Categories
Andhra Pradesh Bakthi

శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ

తిరుమల శ్రీవారి దర్శనార్థం ఉచిత దర్శన టోకెన్ల జారీని టీటీడీ శుక్రవారం (జూన్ 26, 2020) ఉదయం ప్రారంభించింది. స్వామి వారిని దర్శించుకోవడానికి జూన్ 26 వరకు టోకెన్లు జారీ చేశారు. శనివారం (జూన్ 27, 2020) నుంచి తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఉచిత దర్శనం టోకెన్లు జారీ
ప్రారంభమైంది.

తిరుపతిలోని విష్ణునివాసంలోని 8 కౌంటర్లు, శ్రీనివాసంలోని 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లోని 4 కౌంటర్లు మొత్తం 18 కౌంటర్లలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు.

Categories
Bakthi National

9 ఏళ్లు తపస్సు చేసి..35మందితో కలిసి హిందువుగా మారిన ముస్లిం యువకుడు

హర్యానాలో వరుసగా ముస్లిం కుటుంబాలు హిందూ మతంలోకి మారున్నాయి. తాజాగా ఓ ముస్లిం యువకుడు మతం మార్చుకుని తన  35 మంది కుటుంబ సభ్యులతో కలిసి హిందూ మతాన్ని  స్వీకరించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మంలోకి వెళ్లారు. దీని కోసం అతడు తొమ్మిదేళ్ల పాటు ధ్యానం చేసిన అనంతరం హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో హిందూ మతంలోకి మారాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ముస్లిం మత పెద్దలు ఆ యువకుడిని అతని కుటుంబాన్ని బెదిరించి బలవంతంగా మార్పిడి చేశారని ఆరోపిస్తున్నారు. 

 పానిపట్‌లోని అసన్ గ్రామానికి చెందిన నసీబ్ అనే యువకుడు తాను హిందూ మతంపై ఆసక్తి పెంచుకున్నాడు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. హరిద్వార్‌లో తొమ్మిదేళ్లు తపస్సు చేస్తానని చెప్పి హరిద్వార్ వెళ్లిపోయాడు. తరువాత తపస్సు (ధ్యానం) పూర్తి చేసి వచ్చిన తరువాత శివాలయంలో జరిగిన తన కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞంలో పాల్గొన్నాడు. 

దీని తర్వాత వారంతా పూర్తి హిందువులుగా మారిపోయారు.  తాము సంతోషంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని..ఎవరి   బలవంతంమీద మారలేదనీ..హిందూ సంప్రదాయాలపై ఉన్న ఆసక్తితోనే మారామని తెలిపారు. తమను బలవంతంగా మతం మారేలా చేసారనే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టంచేశారు. కాగా..గత మే నెలలో 40 ముస్లిం కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

Read: భారతా వాతావరణ శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్న కేరళ… ప్రైవేట్ గా అంచనా

Categories
Bakthi Telangana

ఆషాఢమాసం ప్రారంభం-బోనాల ఉత్సవాలు

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు.   పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. 

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరంమని పండితులు చెపుతారు.

దక్షిణాయానం ప్రారంభం 
ఆషాడ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది. వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్ష రూపంగా, ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి, ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం.

ఈ శూన్యమాసంలో… 
‘ఆషాఢ శుద్ధ విదియనాడు’ పూరీ జగన్నాధ రధయాత్ర. 
ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’గా 
ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము – సృమతి కౌస్తుభం’ ఈ రోజు చేసే వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి.
ఆషాడ శుద్ధ సప్తమి – మిత్రాఖ్య భాస్కర పూజ- నీలమత పురాణము.
 ద్వాదశ సప్తమీ వ్రతము- చతుర్వర్గచింతామణి.
ఆషాడ శుద్ధ అష్టమి – మిహషఘ్ని పూజ,- కౌస్తుభం
ఆషాడ శుద్ధ నవమి – ఐంద్రదేవి పూజ
ఆషాడ శుద్ధ దశమి – శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము.
ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం..
ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాం తరాది దినము అంటారు. ఈ మాసంలో జగన్నాథుని రధయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది.

శూన్యమాసం అంటే ఏమిటి ? 
శూన్యమాసం అంటే?  జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 , 1/2 రోజులు పడుతుంది. శని గ్రహం 2, 1/2 సంవత్సరాలు పడుతుంది. రాహు, కేతువులకి 1, 1/2 సం, రవికి నెల రోజులు.. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశులలోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది. 

సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని  ‘మేష సంక్రమణం’ అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని ‘వృషభ సంక్రమణం’ అని,ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా జ్యోతిష్య పరిభాషలో చెబుతారు. ఈమాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు. ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకొంటారు. 

ఆషాడ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది.  ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాడ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని  శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. 

బోనాల ఉత్సవాలు 
ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన  బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. దీనిని అమ్మవారికి  నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.

bonalu

మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. 

bonalu 2

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు.
bonalu pothuraju

 అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. సమస్త జగత్తుకు  కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. 

bonalu pothuraju 2

ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు  ఉండవు. కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు  ఎక్కువగా ఉంటాయి. ఆ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్త గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. 

ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు,  తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను  అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల  ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు.

Read: SMS ద్వారా టీటీడీ ఆలయాల్లో దర్శనం టికెట్లు

Categories
Andhrapradesh Bakthi

SMS ద్వారా టీటీడీ ఆలయాల్లో దర్శనం టికెట్లు 

కరోనా లాక్ డౌన్  కారణంగా సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేసిన ఆలయాల్లో నేటి నుంచి దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా 80 రోజలు తర్వాత  సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లోనూ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆలయాలను దర్శించుకునే భక్తులకు టీటీడీ ఆన్ లైన్ లో ఉచితంగా టికెట్లు అందచేస్తోంది.

భక్తులు http://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆయా ఆలయాల దగ్గర ఏర్పాటు చేసిన మెషీన్లలో టికెట్లు తీసుకోవచ్చుని తెలిపింది.  ఇవి కాక భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు  ఎస్ఎంఎస్ ద్వారా కూడా దర్శనం టికెట్లను అందచేస్తోంది.

భక్తులు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం,  శ్రీ ప్రసన్నవెంకటేశ్వరస్వామి, గోవిందరాజస్వామి,కపిలేశ్వరస్వామి ఆలయాల్లో  దర్సనం టికెట్లుకూడా పొందవచ్చు. 

ఇందుకోసం ప్రతిఆలయానికి ఒక కోడ్ ను ఏర్పాటు చేసింది. జూన్ 8 నుంచి టికెట్ల జారీ ప్రారంభించగా భక్తులు  టీటీడీ సూచించిన 9321033330 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది.  మీరు వెళ్లాల్సిన దేవాలయం కోడ్ ను చెపుతూ టీటీడీ ఇచ్చిన  ఫోన్ కు ఎస్సెమ్మెస్ పంపించాలి. ఆలయాలకు టీటీడీ ఇచ్చిన కోడ్స్ ఈ విధంగా ఉన్నాయి. 

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూర్- SVP
శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి- SVG
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుపతి- SVK
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం- SVS
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట- SVA

ఉదాహరణకు భక్తులు  18వ తేదీ తన కుటుంబసభ్యులు 7 మందితో కలిసి తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే వారు  ముందు గుడి కోడ్- తేదీ-ఎంత మంది దర్శనానికి వచ్చేది…SVP 18-06-2020 7 అని 9321033330 నెంబరుకు ఎస్సెమ్మెస్ పంపించాలి. కాగా…ఎస్సెమ్మెస్ ద్వారా ఉచిత టికెట్లు ఇచ్చే సదుపాయం పైన చెప్పిన ఐదుదేవాలయాలకే అని టీటీడీ వివరించింది. 

Read: చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్య

Categories
Andhrapradesh Bakthi

గోవిందా.. గోవిందా: శ్రీవారి దర్శనం మొదలైంది.. తిరుమల గిరుల్లో భక్తుల ఫోటోలు

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు ఇవాళ(8 జూన్ 2020) నుంచి ప్రయోగాత్మకంగా తిరుమ‌ల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం మొదలైంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు దాదాపు 80రోజులుగా భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం నిలిపివేయగా.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తి మేర‌కు ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తూ నేటి నుండి తిరుమ‌లలో ప్రయోగాత్మకంగా ద‌ర్శ‌నం ప్రారంభించారు.

