Categories
71744 71757

తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే

తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే  శాంతి వచనాలు చెప్పే చర్చి ఫాదర్ చేతిలో గన్ పెట్టుకుని కనిపించారు. లోక రక్షకుడు..కరుణామయుడు బిడ్డ అయిన చర్చి ఫాదర్ చేతిలో గన్ కనిపించటం కాస్తంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదూ. చేతిలో గన్ ఉందని ఆ ఫాదర్ నక్సలైటూ కాదు  టెర్రరిస్టు అంతకంటే కాదు. ఎందుకో తెలిస్తే..హల్లెలూయా ఫాదర్ ను అపార్థం చేస్తుకున్నాం అంటూ నవ్వుకుంటాం..ఆ విశేషమేంటో చూద్దాం..

దూరం దూరం. ఇప్పుడు ప్రపంచమంతా అదే మంత్రం. కారణం. కరోనా. దూరం పాటించకపోతే కరోనా కాటేస్తుంది. కాబట్టి దూరం పాటించక తప్పదు. అదొక్కటే మందు అంటున్నారు శాస్త్రవేత్తలు సైతం. ఈ కరోనా కాలంలో చర్చి ఫాదర్ ఏసు విశ్వాసులపై పవిత్రజలం చిలకరించాలంటే వారి దగ్గరకు వెళ్లాల్సిందే.  అలా వెళ్లకుండా దూరం నుంచి పవిత్రజలం విశ్వాసులపై చల్లటానికి  తుపాకీ మంత్రాన్ని కనిపెట్టారు ఈ ఫాదర్. 

అమెరికాలోని డెట్రాయిట్ లో నీటిని పిచికారీ చేసే తుపాకీతో పవిత్ర జలాన్ని చిలకరిస్తున్న ఫాదర్ టిమ్ పెల్క్ అనే 70 ఏళ్ల  ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ట్విట్టర్ లో ఈ పొటో 5.6 లక్షల లైకులు, లక్షకు పైగా రీట్వీట్లు  వచ్చాయి. ఓ డాక్టరుతో చర్చించిన తర్వాత ఈ తుపాకీ ఐడియా వచ్చిందని..దీనివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు అని డాక్టరుతో నిర్ధారించుకున్న తర్వాతనే అమలు చేసినట్లు చెప్పారు ఫాదర్ టిమ్ పెల్క్.

Read: పానీపూరి కోసం టీవీ ముందు నిలబడి అడుక్కుంటున్న బిగ్‌బాస్ భామ: ఏం పాట్లురా బాబూ..

Categories
71721 71757

పానీపూరి కోసం టీవీ ముందు నిలబడి అడుక్కుంటున్న బిగ్‌బాస్ భామ: ఏం పాట్లురా బాబూ..

బిగ్ బాస్-3 నటి హిమజ తన స్మార్ట్ టీవీ ముందు నిలబడి.. టీవీలో పానీపూరి బండివాడిని పిలుస్తూ తనకు కూడా పానీపూరి వేయమని అభ్యర్థిస్తోంది. కాదు కాదు ఆ అడిగే తీరు చూస్తే..దాదాపు అడుక్కుంటోందో అన్నట్లుగా ఉంది. ఈ వీడియో చూసే ముందు ఆ సంగతులేంటో తెలుసుకుందాం..

పానీ పూరి పేరు చెబితే చాలు నోట్లో నీళ్లు ఊరిపోతాయి. పానీ పూరి కావాలంటే పానీ పూరి బండి దగ్గరకెళ్లాలి. కానీ  టీవీ ముందు నిలబడి..ప్లీజ్..నాకూ పానీ పూరి ఇవ్వవా? అంటూ బండి అబ్బాయిని  అడిగితే ఎలా ఉంటుంది? ఇదేంటీ..ఎంత స్మార్ట్ టీవీ అయితే మాత్రం పానీపూరీలను ఇస్తుందా ఏమిటీ? ఇది మరీ చోద్యంగా ఉంది అని అనిపిస్తోంది కదూ..మరి బిగ్ బాస్ సీజన్-3లో వచ్చిన నటి హిమజ ఏంటీ.. తన స్మార్ట్ టీవీ ముందు ఓ బౌల్ తో  నిలబడి ‘‘ప్లీజ్..పానీ పూరీ బండి అబ్బాయ్..నాక్కూడా పానీ పూరీ  ఇవ్వవా..ఆకలేస్తోంది’ అంటూ  అడుగుతోంది.

కాదు కాదు అలా అడుగుతున్న తీరు చూస్తే అడుడుక్కుంటున్న లెవల్ కి పడిపోయినట్లుగా ఉంది…ఈ సిత్రం ఏటో మీరు లుక్కేయండి..తన ఇన్ స్టాగ్రామ్ లో హిమజ షేర్ చేసిన ఈ వీడియో ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టేసుకుంటోంది. కాగా..కరోనా కల్లోలంతో పానీపూరీ షాప్స్ పూర్తిగా బంద్ అయిపొయినా..బిగ్ బాస్ ఫేమ్ హిమజ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#cravings #panipuri #food #hungry #tiktokindia #telugutiktok #funny #fun #smile #teluguactress

A post shared by Himaja Mallireddy (@itshimaja) on

Read :  సంఘవి కూతురు ఫొటో వైరల్

Categories
71723 71757

గిటార్ వాయిస్తూ..పాట పాడి వలస కూలీలకు సెండాఫ్ ఇచ్చిన పోలీస్

లాక్ డౌన్ దెబ్బకు వలస కూలీలు తమ తమ సొంత గ్రామాలకు కాలి నడకలే బయలుదేరారు. వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నా ఏమాత్రంలెక్క చేయటంలేదు. కాళ్లుబొబ్బలెక్కుతున్నా..వారం కాకపోతే నెలకు తమ ఊరు చేరుకోలేమా అనే స్థైర్యంతో మండు వేసవిలో ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా కాలినడకనే పయనం సాగిస్తున్న దారిలో ఎన్నో దీనగాథలు. మరెన్నో విషాదగాథలు.

అయినా వారి పయనం ఆపటకుండా సాగిస్తునే ఉన్నారు. అలా వారి వారి ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్నవారికి పోలీసులు ఆహారం నీళ్లను అందిస్తున్నారు. రైళ్ల మార్గం ద్వారావెళ్లే వారికి కూడా పోలీసులు తమదైన శైలిలో సెండాఫ్ ఇస్తున్నారు. అలా ఓ పోలీసులు రైళ్లలో వెళ్లే వలస కూలీలకు గిటార్ వాయిస్తు పాట పాడుతూ సెండాఫ్ ఇచ్చారు ఓ పోలీసు అధికారి.

వలస కూలీలను తీసుకుని జమ్ము కశ్మీర్ నుంచి శ్రామిక రైలు బయలుదేరింది. వారికి సెండాఫ్ ఇచ్చేందుకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మెడ్లీ రాక్ స్టార్ లా మారిపోయారు. ఓ గిటారు వాయిస్తు ‘గులాబీ ఆంఖేన్ ట్రాక్‌తో ప్రారంభించి, ఆపై ఖయామత్ సే ఖయామత్ తక్ నుండి పాపా కెహతే హై’ను పాడారు. జమ్ము పోలీస్ ఇచ్చిన ఫర్వార్మెన్స్ కు వలస కూలీలతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.

ముఖేష్ సింగ్ అనే ఓ పోలీసు అధికారి ఈ వీడియోను తన ట్విట్లర్ లో పోస్ట్ చేయటంతో పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ సొంత ఊర్లకు వెళ్లుతున్నవారిని అలరించేందుకు మోడ్లీ రాక్ స్టార్ లా మారటం నెటిజన్లను ఫిదా చేసింది. దీంతో ఈ వీడియోను వైరల్ చేశారు. 

Read Here>>  పెళ్లికొచ్చినా..పేరంటానికి వచ్చినా..క్వారంటైన్ కు తరలిస్తాం

Categories
71721 71757

దటీజ్ ఉపాసన: పేడ ఎత్తుతూ..కుడితి కలుపుతూ..లాక్ డౌన్ లో బిజీ బిజీ

ఉపాసన అంటేనే ఓ బ్రాండ్. కామినేనివారి ఆడబిడ్డ..మెగాస్టార్ కోడలు అనే పరిచయాలు ఏమాత్రం అవసరం లేని పేరు ఉపాసన. సోషల్ మీడియాను షేక్ చేసే ఉపాసనకు ఎప్పుడూ చక్కటి గుర్తింపు ఉంది. పర్యావరణ ప్రేమికురాలిగా.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే మహిళగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఉపాసన గురించి ఎప్పుడూ చెప్పుకున్నా..ఓ విశేషం ఉంటుంది. ఇప్పుడు కూడా అటువంటి విశేషమే ఉంది మరి..

కోట్లకు అధిపతి అయ్యుండి కూడా సాధారణ వ్యక్తిలా ఉండటం ఆమె ప్రత్యేకత. ఆవులకు గడ్డి వేస్తూ.. వాటికి కుడితి నీళ్లు కలుపుతూ.. పేడ ఎత్తుతూ కనిపించింది. తండ్రితో కలిసి సేంద్రీయ వ్యవసాయం చేయడం నేర్చుకుంటోంది.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన క్షణం నుంచి వైరల్ గా మారాయి. దటీజ్ ఉపాసన. 

అంతేకాదు గోబర్ గాళ్ విత్ డాడ్ అంటూ..వ్యవసాయం చేయడం నేర్చుకుంటున్నాని చెబుతోంది. లాక్‌డౌన్‌లో ఏమాత్రం ఖాళీగా ఉండకుండా కొత్తకొత్త పనులు నేర్చుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. వ్యవసాయం ఎలా చేయాలి..పశువుల్ని ఎలా చూసుకోవాలి.. వేస్టేజ్‌ను ఎలా తగ్గించాలి.. దాన్ని మళ్లీ ఎలా తిరిగి వాడుకోవాలి అనే వాటి గురించి తెలుసుకుంటోంది ఉపాసన.

Read Here >> రానా పెళ్లి ఎప్పుడంటే?: సురేష్ బాబు క్లారిటీ!

Categories
71706 71757

ATMల వద్ద ప్రజలపై దాడి చేసిన కోడి.. పోలీసుల గాలింపు చర్యలు

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏటీఎం వద్ద లైన్లో నిలబడి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న బ్యాంకు కస్టమర్లపై కోడి విరుచుకుపడింది. అక్కడున్న వారిని చెదరగొట్టడమే కాకుండా అక్కడున్న కార్లలో దూరేందుకు ప్రయత్నించింది. ఎర్ర రంగులో 18 అంగుళాల పొడవుతో, 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉన్నట్లు వాకర్ పోలీసులు తెలిపారు. 

అమెరికాలోని లూసియానాలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయి దాని ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం చేసిన దాడితో ప్రజలు ఆ ఏటీఎం పరిసర ప్రాంతాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. 

ఓ రాత్రి సమయంలో కోడి కనిపించిందని సమాచారం ఇచ్చిన క్షణాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే ఆ అగ్రెసివ్ కోడిని అదుపు చేయలేకపోవడంతో అది తుర్రుమంది. దాన్ని పట్టుకోవడంలో విసుగుచెందిన పోలీసులు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి కోడి జాడ తెలియడం లేదు. ఆచూకీ తెలిసిన వారు తెలియజేయగలరు అంటూ పోస్టు పెట్టారు. 

Read Here>>  కలర్ ఫుల్ మాస్క్‌లతో రెడీ అవుతోన్న ట్రికినీలు

Categories
71706 71757

కలర్ ఫుల్ మాస్క్‌లతో రెడీ అవుతోన్న ట్రికినీలు

గ్లామర్ ఆరబోతకు, సన్‌బాత్‌కు, సినిమాల్లో హాట్ హాట్ సాంగ్ లకూ బికినీలు కేరాఫ్ అడ్రస్. వయస్సుతో సంబంధం లేకుండా బికినీ సోకులు అంటే ఎవరైనా చెప్పేస్తారు. మరి ఈ ట్రికినీలు ఏంటో.. తెలుసా. అదేనండి మాస్క్ లు. బికినీతో పాటు మాస్క్ ఉంటే అది ట్రికినీ. కరోనా భయం ఎంత ముదిరిపోయిందంటే మాస్క్ లేకుండా బయటికి వెళ్తే కరోనా వచ్చేస్తుందేమో అనేంత. 

ఇక ఈ పరిస్థితుల్లో మాస్క్ లు సిద్ధం చేయకుండా ఉంటారా.. డ్రస్ కు మ్యాచ్ అయ్యే మాస్క్ లు రెడీ చేసుకుంటుంటే ఇటలీలో ఓ మోడల్ బికినీతో పాటు మ్యాచ్ అయ్యే మాస్క్ లు కట్టుకుని ఫోజులిస్తుంది. ఇలా ఉంటే కూల్/క్యూట్/ఫ్యాషన్ గా ఉంటామని చెప్పుకొస్తుంది. ఈ ఇటాలియన్ డిజైనర్ ఐడియా మన నేటివిటీకి మ్యాచ్ అవుతుందో లేదో గానీ, ఆమె ఐడియాపై ఓ లుక్కేద్దాం.

కరోనా సమయంలో బీచ్ లలో తిరగాలనే వారి కోసం సెంట్రల్ ఇటలీలోని ఎలెక్సా బీచ్ వేర్ యజమాని టిజియానా pandemic-proof(మహమ్మారి నుంచి కవచం)ను తయారుచేస్తుంది. కరోనా వైరస్ కారణంగా బయటకు వెళ్లకూడదని చెప్పడంతో ఆమె ఇంట్లో ఉండి ఈ వినూత్న ఐడియాతో రెడీ అయింది. 

ప్రపంచంలో కొద్ది చోట్ల నిబంధనలతో కూడిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా మనతోనే ఉంటుంది. కలిసి బతకాల్సి వస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు బీచ్ లలో ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ ట్రికినీలు వాడితే సరిపోతుందేమో.. సమ్మర్ కాబట్టి లాక్‌డౌన్ ఎత్తేస్తే తన ట్రికినీల ఐడియాతో మంచి గిరాకీ తెచ్చుకుంటానంటోంది ఈ డిజైనర్. 

పబ్లిసిటీ కోసం ఆమె వాటిని తయారుచేసి కూతుళ్లకు వేసింది. సోషల్ మీడియా పెట్టడంతో వైరల్ అయ్యాయి. అంతే ఆమె ట్రికినీలకు ఆర్డర్ల వెల్లువ మొదలైంది. లాక్ డౌన్ లో ఇంత బిజినెస్ జరుగుతుందని అనుకోలేదు. కలర్ మాస్క్ లు ఆర్డర్ ఇవ్వడంతో పాటు ట్రికినీలను సైతం తీసుకెళ్తున్నారు. ఇటలీలో ఇప్పటికే లాక్ డౌన్ తీసేశారు. 

Read Here>> Twitter ఉద్యోగులకు పర్మినెంట్‌గా Work from Home 

Categories
71723 71757

చేపల కోసం వలవేసి బుడతడికి కరెన్సీ నోట్ల కట్టలే కట్టలు పడ్డాయి!!

చేపలు పట్టటానికి వలతో చెరువుకు వెళ్లిన ఓ బుడతడికి వలలో చేపలకు బదులు కట్టలకు కట్టలు కరెన్సీ నోట్లు పడ్డాయి. అవన్నీ రూ.500, రూ.2వేల నోట్లు. వాటిని చూసిన ఆ బుడతడికి నోట మాట రాలేదు..ఆహా..ఏమి నా భాగ్యము..ఏమి నా అదృష్టం..ఈరోజుతో నా జీవితం మారిపోతుందనుకుని తెగ  సంబరపడిపోయాడు. కానీ సామెత చెప్పినట్లు చేతిదాకా వచ్చింది నోటికి అందనట్లుగా..రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమన్ శ్రీనివాస్ చెప్పినట్లుగా ‘అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు..దరిద్రం వచ్చి ఏదో చేసినట్లుగా అయిపోయింది పాపం ఆ బుడతడి పరిస్థితి.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆ అదృష్ట దురదృష్టాల బుడతడి కరెన్సీ కట్టలు కథా కమామీషు ఏంటో మీరూ తెలుసుకోండి..

 మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు పొద్దుపొద్దున్నే లేచి వల పట్టుకుని చేపలు పట్టటానికి చెరువుకు వెళ్లాడు. అలా చెరువులోకి వల విసిరాడు. తరువాత కొంతసేపటికి లాగాడు. వలలో  ఏదో చిక్కినట్లు బరువుగా అనిపించింది. ఎంతో సంబరపడిపోతూ వలను పైకి లాగాడు. అందులో చేపలు కాదు..కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. అంతే ఒక్కసారిగా కళ్లు చెదిరిపోయాయి. వెంటనే వలనుంచి బైటకు తీసాడు. అన్నీ రూ.500రూ.2వేల నోట్ల కట్టలు. నీటిలో తడిసిపోవటంతో వాటిని నేలపైన ఆరబెట్టాడు. తడి ఆరిపోవటంతో అదే సమయంలో గాలి వేయడంతో కొన్ని నోట్లు ఎగిరిపోయాయి. వెంటనే గబగబా నోట్లన్నింటినీ సంచిలో వేసుకుని ఇంటికి పరుగెట్టకుంటూ వెళ్లిపోయాడు. 

కానీ గాలికి ఎగిరిపోయిన నోట్లు అటుగా వచ్చిన స్థానికుల కళ్లబడ్డాయి. ఆనందంగా వాటిని చూసిన కొందరు వాటిని ఏరుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం అలా అలా క్షణాల్లో గ్రామం మొత్తం తెలిసిపోయింది. ఇంకేముంది…జనాలు పెద్ద ఎత్తున చెరువు దగ్గరకొచ్చి కంటపడిన నోట్లను ఏరుకోవటం మొదలుపెట్టారు.  

నోట్లు ఏరుకునే హడావిడిలో గ్రామస్తులు ఉంటే ఓ యువకుడు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే చెరువు దగ్గరకు వచ్చిన పోలీసులతో..సదరు యువకుడు తాను ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నప్పుడు గుర్తుతెలియని ఓ వ్యక్తి చెరువులో ఏదో పడేస్తూ కనిపించాడని..కానీ అతను ఏం పాడేస్తున్నాడనేది తాను చూడలేదన్నాడు. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి చెరువు వద్ద జనాలు నోట్ల కట్టలు ఏరుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ డబ్బులు తీసుకున్నవారంతా తిరిగి ఇచ్చేయాలని ఆర్డరేశారు. దీంతో అంతా తమకు దొరికిన నోట్లను పోలీసులకు తిరిగి ఇచ్చేశారు. అసలే కరోనా భయం వెంటాడుతుండటంతో ఆ నోట్లకు కరోనా వైరస్ ఉంటుందనే భయంతో ఎందుకొచ్చిన గోలరా బాబూ అనుకుంటూ భయపడి..వారికి దొరికిన నోట్లను పోలీసులకు ఇచ్చేశారు. 

అలా పోలీసులకు డబ్బుల కట్టలు వలలో పడ్డ  బాలుడి గురించి తెలిసింది. వెంటనే  బాలుడి ఇంటికెళ్లి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని చెరువులో ఆ నోట్లను పాడేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే, చెరువులో ఎంత మొత్తాన్ని పడేశాడనేది ఇంకా తెలియరాలేదు.  కరెన్సీ నోట్లు కనిపించాయి కదాని గబగబా ఏరేసుకున్నాం గానీ..కక్కుర్తి పడినందుకు నోట్లు సొంతం కాలేదు..పైగా తాము ఏరుకున్న నోట్లకు కరోనా వైరస్ ఉందేమో..ఉంటటే తమ పరిస్థితి ఏమిటని భయపడిపోతున్నారు ఆ గ్రామస్తులు.

Read Here>> మరో వారం ఇలానే ఉంటే కుటుంబాలు గడవని పరిస్థితి ఖాయం

Categories
71757

రోడ్డుపై ఉమ్మి వేసిన యువకుడు..చేత్తో కడిగించిన పోలీస్

కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. దీని కోసం ఎన్నో రూల్స్ పెట్టుకున్నాం. వాటిని ఆంక్షలు అనుకున్నా..ప్రజారోగ్యం కోసం పాటించటం అందరి బాధ్యత. కానీ బాధ్యత మరచి ఏమాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తించిన వ్యక్తికి బుద్ది వచ్చేలా చేసాడు ఓ పోలీస్ అధికారి. 

కరోనా వ్యాప్తి చెందకుండా..లాక్‌డౌన్  విధించాయి ప్రభుత్వాలు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. రోడ్లపైనే కాదు పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయకూడదు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదు. ఈ రూల్స్ అతిక్రమిస్తే ఫైన్లు కూడా వేస్తున్నారు. ఇది ప్రజారోగ్యం కోసం. 

ఈ క్రమంలో చండీఘర్‌లో టూవీలర్‌పై వెళుతున్న ఓ యువకుడు నడిరోడ్డుపై తుపుక్కున ఉమ్మి వేశాడు. తనను ఎవరూ గమనించడం లేదనుకున్నాడు. కానీ ఓ అధికారి చూడనే చూశాడు. వెంటనే అతన్ని ఆపాడు. ఫైన్ వేయలేదు. ఉమ్మి వేశావు కాబట్టి నీ చేత్తో నువ్వే కడుగు అంటూ ఓ వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఇక చేసేదేముంది? ఉమ్మి వేసి..చచ్చినట్లు తన చేత్తోనే కడగాల్సి వచ్చింది. ఓ వాహనదారుడికి చండీఘర్ ట్రాఫిక్ పోలీసులు విధించిన పనిష్మెంట్ ఇది. అంతేకాదు..ఇంకెప్పుడు ఇలా చేయను క్షమించండి అని చెప్పించాడు ఆ పోలీస్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Read Here>> యాక్టర్ కాదు..సబ్ ఇన్‌స్పెక్టర్ : లాక్‌డౌన్ వేళ కార్లపై స్టంట్

Categories
71715 71723 71757

కరోనా కట్టడికి పాల వ్యాపారి భౌతిక దూరం ఐడియా అదుర్స్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలీదు. కాగా, వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారిని ఏమీ చెయ్యలేదు. అప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. కచ్చితంగా అందరూ మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, డాక్టర్లు చెబుతున్నారు. కరోనా కట్టడికి ముందు జాగ్రత్త తప్ప మరో మార్గం లేదంటున్నారు.

ఈ క్రమంలో తమకు తాము రక్షణ కల్పించుకుంటూ.. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. కాగా, కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఓ పాల వ్యాపారి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాడు. ఇందుకోసం అతడు వేసిన ఐడియా అదుర్స్ అని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ ఆ పాల వ్యాపారి ఏం చేశాడో తెలుసా, తన పాల బండికి పైపును అమర్చాడు. దాని ద్వారా పాలు విక్రయిస్తున్నాడు. పాలు పోయించుకునే వారు దగ్గరికి రావాల్సిన పని లేదు. పైపు దగ్గర గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. పాల వ్యాపారి పైపులో పాలు పోస్తాడు. ఇటువైపు గిన్నెలో పట్టుకోవాలి. పాల వ్యాపారి మాస్కుతో హెల్మెట్‌ ధరించాడు. చేతులకు గ్లౌస్‌లు ధరించి తన వ్యాపారం కొనసాగిస్తున్నాడు.

ఈ దృశ్యాన్ని అహ్మదాబాద్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ నితిన్‌ సంగ్వాన్‌ చిత్రీకరించి ట్వీట్‌ చేశారు. కొంత మంది తమకు తామే రక్షణ కల్పించుకుంటూ.. ఇతరులకు కూడా రక్షణగా నిలుస్తున్నారని ట్వీట్‌లో ఐఏఎస్‌ అధికారి తెలిపారు. మీరు పాల వ్యాపారిలా వినూత్న ఆలోచనలు చేయలేకపోయినా సరే.. కనీసం ఇంట్లోనైనా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండని ఆ అధికారి సూచించారు. కాగా, పాల వ్యాపారి ఐడియాను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వాటాన్ ఐడియా సర్ జీ అని కితాబిస్తున్నారు.

Read Here>>  పార్క్ లో విచిత్రం : మంటలు వ్యాప్తిస్తున్నా కాలిపోని చెట్లు,గడ్డి,బెంచీలు

Categories
71715 71721 71757

దిల్ రాజుకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పిన కుమార్తె హన్షిత

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు నిజామాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తేజస్వినితో దిల్ రాజు పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు కుమార్తె  హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తండ్రి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. 

నన్ను సంరక్షించడంతో పాటు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు అని ఆమె పోస్ట్‌లో విషెస్ తెలిపారు. 

దిల్  రాజు భార్య అనిత 2017లో అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ట్విటర్‌లో దిల్ రాజుకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. #Dilraju అనే హ్యాష్ ట్యాగ్  ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.

Read Here >> లాక్‌డౌన్‌లో.. దిల్ రాజు రెండో పెళ్లి.. పెళ్లి కూతుర్ని చూశారా?