Categories
71715 71723

కరోనాకు బలైన తండ్రి డెడ్ బాడీ కోసం, వెయిట్ చేస్తున్న వ్య‌క్తి సెల్ ఫోన్ చోరీ

చోరుల‌కు మాన‌వ‌త్వం లేకుండా పోతోంది. క‌రోనా వేళ..తీవ్ర విషాదంలో ఉన్న ఓ వ్య‌క్తి ద‌గ్గ‌రి నుంచి సెల్ ఫోన్ చోరీ చేశారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ జీటీబీ ఆసుప‌త్రిలో 44 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న వ్య‌క్తి క‌రోనా కార‌ణంగా చ‌నిపోయాడు. దీంతో తండ్రి మృత‌దేహాన్ని తీసుకొనేందుకు…2020, జూన్ 15వ తేదీ సోమ‌వారం ఆసుప‌త్రికి వ‌చ్చిన పంక‌జ్ కుమార్ వ‌ద్ద‌నున్న సెల్ ఫోన్ చోరీ చేశారు..

మృత‌దేహాన్నికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని..త‌న కుటుంబ‌స‌భ్యుల కోసం మాదీపూర్ నివాసి పంక‌జ్ కుమార్ క్యాబ్ ఏర్పాటు చేశాడు. గేటు నెంబ‌ర్ 6 బ‌య‌ట వేచి ఉన్నాన‌ని, త‌న స్నేహితుడితో మాట్లాడుతుండ‌గా…కానీ..అదే స‌మ‌యంలో బైక్ పై వ‌చ్చిన వ్య‌క్తులు త‌న సెల్ ఫోన్ లాక్కొళ్లి పోయార‌ని వాపోయాడు.

అందులో త‌న స్నేహితుల ఫోన్ నెంబ‌ర్లు, త‌న తండ్రి ఆధార్ కార్డు, ఫొటోలు ఉన్నాయ‌ని, మృత‌దేహాన్ని అప్ప‌గించే స‌మ‌యంలో త‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవ‌ని..అది సాధ్యం కాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మీపంలో ఉన్న ఓ టీ అమ్మే వ్య‌క్తి..త‌న‌కు స‌హాయం చేసేందుకు ముందుకొచ్చాడ‌ని, అత‌ని ఫోన్ ద్వారా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాన‌న్నారు. చివ‌ర‌కు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి..తండ్రి అంత్య‌క్రియ‌లు పూర్తి చేశాడు పంక‌జ్‌. 

కేసు న‌మోదు  చేశామ‌ని, అనుమానితుల‌ను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ల‌ను స్కానింగ్ చేస్తున్నామ‌ని డిప్యూటి క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ అమిత్ శ‌ర్మ వెల్ల‌డించారు. త‌న తండ్రి ర‌మేష్ కుమార్ ప‌ది రోజుల క్రితం అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు, బ‌ల‌హీనంగా ఉండ‌డం..ఆహారం తీసుకోక‌పోతుండ‌డంతో స్థానిక ఆసుప‌త్రికి తీసుకెళ్లాన‌ని పంక‌జ్ వెల్ల‌డించారు. జీటీబీ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా..క‌రోనా సోకింద‌ని గుర్తించార‌న్నారు. తాను ఆఫ్టిక‌ల్ షోరూంలో ప‌నిచేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. 

Read: మంచుకొండ‌ల్లో ర‌క్తం : భార‌త్ – చైనా వివాదం ఏంటీ

Categories
71723 71732

మీ విజన్ ఇప్పుడు అర్థమైంది…మోడీకి థ్యాంక్స్ చెప్పిన రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన MGNREGA( మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పథకంపై యూ టర్న్ తీసుకున్న మోడీకి థన్యవాదాలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

ఈ పథకం విజన్ ను,విశిష్ఠతను అర్థం చేసుకుని, 40 వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి అదనంగా కేటాయించడంపై మోడీకి రాహుల్ ధన్యవాదాలు చెప్పారు. మోడీ యూటర్న్ ఆన్ MNGREA అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా రాహుల్ తన ట్వీట్ లో ఉంచారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ పార్లమెంట్ లో ఈ స్కీమ్ గురించి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో రాహుల్ పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…MNGREA పథకం అనేది కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ యొక్క జీవిస్తున్న స్మారకం. 60ఏళ్ల తర్వాత కూడా కాలువలను తవ్వేందుకు కాంగ్రెస్ మనుషులను పంపిస్తోందని మోడీ అన్నారు. ఇటీవల ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేగా పథకానికి 40 వేల కోట్ల అదనపు నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. 

దీంతో నరేగాకు కేటయించిన మొత్తం నిధులు 61 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికులకు ఈ కేటాయింపులు మేలు చేయనున్నాయి. నరేగా ప్రకారం కూలీలకు ఏడాదిలో 200 పనిరోజులుంటాయి. కూలీ కూడా గౌరవప్రదంగా ఉంటుంది. యూపిఏ హయాంలో మన్‌రెగా పథకాన్ని ప్రారంభించారు.

Read:  జనం చేతుల్లో డబ్బులు పెట్టండి.. విమర్శలకు సమయం కాదు.. : రాహుల్ గాంధీ

Categories
71723

గ్వాలియర్‌లో ఘోరం : అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి..ఐదుగురు ఒకే కుటుంబంవారు  

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియన్ నగరంలో  ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవంగా దహనమైపోయారు. సోమవారం (మే 18,2020) ఉదయం 10గంటలకు రోషినిగఢ్ రోడ్డులోని ఇందేర్‌గంజ్ ప్రాంతంలోని షాప్ కమ్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగిన ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. 

ఈ ఘటనపై ఎస్పీ సత్యేంద్ర సింగ్ తోమ్ మాట్లాడుతూ..మొదట ఓ పెయింట్ షాప్‌లో మంటలు చెలరేగి, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించటంతో బాధితులు తప్పించుకునే అవకాశం లేక మరణించారని తెలిపారు. పెయింట్స్ వల్ల మంటల వేగంగా విస్తరించినట్లుగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ కౌశేంద్ర విక్రమ్ సింగ్, ఎస్పీ నవనీత్ భాసిన్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మంటలు కింది అంతస్థులో మొదలై రెండో అంతస్థులోకి వ్యాపించాయనీ.. అందులో ఉన్న రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జగ్‌మోహన్ గోయల్, జైకిషన్ గోయల్, హరిఓమ్ గోయల్ అనే ముగ్గురు అన్నదమ్ములు పెయింటింగ్ షాప్ నడుపుతున్నారని, బాధితులు కూడా వారి కుటుంబాలకు చెందిన వారేన‌ని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక‌ అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలిసిరాలేదని పోలీసులు తెలిపారు. అయితే, కేసు నమోదుచేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టిన త‌ర్వాతే ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు  తీవ్ర భ‌యాందోళ‌నకు గుర‌వుతున్నారు. 

Read:గాయపడిన కొడుకుని మోస్తూ..900 కిలోమీటర్ల నడక : లాక్‌డౌన్‌లో మరో వలస వేదన

Categories
71723

గాయపడిన కొడుకుని మోస్తూ..900 కిలోమీటర్ల నడక : లాక్‌డౌన్‌లో మరో వలస వేదన

లాక్ డౌన్ తో ఉన్న ఊరు పొమ్మంటోంది. సొంత ఊరు రమ్మంటోంది. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. కానీ..మనస్సు నిండా భారం మాత్రం నీతోనే ఉన్నానంటోంది. నెత్తిపై బరువు నిన్ను విడిచి ఉండలేనంటోంది. కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ తో ఉపాధి ఉన్న ఊరికి పొమ్మంటోంది. వలస వచ్చిన వలస కూలీలకు బతుకు కష్టమైపోతోంది. ఎంత కష్టం ఉన్నాసరే..నిన్న కడుపులో పెట్టుకుంటాను వచ్చేయ్..బిడ్డా అంటూ కన్నఊరు చేతులు చాస్తోంది. 

దీంతో వలస కూలీలు తమ బతుకులు ఎలా ఉన్నా తమ బిడ్డలనైనా బతికించుకుందామని గంపెడాశతో వందల కిలోమీటర్లు మండుటెండలో నడిచిపోతున్నారు. ఈ పయనంలో రాలిపోయే ప్రాణాలెన్నో..కడు దీనగాథలకు కలాలుగా మారిన కథలెన్నో..ఎన్నెన్నో..అటువంటి మరో వలస కూలీ దీనాతిదీన గాథ ఇది..

పొట్ట చేత పట్టుకుని పెళ్లాబిడ్డల్ని కూడా పెట్టుకుని..పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్ కు వలస పోయాడు ఓ బడుగు జీవి. ఏదో కాస్తంత బాగానే బతుకుతున్నాడు. కానీ కరోనా కరాళ నృత్యానికి లాక్ డౌన్ నేనున్నానంటూ వచ్చేసింది. రెక్కల కష్టానికి గండి కొట్టింది. తినటానికి తిండి లేకుండా పోయింది. దీంతో తన సొంత ఊరు వెళ్లిపోదామని పెళ్లాంబిడ్డల్ని వెంటేసుకుని ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా  900ల కిలోమీటర్లు కాలినడకనే బయలుదేరాడు వలస జీవి. 

పంజాబ్ నుంచి నడుస్తునే ఉన్నాడు. అలా మెడకు గాయం  అయినా 15 ఏళ్ల కొడుకు బ్రజేష్  కుమార్ ను మంచంపై పడుకోబెట్టి మోసుకెళుతు నడుస్తూనే ఉన్నాయి. అలా నడున్న అతడ్ని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో రామ్ కుమార్ అనే పోలీసు అధికారి చూశాడు. అతనిని ఆపి మాట్లాడాడు.

తాను పంజాబ్ లోని లూథియానా కు వలస వెళ్లిన తనకు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయానని అందుకే తన సొంత రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ గ్రామానికి వెళ్తున్నానని చెప్పాడు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 900ల కిలోమీటర్లు అంత దూరం కొడుకుని మోసుకుంటు వెళ్తున్న అతన్నిచూసి చలించిపోయారు రామ్ కుమార్.  దీంతో వాళ్లు సురక్షితంగా వారి సొంత గ్రామానికి చేరుకోవటానికి ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ అధికారి రామ్ కుమార్. 

కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సానికి ఇప్పటికే ఎన్నో ప్రాణాలు బలైపోగా..బతకటానికి సగటు జీవి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఈ తరుణంలో ఇటువంటి దీనగాథలు ఎన్నె ఎన్నెన్నో.

Read: ఆ 2 డ్రగ్స్ కలిపి వాడితే…4 రోజుల్లోనే కోలుకున్న కరోనా పేషెంట్లు

Categories
71706 71723

ఆ 2 డ్రగ్స్ కలిపి వాడితే…4 రోజుల్లోనే కోలుకున్న కరోనా పేషెంట్లు

కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్‌లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడికల్ టీమ్…తరుచుగా వాడుతుండే వెర్మిక్టిన్(vermectin) అనే యాంటీప్రోటోజోయల్ మందును (టానిక్ లాంటిది)… ఓ సింగిల్ డోస్ తీసుకొని… దానికి Doxycycline(ఓ యాంటీబయాటిక్) కలిపి వాడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నట్లు తెలిపింది.

 మొత్తం 60 మంది కోవిడ్-19 పేషెంట్లపై ఈ రెండు రకాల మందులను కలిపి వాడటం ద్వారా మొత్తం 60 మందీ కోలుకున్నారని బంగ్లాదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (BMCH)లో మెడికల్ ‌డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ తారెక్ అలం తెలిపారు. తాము ఇచ్చిన మందుల కాంబోతో ఆ 60 మందీ నాలుగు రోజుల్లో కోలుకున్నారని  తెలిపారు. మూడు రోజుల్లోనే కరోనా లక్షణాలు 50 శాతం తగ్గాయన్నారు.

కోలుకున్నవారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని అలం చెప్పారు. ప్రతి పేషెంట్‌కీ ఈ రెండు మందులే ఇచ్చినట్లు తారెక్ తెలిపారు. ఆ పేషెంట్లంతా మొదట్లో శ్వాస సంబంధ సమస్యలతో హాస్పిటల్ కు వచ్చారనీ, వారికి టెస్టులు చేసినప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిందని తారెత్ తెలిపారు. ఇప్పుడు వాళ్లంతా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ మందుల కాంబినేషన్‌ ను దేశంలో, ప్రపంచ దేశాల్లో అంతా వాడేలా ఏం చెయ్యాలో త్వరలో ప్రభుత్వ అధికారుల్ని కలిసి మాట్లాడతామని అలం అన్నారు.

దీనిపై ప్రపంచ దేశాలు సైంటిఫిక్ రివ్యూ అడుగుతాయని చెప్పిన ఆయన… అందుకోసం తాము ఓ రిపోర్టును తయారుచేసి… ఓ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురిస్తామన్నారు. ఇప్పటివరకూ యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్, రిటానవిర్, Mycobacterium, ఎబోలా డ్రగ్ రెమ్ డిసివర్ అనే మందులు కరోనాను తరిమేస్తున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఈ కాంబో మందులు కూడా చేరే అవకాశముంది. 

కాగా,ప్రస్తుతం బంగ్లాదేశ్ లో 23,870కరోనా కేసులు నమోదవగా,349మంది కోలుకున్నారు. 4,585మంది కోలుకున్నారు. బంగ్లాదేశ్ లో ఏప్రిల్ రెండవ వారం నుంచే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కేసుల సంఖ్య రోజుకి 1000కి పైగా ఉంటుంది. కానీ రికవరీ రేటు మాత్రం తక్కువగా ఉంది. 

Read:కారు బాంబుతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్..

Categories
71715 71723

ప్రభుత్వం టార్గెట్ ఇదే : జూలై ఆఖరులోగా 10 మిలియన్ల టెస్టులు.. 20 రాష్ట్రాల్లో ప్రొటోకాల్

కరోనా కష్టకాలంలో భారతదేశం లాక్ డౌన్ 4.0లోకి అడుగు పెట్టింది. వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం కావడంతో ఆ దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. అందుకే లేటెస్ట్ యాక్షన్ అమలు చేయబోతోంది ప్రభుత్వం. జూలై చివరి నాటికి 10 మిలియన్ల మందికి టెస్టులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనపు సౌకర్యాలను అందించనుంది. కరోనాను కట్టడి చేసేందుకు 20 కీలకమైన రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ప్రోటోకాల్‌ అమల్లోకి తేనుంది. ఆగస్టు వరకు ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న ముంబై, ఢిల్లీ, ఇండోర్, పుణె, భూపాల్, చెన్నై సహా 20 నగరాలను గుర్తించింది. వీటితోపాటు ఇతర నగరాల్లోనూ ఇదే తరహా విధానంతో గుర్తించనుంది. జూన్ మొదటివారంలోనే ఆయా నగరాల్లో టెస్టింగ్ వ్యూహాంపై సమగ్రమైన సమీక్షను కేంద్రం నిర్వహించనుంది. ప్రొటోకాల్ అనుగుణంగా మరిన్ని టెస్టులను నిర్వహించనుందవి. జూలై ముందుగానే రివ్యూ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కరోనా కేసుల తీవ్రతకు కీలకమైన జూలై నెలలోగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా రంగం సిద్ధం చేస్తోంది. అంతర్గత ప్రభుత్వాల సాయంతో జూలై ఆఖరు నాటికి 5లక్షల నుంచి 7లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతయని అంచనా వేస్తోంది.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందుగానే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్ సపోర్ట్ సిస్టమ్స్ సేకరణ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా భారీగా పెరిగిపోతూ ఆగస్టు చివరి నాటికి 8 లక్షల నుంచి 1 మిలియన్ (10 లక్షలు) వరకు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం 91వేల కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు సుమారుగా 4వేల నుంచి 5వేల వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తూర్పు వలస కార్మికులైన తిరిగి వస్తున్న క్రమంలో బీహార్, ఒడిషాలో మూడు వంతుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇలా వలస వచ్చిన వారితో గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. 

మే 15 నాటికి డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల పాజిటివ్ రేషియో సగటున 4.3 శాతంగా నమోదైంది. మహారాష్ట్రలో 11.9శాతంతో అందోళనకరంగా ఉంది. ఢిల్లీలో 9.0శాతం, గుజరాత్ లో 7.8శాతం, చత్తీస్ గఢ్‌లో 6శాతం, తెలంగాణలో 5.4శాతం, మధ్యప్రదేశ్‌లో 4.9శాతం, పశ్చిమ బెంగాల్‌లో 4.6 శాతంగా నమోదయ్యాయి. రాబోయే పక్షం రోజుల్లో భారతదేశం యాంటీ బాడీ టెస్టు ప్లాన్ నుంచి ELISA టెస్టింగ్ మెకానిజానికి మారిపోనుంది. దేశంలోని ప్రతి మెడికల్ కాలేజీలో మాలిక్యులర్ డయాగ్నిస్టిక్ ల్యాబ్ నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసేపనిలో నిమగ్నమైంది. 

Read: ఆరుగురు ఒప్పో ఉద్యోగులకు కరోనా.. మూతపడ్డ ఫ్యాక్టరీ

Categories
71723

కర్ణాటకలో రేపటి నుంచి… బస్సు,రైలు సర్వీసులు ప్రారంభం

లాక్ డౌన్ 4.0ప్రారంభమైన తొలిరోజన పెద్ద సడలింపులను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక వ్యాప్తంగా మంగళవారం(మే-18,2020)నుంచి బస్సు,రైలు,ట్యాక్సీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు యడియూరప్ప సర్కార్ ఓకే చెప్పింది. మే-17న కేంద్రహోంశాఖ సూచించిన విధంగా స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

అయితే కేవలం రాష్ట్రంలోనే ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి,లేదా ఇతర రాష్ట్రాలకు ఈ సర్వీసులు నడువవు. అయితే ఆదివారం రోజుల్లో మాత్రం పూర్తి లాక్ డౌన్ కొనసాగుతందని,ఆ రోజు కేవలం ఎసెన్షియల్ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు  ప్రభుత్వం తెలిపింది. మిగిలిన ఆరు రోజుల్లోనే ఈ సర్వీసులు రాస్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.

మరోవైపు కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర,తమిళనాడు,గుజరాత్ రాష్ట్రాల నుంచి కర్ణాటకలోకి ఎవ్వరూ రాకుండా బ్యాన్ విధించింది కర్ణాటక ప్రభుత్వం. అంతేకాకుండా,కంటైన్మెంట్ జోన్లలో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్క్ లు కూడా మంగళవారం నుంచి తెరుచుకోనున్నట్లు ఇవాళ హై లెవల్ మీటింగ్ తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారయన్ తెలిపారు.

 రెడ్ జోన్లలోని కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం కేవలం ఎసెన్షియల్ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలు రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు అవుతాయని యడియూరప్ప సర్కార్ తెలిపింది. కాగా,ఇప్పటివరకు కర్ణాటకలో 1100కి పైగా కరోనా కేసులు,30కి పైగా మరణాలు నమోదయ్యాయి.

Read: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? 

Categories
71723 71744

జనసంద్రంగా రామ్‌లీలా మైదానం: పాసుల కోసం వేలాదిగా వచ్చారు..కరోనా పాజిటివ్ వచ్చేయదూ..

కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఎవరికి వాళ్లు తమ సొంత ఊర్లకు వెళ్లిపోవాలనే తపనే తప్ప మరొకటి పట్టటంలేదు. రామ్ లీలా మైదానం లోకి ఇంతమంది ఎందుకు వచ్చారో తెలుసుకుందాం..  

యూపీలోని పలు ప్రాంతాలకు శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు మంగళవారం (మే 19,2020) నుంచి బయలుదేరనున్నాయి. ఆ శ్రామిక రైళ్లలో వెళ్లాలంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కావటంతో దాన్ని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేశారు. దీంతో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వేలాదిమంది వలస కార్మికులు రామ్‌లీలా మైదానాని చేరుకున్నారు. 

రాష్ట్రంలో వలస కార్మికులు ఎట్టి పరిస్తితుల్లో కాలినడకన గానీ, సైకిళ్లు, అనుమతి లేని వాహనాలపై వెళ్లడానికి అనుమంతించవద్దని ఇప్పటికే సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ అధికారుల్ని ఆదేశించారు. వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సుల్ని నడుపుతోంది. కానీ  యూపీ పెద్ద రాష్ట్రం. కాబట్టి వలస కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు.

దీంతో యూపీ ప్రభత్వం వలస కార్మికుల తరలింపు కోసం శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను అధికసంఖ్యలో నడపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయటం..ఆ రైళ్లలో ప్రయాణించి సొంత ప్రాంతాలకు చేరుకోవటానికి వేలాదిమంది వలస కార్మికులు ఇలా వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవటాని రామ్ లీలా మైదానికి చేరుకున్నారు. సొంత ఊర్లకు వెళ్లాలనే తపనతో..భౌతిక దూరం పాటించాలనే నిబంధన పాటించటంలేదు. ఇటువంటి పరిస్థితులు కరోనా  వైరస్ మరింతగా వ్యాపించటానికి  కారణం కావచ్చు.

Read :  ఆ 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేస్తోంది!

Categories
71706 71715 71723

ఆ 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేస్తోంది!

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేయనుంది. మెక్సికో బోర్డర్‌ నుంచి అమెరికాలోకి అక్రమంగా వీరంతా ప్రవేశించారు. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా ఇమ్మిగ్రేషన్‌  అధికారులు ఈ 161 మంది భారతీయులను అరెస్ట్‌ చేశారు.  ప్రత్యేకమైన విమానం ద్వారా వీరిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి పంపించనున్నారు.

అయితే అత్యధికంగా 76 మంది హర్యానా నుంచి వెళ్లారు. పంజాబ్‌ నుంచి 56 మంది, గుజరాత్‌ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్‌ నుంచి 5 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌, గోవా నుంచి ఒక్కొక్కరు వెళ్లారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. హర్యానా నుంచి వెళ్లిన 19ఏళ్ల యువకుడు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

అమెరికా వ్యాప్తంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన మొత్తం 1739 మంది భారతీయుల్లో ప్రస్తుతం 95మంది జైళ్లలో మగ్గుతున్నారని నార్త్‌ అమెరికన్‌ పంజాబ్‌ ఆసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ Satnam Singh Chahal తెలిపారు. 2018లో  611 మందిని అమెరికా నుంచి తిప్పి పంపించేసినట్టు చెప్పారు. 2019లో ఈ సంఖ్య రెండున్నర రెట్లు పెరిగి 1616కి  చేరుకుందని తెలిపారు. మధ్యలోని ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి 35 నుంచి 50 లక్షలు తీసుకొని వారిని ఇతర దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తారని చహల్‌ తెలిపారు. పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Read : ఇకపై విమాన ప్రయాణం ఇలానే ఉండబోతోంది..?

Categories
71723

పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి : సహనం చచ్చిపోయిందేమో

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూర్లకు పంపాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు వరస కూలీలు. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. కార్మికుల రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి.  

ఈ ఘటనపై అహ్మదాబాద్‌ జోన్‌-1 డీసీపీ పర్విన్‌ మాల్‌ మాట్లాడుతూ.. వస్ర్తాపూర్‌లో వలస కూలీలు చేస్తున్న ఆందోళనను నియంత్రించే క్రమంలో వారు పోలీసులపై  రాళ్ల దాడి చేశారని తెలిపారు. సుమారు 250 మంది కార్మికులు పోలీసులను రౌండప్‌ చేశారని తెలిపారు. అంతేకాదు ఈ ప్రాంతాలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ కు చెందిన ఆఫీసు భవనాన్ని కూడా కూడా కార్మికులు ధ్వంసం చేశారని తెలిపారు. దీనికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పర్విన్‌ స్పష్టం చేశారు.

లాక్ డౌన్ ఆంక్షలతో ఉపాధి కోల్పోయి ఆకలి బారిన పడుతున్న వలస కార్మికుల దీనగాథలు కంటతడి పెట్టిస్తున్నాయి. వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఎలాగైనా సరే తమ స్వంత ఊర్లకు వెళ్లిపోవాలని తపన పడుతున్నారు. దీని కోసం వందలాది కిలోమీటర్లు ఎర్రటి ఎండలో కాలినడకన పయనిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరిది ఒక్కోగాధ. దీనగాథలు వెలుగులోకి వస్తున్న క్రమంలో సహనం కోల్పోయే..విచక్షణ కోల్పోతున్న వసల కార్మికులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా జరగుతున్నాయి. 

Read : స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు