Categories
71715 71750

తెలంగాణలో భక్తులకు శుభవార్త, త్వరలో ఆలయాల్లోకి ప్రవేశం

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది. భక్తులకు దైవ దర్శనం కలగనుంది. దేవాలయాల్లోకి భక్తులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు దేవుళ్లపైనా పడింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలకు అవకాశం కల్పించినా.. కనులారా భగవంతుడిని చూడకుండా పూజలు చేస్తే ఫలితం ఏంటని వాపోతున్నారు. 

పూజలకు నో, దర్శనం మాత్రమే:
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనల్లో కొన్నింటికి సడలింపు ఇచ్చింది. బస్సులు నడుపుతున్నారు. రైళ్లు కూడా తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న దేవాలయాలను ఆదుకునేందుకు ఎండోమెంట్‌ అధికారులు చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్‌డౌన్‌ పూర్తి కానున్న నేపథ్యంలో జూన్‌లో ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం కల్పించే అవకాశం, ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించినట్లు సమాచారం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల్లో పాటించాల్సిన విధి విధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. పూజలకు అవకాశమిస్తే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పాటు ఎక్కువ సమయం ఒకేచోట ఉంటారని, తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని యోచిస్తున్నారు. అందుకే దైవ దర్శన భాగ్యం మాత్రమే కల్పించాలని భావిస్తున్నారు.

గదులు అద్దెకివ్వరు:
వేసవి సెలవుల్లో భద్రాచలం రామాలయానికి నిత్యం 15 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్‌ టన్నెల్‌ ద్వారా ఆలయం లోపలకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గదర్శకాలను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 27 కాటేజీలు, 140 గదులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గదులు అద్దెకిస్తే భౌతిక దూరం పాటించే అవకాశం ఉండదని, గదులు అద్దెకిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకటి, రెండు రోజులు ఉంటారని, అందుకే గదులు అద్దెకు ఇవ్వొద్దని యోచిస్తున్నారు. కాగా, భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారని తెలుస్తోంది. అందరూ కచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా త్వరలోనే ఆలయాలు తిరిగి తెరుస్తారని, దైవ దర్శనానికి అనుమతి ఇస్తారనే వార్త భక్తుల్లో ఆనందం నింపింది. ఎప్పుడెప్పుడు ఆలయాలు తెరుస్తారా, దైవ దర్శనం చేసుకుంటామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు భారీగా సడలింపులు:
‘కరోనా వైరస్’ లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ పొడిగిస్తూ వెళ్లారు. ఇప్పటి వరకు నాలుగు లాక్ డౌన్‌లు విధించారు. ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ 4 అమలులో ఉంటుంది. కాగా, లాక్ డౌన్ తో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందు లాక్ డౌన్ 4వ దశలో కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చింది. ఫ్యాక్టరీలు, కంపెనీలు, వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు కొన్ని మార్గదర్శకాలు, సడలింపులతో అనుమతి ఇచ్చారు. దీంతో కొద్ది రోజుల క్రితం నుంచే ఆంక్షల మధ్య వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు తెరుచుకుంటున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ కూడా పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. బస్సులు, రైళ్లు, విమానాలు తిరుగుతున్నాయి. 

ఆలయాలు తెరుస్తున్న తొలి రాష్ట్రం కర్నాటక:
కాగా ఆలయాలు తిరిగి తెరిచే విషయంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలు తెరవాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ 4 తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కర్ణాటకలో జూన్‌ 1వ తేదీ నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి. నిర్థిష్ట మార్గదర్శకాలను అనుసరించి ఆలయాల్లోకి భక్తులకు అనుమతిస్తారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు.

Read: మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాల్సిందే..ఎందువల్ల చనిపోయారో తెలుసుకోరా..

Categories
71715 71750

తెలంగాణలో రోడ్డెక్కనున్న బస్సులు, నగర శివార్ల నుంచే జిల్లాలకు, MGBSకు వచ్చే బస్సులకు నో ఎంట్రీ

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. భౌతికదూరం పాటిస్తూ 50శాతం సీటింగ్ తో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో బస్సులు తిరగనున్నాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రం ఇప్పట్లో అనుమతి లేనట్లుగానే తెలుస్తోంది. ఈ సాయంత్రం కేబినెట్ భేటీ తర్వాత ఆర్టీసీ సర్వీసులపై సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు.

* తెలంగాణలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
* అన్ని జిల్లాల్లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రేపటి నుంచే బస్సు సర్వీసులు
* అంతర్రాష్ట్ర సర్వీసులు ఇప్పట్లో లేనట్లే
* హైదరాబాద్ సిటీ సర్వీసులపై ఇంకా సస్పెన్స్
* నగర శివార్ల నుంచి జిల్లాలకు బస్సు సర్వీసులు
* బస్సుల్లో 50శాతం సీట్లలోనే ప్రయాణికులు
* ప్రతి బస్సులో శానిటైజర్లు, మాస్కులు
* హైదరాబాద్ లో జేబీఎస్ వరకే బస్సు సర్వీసులు
* వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి
* నల్గొండ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి
* మహబూబ్ నగర్ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడిపే అవకాశం
* ఎంజీబీఎస్ నుంచి వచ్చే బస్సులకు నో ఎంట్రీ
* డిపోల్లో థర్మల్ స్క్రీన్ చేశాకే ఆర్టీసీ కార్మికులు విధులోకి

నష్టాల్లో ఆర్టీసీ, అందుకే గ్రీన్ సిగ్నల్:
దాదాపు రెండు నెలలు.. లాక్ డౌన్ కారణంగా ప్రజారవాణ సర్వీసులు మూత పడ్డాయి. తెలంగాణలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. కాగా, లాక్ డౌన్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రజారవాణా అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల పరస్పరం ఒప్పందం మేరకు బస్సులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నడపొచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సులను నడపాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రయాణీకుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లాక్ డౌన్ 4లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో అన్ని కార్యాలయాలు దాదాపుగా తెరుచుకున్నాయి. దీంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురి కాకుండా ఆర్టీసీ తగు చర్యలు చేపట్టనుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిపే బస్సుల్లో పరిమితంగా ప్రమాణీకులను అనుమతిస్తారు. దాంతో పాటు వ్యక్తిగత దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేశారు.

Read : మరో మూడు నెలలు థియేటర్లు బంద్!

Categories
71684 71715 71750

కరోనాతో జాగ్రత్త : లాక్‌డౌన్‌లో యథేచ్చగా ‘హలీమ్’ హోం డెలివరీ!

హలీమ్.. అంటే హైదరబాదీలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రుచికరమైన హాలీమ్ లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. మహానగరమైన హైదరాబాద్‌లో హాలీమ్‌కు ఫుల్ మార్కెట్ ఉంటుంది. లాక్ డౌన్ అయినప్పటికీ అండర్ గ్రౌండ్ మార్కెట్లో హాలీమ్ సేల్స్ జోరుందుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో నిబంధనల ప్రకారం.. ఎలాంటి సేల్స్, కుకింగ్ ఫుడ్ డెలివరీని నిషేధించింది. అయినాసరే అక్రమంగా హాలీమ్ డిష్‌ విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. చాలామంది అమ్మకందారులు ఫోన్ల ద్వారానే ఆర్డర్లు చేస్తున్నారు.

కొంతమంది మాత్రం కస్టమర్లకు నేరుగా హాలీమ్ ఆర్డర్లు అందిస్తున్నారు. మరికొంతమంది కాస్తా అదనంగా జోడించి ఇంటికే హోం డెలివరీ చేస్తున్నారు. ఒక్కో హాలీమ్ ఖరీదు దాదాపు రూ.300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ అయితే మాత్రం రూ.1000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. బంజారా హిల్స్ నుంచి ఓ కుటుంబం.. మే 15నుంచి హాలీమ్ విక్రయిస్తోంది. అప్పటినుంచి తమకు భారీ మొత్తంలో కస్టమర్ల నుంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. 

వ్యాపారం మొదలైనప్పటి నుంచి రోజుకు 30 వరకు ఆర్డర్లు వస్తున్నట్టు తెలిపారు. ఖలిందా ( పేరు మార్చాం) అనే వ్యక్తి ఈ హాలీమ్ సేల్ నడుపుతున్నారు. సికింద్రాబాద్ వరకు హాలీమ్ డెలివరీ చేస్తున్నట్టు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఇలా విక్రయించడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించగా.. ‘అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకుంటన్నాం. కుకింగ్, ప్యాకింగ్, డెలివరీ విషయంలో నాణ్యతతోపాటు పరిశుభ్రత ఉండేలా జాగ్రత్త పడుతున్నాం. ఎవరి నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు’ అని వారు చెప్పుకొచ్చారు. కస్టమర్లకు హాలీమ్ డెలివరీ చేసేందుకు ఖలిందా ఫ్యామిలీ తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆపరేట్ చేస్తోంది. టోలి చౌకీ నుంచి ఓ మహిళ కూడా తన ఇంటి నుంచే చాలా రోజులుగా హాలీమ్ డిష్ అమ్ముతోంది. 

కానీ, ఆమె ఎవరి నుంచి క్యాష్ పేమెంట్లను అనుమతించడం లేదు. కేవలం ఆన్ లైన్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇతర పేమెంట్స్ మోడ్ ద్వారా అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నట్టు పేర్కొంది. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వారి కోసం పరిమితంగా ప్రతిరోజు హాలీమ్ విక్రయిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీనియర్ జీహెచ్ఎంసీ అధికారులు కస్టమర్లలా వెళ్లి ప్రశ్నించగా ఆమె పై విధంగా బదులిచ్చింది. సోమాజిగూడలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కూడా మే మొదటివారం నుంచే హాలీమ్ విక్రయిస్తున్నట్టు సమాచారం ఉంది. తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్లో ఫోన్ నెంబర్ కూడా పోస్టు చేశారు. ఆ ఫోన్ కాల్ ఎత్తిన ఆ హోటల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయడంలేదు. నిత్యావసర సర్వీసులు అందించేందుకు తమ దగ్గర పాస్ ఉంది. మేం ఫుడ్ డెలివరీ చేయొచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చాడు. 

ఈ వాదనను పోలీసు అధికారులు ఖండించారు. తమ స్టేషన్ పరిధిలో హలీమ్‌తో సహా ఆహారాన్ని విక్రయించే వ్యక్తులపై ఇటీవల చర్యలు తీసుకున్న మొఘల్‌పురా పోలీసు స్టేషన్ హౌస్ కార్యాలయం ఎ. రవి కుమార్ మాట్లాడుతూ.. వండిన ఆహారాన్ని అమ్మడం చట్టవిరుద్ధమని, నేరస్థులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. హలీమ్ తయారీకి మాంసం ఉపయోగించే జంతువులను జియాగుడ వంటి ప్రదేశాలలో నగరంలోకి రవాణా చేస్తారు. ఇక్కడ చాలా కోవిడ్ -19 కేసులు ఉన్నాయని అందరికి తెలుసు. అక్కడి నుండి జంతువులు కబేళాలకు వెళ్లి మాంసం వంటశాలలకు చేరుకుంటాయి. వీటిన్నింటిని తనిఖీ చేయడం అసాధ్యం. ఇది చాలా ప్రమాదకరమేనని అంటున్నారు. 

Read Here>> కరోనా మహిళ డబ్బు డ్రా చేసింది, బ్యాంకు మొత్తం ఖాళీ అయ్యింది, బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త

Categories
71715 71750

కరోనా మహిళ డబ్బు డ్రా చేసింది, బ్యాంకు మొత్తం ఖాళీ అయ్యింది, బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త

తెలంగాణలో కరోనావైరస్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోనే అత్యధిక స్థాయిలో

తెలంగాణలో కరోనావైరస్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోనే అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి ఓ బ్యాంకును తాకింది. శనివారం(మే 16,2020) డబ్బు కోసం జియాజిగూడలోని పురానాపూల్ ఎస్బీఐ బ్యాంక్‌కు ఓ మహిళ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో తక్షణం స్పందించిన అధికారులు బ్యాంకు సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. బాధిత మహిళ కంటైన్మెంట్ జోన్ నుంచి నేరుగా బ్యాంకుకు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. బ్యాంకులో మొత్తం 11 మంది సిబ్బంది ఉన్నారు.

హైదరాబాద్ లో బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త:
కరోనా సోకిన మహిళ బ్యాంకుకి రావడం, బ్యాంకు సిబ్బందిని క్వారంటైన్ కు తరలించడం తెలిసి ఇతర బ్యాంకుల్లో పని చేసే సిబ్బందిలో కలకలం రేపింది. వారు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు పనుల నిమిత్తం ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు. వారిలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో ఆఫీస్ కి వెళ్లి పని చేయాలంటే భయపడుతున్నారు. కాగా, విధుల్లో ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బ్యాంకులకు వెళ్లే వారూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. భౌతిక దూరం పాటించేలా బ్యాంకు సిబ్బంది చర్యలు తీసుకోవాలి. మాస్కు ధరించేలా నిబంధన పెట్టాలి. ఇలాంటి జాగ్రత్తలతో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు.

నగరంలో ప్రధానంగా జియాగూడ, మాదన్నపేటలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కంటైన్ మెంట్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కొత్తగా 42 కేసులు నమోదు:
ఆదివారం(మే 17,2020) రాష్ట్రంలో కొత్తగా మరో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధిలో 37 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 2 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస ప్రజల కేసులు 2 నమోదయ్యాయి. దీంతో వలసల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 1,551కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 525 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం మరో 42 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లిన వారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 34మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాలు వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి. గత 14 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదవని జిల్లాలు 25 ఉన్నాయి. 

కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువ:
రాష్ట్రంలో మే నెల 16 నాటికి 23,388 నమూనాలను కరోనా నిర్ధారణ కోసం పరీక్షించారు. ఇందులో పురుషులవి 15203 కాగా, వీటిల్లో 947 మందిలో కరోనా పాజిటివ్ గా తేలింది. మహిళల్లో 8,185 నమూనాలను పరీక్షించగా, 566 మందిలో వైరస్ ను నిర్ధారించారు. వయస్సుల వారీగా పరిశీలించినా.. మహిళల కంటే పురుషుల్లో ఎక్కువ మంది పాజిటివ్ లుగా నిర్ధారణ అయింది.

Read Here>> Corona కేసులు పెరగకూడదని ఆంధ్ర నుంచి తెలంగాణకు నో ఎంట్రీ

Categories
71715 71723 71750

కరోనా ఎఫెక్ట్, మే 31 వరకు మెట్రో బంద్

కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి

కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. మే 18 నుంచి లాక్ డౌన్ 4 అమల్లోకి వచ్చింది. మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆదివారం(మే 17,2020) కేంద్రం ప్రకటన చేసింది. మరో 14 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా.. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ లాక్‌డౌన్ పొడిగించడం ఇది నాలుగోసారి. ప్రధాని నరేంద్ర మోడీ విధించిన లాక్‌డౌన్ 3వ దేశ ఆదివారంతో ముగిసింది. దీంతో మరో 14 రోజులు అంటే.. ఈ నెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. 

కరోనా తీవ్రత కారణంగా లాక్ డౌన్ పొడిగింపు:
కాగా కేంద్రం నుంచి ప్రకటన రాకముందే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ను మే 31వ తేదీ వరకు పొడిగించాయి. దేశ వ్యాప్తంగా కరోనా మరింతగా విజృంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కాగా, నాలుగో దశ లాక్ డౌన్ లో కేంద్రం భారీ సడలింపులు ప్రకటించింది. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. ఇకపోతే మే 31వ తేదీ వరకు నిలిపివేసిన వాటిలో మెట్రో రైలు సేవలు కూడా ఉన్నాయి.

కరోనా విస్తరించే అవకాశంతో మెట్రోరైలు సర్వీసులు నిలిపివేత:
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు మెట్రో రైల్‌ సేవలు నిలిపివేశారు. దేశంలోని మెట్రో సర్వీసులన్నింటినీ అప్పటి వరకు తెరవొద్దని కేంద్రం ప్రకటించడంతో హైదరాబాద్‌ మెట్రో సేవలు నిలిచిపోయాయి. ప్రజా రవాణతో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉన్నందున మెట్రోరైలు ఆపరేషన్స్‌ను నిలిపివేశారు. లాక్ డౌన్ 4లో సడలింపులు ఇస్తారని, మెట్రో సేవలు ప్రారంభిస్తారని నగర వాసులు ఆశించారు. మెట్రోలో ఆఫీసులకు వెళ్లొచ్చని ఐటీ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది భావించారు. అలాగే బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సేవలు ప్రారంభిస్తే వాటిలో ప్రయాణం చేయొచ్చని అనుకున్నారు. కానీ కేంద్రం మెట్రో ఆపరేషన్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు. మే 31వ తేదీ వరకు మెట్రో రైలు సేవలు నిలిపివేసింది. కాగా మెట్రో రైలు నడపకున్నా హైదరాబాద్‌లో మెట్రోస్టేషన్లు, కారిడార్‌ ప్రాంతాలను మెట్రో సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెట్రోరైలు అధికారులు చెప్పారు.

* అదే విధంగా ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులను ఆయా రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహనతో నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చిన కేంద్రం. 
* సిటీ బస్సులకు సంబంధించి రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చు.
* బస్‌ డిపోలు, రైల్వే స్టేషన్లలో క్యాంటిన్లు తెరువొద్దని సూచన.

4వ విడత లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలు:
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగింపు
* కంటైన్మెంట్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లపై నిర్థయాధికారం రాష్ట్రాలకే అప్పగింత.
* కరోనా హాట్‌ స్పాట్స్‌ కేంద్రాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశం. 
* కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి.
* అంతర్రాష్ట బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు.
* 65ఏళ్లు దాటినవారు, గర్బిణిలు, పదేళ్ల లోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని కేంద్రం సూచన. 
* కాలేజీలు, స్కూళ్లకు మే 31వరకు అనుమతి లేదు
* సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసివేత కొనసాగింపు
* హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం
* రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు

* మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్‌
* దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్‌
* స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, మే 31వరకు బంద్‌
* ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం
* భౌతిక దూరం పాటిస్తూ అంత్యక్రియలకు 20 మందికి, పెళ్లిళ్లకు 50మందికి మాత్రమే అనుమతి
* అన్ని రాష్ట్రాల మధ్య వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రయాణానికి అనుమతి
* బార్బర్‌ షాపులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఓపెన్‌ చేసేందుకు అనుమతి
* ఆహార పదార్థాలను హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి 

Read Here>> రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? 

Categories
71715 71750

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? 

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం (మే 19) నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడపాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్ డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ చేపట్టిన ప్రభుత్వం మార్చి నాలుగోవారం నుంచి బస్సులను నిలిపి వేసింది. కేంద్రం వెసులుబాటు కల్పించడంతో మంగళవారం నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీ వర్గాలకు ఆదివారమే సమాచారమిచ్చినట్టు తెలిసింది. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి మంత్రిమండలి సమావేశంలో నివేదిస్తారని తెలిసింది. సమగ్రంగా మంత్రిమండలి చర్చించి, రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. 50 శాతం బస్సులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులున్నా వైరస్ వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం ఇప్పటివరకూ నడపేందుకు వెనుకాడింది. 

రాష్ట్రంలో ఆరెంజ్, గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే భావిస్తోంది. కంటెయిన్ మెంటు జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిచే బస్సు సేవలు, పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది. కేంద్రమిచ్చిన ఇతర సడలింపులనూ పరిశీలించే అవకాశం ఉంది.

ప్రధానంగా కంటెయిన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల నిర్ణయాధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే ఇచ్చింది. దీనిపై కూడా కేబినెట్ చర్చించనుంది. స్టేడియాలు, సెల్ఫోన్ షాపులు, సెలూన్లను అనుమతించాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో మే 29 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మే 31 వరకు పొడిగించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంది. 

Read Here>> గ్రేటర్ ఆర్టీసీ రెడీ..ప్రధాన రూట్లలోనే బస్సులు!

Categories
71715 71750

బారికేడ్లు తీసి డబీర్ పురా Flyover తెరిచిన MIM ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా వ్యాపిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా GHMC పరిధిలో కేసులు అధికంగా నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్ మెంట్ ప్రాంతంగా ప్రకటించి…నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. బారికేడ్లను తొలగించి డబీర్ పురా ఫ్లై ఓవర్ ఓపెన్ చేసిన MIM ఎమ్మెల్యే బలాల అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్ లలో కేసులు అధికమౌతున్నాయి. 4 జోన్లను కంటైన్ మెంట్లుగా ప్రకటించి..నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. AIMIM పార్టీకి చెందిన ఇతరులు లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదన్నారు. కానీ బారికేడ్లను తొలగింపు విషయంలో ఏసీపీ నుంచి అనుమతి తీసుకున్నారని డబీర్ పురా పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. 

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం పోరాడుతోందని, మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిలో AIMIM పార్టీకి చెందిన వారున్నారని రాజాసింగ్ వెల్లడించారు. పోలీసులను, వైద్యులను బెదిరిస్తున్నారన్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. 

తెలంగాణలో 1, 414 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34 మంది చనిపోయారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ 2020, మే 17తో ముగియనుండగా..తెలంగాణలో మాత్రం మే 29వ తేదీ వరకు నిబంధనలు అమల్లో కొనసాగనున్నాయి. సడలింపులు, ఇతరత్రా విషయాలపై మే 15వ తేదీన కేబినెట్ సమావేశంలో చర్చించి..మే 17న వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 

 

Read Here>>  13 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిపిన TikTok

Categories
71750

13 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిపిన TikTok

మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి టిక్ టాక్ యాప్ సాయంతో కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం సమీపంలోని పెద్ద తండాకు చెందిన రాత్లావత్ ఛాత్రు 13ఏళ్ల కిందట మక్తల్ మండలంలోని గుడిగండ్లకు వచ్చారు. మానసిక్ పరస్థితి సరిగా లేకపోవడంతో ఆలయాలు, పాఠవాళ వద్ద ఉండేవారు. 

ధాత్రు స్థితిగతులపై గ్రామానికి చెందిన మ్యాకలి రామంజనేయులు మే14న టిక్ టాక్ లో వీడియో పోస్టు చేశారు. దీన్ని బిజినేపల్లి మండలానికి చెందిన శంకర్ చూసి ఛాత్రు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. శుక్రవారం వారు గుడిగండ్లకు చేరుకోగా.. భార్య, కుమార్తె, తల్లిని చూసి ఛాత్రు భావోద్వేగానికి గురయ్యారు. స్థానికులు, కానిస్టేబుల్ కతలప్ప సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. 

Read Here>> తెలంగాణను వీడని కరోనా : కొత్త కేసులు 40

Categories
71715 71750

హైదరాబాద్ లో లాక్‌డౌన్ కఠినంగా అమలు..

కరోనా, లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ (మే 15, 2020) హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోపై ప్రధాన చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లు హాజరు అయ్యారు. కరోనా కట్టడికి అనుసంరించాల్సిన వ్యూహంపై అధికారులతో సమీక్షిస్తున్నారు. గ్రేటర్ లో కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉంది. 

గత వారం రోజులుగా నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వలస కూలీల్లో కూడా పాజిటివ్ కేసులు వస్తున్నా… వాటిలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలో కరోనా కట్టడికి మరింత పకడ్బంది చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వారం, పది రోజుల క్రితం తగ్గిన కేసులు ఆ తర్వాత పెరుగడం మొదలైంది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు. 
 
గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని మరిన్ని కేసులు ఎక్కువ అవుతుండటంతో ఆ ప్రాంతాలను ప్రత్యేక కంటైన్ మెంట్ జోన్లుగా గుర్తించి ఆ ప్రాంతంలో మరిన్ని కఠిన చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించకుండా, ఎవరిని బయటకు వెళ్లనివ్వకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Read Here>> రోజుకు 3 పరీక్షలు.. తెలంగాణలో డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహణకు కసరత్తు

Categories
71684 71715 71750

పెళ్లి పేరుతో ఆన్ లైన్ లో ఘరానా మోసం, రూ.12 లక్షలు పొగొట్టుకున్న యువతి

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. కొంతమంది అమాయకులు వారి ఉచ్చులో పడి అడ్డంగా మోసపోతున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, అప్రమత్తంగా ఉండాలని నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మన కక్కుర్తి కేటుగాళ్లకు వరంగా మారుతోంది. వరుసగా ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ ఆన్ లైన్ మోసం హైదరాబాద్ లో వెలుగుచూసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి ఓ యువతి నుంచి రూ.12 లక్షలు నొక్కేశాడు కేటుగాడు.

మ్యాట్రిమోనీ సైట్ ద్వారా యువతి వివరాలు సేకరణ:
బోరబండలో నివాసం ఉండే యువతికి ఆన్ లైన్ ద్వారా హ్యారీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఓ మ్యాట్రిమోనీ సైట్ లో యువతి వివరాలు చూసి ఆమెను సంప్రదించాడు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. అలా అలా పరిచయం పెరిగింది. ఆ తర్వాత లవ్ లో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని హ్యారీ ప్రపోజ్ చేశాడు. దానికి యువతి కూడా అంగీకరించింది.

కాస్ట్లీ గిఫ్ట్ పేరుతో మోసం:
ఓ రోజు గిఫ్ట్ పంపిస్తున్నానని యువతికి ఫోన్ చేశాడు హ్యారీ. బంగారు గొలుసు, బంగారు వాచి, నెక్లెస్ ఫొటోలను యువతికి ఫోన్ కి వాట్సాప్ చేశాడు. ఆ మరుసటి రోజు కొరియర్ ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీకు ఖరీదైన నగలు వచ్చాయి, వాటిని పొందాలంటే కస్టమ్స్ డ్యూటీ కింద రూ.12 లక్షలు చెల్లించాలని అన్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదని.. ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేస్తే సరిపోతుందని కూడా చెప్పాడు.

ఆన్ లైన్ లో రూ.12లక్షలు పంపిన యువతి:
ఖరీదైన వస్తువులు వస్తున్నాయని నమ్మేసిన యువతి ఏమీ ఆలోచించ లేదు. వెంటనే ఆన్ లైన్ లో చెప్పిన అకౌంట్ కు దశలవారీగా రూ.12 లక్షలు ట్రాన్సఫర్ చేసింది. అంతే.. ఆ తర్వాత ఎన్ని రోజులైనా గిఫ్ట్ రాలేదు. హ్యారీ ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయింది. దీంతో తను మోసపోయానని గ్రహించిన యువతి లబోదిబోమంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, గడిచిన వారం రోజుల్లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఇలానే ఆన్ లైన్ మోసాలకు బలయ్యారు. కేటుగాళ్లు ఆన్ లైన్ ద్వారా రూ.30 లక్షల వరకు దోచుకున్నారు.

మద్యం అమ్మకాల పేరుతో ఆన్ లైన్ చీటింగ్:
‌లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేయటంతో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. క్యూఆర్‌ కోడ్‌, లేదా లింక్‌ పంపటం దానికి నగదు పంపిన వెంటనే మీ ఆర్డర్‌ మీ ఇంటి ముందుకే ఉంటుంది అంటూ సైబర్‌ నేరగాళ్లు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ముందుగా, కొంత మొత్తం చెల్లిస్తే మిగిలిన సొమ్ము ఆర్డర్‌ డెలివరీ సమయంలో ఇస్తే సరిపోతుంది అంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో ప్రకటనలు చూసి ఆకర్షణకు గురైన వారు, ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్ చేసి మోసపోయారు.

రూ.51వేలు పొగొట్టుకున్న మందుబాబు:
హైద‌రాబాద్ లోని ఫేమ‌స్ బగ్గా వైన్స్ పేరుతో.. క్యూ ఆర్ కోడ్ పంపించి.. దానికి అమౌంట్ పంపిస్తే అర గంటలో మందు మీ ఇంటికి పంపిస్తామంటూ మెసేజ్ లు పంపారు మోసగాళ్ళు. ఈ మెసేజ్ ను న‌మ్మిన‌ గౌలిపురాకి చెందిన రాహుల్ ఆన్ లైన్ లో రూ.51 వేలు ట్రాన్సఫ‌ర్ చేశాడు. మద్యం ఇంటికి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

రూ.30వేలు పొగొట్టుకున్న మందు ప్రియుడు:
ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం కోసం వెతికాడు. ఆ వ్యక్తికి ఆన్‌లైన్‌లో ఓ ఫోన్‌ నెంబర్‌ లభించటంతో ఆ నెంబర్‌ కు కాల్ చేసి మద్యం కావాలన్నాడు. అవతలి వ్యక్తి ఆన్ లైన్ లో నగదు చెల్లిస్తే వెంటనే మీకు మద్యం అందుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి మోసగాడు చెప్పిన అకౌంట్‌ కు రూ.30వేలు ట్రాన్సఫర్ చేశాడు. అయితే ఎంతకీ తను చేసిన ఆర్డర్‌ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో, మీ అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష అని పోలీసులు చెబుతున్నారు.

Read Here>>లాక్ డౌన్ లో పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య.. నెల రోజుల్లో ప్రేమజంటకు ఏం జరిగింది