Categories
71744 71757

తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే

తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే  శాంతి వచనాలు చెప్పే చర్చి ఫాదర్ చేతిలో గన్ పెట్టుకుని కనిపించారు. లోక రక్షకుడు..కరుణామయుడు బిడ్డ అయిన చర్చి ఫాదర్ చేతిలో గన్ కనిపించటం కాస్తంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదూ. చేతిలో గన్ ఉందని ఆ ఫాదర్ నక్సలైటూ కాదు  టెర్రరిస్టు అంతకంటే కాదు. ఎందుకో తెలిస్తే..హల్లెలూయా ఫాదర్ ను అపార్థం చేస్తుకున్నాం అంటూ నవ్వుకుంటాం..ఆ విశేషమేంటో చూద్దాం..

దూరం దూరం. ఇప్పుడు ప్రపంచమంతా అదే మంత్రం. కారణం. కరోనా. దూరం పాటించకపోతే కరోనా కాటేస్తుంది. కాబట్టి దూరం పాటించక తప్పదు. అదొక్కటే మందు అంటున్నారు శాస్త్రవేత్తలు సైతం. ఈ కరోనా కాలంలో చర్చి ఫాదర్ ఏసు విశ్వాసులపై పవిత్రజలం చిలకరించాలంటే వారి దగ్గరకు వెళ్లాల్సిందే.  అలా వెళ్లకుండా దూరం నుంచి పవిత్రజలం విశ్వాసులపై చల్లటానికి  తుపాకీ మంత్రాన్ని కనిపెట్టారు ఈ ఫాదర్. 

అమెరికాలోని డెట్రాయిట్ లో నీటిని పిచికారీ చేసే తుపాకీతో పవిత్ర జలాన్ని చిలకరిస్తున్న ఫాదర్ టిమ్ పెల్క్ అనే 70 ఏళ్ల  ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ట్విట్టర్ లో ఈ పొటో 5.6 లక్షల లైకులు, లక్షకు పైగా రీట్వీట్లు  వచ్చాయి. ఓ డాక్టరుతో చర్చించిన తర్వాత ఈ తుపాకీ ఐడియా వచ్చిందని..దీనివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు అని డాక్టరుతో నిర్ధారించుకున్న తర్వాతనే అమలు చేసినట్లు చెప్పారు ఫాదర్ టిమ్ పెల్క్.

Read: పానీపూరి కోసం టీవీ ముందు నిలబడి అడుక్కుంటున్న బిగ్‌బాస్ భామ: ఏం పాట్లురా బాబూ..

Categories
71723 71744

జనసంద్రంగా రామ్‌లీలా మైదానం: పాసుల కోసం వేలాదిగా వచ్చారు..కరోనా పాజిటివ్ వచ్చేయదూ..

కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఎవరికి వాళ్లు తమ సొంత ఊర్లకు వెళ్లిపోవాలనే తపనే తప్ప మరొకటి పట్టటంలేదు. రామ్ లీలా మైదానం లోకి ఇంతమంది ఎందుకు వచ్చారో తెలుసుకుందాం..  

యూపీలోని పలు ప్రాంతాలకు శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు మంగళవారం (మే 19,2020) నుంచి బయలుదేరనున్నాయి. ఆ శ్రామిక రైళ్లలో వెళ్లాలంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కావటంతో దాన్ని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేశారు. దీంతో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వేలాదిమంది వలస కార్మికులు రామ్‌లీలా మైదానాని చేరుకున్నారు. 

రాష్ట్రంలో వలస కార్మికులు ఎట్టి పరిస్తితుల్లో కాలినడకన గానీ, సైకిళ్లు, అనుమతి లేని వాహనాలపై వెళ్లడానికి అనుమంతించవద్దని ఇప్పటికే సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ అధికారుల్ని ఆదేశించారు. వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సుల్ని నడుపుతోంది. కానీ  యూపీ పెద్ద రాష్ట్రం. కాబట్టి వలస కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు.

దీంతో యూపీ ప్రభత్వం వలస కార్మికుల తరలింపు కోసం శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను అధికసంఖ్యలో నడపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయటం..ఆ రైళ్లలో ప్రయాణించి సొంత ప్రాంతాలకు చేరుకోవటానికి వేలాదిమంది వలస కార్మికులు ఇలా వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవటాని రామ్ లీలా మైదానికి చేరుకున్నారు. సొంత ఊర్లకు వెళ్లాలనే తపనతో..భౌతిక దూరం పాటించాలనే నిబంధన పాటించటంలేదు. ఇటువంటి పరిస్థితులు కరోనా  వైరస్ మరింతగా వ్యాపించటానికి  కారణం కావచ్చు.

Read :  ఆ 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేస్తోంది!

Categories
71671 71744

ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మే 18,2020) కరోనా కేసులపై బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన వాటితో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 2వేల 282కి చేరింది. ఇప్పటివరకు 1,527 మంది కోలుకున్నారు. 705 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 50మంది చనిపోయారు.

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు:
చిత్తూరు 15
కృష్ణా 15
నెల్లూరు 7
తూ.గో 5
కర్నూలు 4
కడప 2
ప.గో. 2
విజయనగరం 1
విశాఖ 1

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:

CORONA

Read Here>> ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు

Categories
71706 71723 71744

ఇకపై విమాన ప్రయాణం ఇలానే ఉండబోతోంది..?

విమాన ప్రయాణాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయా? మునపటిలా విమానాల్లో ప్రయాణించలేమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా నేర్పిన పాఠాలతో అన్నింట్లో కొత్త మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా విమానాశ్రయాలు, విమానాల్లోనూ వినూత్న విధానాలు అమల్లోకి రానున్నట్టు అంతర్జాతీయ విమానయాన సంస్థలు, నిపుణుల అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయో చెప్పలేం. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విమానాలు, విమానాశ్రయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సురక్షిత ఆరోగ్యకర ప్రయాణానికి అనుగుణంగా అనేక మార్పులు, చేర్పులు తథ్యమని నిపుణులు అంటున్నారు. భౌతిక దూరానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రయాణికులకు భరోసా కల్పించేలా చేపట్టాల్సిన చర్యలపై విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు దృష్టి పెడుతున్నాయి. 

విమాన ప్రయాణాల్లో రక్త పరీక్షలు లేదా ముక్కులోంచి శాంపిల్స్ సేకరించడం తప్పనిసరి చేసే అవకాశం ఉంది. దుబాయ్ రక్త పరీక్షలను ఏప్రిల్ నెలలోనే తప్పనిసరి చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే ఫలితం తేల్చేస్తారు. హాంకాంగ్ కూడా కొవిడ్ పరీక్షలను తప్పనిసరి చేసింది. అమెరికా, ఇటలీ వంటి ఎక్కువ ముప్పున్న దేశాల నుంచి వచ్చే వారికి టోక్యోలో కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు శానిటైజర్ కూడిన కిట్ తప్పనిసరి చేసింది. 

ప్రయాణం మొత్తంగా ముఖాన్ని కప్పిఉంచడం (ఫేస్ కవరింగ్) తప్పనిసరి కానుంది. కెనడాలో మాస్క్‌లు లేకపోతే అనుమతించడం లేదు. సిబ్బందికీ కూడా తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ప్రయాణికులను పూర్తిగా శానిటైజ్ చేసేందుకు క్రిమినాశక బూత్‌లు రావొచ్చు. బహిరంగ ప్రాంతాలను అతినీల లోహిత కిరణాలతో శుభ్రంచేసే రోబోలు కూడా సేవలందిస్తాయి. సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా లోపలికి వెళ్లే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రయాణికులకు వారి సమయం వచ్చినప్పుడు ఫోన్ మెసేజ్ పంపుతారు. అప్పడే వారు వెళ్లాల్సి ఉంటుంది.

విమానాశ్రయాల్లో గుర్తింపు కార్డుతో పాటు రోగనిరోధక ధ్రువపత్రం లేదా హెల్త్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే థాయిలాండ్‌లో అమలుచేస్తోంది. కొత్తగా ఐఏటీఏ ఇమ్యూనిటీ పాస్‌పోర్టును ప్రతిపాదిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో యెల్లో ఫీవర్ కార్డులను ప్రయాణికులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. తీసుకెళ్లే లగేజీలను విమానాల్లోకి ఎక్కించే ముందు యంత్రాలతో వాటంతట అవే శానిటైజ్ కావడం లేదా అతినీల లోహిత కాంతితో క్రిమినాశకంగా తయారయ్యే విధానం కూడా రానుంది. అప్పుడే లగేజీ ట్యాగింగ్ చేస్తారు. దీన్నే శానిట్యాగింగ్ అని పిలుస్తున్నారు. విమానం దిగిన తర్వాత అదే లగేజీ బెల్ట్‌కు చేరుతుంది.

శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా చూస్తారు. ఇందుకు థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు అమరుస్తారు. పోర్టోరికోలో థర్మల్ కెమెరాలు పెట్టారు. శరీర ఉష్ణోగ్రత 100.3 డిగ్రీలు (ఫారన్హీట్) దాటగానే అలారం మోగుతుంది. విమానాల్లో సీట్ల వెనుక ఉండే ప్యాకెట్లను తొలగించి ఖాళీగా ఉంచొచ్చు. ఎంటర్ టైన్మెంట్‌కు సంబంధించి ఇక టచ్ స్ర్కీన్లు ఉండకపోవచ్చు. సొంత వినోద టూల్స్ అనుమతించవచ్చు.

విమానాల లోపల భౌతిక దూరం పాటించేలా కొత్త డిజైన్లు వస్తాయి. సీటుకు సీటుకు దూరం పెట్టనున్నారు. మధ్యలో ఒక సీటును తొలగించడం లేదా వదిలేయడం చేయొచ్చు. ఇటలీలోని ఓ ప్రముఖ విమాన డిజైన్ సంస్థ ఓ సరికొత్త డిజైన్‌ను తెరపైకి తెచ్చింది. మూడు సీట్లుండే వరుసలో మధ్య సీటును వెనక్కు తిప్పేసి (వ్యతిరేక దిశలో) ఏర్పాటు చేయడమే ఈ విధానం. మూడు సీట్లకు మధ్య పారదర్శక డివైడర్లను కూడా అమరుస్తారు. విమానాలను రీ డిజైన్ చేయకుండా సీటుకు సీటుకు మధ్య చుట్టూ ఎత్తైన ప్రొటెక్టివ్ షీల్డ్‌లు అమర్చడాన్ని ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. 

చాలా విమానయాన సంస్థలు ఆహార సేవలను పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేసే అవకాశం ఉంది. వేడి వంటకాలకు బదులు ముందుగానే ప్యాక్ చేసి, శీతలీకరించిన భోజనాలను అందించొచ్చు. లోపల కప్పులతో నీళ్లు అందించడానికి బదులు, ప్రయాణికులు సొంతంగా నీళ్ల సీసాలను ముందే తీసుకురావాల్సి ఉంటుంది. విమానం ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ భోజనాలను టచ్ లెస్ వెండింగ్ మెషీన్ల ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది.

Read Here>> కరోనా ఎఫెక్ట్, మే 31 వరకు మెట్రో బంద్

Categories
71706 71744

coronavirus vaccine సిద్ధం చేసిన సిగరెట్ కంపెనీ.. human trials ఒక్కటే లేట్

ప్రపంచంలోనే టాప్ పొగాకు కంపెనీ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్ధం చేశానంటోంది. ఇక మనుషులపై ప్రయోగించడమే తరువాయనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. లండన్ లోని అమెరికన్ పొగాకు కంపెనీ శుక్రవారం ప్రయోగాత్మకమైన వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు.. లాబొరేటరీ టెస్టు పూర్తి చేసుకుందని.. ఇక మనుషులపై ప్రయోగించడమే లేట్ అని చెప్పింది. 

సిగరెట్ లు తయారుచేయడంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రిటిష్ అమెరికన్ టుబాకో కంపెనీ వ్యాక్సిన్ కనుగొనడానికి త్వరపడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిగరెట్ స్మోకింగ్ చేసే వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది. ఇలాంటి వారిలో కరోనా మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. 

శుక్రవారం.. ల్యాబొరేటరీ టెస్టులు పూర్తి చేసుకుని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో దీనిని హ్యూమన్ ట్రయల్స్ లో వాడనున్నారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ కు నిధులను కేటాయించాం. జూన్ నెలాఖరు నాటికి దీనిని మానవ శరీరాలపై ప్రయోగిస్తామని బ్రిటిష్ అమెరికన్ టుబాకో కంపెనీ చెప్పుకొచ్చింది. 

ఈ ప్రయోగంలో కీలకంగా యాంటీ జెన్ అనే ఫ్రాగ్మెంట్ ను వాడారు. పొగాకు మొక్కల పునరుత్పత్తి కోసం దీనిని వాడుతుంటారు. మొక్కలు పెరిగిన తర్వాత ఈ యాంటి జెన్ స్వచ్ఛంగా మారిపోతుంది. ఈ యాంటీజెన్ మనుషుల శరీరాల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పింది. 

లేటెస్ట్ అప్‌డేట్‌లో పొటెన్షియల్ వ్యాక్సిన్ పాజిటివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుంది.. ప్రీ క్లీనికల్ టెస్టింగ్ లో ఇది నిర్ధారించాం. ఇప్పుడు తర్వాతి స్టేజి కోసం ఎదురుచూస్తున్నాం. ఒకసారి అనుమతులు దొరికితే మానవ శరీరాలపై ప్రయోగిస్తాం. ఇప్పటికీ ల్యాబొరేటరీల్లో టెస్టులు పూర్తి చేసుకున్న 110 పొటెన్షియల్ వ్యాక్సిన్లు మానవ శరీరాలపై ప్రయోగాల కోసం ఎదురుచూస్తున్నాయి. 

నొవల్ కరోనా వైరస్ పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేకపోతున్నారని.. సైంటిస్టులు పలు కీలక దశలను విస్మరిస్తున్నారని అధికారులు అంటున్నారు. ఏదేమైనా ఓ రెండు సంవత్సరాల్లో వ్యాక్సిన్ కు మందు తయారవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Read Here>> ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేస్తాం: ట్రంప్

Categories
71723 71744

భారత్‌లో 85వేల మార్క్ దాటిన కరోనా కేసులు

భారత దేశంలో కరోనావైరస్ కేసులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్‌ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరుకుంది. దీంతో 85,000 మార్కును దాటినట్లు అయ్యింది.

అయితే అందులో 30,152 మంది మాత్రం వ్యాధి నుంచి కోలుకున్నారు. చనిపోయినవారి సంఖ్య 2,752గా ఉంది, అత్యధిక మరణాలు మహారాష్ట్ర (1068) నుంచి నమోదయ్యాయి. దీంతో భారత్‌ చైనా సంఖ్యను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ మరణాలు అమెరికా కలిగి ఉండగా, 85,000 కేసులతో భారతదేశం, చైనా సంఖ్యను కూడా దాటింది. 

భారతదేశం కంటే ఎక్కువ కేసులు ఉన్న పది దేశాలు.. యునైటెడ్ స్టేట్స్ , రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ , ఇటలీ , బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ మరియు ఇరాన్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4.5 మిలియన్లు దాటింది. వారిలో 3 లక్షలకు పైగా చనిపోయారు. 

దక్షిణాది నుంచి టాప్‌లో తమిళనాడు:
ఇక దక్షిణాది నుంచి తమిళనాడులో కేసులు విపరీతంగ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 10వేల కరోనా కేసులు దాటాయి. చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్‌ కరోనా వ్యాప్తికి కేంద్రబిందువు అవగా.. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,108కి చేరుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో కేసులు:
తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్-19 కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. తెలంగాణలో కొత్తగా 40 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1454కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 102పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 2307కి చేరకుంది.

Graph

 

Read Here>> భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు, 3,967 కేసులు నమోదు

Categories
71715 71723 71744

మరో ఘోరం : 23 మంది వలస కూలీలు మృతి

కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో విధించిన లాక్ డౌన్…వలస కూలీల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలు ఘటనలు చూపిస్తున్నాయి. ఉపాధి పోవడంతో..వారి వారి రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. కాలినడకన వెళుతూ..చనిపోయిన సందర్బాలున్నాయి. కానీ..రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది చనిపోతుండడం అందర్నీ కలిచి వేస్తోంది. తాజాగా…ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 

రాజస్థాన్ నుంచి తమ తమ సొంతూళ్లకు కొన్ని కుటుంబాలు వెళుతున్నాయి. వీరు ట్రక్కులో వెళుతున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం…ఔరమా దగ్గర వీరు ప్రయాణిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొంది. దీంతో 23 మంది అక్కడికక్కడనే చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల రోదనలతో మారుమ్రోగుతోంది.

ఘటనా ప్రదేశం వద్ద హృదయవిదాకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

2020, మే 14వ తేదీన మహారాష్ట్ర నుంచి కొంతమంది వలస కూలీలు సొంతూళ్లకు వెళుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ వద్ద కంటైనర్ ఢీకొనడంతో 8 మంది చనిపోయారు. మొన్నటికి మొన్న సొంత గ్రామాలకు వెళుతూ..రైలు పట్టాలపై పడుకున్న వలస కూలీలపై నుంచి రైలు వెళ్లడంతో 16 మంది వలస కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే. 

Read More:

వలస కార్మికుల రైలును మా రాష్ట్రంలో ఆపొద్దు : సీఎం 

సైకిల్ రిక్షాపై 500కి.మీ దూరంలోని సొంతూరుకి తల్లిదండ్రులను తీసుకెళ్తున్న 11ఏళ్ల బాలుడు

Categories
71723 71744

3వ కరోనా రిలీఫ్ ప్యాకేజీ వివరాలివే..రైతులకు మంచి ధరల కోసం సంస్కరణలు

కోవిడ్-19 మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ లో మూడవ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం(మే-15,2020)ప్రకటించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలకు, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ఊతమిచ్చేలా ఉద్దీపన చర్యలను ఆమె ప్రకటించారు. 

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు 11 ఫార్ములా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.1 లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా ప్రకటించారు. శీత‌ల గోదాముల ఏర్పాటుకు ఈ నిధుల‌ను వినియోగించ‌నున్నారు. దీర్ఘ‌కాలిన వ్య‌వ‌సాయ మౌళిక‌స‌దుపాయాల కోసం స్వ‌ల్ప కాలిక పంట రుణాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంతో పోటీ పడటంలో భారత్ ను ముందు వరుసలో ఉంచింది రైతులేనని కొనియాడారు. వాతావరణ సమస్యలను అధిగమించి కష్టపడుతున్నారన్నారు.

లాక్‌డౌన్‌ కాలంలో  పీఎం కిసాన్ ఫండ్ కింద రైతుల ఖాతాల్లో రూ. 18,730 కోట్లను జమచేయడంతో పాటు రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. పండించిన పంటలకు రైతులకు మంచి ధర దక్కేలా నిత్యావసర వస్తువుల చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. ఈసీ యాక్ట్‌ 1955లో సవరణలు చేయనున్నట్లు చెప్పారు. తృణధాన్యాలు, తినదగిన నూనెలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయాలు, బంగాళాదుంపలతో సహా వ్యవసాయ ఆహార పదార్థాలు ఈ చట్టం కింద నియంత్రించబడతాయన్నారు. తీవ్ర విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఆహార పదార్థాల నిల్వపై నిషేధం ఉంటుందన్నారు. 

దేశంలోని సూక్ష్మ ఆహార సంస్థలకు సంస్ధలకు(micro food enterprises) రూ. 10 వేల ప్యాకేజీని ఈ సందర్భంగా నిర్మలా ప్రకటించారు. స్థానిక వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలన్న ప్రధాని లక్ష్య సాధనకు అనుగుణంగా 2లక్షల ఎంఎఫ్ఈలకు సాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించబడుతున్నట్లు ఆమె తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఎంఎఫ్‌ఈలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం, బ్రాండ్లు కల్పించి మార్కెట్‌ సదుపాయాలు కల్పించడం, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పించడం, ప్రాంతానికి అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి ఈ పథకం కింద చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో మామిడి, జమ్ముకశ్మీర్‌లో కేసర్‌, ఈశాన్యంలో వెదురు, ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి, తమిళనాడులో కర్రపెండలం వంటి వాటిని ప్రోత్సహించనున్నట్లు ఆమె ప్రకటించారు.

రూ. 500 కోట్లతో ఆపరేషన్‌ గ్రీన్‌ విస్తరణను చేపట్టినట్లు నిర్మలా తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల వస్తువుల సరఫరా చైన్‌కు ఆటంకం తలెత్తిందన్నారు. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరల తగ్గుదల, అమ్ముడుపోవడం లేదన్న బాధను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ స్కీం కింద వివిధ మార్కెట్లకు తరలించే నిమిత్తం రవాణపై 50 శాతం సబ్సిడి కల్పిస్తున్నట్లు తెలిపారు. నిల్వ చేసుకునేందుకు శీతల గోదాముల్లో నిల్వపై సహా 50 శాతం సబ్సిడీని కల్పిస్తున్నామన్నారు. రైతులకు మంచి ధరలు దక్కేలా చూడటం, వ్యర్థాలు తగ్గించడం అదేవిధంగా వినియోగదారులకు అందుబాటు ధరలో లభించేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని నిర్మలా తెలిపారు.

‌ప్రధాన మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న ప‌థ‌కానికి 20 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. స‌ముద్ర‌, ఆక్వా, చేప‌ల చెరువుల స‌మ‌గ్ర‌, సుస్థిర అభివృద్ధి కోసం ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. మెరైన్‌, ఇన్‌ల్యాండ్ ఫిష‌రీస్‌, ఆక్వాక‌ల్చ‌ర్ కోసం 11వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఫిషింగ్ హార్బ‌ర్స్‌, కోల్డ్ చెయిన్స్‌, మార్కెట్ల కోసం మ‌రో 9 వేల కోట్ల నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. మ‌త్స సంప‌ద యోజ‌న ప‌థ‌కం ద్వారా రానున్న 5ఏళ్ల‌లో దాదాపు 70 ల‌క్ష‌ల ట‌న్నుల చేప‌ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం వ‌ల్ల సుమారు 55 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాలు దొరికే ఛాన్సు ఉన్న‌ది. అంతేకాదు, మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎగుమ‌తుల విలువ సుమారు ల‌క్ష కోట్లు దాటుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోందన్నారు.

మత్స్యకారులకు బీమా సౌకర్యం, పశుసంవర్ధక మౌలిక వసతులకు రూ 15,000 కోట్లు, పశువులు, జీవాలకు వ్యాక్సిన్‌ల కోసం రూ 13,300 కోట్లు,ఔషధ మొక్కల సాగుకు రూ 4000 కోట్లతో నిధి, తేనెటీగల పెంపకందారులకు రూ 5000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్ధానిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం రూ 10,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

డెయిరీ రైతులకు రూ 5వేల కోట్లతో అదనపు సాయం అందిచనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 2 కోట్ల మందికి దీని ద్వారా లబ్ధి కలగనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే పాల ఉత్తత్తిలో భారత్ నెంబర్1 అన్న ఆమె..లాక్ డౌన్ వేళ పాల ఉత్పత్తి 25 శాతం తగ్గిందన్నారు. 

Read Here>> ఆర్థిక సంక్షోభానికి.. నగదు ముద్రణే పరిష్కారం!

Categories
71706 71716 71744

కరోనావైరస్‌ను గుర్తించగానే.. ఈ ఫేస్ మాస్క్‌ల్లో లైట్లు వెలుగుతాయి!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను గుర్తించాలంటే టెస్టులతోనే సాధ్యం. కరోనా సోకగానే వెంటనే గుర్తించేలేని పరిస్థితి. అందుకే కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ను గుర్తించేందుకు కొత్త రకం మాస్క్‌లు రాబోతున్నాయి. సాధారణ మాస్క్ ల మాదిరిగా కాకుండా ఇందులో సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్ల ఆధారంగా కరోనా వైరస్ బాధితులను వెంటనే గుర్తించవచ్చు. తద్వారా వైరస్ ఇతరులకు సోకకుండానే ముందుగానే జాగ్రత్త పడొచ్చు అంటున్నారు హార్వర్డ్, MIT రీసెర్చర్లు. ఇప్పడు కరోనా వైరస్ ను వెంటనే గుర్తించే మాస్క్ లను డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. గత ఆరేళ్లుగా బయో ఇంజినీర్లు జికా వైరస్, ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్‌లను గుర్తించే సెన్సార్లను డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త కరోనా వైరస్‌ను గుర్తించేందుకు సెన్సార్లతో కూడిన ఫేస్ మాస్క్ లను డెవలప్ చేస్తున్నట్టు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, తుమ్మినా లేదా దగ్గినప్పుడు వెంటనే ఈ ఫేస్ మాస్క్‌లోని సెన్సార్ల సిగ్నల్స్ ద్వారా లైట్లు వెలుగుతాయి. 

2014లోనే అమెరికన్ రీసెర్చర్ Jim Collins తన బయో ఇంజినీరింగ్ ల్యాబరేటరీ అయిన MITలో సెన్సార్లను డెవలప్ చేయడం ప్రారంభించారు. ఈ సెన్సార్ల ద్వారా ఎబోలా వైరస్ ను సులభంగా గుర్తించడం సాధ్యపడింది. ఒక పేపర్ ముక్కపై సెన్సార్ల ద్వారా గుర్తించారు. దీనికి సంబంధించి రీసెర్చ్‌ను MIT, హార్వర్డ్ కు చెందిన కొంతమంది చిన్న శాస్త్రవేత్తల బృందం ప్రచురించింది. ఆ తర్వాత జికా వైరస్ ముప్పుపై కూడా సెన్సార్లను డెవలప్ చేసింది ఈ బృందం.. ఇప్పుడు ఇదే బృందం తమ సెన్సార్ టూల్స్ సవరించి కరోనా వైరస్ కేసులను గుర్తించే పనిలో పడింది.

కరోనా వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, తుమ్మడం, దగ్గినప్పుడు fluorescent సిగ్నల్ ఉత్పత్తి చేసే ఫేస్ మాస్క్ లను డెవలప్ చేస్తోంది ఈ బృందం. ఒకవేళ ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే.. టెంపరేచర్ చెకింగ్ వంటి ఇతర స్క్రీనింగ్ పద్ధతులతో సంబంధం ఉన్న లోపాలను పరిష్కరించగలదని అంటోంది. ఎయిర్ పోర్టుల నుంచి ఆస్పత్రుల వరకు అన్నిచోట్ల ఈ టూల్స్ ద్వారా స్ర్కీనింగ్ చేయొచ్చునని అంటున్నారు. కరోనాను గుర్తించేందుకు ల్యాబరేటరీకి ఎలాంటి శాంపిల్స్ పంపాల్సిన అవసరం లేకుండానే ఉన్నచోటనే కరోనా బాధితులను సులభంగా గుర్తించవచ్చునని రీసెర్చర్ Jim Collins అంటున్నారు. 

ప్రస్తుతం ఈ ల్యాబ్ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని కాలిన్స్ చెప్పారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా, అతని బృందం చిన్న లాలాజల నమూనాలో కరోనావైరస్‌ను గుర్తించే సెన్సార్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. కరోనా లాంటి వైరస్ లను గుర్తించేందుకు మొదట్లో తాము తేలికైన కాగితంపై సెన్సార్లను అమర్చి విశ్లేషించినట్టు కాలిన్స్ తెలిపారు. ఇప్పుడు ఈ టూల్స్ ప్లాస్టిక్, క్వార్జ్, వస్త్రాలపై కూడా పనిచేస్తుందని నిర్ధారించినట్టు తెలిపారు. వైరస్‌ను గుర్తించే సెన్సార్లను జన్యు పదార్థం DNA, RNA లతో కలిసి ఉంటుందని అన్నారు. 

లైయోఫిలిజర్ అని పిలిచే యంత్రాన్ని ఉపయోగించి వస్త్రంపై ఉండే పదార్థం స్తంభింపచేస్తుంది. ఇది జన్యు పదార్ధం నుండి తేమను చంపకుండా పీల్చుకుంటుంది. ఇది చాలా నెలలు గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటుంది. సెన్సార్లను యాక్టివేట్ చేయడానికి రెండు విషయాలు అవసరం. మొదటిది తేమ, మన శరీరాలు శ్లేష్మం లేదా లాలాజలం వంటి శ్వాసకోశ కణాల ద్వారా ఇస్తాయి. రెండవది వైరస్ జన్యు క్రమాన్ని గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ టెస్టులకు 24 గంటల వరకు సమయం పడుతోంది. పేషెంట్లకు టెస్టు ఫలితాలు కూడా చాలా రోజులు పడుతోంది. ఏదిఏమైనా ఈ సమ్మర్ ముగిసేనాటికి సెన్సార్ ఫేస్ మాస్క్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కాలిన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read Here >> కావాలనే కరోనా వైరస్ అంటించుకున్న అమెరికా ఖైదీలు..విడుదల కావటానికి ప్లాన్

Categories
71715 71723 71744

అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కన్నుమూత

మాజీ అండర్ వరల్డ్ డాన్, సోషల్ యాక్టివిస్ట్ ముతప్ప రాయ్(68) కన్నుమూశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గత ఏడాదిగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ముతప్ప.. ఆరోగ్యం మరింత విషమించడంతో ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ రాత్రి 2.30 గంటల సమయంలో మరణించాడు. ముతప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దక్షిణ కన్నడ పుత్తూరు పట్టణంలో తులు మాట్లాడే బంట్ కుటుంబంలో రాయ్ జన్మించాడు. చాలా చిన్న వయస్సులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 

హత్య, కుట్రకు సంబంధించి 8 క్రిమినల్ కేసుల్లో కర్ణాటక పోలీసులు ముతప్పకు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. 2002లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారతదేశానికి రాయ్ వచ్చాడు. ఇండియాకు వచ్చినవెంటనే కన్నడ పోలీసులతోపాటు సీబీఐ సహా దర్యాప్తు బృందాలు ముతప్పను పలు కోణాల్లో విచారించాయి. 

ఆధారాలు లేకపోవడంతో అతన్ని నిర్దోషిగా ప్రకటించారు. ‘జయ కర్ణాటక’ పేరుతో చారిటబుల్ సంస్థను రాయ్ స్థాపించాడు. 2011లో విడుదలైన తులు చిత్రం ‘Kanchilda Baale’లో రాయ్ నటించారు. ఆ తర్వాత 2012లో వచ్చిన Katari Veera Surasundarangi కన్నడ చిత్రంలో కూడా రాయ్ నటించాడు. 

Read Here>> విజయ్ మాల్యాకు బిగ్ షాక్…28రోజుల్లో భారత జైలుకు