Categories
Andhra Pradesh Political

ఏపీలో జిల్లాల విభజన సాధ్యమేనా? జగన్ సర్కార్ వ్యూహం ఇదేనా?

ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ చాలా హామీలిచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తానిచ్చిన హామీల్లో ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరో హామీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా… వాటిని పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 జిల్లాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది ప్రభుత్వం. నిజానికి జిల్లాల విభజన అనేది అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులోనూ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాను చేయడం ఇంకా కష్టంతో కూడుకున్న పని. రాజకీయంగా, సామాజికంగా, భౌగోళికంగా, పాలనాపరంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే విభజన చేయాల్సి ఉంటుంది.

జగన్‌ ఇచ్చిన హామీ మేరకు పార్లమెంటు నియోజకవర్గం ప్రకారం జిల్లాను ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బందులే ఎదురవుతాయి. ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండే పరిస్థితులుంటాయి. అలాంటప్పుడు దానిని జిల్లాగా మార్చాలంటే పాత జిల్లా నేతలు రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా అంగీకరించకపోవచ్చు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి. వాటిలో కొన్ని సెగ్మెంట్లు వేరే జిల్లాలో ఉండొచ్చు.

అప్పుడు పాతుకుపోయిన లీడర్లకు అది ఇబ్బంది. అంతేనా, ప్రజలు కూడా ఒప్పుకోకపోవచ్చు. ఉదాహరణకు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్నే తీసుకుంటే… ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉంది. అంటే జిల్లా కేంద్రానికి ఇటు పక్క ఇతర ప్రాంతాలుండవు. అటు ఇచ్ఛాపురం.. ఇటు శ్రీకాకుళం రెండూ… చివరి ప్రాంతాలే. ఇలాంటి సమస్యలు చాలానే ఉంటాయని అంటున్నారు.

జిల్లాలను ఎలా విభజిస్తే మంచిదనే.. :
ఇప్పుడిప్పుడే ఈ విషయంలో నేతలు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా శ్రీకాకుళానికి చెందిన సీనియర్‌ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు దీనిపై తొలిసారిగా మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల విభజన సాగాలని సూచించారు. దీనిపై ఎమ్మెల్యేలంతా కలసి జగన్‌తో మాట్లాడతామని అన్నారు.

ఒక విధంగా జిల్లాల విభజన తీరుపై అనుమానాలు మొదలైనట్టేనని అంటున్నారు. ఎందుకంటే భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా జిల్లాలను విభజిస్తే మంచిందనే అభిప్రాయాలున్నాయి. ధర్మాన ప్రసాదరావు బయటపడ్డారు. ఇంకా ఈ విషయంలో అలాంటి అభిప్రాయాలే ఉన్నప్పటికీ బయటకు చెప్పని నేతలు చాలా మందే ఉన్నారంటున్నారు.

ప్లాన్ ప్రకారమే జగన్ ముందకు :
జిల్లాల విభజన విషయంలో తెలంగాణలో ఎదురైన ఇబ్బందులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగితే.. కొందరు తమకు ప్రత్యేక జిల్లా కావాలంటూ రోడ్లెక్కారు. అలాంటి పరిస్థితులే భవిష్యత్తులో ఏపీలో కూడా ఎదురు కావచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

మండలాలు మారితేనే ఒప్పుకోరు. అలాంటిది సొంత నియోజకవర్గం వేరే జిల్లాలోకి మారితే నేతలు ఒప్పుకొంటారా? కష్టమే. కాకపోతే ఈ విషయంలో జగన్‌కు ఫుల్‌ క్లారిటీ  ఉంది. ప్లాన్‌ ప్రకారమే ఆయన ముందుకెళ్తారని, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం కూడా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Categories
Andhra Pradesh

పెన్నానదిలో జేసీబీతో కరోనా మృతదేహాలు ఖననంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

నెల్లూరు జిల్లాలోని పెన్నానదిలో కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జేసీబీలతో పెన్నానదిలో గుంతలు తీసి మృతదేహాలను వైద్య సిబ్బంది పూడ్చివేసిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఆర్డీవో హుస్సేన్ సాహిద్ స్పందించారు.

కరోనా మృతదేహాలకు తీసుకువచ్చిన జేసీబీలతో పెన్నానదిలో పూడ్చివేయటం విచారకరమన్నారు. ఈ విషయంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారని విచారణాధికారిగా నన్నునియమించారని దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తానని తెలిపారు. ఇకపై ఇలా జరకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా..ఈ ఘటనపై మాజీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ..ఇటువంటి ఘటనలు దారుణమని కరోనా చనిపోయినంత మాత్రాన మృతదేహాలను ఇలా దారుణం నదిలో జేసీబీలతో ఖననం చేయటమేంటని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు తరచు ఏపీలో జరుగుతున్నాయని కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటిదే జరిగిందని ఇటువంటి ఘటనలకుసీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలు ఖననం చేసే విషయంలో పలు దారుణాలు జరుగుతున్నాయి. కరోనా మృతదేహాలను గుంతల్లో పడేయటం..పొల్లాల్లో ఊడ్చుకెళ్లటం వంటివి చూశాం. ఇప్పుడు ఏపీలోని నెల్లూరుజిల్లాలో జరగటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Here>>కరోనా వచ్చిందని భయంతో ఆత్మహత్య..

Categories
Andhra Pradesh

కరోనా వచ్చిందనే భయంతో ..పోలీసుల్ని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి : రోగంకంటే భయం మా చెడ్డది

కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్ని విచక్షణ లేకుండా ప్రవర్తించేలా చేస్తోంది. కరోనా సోకిందని కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు తమకు కరోనా వచ్చిందనే భయం..తనవల్ల అది తమ వారికి కూడా వచ్చేస్తుంది అనే భయంతో ఇంటినుంచి పారిపోతున్నారు. అటువంటి ఘటన ఆంధ్రప్రదేశల్ లోని కృష్ణాజిల్లాలోని విజయవాడలో జరిగింది.

విజయవాడలో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తికి జ్వరం వచ్చింది. దాంతో అతను తనకు కరోనా వచ్చిందనే భయంతో ఇంటి నుంచి గబగబా ఓ ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాడు.కానీ వాళ్లు పట్టించుకోలేదు. అక్కడ నుంచి కోవిడ్ పరీక్షలు చేసే సెంటర్ కు వెళ్లాడు. దీంతో శ్రీనివాస్ కు డాక్టర్లు కోవిడ్ పరీక్షలు చేయటానికి నమూనాలను తీసుకున్నారు. రిపోర్ట్స్ రావటానికి కొన్ని రోజులు పడతాయనీ..చెప్పారు. కానీ శ్రీనివాస్ భయపడ్డాడు. తనకు పాజిటివ్ వస్తే..ఎలా..అది తన ఇంటిలోవారికి కూడా వచ్చేస్తుందేమోనని ఎంతగానో భయపడ్డాడు. అలా జరక్కూడదనే ఉద్ధేశ్యంతో జులై4న ఇంటినుంచి పారిపోయాడు.

దీంతో శ్రీనివాస్ భార్య తన భర్త కనిపించట్లేదంటూ విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారంరోజుల నుంచి శ్రీనివాస్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈక్రమంలో శ్రీనివాస్ రావు పరీక్షలకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా రోగం కంటే భయం మాచెడ్డది. ఆ భయంతోనే శ్రీనివాస్ ఇంటినుంచి పారిపోయాడు. తన కుటుంబానికి దూరంగా ఉండిపోయాడు. కాగా..కరోనా వచ్చిందనే భయంతో పరీక్షలు చేయించుకుని ఆ రిపోర్ట్ కాకుండానే కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపేశాడు. ఇలా భయంతోనే చాలామంది ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

Read Here>>బతికుండగానే చనిపోయాడని చెప్పిన కార్పోరేట్ ఆస్పత్రి

Categories
Andhra Pradesh Uncategorized

పెన్నానదిలో కరోనా మృతదేహాలు ఖననం : నెల్లూరు జిల్లాలో దారుణం

కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలు ఖననం చేసే విషయంలో పలు దారుణాలు జరుగుతున్నాయి. కరోనా మృతదేహాలను గుంతల్లో పడేయటం..పొల్లాల్లో ఊడ్చుకెళ్లటం వంటివి చూశాం. ఇప్పుడు ఏపీలోని నెల్లూరుజిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారికి గురై చనిపోయినవారి శవాలను ఏకంగా నదిలో ఖననంచేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని పెన్నానదిలో కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జేసీబీలతో పెన్నానదిలో గుంతలు తీసి మృతదేహాలను వైద్య సిబ్బంది పూడ్చివేశారు. మృతదేహాలను పెన్నానదిలో పూడ్చిపెట్టం గురించి తెలిసిన స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read Here>>దేశంలో తొలిసారి ఒకే రోజులో 25 వేలకు పైగా కరోనా కేసులు

Categories
Andhra Pradesh

అనంత తాడిపత్రి : త్రైత సిద్ధాంతకర్త స్వామి ప్రబోధానంద కన్నుమూత

అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ప్రభోదానంద అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. ప్రభోదానంద ఆత్మజ్ఞానం పేరుతో అనేక ప్రబోధానంద అనేక రచనలు చేశారు. గతంలో హిందూ, ముస్లిం దేవుళ్లపై ప్రబోధానం చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకుదారి తీశాయి.

కాగా..అనంతపురం నేత జేసీ వర్గీయులకు ప్రభోదానంద వర్గీయులకు వివాదాలు కొనసాగిన క్రమంలోతాడిపత్రి ఉద్రిక్తతగా మారింది. జేసీ వర్గీయులు, ప్రబోధానంద శిష్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కారణంగా ఆయన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కాగా తాను చనిపోయే ముందే ప్రబోధానంద తన ఆశ్రమంలో సమాధి కట్టించుకోవటం విశేషం.

1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ప్రభోదానంద జన్మించారు. ప్రభోదానంద అసలు పేరు పెద్దన్న చౌదరి. భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా కూడా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేశారు. డాక్టర్ గా పనిచేస్తూనే ఆయుర్వేదంపై పుస్తకం రాశారు.

ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపై కూడా గ్రంథాలను రచించారు. అనంతరం ఆధ్యాత్మిక గురువుగా మారి..తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నిర్మించారు.

త్రైత సిద్ధాంతాన్ని బోధించే ప్రభోదానం భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేననేదే ఆయన సిద్ధాంతం. ప్రబోధానంద మరణవార్తతో ఆయన భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇక ప్రబోధానంద అంత్యక్రియలు రేపు తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమంలో తన మరణానికి ముందే నిర్మించుకున్న సమాధిలోనే జరుతాయి.

Categories
Andhra Pradesh Political

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు : బాగా ముదిరిపోయింది
ఏపీలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను మాటలతో కించపరుస్తున్నారంటూ శ్రీనివాస్ ఎంపీపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడార‌ని ఫిర్యాదులో తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎంపీ రగురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారనీ..తన పరువు ప్రతిష్టలకు నష్టం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భీమవరం పోలీస్‌స్టేష‌న్‌తో పాటు.. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీ‌నివాస్‌.

కాగా..సొంత పార్టీ నేత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన విసయం తెలిసిందే. దానిపై ఆయన స‌రైన స‌మాధానం ఇవ్వ‌క‌పోడం.. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డం..వైసీపీ నేత‌ల‌పైనే ఫిర్యాదు చేయ‌డం వంటి పలు ప‌రిణామాల‌తో..ఆయ‌న‌పై స్వపక్ష నేతలతో పాటు సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయనపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Categories
Andhra Pradesh

సున్నా వడ్డీ ప్రయోజనం ఇక నుంచి నేరుగా రైతులకే

వైయస్సార్‌ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ రైతులకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వివిధ జిల్లాలలోని రైతులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. మంత్రులు కె.కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ప్రతినిధులు హాజరు .కాగా, ఢిల్లీ నుంచి మత్స్య శాఖ కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

రూ.1200 కోట్ల విద్యుత్‌ బిల్లుల రద్దు
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ఒక మనిషి నిజంగా రైతుల గురించి ఆలోచించి, వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడా అని చూసి ఆ గౌరవ మర్యాదలు ఇస్తారని, రైతుల పట్ల మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే నాన్నగారి పేరు గొప్పగా కనిపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారన్న ముఖ్యమంత్రి, 2004లో వైయస్సార్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1200 కోట్ల విద్యుత్‌ బిల్లుల రద్దుతో పాటు, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే ఫైలు మీద తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. దీని వల్ల రైతులకు ఏటా రూ.50 వేల ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. ‘సాధారణంగా రైతులు 7.5 హెచ్‌పీ మోటరు వాడతారు. అంటే దాదాపు 5 కిలోవాట్‌ మోటరు. అంటే గంటకు 5 యూనిట్లు. రోజుకు 7 నుంచి 9 గంటలు వేసుకున్నా రోజుకు 35 నుంచి 45 యూనిట్లు. ఏటా కనీసం 150 రోజులు లెక్క వేసుకుంటే.. ఇవాళ మనకు యూనిట్‌ విద్యుత్‌కు రూ.6.87 చొపున లెక్కిస్తే, రైతులకు ఏటా రూ.50 వేలు మేలు జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం నాన్నగారు తీసుకున్న నిర్ణయం’ అని సీఎం జగన్‌ వివరించారు.

ఉచిత విద్యుత్‌ అమలు చేసి చూపిన వైయస్సార్‌
2004 ఎన్నికల ముందు రైతులకు ఉచిత విద్యుత్‌ అంటే చంద్రబాబు చులకన చేశారని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, బట్టలు ఆరేసుకోవడానికి తప్ప విద్యుత్‌ తీగలు పనికి రావన్నారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత దాన్ని నాడు వైయస్సార్‌ అమలు చేసి చూపారని, ఇవాళ్టికి రైతుల జీవితాల్లో గుర్తుండిపోయే ఘట్టం అది అని చెప్పారు. ఒక్క ఉచిత విద్యుత్‌ మాత్రమే కాకుండా, ఆరోగ్యశ్రీ. 108, 104 సర్వీసులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌. జలయజ్ఞం అన్నీ గుర్తుకు వస్తాయని చెప్పారు. ఈ ప్రభుత్వం ఏమేం చేసింది తమ ప్రభుత్వం కూడా రైతుల కోసం చాలా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిందని సీఎం జగన్‌ వెల్లడించారు.

రూ.1150 కోట్ల వడ్డీ బకాయిల చెల్లింపు
రైతుల సకాలంలో వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లిస్తే, వారికి వడ్డీ వేయకూడదని, కానీ గత ప్రభుత్వం ఆ కార్యక్రమానికి గ్రహణం పట్టించిందని, దాదాపు 57 లక్షల రైతులకు రూ.1150 కోట్లు బకాయి పెట్టిందని సీఎం తెలిపారు. ఆ బాధ్యతను గత ప్రభుత్వం మర్చిపోయిందన్న ఆయన, ఇప్పుడు ఆ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వం చెల్లిస్తోందని, రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని చెప్పారు. ‘రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. రైతులను మోసం చేసింది. ఇప్పుడు మేము వాటిని పూర్తిగా చెల్లిస్తున్నాం. రైతులకు సున్నా వడ్డీ పథకంలో ఏ మాత్రం బకాయి లేకుండా పూర్తిగా చెల్లిస్తున్నాం. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పూర్తి బకాయిలు చెల్లించినట్లు, దీన్ని కూడా పూర్తిగా చెల్లిస్తున్నాం. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే, వారి వడ్డీ కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం మాదిరిగా ఎగ్గొట్టకుండా పూర్తిగా ఇస్తున్నాం…ఆ మొత్తం కూడా బ్యాంకులకు నేరుగా చెల్లించకుండా, ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోనే వేస్తున్నాం. ఈ బాధ్యత తీసుకుంటూ దాదాపు రూ.1150 కోట్లు నేరుగా 57 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఇక నుంచి అవి మాత్రమే కాకుండా 2019–20కి సంబంధించి రైతులు ఖరీఫ్, రబీలో తీసుకున్న రుణాలకు సంబంధించి, ఆ సీజన్లు పూర్తయ్యే నాటికివ నేరుగా వారి ఖాతాల్లోనే వడ్డీ మొత్తం జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఏడాది అక్టోబరు, వచ్చే ఏడాది మార్చి నెలలో రైతులకు వడ్డీ మొత్తాన్ని వారి వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.

రూ.1572 కోట్ల వ్యయంతో రైతులకు సాగులో ఉపయోగపడే యంత్రాలు
ఇప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రూ.1150 కోట్ల వడ్డీ మొత్తం గత ప్రభుత్వం బకాయి పెట్టినవన్న ముఖ్యమంత్రి, అవి అంతకు ముందు ఏడాదికి చెందిన రుణాలకు సంబంధించినవి కాబట్టి, ఇవాళ బటన్‌ నొక్కిన వెంటనే అందరు రైతుల ఖాతాల్లో జమ కాకపోతే, కంగారు పడవద్దని చెప్పారు. నాలుగు రోజులు బ్యాంకులకు సమయం ఇవ్వాలని, అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే కాల్‌ సెంటర్‌ నెంబరు 1097 కు ఫోన్‌ చేయాలని కోరారు. రైతులకు సాగులో ఉపయోగపడే యంత్రాలు నేరుగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) పరిధిలోకి తీసుకువస్తున్నామని, అవి అవసరమైన రైతులు ఆర్‌బీకేలను సంప్రదిస్తే, తక్కువ వ్యయానికే అవి పొందవచ్చని తెలిపారు. దాదాపు రూ.1572 కోట్ల వ్యయంతో యంత్రాలు సేకరిస్తున్నామని చెప్పారు.

పశువులు–కృత్రిమ గర్భధారణ
పశు సంవర్థక శాఖ రైతు భరోసా కేంద్రాల ద్వారా శాచురేషన్‌ పద్ధతిలో పశువులకు పూర్తి వైద్య సేవలందించడంతో పాటు, లక్షలాది పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. చెరకు రైతుల బకాయిల చెల్లింపు సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో రైతులకు గత ప్రభుత్వం దాదాపు రూ.88 కోట్లు బకాయి పెట్టిందని, దానికి సంబంధించి కొన్నాళ్ల క్రితం రూ.34 కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు. కాగా ఇవాళ రూ.54 కోట్లు ఇచ్చి, 5 ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకు రైతుల మొత్తం బకాయిలు చెల్లిస్తున్నామని, దీని వల్ల దాదాపు 36 వేల రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు.

ఫిషింగ్‌ హార్బర్లు–ఎంఓయూ
మత్స్యకారులు ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారని, ఆ పరిస్థితి మార్చడం కోసం దాదాపు రూ.2800 కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్‌ హార్బర్లు. 4 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. వాటిలో జువ్వలదిన్నెకు సంబంధించి ఇటీవలే కేంద్రం, నాబార్డుతో ఒప్పందం చేసుకున్నామన్న ఆయన, ఇవాళ నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లకు నాబార్డ్‌ ఆర్థిక సహాయం అందించనుందని, ఆ మేరకు కేంద్రం, నాబార్డుతో రూ.1000 కోట్లతో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. 8 ఫిఫింగ్‌ హార్బర్లలో 4 ఫిషింగ్‌ హార్బర్ల పనులు రూ.1300 కోట్లతో పనులు మొదలు పెడుతున్నామని వివరించారు. గత 13 నెలల్లో ‘రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. గత 13 నెలలుగా ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పని చేసిందని చెబుతున్నాను. దేవుడి దయ, అందరి దీవెనలతో చాలా పనులు చేశాను’ అన్న సీఎం జగన్‌ వాటన్నింటినీ వివరించారు.

వైయస్సార్‌ రైతు భరోసా… రూ.10,242 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ
‘వైయస్సార్‌ రైతు భరోసా. రైతులకు దాదాపు రూ.10,242 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేశాము. ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయంగా ఇచ్చాం. 10641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. కనీస ధర ప్రకటించని వ్యవసాయ ఉత్పత్తులు, త్వరగా చెడిపోయే టమోటా, బొప్పాయితో పాటు, పొగాకు కూడా ఇవాళ రైతుల నుంచి కొంటున్నాం. రూ.8655 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు, గత ప్రభుత్వం బకాయి పెడితే, అవి కూడా ఇచ్చాం. వడ్డీ లేని రుణాలకు గానూ రూ.1150 కోట్లు చెల్లిస్తున్నాం. ధాన్యం సేకరణకు సంబంధించి రూ.960 కోట్లు బకాయి పెడితే అవి కూడా ఇచ్చాం. రూ.384 కోట్లు విత్తనాల బకాయిలు కూడా చెల్లించాం. 2018–19కి సంబంధించి గత ప్రభుత్వం రబీలో పంటల బీమా ప్రీమియమ్‌ కట్టకపోతే రూ.122.16 కోట్లు కట్టాం. బీమా కంపెనీలతో మాట్లాడి రైతులకు రూ.596 కోట్ల బీమా పరిహారం రైతులకు అందించాం. రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్‌ 83 శాతం ఫీడర్లలో ఇస్తుండగా, రబీ నాటికి మిగిలిన ఫీడర్ల కింద కూడా ఇచ్చేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని తెలిపారు.

పంటల బీమా సొమ్ములో రైతుల వాటా కడుతున్నాం
‘దేశ చరిత్రలోనే తొలిసారిగా పంటల బీమా సొమ్ములో రైతుల వాటాను కడుతున్నాం. రైతుల వాటాగా రూ.690 కోట్లు, ప్రభుత్వ వాటాగా రూ.766 కోట్లు.. మొత్తం రూ.1456 కోట్లు పంటల బీమా కింద కట్టాం. ఆక్వా రైతులకు కరెంటు యూనిట్‌ రూ.1.50 కే ఇస్తూ, దాదాపు రూ.700 కోట్లు సబ్సిడీ. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి. రూ.2753 కోట్లు ఖర్చు చేసి, కరోనా సమయంలో రైతులకు మేలు చేయడం కోసం దాదాపు 8.25 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం పలు ఉత్పత్తులు కొనుగోలు చేసింది. శనగ రైతులకు రూ.300 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. అది కూడా కలుపుకుంటే రూ.3050 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు తోడుగా ఉన్నాం. అరటి, టమోటా కూడా కొన్నాం. 191 నుంచి 216 మార్కెట్‌ యార్డుల పెంపు. వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు వైయస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల సహాయం. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 417 కుటుంబాలకు అండగా ఉంటూ రూ.20.85 కోట్లు ఇచ్చాం. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం. కౌలు రైతులతో పాటు, ఆలయ భూములు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా పథకం అమలు చేశాం. ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబరు.155251 ఏర్పాటు చేశాం’ అని వివరించారు.

ఈ ఏడాది 6 ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న లక్ష్యం
ఇంకా.. అధిక ఆహార ధాన్యాలు వీటన్నింటి వల్ల ఈ ఏడాది ఏకంగా 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్న ముఖ్యమంత్రి, గత ఏడాది కేవలం 150 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు పనులు పరుగెత్తిస్తున్నామని, ఈ ఏడాది 6 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నానంటూ సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

వ్యవసాయ యంత్ర శిక్షణ కేంద్రాలకు ఆన్‌లైన్ లో శిలాఫలకాల ఆవిష్కరణ
వ్యవసాయ యాంత్రీకరణ చర్యలలో భాగంగా చేపట్టిన మూడు శిక్షణ కేంద్రాలకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆన్‌లైన్‌లో శిలా ఫలకాలు ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా తంగడంచ, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, శ్రీకాకుళం జిల్లా నైరాలో మూడు చోట్ల వ్యవసాయ యంత్ర శిక్షణ కేంద్రాల పనులను ఆయన ప్రారంభించారు. రూ.42 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న శిక్షణ కేంద్రాలలో ఏటా సుమారు 1500 మందికి శిక్షణ ఇస్తారు.

పోస్టర్ల విడుదల
ఇంకా వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద రుణాల సహాయం, వైయస్సార్‌ రైతు భరోసా, కౌలు రైతులకు మేలు విధంగా తీసుకువచ్చిన పంటసాగుదారు హక్కు పత్రం, వరిలో సరైన మోతాదుల్లో ఎరువుల వాడకం, సమగ్ర ఎరువుల యాజమాన్యం, రైతులకు ఉద్దేశించిన 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సంబంధించిన పోస్టర్లను కూడా సీఎం విడుదల చేశారు.

మాస పత్రిక ఆవిష్కరణ
రాష్ట్రంలోని రైతులకు ఆర్బీకేల ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలిపే ఉద్దేశ్యంతో వ్యవసాయశాఖ రూపొందించిన డాక్టర్‌ వైయస్సార్‌ రైతు భరోసా మాసపత్రికను కూడా కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆవిష్కరించారు. పంటలసాగు మెళకువలు, ప్రభుత్వం చేపట్టనున్న వివిధ పథకాల వివరాలు, మార్కెట్‌ ధరలు, వాతావరణం తదితర వివరాలు ఆ పత్రికలో ఉంటాయి. చివరగా, ఆంధ్రప్రదేశ్‌ మత్స్యశాఖ రూపొందించిన మత్స్య సాగుబడి మార్గదర్శి పుస్తకాన్ని కూడా సీఎం జగన్‌ ఆవిష్కరించారు.

Categories
Andhra Pradesh

వైఎస్ఆర్‌కు, కుటుంబసభ్యుల ఘన నివాళి

దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు.

ys jagan2

ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాలో.. నాతో వైఎస్సార్‌…పుస్తకం ఆవిష్కరణ
వైఎస్సార్‌కు నివాళి అనంతరం “నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్సార్‌ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం “నాలో.. నాతో వైఎస్సార్‌”. వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… నాన్న జ‌యంతిని పుర‌స్కరించుకుని అమ్మ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం అమ్మ.. నాన్నను చూసిన విధంగా.. ”నాలో.. నాతో.. వైయ‌స్ఆర్” ర‌చ‌న చేశారని సీఎం అన్నారు.

ys jagan

నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి అని తెలిపారు. వైయ‌స్ఆర్‌ గారిలో ఉన్న గొప్పత‌నాన్ని, ఒక భ‌ర్తను, తండ్రిని, మంచి వ్యక్తిని అమ్మ పుస్తక రూపంలో ఆవిష్కరించారని సీఎం వైయస్ జగన్ కొనియాడారు. నాన్నతో అమ్మ చేసిన ‌సుదీర్ఘ ప్రయాణంలో తాను తెలు‌సుకున్న, చూసిన నాన్నను ఈ పుస్తకంలో ఆవిష్కరించారని సీఎం జగన్ అన్నారు.

Read Here>>కరోనా ఎఫెక్ట్, ఏపీలో 13 ప్రత్యేక జైళ్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం

 

Categories
Andhra Pradesh

కడప జిల్లాలో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇడుపులపాయకు వెళ్తున్నారు. కడప జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు.

సీఎం పర్యటన షెడ్యూల్
> 7వ తేదీ మ.3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో కడపకు బయల్దేరుతారు.
> సాయంత్రం కడప విమానాశ్రయంలో దిగి.. హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు.
> రాత్రికి ఇడుపులపాయ అతిథిగృహంలో బస చేస్తారు.

8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.
> అనంతరం వైఎస్సార్‌ సర్కిల్, ఆర్‌.కె.వ్యాలీ వద్ద ఆర్‌జీయూకేటీకి చేరుకుని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం.
> 3 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ అతిథి గృహానికి వెళ్తారు.
> మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి∙నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

Read Here>>ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే…

Categories
Andhra Pradesh Latest

ఎమ్మెల్సీ రేసులో వైసీపీ అభ్యర్థులు ఫిక్స్.. అయినా నేతల్లో పోటీలు

అధికార వైసీపీలో ఎమ్మెల్సీ రేస్‌ మొదలైంది. ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు అప్పుడే లాబీయింగ్‌ మొదలుపెట్టారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. త్వరలోనే మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో వాటిని దక్కించుకునేందుకు నేతలు పోటీపడుతున్నారు.

త్వరలో ఏపీలో విడుదలకానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ రెడీ అయింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న రత్నబాయి, కంతేటి సత్యనారాయణ పదవీకాలం గత నెలలోనే ముగిసింది. వీటితోపాటుగా.. మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి. దీంతో అధికార పార్టీలో ఎమ్మెల్సీ రేస్‌ మొదలైంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలపై చాలా మంది నేతలే ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు టికెట్‌ త్యాగాలు చేసిన వాళ్లు… పార్టీకి ముందు నుంచి సేవలు అందించిన వారు ఇలా చాలా మందికి.. ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. జగన్‌ నుంచి హామీ పొందిన నేతలు చాలా మందే ఉన్నారు. దీంతో వారంతా తమకే టికెట్‌ దక్కుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా ఎవరి లెక్కలు వారి వేసుకుంటూ.. ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ నాలుగు స్థానాల కోసం పార్టీలో ఆశావహులు భారీగానే ఉన్నారు. సీఎం జగన్‌ మాత్రం ఇప్పటికే ఆ నలుగురు ఎవరన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు చూసుకునిని టికెట్‌ ఇచ్చే అవకాశముంది. ఇందులో కడప జిల్లాకు చెందిన ఓ మైనార్టీ నేతకు అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

మరో స్థానం ఎస్సీ నేతలకు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఇక మిగిలిన రెండు స్థానాలను బీసీలతో భర్తీ చేసే అవకాశముందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. నేతలు ఎవరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నోటిఫికేషన్‌ రాగానే పేర్లను ఖరారు చేసే అవకాశముంది.

Read:ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు