Categories
71715 71749

మీ ఫోన్ రేడియేషన్, IMEI నెంబర్లు చెక్ చేయడం తెలుసా?

మీ స్మార్ట్ ఫోన్ రేడియేషన్ స్థాయి ఎంత ఉందో తెలుసా? ప్రతి ఫోన్ కు రేడియేషన్ ఒక్కో స్థాయిలో ఉంటుంది. మీరు వాడే ఫోన్‌కు రేడియేషన్ స్థాయి ఎంత ఉందో వెంటనే చెక్ చేసుకోండి. రేడియేషన్ అంటే ఏంటో తెలియనివారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. రేడియేషన్ లేదా SAR వాల్యూ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ముందు ప్రతిఒక్కరూ చెక్ చేయాల్సింది రేడియేషన్ లెవల్ ఎంత ఉంది? అప్పుడే ఆ ఫోన్ కొనాలా? వద్దా? అని డిసైడ్ చేసుకోవాలి. కొన్ని స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు తమ యూజర్ మాన్యువల్ ల్లోనే SAR రేటింగ్ ఎంతో ప్రస్తావిస్తాయి.

స్మార్ట్ ఫోన్ అధికారిక వెబ్ సైట్లో కూడా తమ ప్రొడక్టుకు సంబంధించి SAR వాల్యూ ఎంత ఉందో రివీల్ చేస్తాయి. సాధారణంగా ప్రతి ఫోన్‌లో రేడియో ఫ్రిక్వెన్సీ ట్రాన్స్ మిటింగ్ డివైజ్ ఉంటుంది. కొత్త స్థాయిలో రేడియేషన్ బయటకు రిలీజ్ అవుతుంది. ఈ రేడియేషన్ కారణంగా ఆ ఫోన్ వాడేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రేడియేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్టే. స్మార్ట్ ఫోన్లో రేడియేషన్ లెవల్ ఎంత ఉందో తెలుసుకోండి. రేడియేషన్ లెవల్ మీ ఫోన్లలో ఇలా చెక్ చేసుకోవచ్చు.  

SAR Value చెకింగ్ ఇలా :
* మీ స్మార్ట్ ఫోన్ Unlock చేయండి.
* మీ ఫోన్ Dialer Keypad ఓపెన్ చేయండి.
* ఇప్పుడు *#07# అని టైప్ చేయండి.
* మీ స్మార్ట్ ఫోన్ స్ర్కిన్‌పై SAR రేటింగ్ వాల్యూ కనిపిస్తుంది.
* రేడియేషన్ స్థాయి 1.6w/kg (Body, Head) కంటే తక్కువ స్థాయిలో ఉంటే పర్వాలేదు.
* మీ ఫోన్ వాడొచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు.
* ఎక్కువ స్థాయిలో రేడియేషన్ ఉంటే మాత్రం తక్షణమే ఆ ఫోన్ వాడకం ఆపేయండి.

IMEI నెంబర్లు చెకింగ్ :
* IMEI నెంబర్లు సహా ఇతర విషయాలను కూడా చెక్ చేయొచ్చు.
* మీ డయలర్ ప్యాడ్ పై *#06# అని టైప్ చేయండి.
* స్మార్ట్ ఫోన్ స్ర్కిన్ పై ఆటోమాటిక్ గా IMEI నెంబర్లు కనిపిస్తాయి.

Read : మీ ఐఫోన్‌‌ స్లో అయిందా? Cache ఇలా క్లియర్ చేయండి!

Categories
71715 71749

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా? రిలయన్స్ జియో హైస్పీడ్ డేటా ఆఫర్ మీకోసం

కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగుల్లో చాలామంది ఇంటినుంచే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ కరోనాతోనే మొదలైనట్టు కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లలేని వారంతా తమ ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు. అయితే ఆఫీసుల్లో మాదిరిగా ఇంట్లో నుంచి పనిచేయడానికి వాతావరణం అందరికి అనుకూలంగా ఉండదు. ఇంటర్నెట్ నుంచి ఇతర నెట్ వర్క్ సౌకర్యాలు కూడా ఉండాలి. 

అప్పుడే ఎలాంటి అవంతరాలు లేకుండా వర్క్ చేసేందుకు వీలుంటుంది. ఇంట్లో నుంచి పనిచేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరి. టెలికం కంపెనీలు కూడా తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన డేటా ప్యాకేజీలను అందిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం వినియోగదారులకు మరిన్ని డేటా బెనిఫెట్స్ అందిస్తున్నాయి. అందులో ప్రముఖ టెలికం దిగ్గజం రియలన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.999 రీఛార్జీతో 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రతిరోజు 3GB వరకు హై-స్పీడ్ డేటాను అందిస్తోంది.  

ఇతర జియో ల్యాండ్ లైన్, మొబైల్ నంబర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. రోజువారీ 100 SMSలు అదనంగా అందిస్తోంది. ఇతర నెట్ వర్క్ నంబర్లకు 3,000 వాయిస్ కాలింగ్ నిమిషాలను పొందవచ్చు. జియో యాప్స్ సబ్ స్ర్కిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. జియో ఇప్పటికే రూ.599 రీఛార్జీతో రోజువారీ 2GB డేటా, రూ.555 రీఛార్జీతో 1.5GB డేటా ప్లాన్లపై 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. 

Read Here>> వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియో ఆఫర్లు ఇవే!

Categories
71715 71749

మీ ఐఫోన్‌‌ స్లో అయిందా? Cache ఇలా క్లియర్ చేయండి!

మీ ఐఫోన్ స్లో అయిందా? అయితే వెంటనే cache (క్యాచీ) క్లియర్ చేసేయండి. మీరు మీ ఫోన్లోని మెమరీని ఫ్రీ అప్ చేయండి లేదా ఐఫోన్ స్పీడ్ బూస్ట్ కోసం cache క్లియర్ చేయడమే మంచిది. సాధారణంగా మీ ఐఫోన్ స్టోర్ మెమెరీలో ప్రత్యేక యాప్స్ కారణంగా క్యాచీ స్టోర్ అవుతుంది. ప్రత్యేకించి సఫారీ బ్రౌజర్, ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ఫేస్ బుక్, స్పాటిఫై, టిండర్ కారణంగా కూడా క్యాచీ స్టోర్ అవుతుంది. ఐఫోన్ క్యాచీని క్లియర్ చేయడానికి ముందు మీరు ఎలా చేస్తున్నారో ఓసారి గమనించండి. 

clear cache

లేదంటే.. మీ యాప్ డేటా కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. యాప్ లోని క్యాచీని మాత్రమే క్లియర్ చేయాల్సి ఉంటుంది. యాప్స్ ద్వారా స్టోర్ అయిన డేటాను మీరు డిలీట్ చేస్తున్నారని గమనించండి. చాలా సందర్భాల్లో మీరు వాడే యాప్స్ సరిగా పనిచేయాలంటే ఈ Cache తప్పనిసరిగా ఉండాలి. లేదా Settingsలోని your preferences కనీసం గుర్తించుకోండి. అందులో ఏదైనా ఫైల్స్ సేవ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా ఐఫోన్ యాప్ క్యాచీ క్లియర్ చేయడానికి ముందు కచ్చితంగా ఈ విషయం గుర్తించుకోవాలి. మీరు డిలీట్ చేసే ఆ డేటా అవసరం లేదనకుంటే క్లియర్ చేసేయొచ్చు. 

ఐఫోన్ Safariలో cache క్లియర్ చేయాలంటే :
ముందుగా మీ ఫోన్లోని మెమెరీని ప్రీ అప్ చేయండి. ఐఫోన్ పర్ఫార్మెన్స్ ద్వారా సఫారీ క్యాచీని క్లియర్ చేయొచ్చు. అది ఎలానో ఓసారి లుక్కేయండి. 

Step 1 : Go to Settings > Safari పై క్లిక్ చేయండి. స్ర్కోల్ డౌన్ చేసి Clear history, Website Dataపై ట్యాప్ చేయండి. ఆ
తర్వాత Clear History, Dataపై టాప్ చేయండి. 

Step 2 : go to Settings > Safari లోకి వెళ్లండి. Safari Settings menuను కిందికి స్ర్కోల్ డౌన్ చేయండి. Advanced > Website Data ఆప్షన్ పై Tap చేయండి. చివరిగా Remove All website Dataపై ట్యాప్ చేయండి. అప్పుడు Remove nowపై క్లిక్ చేయండి. 

iphone cache

ఐఫోన్లలో సఫారీ క్యాచీ క్లియర్ చేయండి. వెబ్‌సైట్ డేటా, బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్‌సైట్ కుకీలను క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్స్‌‌లోనూ క్యాచీ క్లియర్ చేయొచ్చు. సఫారీ తోపాటు ఇతర థర్డ్ పార్టీ యాప్స్ cache కూడా క్లియర్ చేయొచ్చు. డేటా క్లియర్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ డిలీట్ చేయొచ్చు. అప్పుడు మళ్లీ యాప్ రీఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. మరోలా కూడా థర్డ్ పార్టీ యాప్స్ క్యాచీని క్లియర్ చేయొచ్చు. 

Step 1 : Go to Settings > General > iPhone Storage ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు యాప్స్ లిస్టును కిందికి స్ర్కోల్ డౌన్ చేయండి. మీరు ఏ యాప్ క్లియర్ చేయాలో దానిపై Tap చేయండి. 

Step 2: Delete App బటన్‌పై Tap చేయండి. Delete App బటన్‌పై Tap చేసి Confirm చేయండి.

Step 3: ఒకవేళ మీరు యాప్ రీ ఇన్ స్టాల్ చేయాలనుకుంటే (ఎలాంటి డాక్యుమెంట్లు, డేటా లేకుండా డిలీట్ చేస్తే) App స్టోర్ లోకి వెళ్లి reinstall చేయండి. 

మిగతా యాప్స్‌లోనూ ఇదే ప్రాసెస్ చేయొచ్చు. క్యాచీ డేటాను క్లియర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏ యాప్ క్యాచీ డేటాను క్లియర్ చేస్తున్నారో ఓసారి నిర్ధారించుకున్నాక మాత్రమే చేయాల్సి ఉంటుంది. 

Read Here>> Conference Calls చేస్తున్నారా.. బిల్లులు పెంచేసిన  Trai

Categories
71749

WhatsApp webలో కొత్త ఫీచర్: మెసేంజర్ రూంలతో వీడియో కాల్స్

WABetaInfo ఇచ్చిన సమచారం మేరకు వాట్సప్ లోనూ మెసేంజర్ రూమ్స్ తీసుకురానున్నారు. జూమ్ లాంటి ఇతర వీడియో ప్లాట్ ఫాంలకు ధీటుగా ఫేస్‌బుక్ గత నెలలో వీడియో కాన్ఫిరెన్స్ టూల్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాన్ని వాట్సప్ వెబ్ వర్షన్ లోనూ చూడబోతున్నామని వెల్లడించింది ఫేస్‌బుక్. వాట్సప్ వెబ్ వర్షన్ 2.2019.6 ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. 

మెసేంజర్ రూంల ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వొచ్చని.. అది కూడా పీసీలు, ల్యాప్‌టాప్‌ల నుంచే కుదురుతుందని వెల్లడించింది. ఈ ఆప్షన్ అటాచ్ బటన్ పక్కనే ఇతర ఆప్షన్లతో పాటు కనిపిస్తుందని.. సమాచారం. ఈ న్యూ వర్షన్ యూజర్లందరికీ అందుబాటులో లేదు. డెవలప్‌మెంట్‌లోనే ఉండటంతో వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ అప్‌డేట్‌కు మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. 

రిపోర్టు మేరకు వాట్సప్ యూజర్లకు ఫీచర్ అప్‌డేట్స్ ద్వారా న్యూ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు. గతనెలలోనే ఫేస్‌బుక్ మెసేంజర్ రూమ్స్ అన్ని గ్రూప్ వీడియో కాల్స్ ను అనుమతిస్తుందని ఏ లిమిట్ లేకుండా ఒకేసారి 50మంది వీడియో కాల్ చేసుకోవచ్చని అన్నారు. 

యూజర్లు మెసేంజర్, ఫేస్‌బుక్ ద్వారా ఎవరినైనా వీడియోకాల్స్ కు ఆహ్వానించొచ్చని పైగా వారికి ఫేస్ బుక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఫేస్‌బుక్ మెసేంజర్ రూమ్స్‌లో యూజర్లు న్యూస్ ఫీడ్ లో లింకులు పోస్టు చేసుకోవచ్చు. గ్రూపులు, ఈవెంట్ పేజీలలోనూ ఇలా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

Read More :

ఈ టిప్స్ ఫాలో అవ్వండి : వాట్సాప్‌లో బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టాలంటే?

WhatsApp’s కొత్త ఫీచర్ : 8 మందితో Video Calls

Categories
71715 71723 71749

రసాయనాలు వాడకుండానే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కరెన్సీ నోట్లు శానిటైజ్ చేసేందుకు హైదరాబాద్ డీఆర్డీవో కొత్త ఆవిష్కరణ

ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు చల్లడమే మనకు తెలుసు.

ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు చల్లడమే మనకు తెలుసు. కరోనా నుంచి రక్షించేందుకు ప్రజలపైనా శానిటైజర్‌లను చల్లుతున్నారు. కొన్ని మొబైల్ శానిటైజేషన్ గదులను కూడా తయారు చేశారు. అయితే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను రసాయనాలు లేదా క్రిమి సంహారకాలతో శుద్ధి చేసేందుకు వీలుపడదు. ఉదాహరణకు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఐప్యాడ్ లు, కరెన్సీ నోట్లు, చలాన్లు. వీటిపై శానిటైజర్‌ను స్ప్రే చేయడం సాధ్యపడదు. దీనివల్ల వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది.

యూవీ కిరణాలతో శుభ్రం చేస్తుంది:
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ను రసాయన రహితంగా అంతమొందించేందుకు హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) ల్యాబ్ ఓ పరికరాన్ని రూపొందించింది. అది కాంటాక్ట్ లెస్ శానిటైజేషన్ కేబినెట్. దాని పేరు Defence Research Ultraviolet Sanitizer (DRUVS). మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కరెన్సీ నోట్లు, చలాన్లు మొదలైన వాటిని శుభ్రపరిచేందుకు ఇది రూపొందించబడిందని డీఆర్‌డీవో తెలిపింది. ఈ కేబినెట్ యూవీ(అతినీలలోహిత) కిరణాల సాయంతో సెన్సార్ల ఆధారంగా పని చేస్తుంది. ఇందులో ఓ డ్రాయర్ ఉంటుంది. అది ఆటోమేటిక్ గా కాంటాక్ట్ లెస్ గా ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఇది ప్రతీ వస్తువును, పరికరాన్ని 360 డిగ్రీల్లో యూవీ కిరణాలతో శుభ్రం చేస్తుంది. క్లీన్ అయిన తర్వాత, సిస్టమ్ స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది.

ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కరెన్సీ నోట్లు, చెక్ నోట్లు, చలాన్లు, పాస్‌బుక్‌లు, పేపర్, ఎన్వలప్‌ లు శుభ్రం:
“ఆర్‌సిఐ, డిఆర్‌డిఓ, హైదరాబాద్… మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కరెన్సీ నోట్లు, చెక్ నోట్లు, చలాన్లు, పాస్‌బుక్‌లు, పేపర్, ఎన్వలప్‌లను శుభ్రపరచడానికి ఆటోమేటెడ్ కాంటాక్ట్‌లెస్ యువిసి శానిటైజేషన్ క్యాబినెట్ ‘డ్రూవ్స్'(DRUVS) ను అభివృద్ధి చేసింది. ఇది ఆటోమేటెడ్ యువీసీ కరెన్సీ శానిటైజింగ్ పరికరం ”NOTESCLEAN” అని రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ కేబినెట్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయొచ్చని డీఆర్డీవో తెలిపింది. 

కరోనాను చంపే మరో పరికరం యూవీ బ్లాస్టర్:
కాగా, ఇటీవలే భారత ప్రభుత్వ రక్షణ సంస్థ డీఆర్‌డీవో మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. దానికి ‘యూవీ బ్లాస్టర్’ అని నామకరణం చేసింది. ఇది యూవీ(అతినీలలోహిత) కిరణాల సాయంతో పనిచేస్తుంది. ఇది ఓ టవర్ ఆకారంలో ఉంటుంది. కంప్యూటర్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఉపకరణాల ఉపరితలాలను అతినీల లోహిత(యూవీ) కిరణాలతో శుద్ధిచేయగల ఈ టవర్‌ను డీఆర్‌డీఓ- లేజర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ రూపొందించింది. రసాయనాలు, క్రిమిసంహారకాలతో శుద్ధిచేసేందుకు వీలుపడని ప్రతీ వస్తువును, పరికరాన్ని ఇది 360 డిగ్రీల్లో యూవీ కిరణాలతో శుభ్రం చేయగలదు. 43 వాట్ల యూవీ-సీ బ‌ల్బులు ఆరు ఇందులో ఉంటాయి. ఇవి 254 నానోమీట‌ర్ త‌రంగ దైర్ఘ్యంతో ప‌నిచేస్తుంది. ఈ ప‌రిక‌రం wifi ద్వారా ఆప‌రేట్ చేసే వీలుంది. 12 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలిగిన గదిని వైరస్‌ రహితంగా శానిటైజ్ చేసేందుకు 10 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. 400 చదరపు అడుగుల ఏరియా శుద్ధికి అరగంట సమయాన్ని తీసుకుంటుంది.

పూర్తిగా రసాయన రహితంగా పని చేసే యూవీ బ్లాస్టర్:
ఆఫీసులు, లేబోరేటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కాకుండా జనసమర్థం ఎక్కువగా ఉండే విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో ఈ యూవీ బ్లాస్టర్‌ను వినియోగించి పరిసరాలన్నింటినీ శానిటైజ్ చేయవచ్చని తెలిపింది. ఈ పరికరం పూర్తిగా రసాయన రహితంగా పని చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ పరికరాన్ని ఏదైనా గదిలో ఉంచి ఆన్ చేసిన తర్వాత అనుకోకుండా ఆ గదిలోకి ఎవరైనా ప్రవేశించారంటే వెంటనే పరికరం ఆఫ్ అయిపోతుందని, దీనివల్ల మనుషులపై దీని ప్రభావం ఉండదని డీఆర్‌డీవో తెలిపింది.

Read More :

భారత కరోనా రోబోలు: పేషెంట్లకు థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ కోసం వాడుతున్నారు.. ఎలా పనిచేస్తున్నాయంటే?

కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం జతకట్టిన భారత్ బయోటెక్, ICMR

Categories
71680 71715 71749

మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నిత్యావసరేతర వస్తువులు డెలివరీ 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా లేటెస్ట్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు రిలీఫ్ ఇచ్చింది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతినివ్వగా.. తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రెడ్ జోన్లలో మాత్రం నిత్యావసర వస్తువుల్లో కిరాణా సరుకులు, మెడికల్, చిన్నారులకు సంబంధించి వస్తువలపై పరిమితంగా డెలివరీ చేసేలా అనుమతి ఇచ్చింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రజలకు అవసరమైన వస్తువులను సురక్షితంగా డెలివరీ చేసేందుకు ప్రభుత్వం తమకు అనుమతినిచ్చేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపాయి. మిలియన్లలో చిన్న, మధ్య వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని నిర్వహించేందుకు అనుమతి లభించినట్టు ఈ కామర్స్ దిగ్గజం ఈమెయిల్ స్టేట్ మెంట్ లో పేర్కొంది.

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నివసించే వినియోగదారులు మే 4 నుంచి నాన్ ఎసెన్షియల్ వస్తువుల కేటగిరీ కింద స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ సహా ఇతర గాడ్జెట్లు, ఇతర ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు. ఈ జోన్లలో ఉండే వినియోగదారులకు మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ ఫాంలు నాన్ ఎసెన్షియల్ ఆర్డర్లను అంగీకరించనున్నాయి. 

Also Read | ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలకు అనుమతి

Categories
71680 71749

లాంచ్ చెయ్యకుండానే లీకైన యాపిల్ ధరలు

కరోనా దెబ్బకు ప్రపంచం ఆగిపోయింది. ఎక్కడా కూడా వ్యాపారాలు జరగని పరిస్థితి. ఇటువంటి స్థితిలో కరోనా మహమ్మారితో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినా ఐఫోన్‌12 సిరీస్‌ని ఈ ఏడాది తీసుకురావాలని ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఆపిల్‌ భావిస్తోంది.

ఐఫోన్‌12 సిరీస్‌ కోసం యాపిల్‌ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయంలో లాక్‌డౌన్ ప్రకటనకు అంతరాయం కలిగించింది. ఇటువంటి పరిస్థితిలో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ లాంచ్‌ తేదీలను ముందుగానే తెలిపిన జోన్‌ ప్రోసర్‌, ఇప్పుడు ఐఫోన్‌ 12 ధరలను కూడా తన ట్విటర్‌ ఖాతాలో లీక్ చేశారు.

జోన్‌ ప్రోసర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఐఫోన్‌12 సిరీస్‌ ధరలు:

5.4 ఐఫోన్‌ 12 డీ52జీ
ఓఎల్‌ఈడీ/5జీ
రెండు కెమెరాలు
649 డాలర్లు( రూ.48,754)

6.1 ఐఫోన్‌ 12 డీ53జీ
ఓఎల్‌ఈడీ/5జీ
2కెమెరాలు
749డాలర్లు( రూ.56,266)

6.1 ఐఫోన్‌ 12 ప్రో డీ53పీ
ఓఎల్‌ఈడీ/5జీ
3 కెమెరాలు+ లిడార్‌
999 డాలర్లు( రూ.75,047)

6.7 ఐఫోన్‌ 12 ప్రో మాక్స్‌ డీ54పీ
ఓఎల్‌ఈడీ/5జీ
3 కెమెరాలు+ లిడార్‌
1099 డాలర్లు(రూ.82,573)