Categories
Andhrapradesh

ఏపీలో కొత్తగా 1,813 కరోనా కేసులు… 17 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా వల్ల 17 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 1,775 మందికి కరోనా సోకగా, విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 34 మందికి కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,235కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో 309 మంది మరణించారు. ప్రస్తుతం 12,533 మంది చికిత్స పొందుతున్నారు.

అనంతపురం 311, చిత్తూరు 300, తూర్పుగోదావరి 143, గుంటూరు 68, కడప 47, కృష్ణ 123, కర్నూలు 229, నెల్లూరు 76, ప్రకాశం 63, శ్రీకాకుళం 204, విశాఖ 51, విజయనగరం 76, పశ్చిమగోదావరి 84 చొపపున నమోదు అయ్యాయి.

Categories
Andhrapradesh

యువకుల వేధింపులు తట్టుకోలేక యువతి సెల్ఫీ సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భక్తవత్సల నగర్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు యువకులతో వాట్సాప్ చాట్ చేసిన ఆ యువతి సూసైడ్ చేసుకుంటున్న ఫోటోలను వారికి పంపించింది. ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై రమ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకుల వేధింపులే రమ్య మృతికి కారణమని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నారు. చనిపోయే ముందు కూడా రమ్య వారికి చెప్పిందని వాళ్లు పట్టించుకోలేదన్నారు. ఆ యువకులపై దిశ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.

నెల్లూరులోని భక్తవత్సల నగర్ లో నివాసముంటున్న కొండూరు రమ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొన్ని ఫోటోలను తీసుకొని సాయి, శివభార్గవ్, వాసు అనే ముగ్గురు యువకులకు వాట్సాప్ ద్వారా పంపించారు. అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలోనే రమ్య ఉరివేసుకుంటూ లైవ్ డెత్ రికార్డ్ చేసుకొని చనిపోయింది.

విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. దీని ద్వారా ఎవరెవరితో చాటింగ్ చేసింది, ఫోటోలు పెట్టిందన్న విషయం బయటపడింది. శివ భార్గవ్ కు ఆమె మెస్సెజ్ చేసింది. ఆ మెసేజ్ లు చూస్తే రమ్యకు, శివభార్గవ్ కు మధ్య కొంత ఎఫైర్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొంతకాలం నుంచి శివభార్గవ్ రమ్యతో మాట్లడం మానేశాడు. ఈ క్రమంలోనే రమ్య శివభార్గవ్ ను బతిమిలాడుకున్నట్లు తెలుస్తోంది. అనేక సార్లు కూడా మెస్సెజ్ లు పెట్టింది. ఈ వీడియోలో కూడా శివ భార్గవ్ ను ఒక్కసారి మాట్లాడమని బతిమిలాడుతున్నట్లు కనిపించింది. అయితే ఈ విషయంలో సాయి, వాసుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురి యువకుల వేధింపులు, ప్రేమ వ్యవహారమే రమ్య మృతికి కారణమని చెప్పొచ్చు.

Categories
Andhrapradesh

నెల్లూరులో ఆనం ఫ్యామిలీ నయా ఎత్తుగడ

నెల్లూరు కొంతకాలంగా అధికార పార్టీ రాజకీయ అంతర్యుద్ధం సాగుతోంది. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోంది. ఈక్రమంలో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు ఆనం కుటుంబం పావులు కదుపుతోందని అంటున్నారు. అనిల్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో ఆనం రామనారాయణరెడ్డికి సఖ్యత లేదు.

వీఆర్‌ విద్యా సంస్థలు, వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం ఇందుకు కారణంగా నిలిచాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అనిల్ , ఎమ్మెల్యే కోటంరెడ్డి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీఆర్ విద్యాసంస్థలపై ఆనం పెత్తనానికి చెక్ పడటం, వేణుగోపాలస్వామి భూముల విక్రయించాలనుకున్న వ్యవహారం కూడా ఆనంకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ వ్యవహారాలను నడిపించిన వారిద్దరిపై రామనారాయణరెడ్డి గుర్రుగా ఉన్నారు.