ttd

లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న కేంద్రప్రభుత్వం ఆలయాలను తెరవటానికి అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సుమారు రెండున్నర నెలల తర్వాత తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో ఉదయం 6.30 గంటల నుంచి తిరుపతి వెంకన్న భక్తులకు దర్శనమిచ్చాడు.

ttd

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలి రెండు రోజుల పాటు దర్శనాల ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

ttd

జూన్ 10వ తేదీ నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనుండగా.. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు దర్శనాలకు ఏర్పాట్లు చేసింది. గంటకు ఐదు వందల మంది చొప్పున, రోజుకు ఆరు వేల మందికి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం, మరో మూడు వేల మందికి సాధారణ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. 

ttd

భక్తులు మధ్య భౌతిక దూరం, శుభ్రత పాటించేలా ఏర్పాట్లు చేశారు. బౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లను ధరించిన ఉద్యోగులు, క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు. కాగా, దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ, స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు అమర్చారు అధికారులు.

Read: సీన్ రివర్స్ : ఆ ఆలయం తలుపులు తెరుచుకోవు

Categories
Andhrapradesh Bakthi

జూన్10 నుంచి బెజవాడ దుర్గమ్మ, ద్వారకా తిరుమలల్లో దర్శనాలు

జూన్ 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి దర్శనం భక్తులకు కల్పిస్తామని  దేవస్ధానం ఈవో సురేశ్‌ బాబు తెలిపారు. రూ.300 టికెట్లు రద్దు చేశామని, తీర్థాలు, శఠగోపాలు ఉండవని చెప్పారు. ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఇస్తామన్నారు.

సోమ మంగళవారాలు దర్శనాల ట్రయల్‌ రన్‌ ఉంటుందని ఈవో పేర్కొన్నారు. 10 వ తేదీ నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తామని…మహామండపం ద్వారానే దర్శనం చేసుకుని భక్తులు కిందకు రావాలని సూచించారు. భక్తులు కరోనా నివారణ సూచనలు పాటిస్తూ ఆలయ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈవో సురేశ్‌ బాబు విజ్ఞప్తి చేశారు.

మరో వైపు….. చినతిరుపతిగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారాకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. 8,9 తేదీల్లో దేవస్థానం సిబ్బంది,  స్థానిక భక్తులతో ట్రయిల్ రన్ నిర్వహిస్తామని… 10 నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని చెప్పారు.

10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి, 65 సంవత్సరాలు పైబడిన పెద్ద వాళ్లకు దర్శనానికి అనుమతించమని ఈఓ అన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని ఈవో తెలిపారు. ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం7 గంటల వరకు దర్శనం కొరకు తెరిచి ఉంటుందని ఆయన వివరించారు.  

Categories
Andhrapradesh Bakthi Telangana

జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం పునః ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 8 నుంచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.  ఈలోపు టీటీడీ ఉద్యోగులు, స్ధానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు టీటీడీ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

భక్తులు ఒక్కోక్కరు 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్సనం కల్పించాలని  సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి జేఎస్ వీ ప్రసాద్ టీటీడీకి లేఖ రాశారు.  గత 70 రోజులుగా స్వామి వారి దర్శనానికి దూరమైన భక్తులుజూన్ 8 నుంచి శ్రీవారిని  దర్శించుకోనున్నారు.

 

కరోనా లాక్ డౌన్ 5 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు రంగాలకు సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా జూన్ 8 నుంచి  దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లోకి భక్తులకు  ప్రవేశం  కల్పించవచ్చని తెలిపింది.  ఈ క్రమంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించే విషయంలో టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి అనుమతి పొందటంతో  ఇక శ్రీవారి దర్శనం అందుబాటులోకి రానుంది. 

Read: నిమ్మగడ్డపై పిటిషన్‌ను హైకోర్టులో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

Categories
Andhrapradesh Bakthi

జూన్-8నుంచి భక్తులకు వెంకన్న దర్శనం!

ఊహించని విధంగా లాక్ డౌన్ ను మరో నెల రోజులు పొడిగిస్తూ ఇవాళ(మే-30,2020)కేంద్రం కీలక ప్రకటన చేసింది.  కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన అన్ని చోట్లా జూన్ 8నుంచి రెస్టారెంట్లు,ఆతిథ్య రంగ సేవలు, మాల్స్,ఆలయాలు తిరిగి తెరుచుకోవచ్చునని ఇవాళ(మే-30,2020)కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన అన్ లాక్ 1 గైడ్ లైన్స్ లో తెలిపింది.

ప్రార్థనా మందిరాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో… అందరి దృష్టి టీటీడీపై పడింది. కేంద్రం అనుమతి ఇవ్వడంతో… భక్తులకు దర్శన విధివిధానాలపై టీటీడీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కేంద్రం అనుమతించిన విధంగా తిరుమలలో జూన్ 8 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అనుమతిస్తే, అప్పుడు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా కేంద్రం ఇందుకు అనుమతి ఇవ్వడంతో… భక్తులకు దర్శన విధివిధానాలపై టీటీడీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కేంద్రం అనుమతించిన విధంగా తిరుమలలో జూన్ 8 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రెండు నెలలకు పైగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడంతో… టీటీడీ ఆదాయంలో భారీగా కోతపడింది. ఈ నష్టాన్ని ఏరకంగా పూడ్చుకోవాలనే దానిపై టీటీడీ సమాలోచనలు కూడా జరిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల్లో భక్తులకు అనుమతి ఇస్తే.. పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం ఎలా అనే దానిపై టీటీడీ ఇదివరకే కసరత్తు చేసింది. 

Categories
Andhrapradesh Bakthi Telangana

తిరుమల శ్రీవారి లడ్డూలు మే 31 నుంచి హైదరాబాద్ లో అమ్మకం

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూ  రేపు ఆదివారం నుంచి హైదరాబాద్ లోని భక్తులకు అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో గత 67 రోజులకు పైగా స్వామి వారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. 

భక్తులకు శ్రీవారి ఆశీస్సులు ప్రసాదం రూపంలో అయినా అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ బోర్డు నిర్ణయించిందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా రూ.25 లకే లడ్డూను భక్తులకు అందించనున్నారు. 

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా లడ్డూ ప్రసాదం విక్రయిస్తామని సుబ్బారెడ్డి వివరించారు. లడ్డూ విక్రయాలకు టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో భక్తుల కోసం 60 వేల లడ్డూలు నగరానికి చేరుకున్నాయి.  

కాగా టీటీడీ లడ్డూలుదేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మాలని    తీసుకున్న నిర్ణయంపై భక్తులనుంచి మిశ్రమ స్పందన వచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తమకు అందుబాటులోకి వచ్చిందని కొంత మంది భక్తులు ఆనందిస్తుంటే… మరికొందరు మాత్రం టీటీడీ తీరును విమర్శిస్తున్నారు. అతి  పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అంగట్లో సరుకులా అన్ని ప్రాంతాల్లో విక్రయించడం ఏంటంని మరికొందరు ఆక్షేపించారు. 

Read: ఆస్తుల అమ్మకంపై TTD పాలక మండలి కీలక నిర్ణయం

Categories
Bakthi National

గుడికి వెళ్లక్కర్లా : పూజలు..అభిషేకాలు..Liveలోనే..ఇంటినంచే దణ్ణం పెట్టేసుకోండి

కరోనా మనిషి జీవనశైలినే కాదు దేవుళ్లకు జరిగే సేవలకు కూడా స్టాప్ బోర్డు చూపించేసింది. అన్ని దేవాలను మూసి వేసే పరిస్థితి తెచ్చింది కరోనా. కరోనా కట్టడిలోభాగంగా లాక్ డౌన్ లో దేశంలోని దాదాపు అన్ని దేవాలను మూతపడ్డాయి. 

ఈ క్రమంలో లాక్ డౌన్ సడలింపులు జరుగుతున్నక్రమంలో దేవాలయాల్లో నిర్వహించే పూజా కార్యాక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.  కానీ ఆలయాల్లో భక్తుల రద్దీ ఉండకుండా చూసుకోవాలని కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే యోచనలో ఉంది. 

ఈ  సమాచారాన్ని భక్తులకు తెలియజేయటానికి..ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరించడానికి ఓ యాప్‌ను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అమలులోకొస్తే..భక్తులు గుడికి రానక్కర్లేదు. ఇంటినుంచే భగవంతుడికి దణ్ణం పెట్టేసుకోవచ్చన్నమాట. చూసారా..కలికాలం..కాదు కాదు కరోనా కాలం..ఎంత పనిచేసింది. 

Read: ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం