస్యలు వచ్చి పడ్డాయి. చేసేది లేక మేకప్ మ్యాన్ దగ్గర ఓ రూ.15వేలు కావాలంటూ అప్పు తీసుకుందంట. 

‘ఇవాళ వచ్చే నెల ఖర్చులకు సరిపడ డబ్బులు లేవని మేకప్ మ్యాన్ దగ్గర అప్పు తీసుకున్నాను. ఓ ప్రొడ్యూసర్ టైంకు మనీ ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి అడుగుతున్నా పట్టించుకోలేదు. ఓ మేకప్ మ్యాన్ కు విషయం చెప్పాను. అతని భార్య గర్భిణీ. అయినా నా పరిస్థితి అర్థం చేసుకుని సాయం చేస్తానన్నాడు. అతను పంపిన మెసేజ్ చూసి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి

‘మేడమ్ నా దగ్గర రూ.15వేలు ఉన్నాయి. ఇప్పుడు మీకు కావాలంటే తీసుకోండి. గర్భిణీ అయిన నా భార్య డెలివరీ సమయానికి ఇచ్చేస్తే చాలు. నా వల్ల లక్షల లాభం గడించిన వాళ్లు నా ఫోన్ ఆన్సర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. కాల్స్ బ్లాక్ చేసి నేను పనిచేసిన దానికి కూడా డబ్బులివ్వలేదు. నా మేకప్ మ్యాన్ పంకజ్ గుప్తా ఓ ఫ్యామిలీ మెంబర్ లా సాయం చేశాడు’

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@pankajgupt09 ♥️

A post shared by Sonal Vengurlekar (@sonal_1206) on

‘అతను డబ్బులు ఇస్తాననడం పెద్ద విషయం కాదు. అతని దగ్గర అన్ని డబ్బులు లేకపోయినా నా గురించి ఆలోచించాడు. మనస్సుతోనూ ప్రజలు ఎంత ఉన్నతంగా ఉండగలరో తెలుసుకునే టైం వచ్చింది’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టి వెల్లడించింది. 

Read Here>> ఆనాటి ‘మిస్ ఇండియా’ సుందరీమణుల ఫొటోలు చూశారా?

Categories
71715 71721

ఆనాటి ‘మిస్ ఇండియా’ సుందరీమణుల ఫొటోలు చూశారా?

బిజీబిజీగా లైఫ్ గడిపేసిన వారంతా లాక్‌డౌన్ పుణ్యామని ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ తమ ఇంట్లోనే ఉంటూ ఒకప్పటి మెమెరీలను గుర్తుచేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఒకప్పటి తీపి గుర్తులను తమ కుటుంబ సభ్యులతో పాటు తమ అభిమానులతోనూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఒకప్పుడు ప్రపంచ సుందరిగా పేరొందిన మిస్ యూనివర్స్ లారా దత్తా తన 20ఏళ్ల నాటి మిస్ యూనివర్స్ కిరీటీం దక్కించుకున్న నాటి పాత ఫొటోలు, ఫ్యాన్ పేజీల్లో షేర్ చేసింది. లారా షేర్ చేసిన పాత ఫొటోల్లో ఒక ఫొటో ప్రతిఒక్కరిని ఫిదా చేస్తోంది. ఆ ఫొటోలో లారా స్విమ్ స్యూట్ రౌండ్ లో పాల్గొని తన అందాలతో ఫొజిస్తూ ప్రతిష్టాత్మకమైన కిరీటాన్ని గెల్చుకుంది. 

ఆ ఫొటోలో లారా దత్తాతో పాటు మొత్తం 8 మంది మిస్ ఇండియా అందాల సుందరిమణులు కూడా తళుకుమని మెరిశారు. ఆ ఫొటోలో మిస్ యూనివర్స్ (1994) సుస్మితా సేన్, మిస్ వరల్డ్ (1994), ఐశ్వర్యా రాయ్, మిస్ వరల్డ్ (199), డయానా హేడెన్, మిస్ వరల్డ్ (1999), యుక్తా మోఖే, మిస్ యూనివర్స్ (2000), లారా, మిస్ వరల్డ్ (2000), ప్రియాంకా చోప్రా, మిస్ ఆసియా పసిఫిక్ (2000) డియా మిర్జా తదితరులు ఉన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

? A bevy of beauties! From left to right: Sushmita Sen – Miss Universe 1994 Priyanka Chopra – Miss World 2000 Lara Dutta – Miss Universe 2000 Yukta Mookey – Miss World 1999 Dia Mirza – Miss Asia Pacific 2000 Diana Hayden – Miss World 1997 Aishwarya Rai – Miss World 1994 @sushmitasen47 @priyankachopra @larabhupathi @yuktamookhey @diamirzaofficial @dianahaydensays @aishwaryaraibachchan_arb #missasiapacific #missworld #missuniverse #missindia #missfeminaindia #femina #beautypageant #beautyqueen #beautyqueens #laradutta #laraduttabhupathi #diamirza #diamirzaofficial #priyankachopra #priyankachoprajonas #priyankachoprafans #priyankachopra_nour #priyankachoprateam #aishwaryarai #aishwaryaraibachan #aishwarya #aish #aishwaryaraibachchan #sushmitasen #sushmitasenfanclub #sushmitasen47 #yuktamookhey #dianahayden #missworld1994 #missuniverse1994

A post shared by @ retrobollywood on

మరో బాలీవుడు భామ సోనమ్ కపూర్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో ఫొటోను షేర్ చేసింది. ‘నేనెప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు. ఈ మహిళలు చరిత్రను సృష్టించారు. ఇలాంటి మరుపురాని క్షణం మళ్లీ జరుగుతుందని అనుకోం. భారత్ ఒక నిజమైన శక్తి కేంద్రం’ అని పోస్టు చేసింది.

సుస్మితా సేన్ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న రెండో భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. 2003లో ఫిల్మ్ అండాజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి లారా ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొనే మోడల్స్ కోసం లారా దత్తా మెంటర్ గా కూడా వ్యవహిరించారు. 

Read Here>> భార్యను వదిలేసి, యువ గాయనితో మ్యూజిక్ డైరెక్టర్ సహజీవనం