మరోవైపు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. నియోజకవర్గంలో తన మాట వినడం లేదని మీడియా సమావేశంలోనే అధికారులపైన, ప్రభుత్వంపైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు మంత్రి అనిల్, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆనం రామనారాయణరెడ్డి… నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందనే విమర్శలు చేసి దుమారాన్ని లేపారు.

అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఆనం సోదరులు చక్రం తిప్పారు. జిల్లాలో తమకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి మృతితో ఆ కుటుంబ ప్రాబల్యం జిల్లాలో బాగా తగ్గిపోయింది. ఆనం వర్గం కూడా చెల్లాచెదురైపోయింది. కుటుంబ సభ్యుల మధ్య కూడా వివాదాలు నెలకొన్నాయి. ఎవరికి వారుగా వేర్వేరు పార్టీల్లో ఉంటూ వస్తున్నారు. మొత్తం నలుగురు సోదరుల్లో ఆనం వివేకానందరెడ్డి మరణించగా మిగిలిన ముగ్గురిలో రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డి వైసీపీలోనూ, జయకుమార్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు.

కొద్ది రోజుల క్రితం వరకు ఎవరికి వారుగా ఉంటున్న ఈ అన్నదమ్ముల్లో ఇప్పుడు రామనారాయణరెడ్డి, విజయకుమార్‌రెడ్డి ఏకమయ్యేందుకు ముందుకొచ్చారట. తమ విభేదాలను పక్కన పెట్టేశారట. ఎవరికి వారుగా ఉంటే జిల్లాలో మనుగడ కష్టమని భావించి కలిసిపోయి జిల్లాలో మళ్లీ చక్రం తిప్పాలని ప్లాన్‌ చేసుకున్నారట. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోయినా తమ వర్గానికి అండగా నిలవాలని డిసైడ్‌ అయ్యారని అంటున్నారు.

వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూర్ రెడ్డి మాత్రమే నెల్లూరులో రాజకీయాల్లో కొంత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మంత్రి అనిల్ నెల్లూరు సిటీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో నగరంలో ఆనం కుటుంబానికి అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో అనిల్ పాల్గొనే కార్యక్రమాల్లో రంగ మయూర్‌రెడ్డి అంతగా పాల్గొనడం లేదు. తమ ప్రాభవం మళ్లీ పెరగాలంటే కుటుంబం కలసికట్టుగా ఉండడం ఒక్కటే పరిష్కారమని భావించి, ఏకమయ్యారని అంటున్నారు.

నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలను ఇప్పుడు ఆనం ఫ్యామిలీ టార్గెట్ చేసిందని సన్నిహితులు అంటున్నారు. నెల్లూరులో రాజకీయం మళ్లీ స్పీడ్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆనం కుటుంబంలో యువ నాయకులు రంగమయూర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి తమ కుటుంబ రాజకీయాలకు అండగా నిలువనున్నారన్న ప్రచారం సాగుతోంది. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న విజయకుమార్ రెడ్డి కూడా తమను పట్టించుకొనే వారెవరూ లేరంటూ అన్న రాంనారాయణరెడ్డిని కలసి ఆవేదన వ్యక్తం చేశారట.

గతంలో ఈ ఇద్దరు సోదరుల మధ్య గ్యాప్ ఉండేది. ఇప్పుడు మాత్రం కలసి పని చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేశారట. మరి ఈ కలయికతో ఆనం ఫ్యామిలీకి పూర్వ వైభవం వస్తుందా లేదా అన్నది చూడాలి.

Categories
Andhrapradesh

విశాఖలో ఉద్యోగాల పేరుతో డైరీ ఉద్యోగి మోసం… కిడ్నాప్ చేసిన బాధితులు

విశాఖలో డైరీ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడు నుంచి రెండు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మింది జంక్షన్ వద్ద అగస్టిన్ ను కిడ్నాప్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్ల కార్లను వెంబడించారు. అగస్టిన్ ను కూర్మనపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అగస్టిన్ కాకినాడలో ఉద్యోగాల పేరుతో కొంత మంది నిరుద్యోగులను మోసం చేశారు. బాధితులే అగస్టిన్ ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అగస్టిన్ అనే వ్యక్తి కాకినాడలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దాదాపుగా 25 మంది యువకుల వద్ద లక్షల కొద్ది డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలోనే విశాఖలో తనకు చాలా పరిచయాలు ఉన్నాయి. కేంద్ర పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఈ క్రమలో ఎంత మేరకు కూడా ఉద్యోగాలు రాకపోవడం, డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకుండా అగస్టిన్ తప్పించుకుని తిరుగుతున్నాడు.

ఈక్రమంలోనే అగస్టిన్ విశాఖలో ఉన్నాడని తెలుసుకున్న కాకినాడ వాసులంతా కలిసి రెండు కార్లలో అక్కడికి వెళ్లారు. వెళ్లిన తర్వాత అతనితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. తమ డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే తను డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నానని అగస్టిన్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతన్ని కాకినాడ తీసుకొచ్చేందుకు వారంతా అగస్టిన్ ను వ్యాన్ లో ఎక్కించుకుని మింది నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా కూర్మనపాలెం వద్ద అంగన్ పూడి టోల్ గేట్ దగ్గర వీరిని ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు.

కాకినాడుకు చెందిన 11 మంది అగస్టిన్ ను తీసుకెళ్లేక్రమంలో అగస్టిన్ తన ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. తనను కిడ్నాప్ చేస్తున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు మాత్రం తాము కిడ్నాపర్లం కాదని.. ఇతని వద్ద మోసపోయిన బాధితులమన్నారు. తమపై ఎలాంటి కేసులు పెట్టొద్దని కోరారు.

Categories
Andhrapradesh

అంతా బాగున్నా బీజేపీలో అసలు సమస్య ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీలోకి చాలా మంది నేతలను చేర్చుకుంది. కాకపోతే నేతలు పుష్కలంగా ఉన్నా గ్రౌండ్‌ లెవెల్లో కార్యకర్తలు మాత్రం పార్టీలో లేరనేది వాస్తవం. బీజేపీకి ఏపీలో నాయకత్వ లోపం ఏమీ లేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో సీనియర్ నాయకులతో పాటు పక్క పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులతో పార్టీ బయటకు పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ, ఏదైనా కార్యక్రమం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చి దీక్షలలో, నిరసనలలో కూర్చుంటున్నారు తప్ప కార్యకర్తలు మాత్రం పెద్దగా కనిపించడం లేదంటున్నారు.

అమరావతి ఉద్యమంలో కూడా రైతులకు సంఘీభావం తెలిపిన ప్రతిసారీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేదా రావెల కిశోర్ బాబు, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ఒంటరిగా వెళ్లి వారికి మద్దతు తెలపడమే కనిపించింది. అంతే తప్ప వారి వెనుక కార్యకర్తల సందడి మాత్రం లేదు. కరోనా సమయంలో బీజేపీని పలకరించేందుకు కొద్దిపాటి కార్యకర్తలు కూడా లేరని చెప్పాలి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత బీజేపీ వరస నిరసన దీక్షలతో మోతెక్కించింది.

తిరుమల భూములు అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒక రోజు చేపట్టిన ఉపవాస దీక్ష, కరెంట్ బిల్లులు తగ్గించాలంటూ నిరసనలు, మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకం, ఇసుక రీచ్‌ల వద్ద చేపట్టిన దీక్షలు ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టింది. ఇలా ఏ నిరసన చేసినా బీజేపీలోని జిల్లా స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు తప్ప కార్యకర్తలు మాత్రం కనిపించలేదు. ఇప్పుడు ఆ పార్టీ నేతలకు ఇదే గుబులు పట్టుకుంటుందంట.

కార్యకర్తలుంటేనే కింది స్థాయి వరకూ పార్టీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని, ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటుంది. కరోనా కారణంగా కార్యకర్తలు రావడం లేదని బయటకు చెబుతున్నా.. కార్యకర్తలు ఉన్నా అదే జనం.. లేకపోయినా అదే జనమని లోలోపల ఫీలవుతున్నారట. ముఖ్యంగా వలస వచ్చిన వారితో పాటే క్యాడర్ మాత్రం రాలేదు. వారితో టచ్‌లో ఉన్న వారిని కూడా అడ్డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా నిర్వహించిన బీజేపీ వర్చువల్ ర్యాలీల్లో సైతం కార్యకర్తలు లేని లోటు స్పష్టంగా కనిపించింది.

ఈ ర్యాలీల్లో బీజేపీ కేంద్రం ఏం చేసిందో, ప్రధాని ఏం చేశారో జాతీయ నాయకులతో చెప్పించే ప్రయత్నం బాగానే ఉన్నా ఏపీకి చేసిన సేవలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలు, బీజేపీ అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యకర్తల సంఖ్య లేకపోవడంతో వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడింది.

ప్రతిసారి సీఎంకి లేఖలు రాయటం, నిరసన దీక్షలు చేయడం తప్ప.. రాష్ట్ర నాయకులు ఎవరూ కార్యకర్తల సమీకరణపై అసలు దృష్టి సారించకపోవడంపై అధినాయకత్వం సీరియస్‌గా ఉందని అంటున్నారు. నాయకత్వం అండతో బలంగా కనిపిస్తున్న బీజేపీ… కార్యకర్తల లోటును మాత్రం పూడ్చుకోకపోతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దుకోవడం కష్టమేనని ఉన్న కొద్ది పాటి ద్వితీయ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు. ఈ దిశగా సీనియర్లుగా చలామణి అవుతున్న నేతలు దృష్టి సారించాలని సలహాలు ఇస్తున్నారు.

Categories
Andhrapradesh

ఆ రెండు మినిస్ట్రీలు ఎవరికి..? ఏపీ మంత్రివర్గ విస్తరణకు డేట్ ఫిక్స్

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైపోయింది. శ్రావణమాసం మొదటి రోజు జులై 22న విస్తరణ చేపట్టాలని డిసైడ్‌ అయ్యారు. ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై ఇప్పుడు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నుంచి ప్రభుత్వ వర్గాల వరకూ రోజు రోజుకి కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు స్థానాలు బీసీ వర్గాలకే ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.

ఇందుకోసం ఆ సామాజికవర్గ నేతల్లో సీనియర్లు, జూనియర్లయిన చాలామంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో జోగి రమేశ్‌, పొన్నాడ సతీశ్‌ పేర్లు బలంగా వినిపించాయి. తాజాగా వీటితో పాటు మరికొన్ని పేర్లు పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు స్పీకర్ తమ్మినేని సీతారాం, మరొకరు మాడుగుల ముత్యాలనాయుడు. వీరిద్దరూ ఉత్తరాంధ్రలో బీసీ సామాజికవర్గానికి చెందినవారే. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

స్పీకర్ తమ్మినేనికి కనుక అవకాశం ఇస్తే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతికి స్పీకర్‌గా ప్రమోట్‌ చేస్తారని టాక్‌. ఎలాగో గుంటూరుకు మంత్రి పదవి దక్కే అవకాశం లేనందున ఈ కీలక పదవి ఇవ్వాలనే ఆలోచనలో జగన్‌ ఉన్నారంటున్నారు. దానికి తోడు బ్రాహ్మణ సామాజికవర్గానికి మంచి స్థానం ఇచ్చినట్లు అవుతుందనేది అధినేత అభిప్రాయంగా చెబుతున్నారు. వీరు కాకుండా ఇంకా చాలా మంది ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. వారికి పరిచయం ఉన్న పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఎవరూ ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. జగన్‌ మైండ్‌లో ఏముంటే అదే జరుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికి మంత్రి పదవుల భర్తీ విషయంలో ఈ కొత్త సమీకరణాలు తెరపైకి రావడంతో అసలు అవకాశం ఎవరికి దక్కుతుందో అని పార్టీలో ఉత్కంఠ నెలకొంది. మరి ఆ చాన్స్ జగన్‌ ఎవరికి ఇస్తారో చూడాలని కార్యకర్తలు అంటున్నారు.

Categories
Andhrapradesh Uncategorized

ఏపీ డీజీపీ కొత్త గెటప్ : ఆర్మీ డ్రెస్ లో ఫైరింగ్ చేసిన గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సరికొత్త గెటప్ లో అలరించారు. ఏపీ డీజీపీగా విధులు నిర్వహించే గౌతమ్ సవాంగ్ కొత్తగా ఆర్మీ డ్రెస్ లో కనిపించారు. ఫైరింగ్ చేస్తూ అలరించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ను పరిశీలించేందుకు సవాంగ్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నారు. తరువాత అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గన్ పట్టుకుని ఆర్మీ డ్రెస్ లోఉన్న ఆయన ఫైరింగ్ చేశారు.

Read Here>>సీఐ శంకరయ్య ఆస్తులు రూ.40 కోట్ల పైమాటే ?

Categories
Andhrapradesh

నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి

నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు అర్జీ పెట్టుకోవడం చర్యనీయాంశం అయ్యింది. నెల్లూరు నగరపాలకసంస్థలో ఈ ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బతికున్న శాశ్వత పారిశుద్ధ్య కార్మికురాలిని 2012లోనే చనిపోయినట్లుగా నమోదు చేసి, ఆమె స్థానంలో మరో మహిళకు ఉద్యోగం ఇచ్చేశారు నగరపాలకసంస్థ అధికారులు.

దీంతో బాధిత మహిళ కృష్ణమ్మ తనకు న్యాయం చెయ్యాలంటూ నగరపాలకసంస్థ ఆరోగ్యాధికారి వెంకటరమణను కలిసింది. నేను బతికే ఉన్నాను.. ఉద్యోగం ఇప్పించి న్యాయం చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ అర్జీ పెట్టుకోగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బతికున్న పారిశుద్ధ్య కార్మికురాలికి డెత్ సర్టిఫికేట్ మంజూరు చేసి మరో మహిళకు ఉద్యోగం కల్పించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళ ఎవరో తనకు తెలియదని, తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేయించి కృష్ణమ్మకు న్యాయం చేస్తామని ఆరోగ్యాధికారి తెలియజేశారు.

Categories
Andhrapradesh

కోవిడ్ నిర్ధారణ కేంద్రాలుగా ఇంద్ర బస్సులు

ఏపీలో కరోనా ఎఫెక్ట్ తో అన్ని విధాలుగా ఆర్టీసీ నష్టపోయింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రగతి చక్రాలు..ఇప్పుడు రోజుకు రెండు లక్షల మందిని మాత్రమే తీసుకెళ్తున్నాయి. మార్చి 23న నిలిచిపోయిన ప్రగతి చక్రాలు నేటికి పూర్తిస్థాయిలో పరుగులు పెట్టడం లేదు. ఏపీ ప్రభుత్వం కరోనా నిబంధనలతో కొన్ని రూట్లలో బస్సులు తిప్పమని ఆదేశాలివ్వడంతో కొన్ని రోజుల నుంచి ఆర్టీసీ లిమిటెడ్ సర్వీసులు నడుపుతోంది. ఈ సర్వీసుల్లో కూడా ప్రయాణికులు పూర్తిస్థాయిలో లేకపోవడం ఆర్టీసీకి ఆర్థికంగా మరింత భారంగా మారింది.

అయినా ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కొన్ని సర్వీసులను నడుపుతోంది. రోడ్డెక్కిన బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పూర్తిస్థాయిలో లేకపోవడం మరింత నష్టాల బాటలో పయనిస్తోంది. మరికొన్ని నెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల బాట పట్టారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా 25 బస్సులను స్పెషల్ గా తయారు చేసి డ్రైవింగ్ స్కూల్స్ కు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వీసీ, ఎండీ మాసిరెడ్డి ప్రతాప్ చెప్పారు.

మరోవైపు కార్గో, సంచార బస్సుల ద్వారా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం ఆర్జించే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఆర్టీసీ నాలుగు నెలల్లో రూ.4200 కోట్లతో నష్టపోయినట్లు చెప్పారు. ఇటు కార్గో, సంచార బస్సులు డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా కోవిడ్ కోల్పోయిన ఆదాయాన్ని ఆయన రాబట్టేందుకు ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేస్తామని ఎండీ చెప్పారు.

మరోవైపు ప్రజలకు సేవ చేసే అంశంలో ఎప్పుడు ముందుంటే ఆర్టీసీ సంస్థ కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా కీలకమైన అవసరాలకు బస్సులను సిద్ధం చేస్తోంది. ఇంద్ర బస్సుల్లో కొద్దిపాటి మార్పులు చేసి సంజీవని పేరుతో కరోనా పరీక్షలకు బస్సులను ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్కొక్క జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున వీటిని పంపుతారు. అక్కడి జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని ఈ బస్సుల్లోనే కోవిడ్ వైద్య పరీక్షలు చేస్తారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులు నడపటం వల్ల ఆర్థిక నష్టమే కాకుండా ఉద్యోగులకు కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణకు సర్వీసులు నడపాలని భావించినా రెండు రాష్ట్రాల మధ్య చర్చలకు ఆటంకం కరోనా ఆటంకం కల్గించడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు పున:రుద్ధరణ కాలేదు. అదే విధంగా బెంగళూరు కూడా సర్వీసులు నడుపాలని ఏపీ ప్రభుత్వం భావించినా కొన్ని సాంకేతి పరిస్థితుల కారణంగా సాధ్యమవ్వలేదు.

Categories
Andhrapradesh

కరోనా కట్టడికి జగన్ సర్కార్ ప్లాన్.. త్వరలో ప్రతి జిల్లాలోనూ 5వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్లు

కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే వారిని సమీపంలోని కోవిడ్ ఆస్పతికి తీసుకువెళ్ళేందుకు వీలుగా అన్ని ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. అందుకే కోవిడ్ ఆస్పతికి కనీసం 15 నిమిషాల ప్రయాణ దూరంలోనే కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తన్నామని తెలిపారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 76 కోవిడ్ కోవిడ్ సెంటర్లలో మొత్తం 45240 బెడ్ లను సిద్ధం చేయడం జరిగిందని కృష్ణబాబు తెలిపారు.

ప్రతి జిల్లాలో కనీసం మూడు వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని త్వరలోనే 5వేల బెడ్ లకు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు కోటి రూపాయలు ప్రత్యేక నిధులు ఇవ్వడ జరిగిందని తెలిపారు. ప్రతి కోవిడ్ సెంటర్ కు ఒక మొబైల్ ఎక్స్‌రే, ఇసిజి, ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 23 యాక్టీవ్ సెంటర్లలో 2280 మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. ఈ రోజు 230 మంది అడ్మిట్ అయ్యారని వెల్లడించారు.

రాష్ట్రంలోని మొత్తం 74 కోవిడ్ హాస్పటల్స్ లో 5874 మంది చికిత్స పొందుతున్నారని, 9421 మంది అనుమానితులు 116 క్వారంటైన్ సెంటర్లలో వున్నారని తెలిపారు. క్వాంరంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లలో మంచినీరు, ఆహారం, శానిటేషన్, వైద్యబృందాలు అందించే సేవలు, అంబులెన్స్‌లు తదితర అన్ని సదుపాయాల విషయంలో ఎటువంటి ఉదాసీనత ప్రదర్శించినా సహించేది లేదని స్పష్టం చేశారు.