Categories
71706 71715 71745

ఆమె ప్రపంచ ఛాంపియన్.. ఇప్పుడు కొవిడ్-19 పోరాటంలో వైద్యురాలు!

ఆస్ట్రేలియా క్రీడల్లో Jana Pittman అనే పేరు కొత్తేమి కాదు. ఆ అథ్లెట్.. ప్రపంచ ఛాంపియన్, ఒలింపియన్ కూడా. ఆస్ట్రేలియా తరపున 400 మీటర్లు, 400మీటర్ల hurdles, bobsleigh విభాగాల్లో ఆడి అందరిని మెప్పించింది. 1999లో తొలి విజయాన్ని రుచిచూసింది. ప్రపంచ యూత్ చాంపియన్ షిప్స్‌లో బంగారు పతకాన్ని సాధించింది. కానీ, రాబోయే ఏళ్లలో తన విజయం ఒక సంకేతం మాత్రమేనని తెలియజేసింది. 2000లో జానా ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్‌లో 2 బంగారు పతకాలను గెల్చుకుంది. 2002లో రెండు కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలను సాధించి తిరుగులేదని నిరూపించుకుంది. 
Jana Pittman, A World Champion Athlete Who Is Now Working As A Doctor On The Frontlines Vs COVID-19

ఒక ఏడాది తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్స్ టాప్ లోకి దూసుకెళ్లింది. 2006లో కామన్ వెల్త్ గేమ్స్ లో డబుల్ గోల్డ్ సాధించి స్వదేశానికి తిరిగి వచ్చింది. 2007లో ప్రపంచ చాంపియన్ షిప్స్ లో మరో బంగారు పతకాన్ని సాధించింది. కానీ, తన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా మార్చేసింది. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న తరుణంలో తనవంతు సాయంగా ఇప్పుడు ఆమె ఒక వైద్యురాలు అవతారమెత్తింది. కొవిడ్-19 బాధితులకు అండగా ముందుండి వైద్యసాయం అందిస్తోంది. ఒకవైపు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. గత ఏడాదిలో తాను వైద్యురాలు కావాలనే కలను నేరవేర్చుకుంది. 
Jana Pittman, A World Champion Athlete Who Is Now Working As A Doctor On The Frontlines Vs COVID-19

ఇప్పుడు దేశంతో పాటు తాను కూడా బాధితులకు సాయం అందిస్తూ కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. కొవిడ్-19 సమయంలో ముందుండి పోరాటం చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. నిజాయితీగా చెబుతున్నా.. నా కల నిజమైంది’ అని ఒక మీడియాకు తెలిపింది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి కంటే మరొకటి ఉండదని ఆమె చెప్పారు. 

Read: కశ్మీర్‌ మాతోనే ఉంటుంది : అఫ్రిదిపై ధావన్ ఫైర్ 

Categories
71715 71745

కశ్మీర్‌ మాతోనే ఉంటుంది : అఫ్రిదిపై ధావన్ ఫైర్ 

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. కశ్మీర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించాడు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లకు మద్దతుగా ధావన్ నిలిచి పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదిపై మండిపడ్డాడు. ‘ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం కశ్మీర్ పై పడి ఏడుస్తున్నారు. కశ్మీర్ మాది.. కశ్మీర్ ఎప్పటికీ మాతోనే ఉంటుంది. కావాలంటే మీ 22 కోట్ల మందిని తీసుకురా. మాలో ఒక్కరు 15 లక్షల మందితో సమానం’ అని ధావన్ తన ట్విట్టర్ అకౌంట్లో గట్టిగా బదులిచ్చాడు. 

ఇటీవల పీఓకేలో జరిగిన బహిరంగ సమావేశంలో షాహిద్ అఫ్రిది పీఎం మోడీ, భారత ఆర్మీ, కశ్మీర్‌లో ప్రస్థుత పరిస్థితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన భారత జట్టు క్రికెటర్లు స్పందించారు. గౌతమ్  గంభీర్, హర్భజన్ సింగ్ అఫ్రిదిపై మండిపడ్డారు. అఫ్రిదీ 16 ఏళ్ల వృద్ధుడు, పాక్ లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతుందని అన్నాడు. వాళ్లు 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తూనే ఉన్నారు.

పాక్ ప్రజల్ని మోసం చేయడానికి అఫ్రిదీ, ఇమ్రాన్ ఖాన్, బజ్వా లాంటి జోకర్లు భారత్‌పై, ప్రధాని మోడీపై విషం చిమ్ముతున్నారని తమదైన శైలిలో ధీటుగా బదులిచ్చారు. యువరాజ్ సింగ్ కూడా అఫ్రిది వ్యాఖ్యలను ఖండించాడు. ప్రధాని మోడీపై అఫ్రిది వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపాడు. ఒక దేశం పట్ల బాధ్యతాయుతమైన వ్యక్తిగా తాను ఇలాంటి వ్యాఖ్యలను ఎప్పటికీ సమర్థించనని అన్నాడు. పాక్‌లో అఫ్రిది ఫౌండేషన్‌లో విరాళాల కోసం యువరాజు, హర్భజన్ అతడికి మద్దతు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

Read Here>> అఫ్రిదిపై గంభీర్ ఫైర్.. అతడో జోకర్..! 

Categories
71715 71745

అఫ్రిదిపై గంభీర్ ఫైర్.. అతడో జోకర్..! 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదిపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఫ్రిది వ్యాఖ్యలను తనదైనశైలిలో గంభీర్ ఖండించాడు. పాకిస్థాన్‌లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతు ఉందని 16 ఏళ్ల వృద్ధుడు (అఫ్రిది)  @SAfridiOfficial అన్నాడు. 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తూనే ఉంది. పాక్ ప్రజల్ని మోసం చేయడానికి అఫ్రిది, ఇమ్రాన్, బజ్వా వంటి జోకర్లు.. భారతదేశం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విషం చిమ్మగలరు. కానీ కశ్మీరును ఎప్పటికీ దక్కించుకోలేరు. బంగ్లాదేశ్ గుర్తుందా? అని గంభీర్ గట్టిగా బదులిచ్చాడు. ప్రపంచం ఒక ప్రాణాంతక వ్యాధి ప్రభావానికి గురైందన్నారు.  

అంతకంటే ప్రమాదకరమైనది మోడీ మనసులో ఉంది అంటూ అంతకుముందు పీఓకేలో అఫ్రిది నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. తమ సైన్యానికి కశ్మీర్ ప్రజలు మద్దతిస్తున్నారంటూ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అఫ్రిది వ్యాఖ్యలను భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కూడా తప్పుపట్టారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వీడియో మెసేజ్ ద్వారా తన స్వచ్ఛంద సంస్థకు సపోర్టు చేయాలని నన్ను, యువీని అఫ్రిది కోరినట్టు చెప్పాడు. మళ్లీ మళ్లీ అతడు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అఫ్రిదిని స్నేహితుడని పిలిచినందుకు బాధపడుతున్నాని, అతడికి మిత్రుడనే అర్హత లేదు అని భజ్జీ తెలిపాడు. 

Read Here>> ఆ దేశంలో టీమిండియా మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులు రారు: రోహిత్ శర్మ

Categories
71723 71745

మేరీకోమ్ ను సర్ ప్రైజ్ చేసిన ఢిల్లీ పోలీసులు: సెల్యూట్ చేసిన మణిపూర్ మణిపూస

మణిపూర్ మణిపూస..బాక్సింగ్ లో చరిత్ర సృష్టించిన మేరికోమ్ కు ఢిల్లీ పోలీసులు సర్ ప్రైజింగ్ ఇచ్చారు.  ఊహించని రీతిలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఆ సర్ ప్రైజ్ కు మేరికోమ్ ఉబ్బి తబ్బియ్యారు. 

మేరీ కోమ్ కుమారుడు ప్రిన్స్ కోమ్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీపోలీసులు ఓ కేక్ తీసుకువచ్చి మేరీ కోమ్ కుటుంబ సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. దానికి మేరీ ఎంతగానో సంతోష పడ్డారు. తన కుమారుడి పుట్టినరోజని తెలుసుకోవటమేకాకుండా ఓ కేక్ కూడా తీసుకోవటంపై ఆమెఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల పెద్ద మనస్సుకు ఆమె చలించిపోయారు.  కదిలిపోయారు. పోలీసుల పెద్ద మనస్సుకు మేరీకోమ్ వారికి సెల్యూట్ చేశారు. 

కరోనాపై ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న యోధులు మీరు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ పాట కూడా పాడడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమైన వేళ తమ కుటుంబంలో ఆనందం నింపారంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, ఏసీపీ ప్రగ్యా ఆనంద్ కు మేరీ కోమ్ మరీ మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భాన్ని తాను ఎన్నడూ మరచిపోలేనని అంతటి అనుభూతిని కలిగించిన పోలీసులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు మణిపూర్ మణిపూస మేరీకోమ్.పోలీసులు కేక్ తీసుకురావటం..కుమారుడితో కట్ చేయించటం..హ్యాపీ బర్త్ డే పాట పాడి సెలబ్రేట్ చేసిన వీడియోను మేరీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
 

కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసుల సేవలు ఎవ్వరూ ఎన్నడూ మరచిపోలేనివి. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ముందు నిలిచి కరోనాపై పోరాటం సాగిస్తున్న వీరులుగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. అటువంటి పోలీసులకు అందరూ సహకరించాలి. లాక్ డౌన్ ఆంక్షలను అనుసరించాలి. అదే అందరూ పోలీసులకు ఇచ్చే నిజమైన గౌరవం.

Read Here>>తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం…మోడీ తరపున మొదటి పూజ

 

Categories
71744 71745

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 22 నుంచి లీగ్‌ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడా ఈవెంట్లు రద్దయ్యాయి. ఇక ఈ సీజన్ ఐపీఎల్ కూడా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ లవర్స్ బాగా డీలా పడ్డారు. సమ్మర్ లో మంచి ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్రికెట్ అభిమానులకు ఓ గుడ్ నూస్. త్వరలో క్రికెట్ లీగ్ ఒకటి ప్రారంభం కానుంది.

6 జట్లు.. 30 మ్యాచ్ లు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతుండగా ఓ వైపు వెస్టిండీస్‌ లో క్రికెట్ జోరు మొదలైంది. విన్సీ ప్రీమియర్‌ లీగ్‌(వీపీఎల్‌)లో భాగంగా టి-10 లీగ్ ను ప్రారంభించడానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. తూర్పు కరీబియన్‌ దీవుల్లో నిర్వహించ తలపెట్టిన ఈ టోర్నీతో వెస్టిండీస్‌ లో మళ్లీ క్రికెట్ కళ తీసుకురావాలని యోచిస్తోంది. మే 22 నుండి మే 30 వరకు ఈ లీగ్ జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్ లో మొత్తం 30 మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇందులో అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా పాల్గొంటారని.. మొత్తం 72 మంది ఆటగాళ్లు పాల్గొంటారని విండీస్ తెలిపింది.

కరోనా సంక్షోభంలో తొలి క్రికెట్ టోర్నీ:
ఇక కరోనా సంక్షోభంలో ఐసీసీలో సభ్యత్వం కలిగిన ఒక దేశం నిర్వహిస్తున్న తొలి క్రికెట్ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇది టీ 10 క్రికెట్ పొట్టి పార్మెట్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఇది ఎంతో అలరిస్తుందని.. వీటిని ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నామని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కిషోర్‌ షా లో తెలిపారు. కాగా ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూనే బరిలోకి దిగబోతున్నారని.. గ్యాలరీల్లో ప్రేక్షకులు ఎవరు ఉండరు కాబట్టి ఆటగాళ్లు భౌతికదూరం పాటించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బంతిపై సలైవాను రుద్దడాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు.

Read Here>> ధావన్ ఒక ఇడియట్.. ఫస్ట్ బాల్ ఆడడు: రోహిత్ శర్మ

Categories
71745

నాలుగేళ్ల తర్వాత: మ్యాచ్‌లు ఆడకుండా నెం.1 ర్యాంకు పోగొట్టుకున్న టీమిండియా

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం కోల్పోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2016 అక్టోబరులో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న టీమిండియా.. ఆ తర్వాత ఇంటా బయటి వరుస విజయాలతో నెం.1 స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లిన భారత్ జట్టు.. టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ అవ్వడంతో కేవలం రెండు పాయింట్ల తేడాతో నెం.1 స్థానాన్ని మిస్ చేసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక భారత్ 114 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ (105), శ్రీలంక (91), దక్షిణాఫ్రికా (90), పాకిస్థాన్ (86), వెస్టిండీస్ (79), అఫ్గానిస్థాన్ (59), బంగ్లాదేశ్ (55) టాప్-10లో నిలిచాయి.

నాలుగేళ్ళలో తొలిసారిగా కోహ్లీసేన నంబర్‌వన్‌ ర్యాంకును చేజార్చుకుంది. అక్టోబర్ 2016 నుంచి టీమిండియా  అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తుండగా.. తాజాగా ప్రకటించిన పురుషుల క్రికెట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తన ఫస్ట్ ర్యాంకును కోల్పోయింది టీమిండియా. 2019 మే నుంచి ఆడిన అన్ని మ్యాచ్‌లను 100 శాతంగా, అంతకుముందు రెండేళ్ల మ్యాచ్‌లను 50 శాతంగా పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయించింది ఐసీసీ.

మెరుగైన పాయింట్లను సాధించడం ద్వారా ఐసీసీ పురుషుల టెస్ట్ టీం ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(26 మ్యాచ్‌లు) 116 పాయింట్లతో  నంబర్‌వన్‌ ర్యాంకుకు ఎగబాకింది. ఇక టీ20ల్లోనూ కంగారులదే హవా.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం. రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఇంగ్లాండ్‌, భారత్‌ నిలిచాయి. పాకిస్థాన్‌ నాలుగు, సౌతాఫ్రికా ఐదో ర్యాంకు సాధించాయి.(ధోనీలా కీపింగ్ చేయాలంటే భయం వేస్తుంది: కేఎల్ రాహుల్)