Categories
71723 71732

మీ విజన్ ఇప్పుడు అర్థమైంది…మోడీకి థ్యాంక్స్ చెప్పిన రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన MGNREGA( మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పథకంపై యూ టర్న్ తీసుకున్న మోడీకి థన్యవాదాలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

ఈ పథకం విజన్ ను,విశిష్ఠతను అర్థం చేసుకుని, 40 వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి అదనంగా కేటాయించడంపై మోడీకి రాహుల్ ధన్యవాదాలు చెప్పారు. మోడీ యూటర్న్ ఆన్ MNGREA అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా రాహుల్ తన ట్వీట్ లో ఉంచారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ పార్లమెంట్ లో ఈ స్కీమ్ గురించి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో రాహుల్ పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…MNGREA పథకం అనేది కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ యొక్క జీవిస్తున్న స్మారకం. 60ఏళ్ల తర్వాత కూడా కాలువలను తవ్వేందుకు కాంగ్రెస్ మనుషులను పంపిస్తోందని మోడీ అన్నారు. ఇటీవల ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేగా పథకానికి 40 వేల కోట్ల అదనపు నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. 

దీంతో నరేగాకు కేటయించిన మొత్తం నిధులు 61 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికులకు ఈ కేటాయింపులు మేలు చేయనున్నాయి. నరేగా ప్రకారం కూలీలకు ఏడాదిలో 200 పనిరోజులుంటాయి. కూలీ కూడా గౌరవప్రదంగా ఉంటుంది. యూపిఏ హయాంలో మన్‌రెగా పథకాన్ని ప్రారంభించారు.

Read:  జనం చేతుల్లో డబ్బులు పెట్టండి.. విమర్శలకు సమయం కాదు.. : రాహుల్ గాంధీ

Categories
71671 71732

చంద్రబాబు.. మీరు రాయలసీమ బిడ్డేనా, అసలే ఏపీవారేనా?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలించే జీవో 203పై అభిప్రాయం చెప్పాలని విజయసాయిరెడ్డి నిలదీశారు. అడ్డమైన విషయాలపై జూమ్‌లో మాట్లాడే చంద్రబాబుకు… ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా ? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అసలు మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

 

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 203 జీవో వివాదానికి దారితీసింది. ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు రాజేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డ్ కు లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 3 టీఎంసీల నీటి తరలించేందుకు ప్రయత్నిస్తోందని, దీని కోసమే 203 జీవో జారీ చేసిందని లేఖలో తెలిపింది. ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

శ్రీశైలం నుండి కొత్త లిఫ్ట్ స్కిమ్ ను ఏర్పాటు చేయడం అన్యాయని, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన అడ్మినిస్ట్రేషన్ జీవో అక్రమమని తెలంగాణ ప్రభుత్వం లేఖలో తెలిపింది. కేఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఏ ప్రాజెక్ట్ అయినా మొదలు పెట్టాలని, దీనిపై కృష్ణా నది యాజమాన్య బోర్డ్ వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. టెండర్ల ప్రక్రియ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంది.

Read Here>> హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు రావొచ్చు..!

Categories
71723 71732

కమల్ నాథ్ వైఫల్యం వల్లే కరోనా కేసులు పెరిగాయ్

ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్‌నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.  అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివరాజ్ సింగ్ అన్నారు. కరోనా విజృభిస్తున్నా సరే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, అరికట్టడంలో వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు.

శనివారం(మే-2,2020)ఈ-అజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ…ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రే. ఆ పదవిలో ఉన్నంత కాలం బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. బాధ్యతలను విడిచిపెట్టి ఎలా వెళ్లిపోతారు? మేము మాత్రం పరిస్థితిని అదుపులోకి తేవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. తాను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేనాటికే ఇండోర్‌లో కేసులు నమోదయ్యాయని, ఆ సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు.

అప్పటి కమల్‌నాథ్ ప్రభుత్వం ఎలాంటి నష్ట నివారణా చర్యలకు ఉపక్రమించలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే, అధికారులను బదిలీచేసి, నిత్యం వారితో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇండోర్‌లో ఇప్పటికే కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని, ఇంటింటి సర్వేను కూడా చేపట్టి నష్ట నివారణా చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం ఇండోర్‌లో పరిస్థితి పూర్తి అదుపులోనే ఉందని తాను భావిస్తున్నానని, అలాగే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్.

కాగా, మార్చి నెల ప్రారంభంలో మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 ఎమ్మెల్యేలు కమల్‌నాథ్‌తో విభేదించి.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అంతేకాదు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు వారంతా కాంగ్రెస్ పార్టీని వీడారు. దాంతో కమల్‌నాథ్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో.. ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతిచ్చారు. ఇక రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని కమల్‌నాథ్‌ని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. బలనిరూపణ పరీక్షకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మార్చి-23న బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

మరోవైపు,కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 2,719 పాజిటివ్ కేసులు నమోదుకాగా,145మంది మరణించారు. 524మంది కోలుకున్నారు. అయితే భారత్ లో అత్యధిక కరోనా మరణాలు నమోదైన మూడవ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.

Also Read | రెడ్ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్ అమలు: కిషన్ రెడ్డి 

Categories
71671 71715 71732

‘గురు స్మరణలో’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్‌లో వందల మంది సీనియర్‌ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ. ఆయన 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకొచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్‌ శనివారం(మే 2,2020) తన క్యాంపు కార్యాలయంలోని ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూదరాజు సేవలను సీఎం జగన్ స్మరించుకున్నారు.

పత్రికా రంగానికి, తెలుగు భాషకు బూదరాజు సేవలు చిరస్మరణీయమని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్‌ పాల్గొన్నారు.

 ‘బూరా బృందం’ గా పిలుచుకునే బూదరాజు శిష్యులు పి.మధుసూదన్, ముని సురేష్‌ పిళ్ళె, ఎస్‌.రాము ఈ సంకలనాన్ని అందుబాబులోకి తీసుకొవచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ… కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తాము హాజరు కాలేకపోయామని తెలిపారు.

Also Read | ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్

Categories
71671 71732

కన్నా కు బుగ్గన  సవాల్ 

కరోనా  వైరస్ పరీక్షల కిట్లు కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ ను కాదని…. సదరు  కంపెనీలో తాను డైరెక్టర్ నని రుజువు చేస్తే  మే 2 వతేదీ,శనివారం, ఉదయం9 గంటలకు రాజీనామా చేస్తానని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు సవాల్ విసిరారు. కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తనపై చేసిన ఆరోపణలపై బుగ్గన స్పందించారు.

 
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున మొదట లక్ష కిట్లను దిగుమతి చేసుకున్న  జగన్ ప్రభుత్వం… రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రత్యేకమైన క్లాజ్‌ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది.(వలస కార్మికుల కోసం జగన్ సర్కార్  కీలక నిర్ణయం..)

ఈ క్రమంలో  బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణతో సహా పలువురు టీడీపీ  నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో వీరి తప్పుడు ప్రచారం బట్టబయలైంది. ఇదిలా ఉండగా….కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది.