Categories
Business

టిక్-టాక్ నిషేధం నిర్ణయంపై అమెజాన్ వెనకడుగు

అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, చైనా యాప్ టిక్-టాక్‌ను తొలగించమని తన ఉద్యోగులను కోరుతూ ఈ-మెయిల్ పంపింది. అయితే ఈ మెయిల్ పంపిన కొన్ని గంటల తర్వాత అమెజాన్ మెయిల్ పొరపాటున జరిగిందంటూ వెల్లడించింది. మా ఉద్యోగులలో కొంతమందికి పొరపాటున ఒక ఈ-మెయిల్ పంపబడిందని అమెజాన్ ప్రకటించింది.

తాము పంపే ఈ-మెయిల్స్‌లోని సమాచారం టిక్‌టాక్‌ ద్వారా తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా మొబైల్ ఫోన్ల నుంచి ప్రతి అమెజాన్ ఉద్యోగి ఆ యాప్‌ను తొలగించాలని ఇటీవల ఈ-మెయిల్స్ పంపింది. ఈ క్రమంలో ల్యాప్‌టాపుల్లో మాత్రమే టిక్‌టాక్‌ను వాడొచ్చని తెలిపింది.

అయితే, ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు మరో ప్రకటన చేసింది. టిక్‌టాక్‌పై బ్యాన్ ప్రకటన పొరపాటున చేశామని అమెజాన్ చెప్పుకొచ్చింది. టిక్‌టాక్‌పై విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని మాత్రం కంపెనీ చెప్పలేదు. ఇప్పటికే టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ యాప్‌పై నిషేధం విధించాలనే యోచనలో ఉన్నారు.

Categories
Business

రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర…వెండి పరుగు

గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హై రికార్డు క్రియేట్ చేసింది. బంగారం ధర బాటలోనే మరో మెటల్ కేజీ సిల్వర్ రేటు కూడా పరుగులు పెడుతుంది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి రేటు కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్ లో కూడా బంగారం ధర ర్యాలీ చేసిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్ సంగతి చూస్తే శుక్రవారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 మేర జంప్ చేసింది. దీంతో తులం బంగారం ధర రూ.51,460 చేరింది. ఇదే ఆల్ టైమ్ హైఎస్ట్ రేటు.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయల పెరుగుదలతో రూ.47,180 కు చేరింది. కేజీ వెండి రేటు ఏకంగా రూ.1,880 పెరుగటంతో కిలో గ్రామ్ సిల్వర్ రూ. 51,900 చేరింది. వెండి తయారీ యూనిట్ల నుంచి డిమాండ్ పెరగటం సిల్వర్ కాయిన్స్ కు డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణంగా తెలుస్తుంది. గోల్డ్ రష్ ఇంటర్నేషనల్ గానూ కంటిన్యూ అయింది.

ఔన్స్ గోల్డ్ రేట్ 0.13 శాతం పెరగడంతో 1806 డాలర్ల స్థాయికి చేరింది. ఇన్ ప్లెషన్ పెరగడం చైనా, అమెరికా మధ్య పెరిగిపోయిన అగాధం వంటి గ్లోబల్ రీజన్స్ బంగారం ధరలో పెరుగుదలకు ప్రాథమిక కారణాలుగా తెలుస్తోంది. ఈ పరుగు ఇక్కడితో ఆగదని ముందే అంచనాలు ఉన్నా.. ఒక్క నెలలోనే బంగారం పాత రికార్డు బద్దలు కొట్టి తులం రేట్ దాదాపు 52 వేలకు చేరటం విశేషం.

Categories
Business National

బిలియనీర్ల లిస్ట్ లో వారెన్ బఫెట్ ని బీట్ చేసిన ముకేశ్ అంబానీ

ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ () అధినేత ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించాడు. నికర విలువపరంగా ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అంబానీ అధిగమించారు.

2012లో ప్రారంభమైన బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం… బఫెట్‌ సంపద గురువారానికి 67.9 బిలియన్ డాలర్లుండగా, ముకేశ్ అంబానీ 68.3 బిలియన్ల సంపదతో ఆయనను వెనక్కి నెట్టారు.

అంబానీ ఇప్పుడు భూమి మీద నివసిస్తున్నఅత్యంత ధనవంతుల్లో ఎనిమిదో వాడు. బఫెట్‌ తొమ్మిదోస్థానంలో ఉన్నాడు
పేస్ బుక్ , సిల్వర్ లేక్ వంటి సంస్థల నుంచి జియోలోకి బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడంతో అంబానీ షేర్లు మార్చిలో కనిష్టస్థాయి నుంచి రెట్టింపయ్యాయి.

ఈ వారం బఫెట్‌ 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు ఇవ్వడంతో ఆయన సంపద తగ్గింది. గత నెల ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల క్లబ్‌లో ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా అంబానీ నిలిచిన విషయం తెలిసిందే.

Categories
Business

కొండెక్కిన బంగారం ధరలు.. 10గ్రాములు 51,460రూపాయలు

ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వసూలు చేయడం వల్ల భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత మార్కెట్‌లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 470 పెరిగి రూ. 51,460కి చేరుకుంది.

ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1,880 పెరిగి రూ. 51,900కి చేరుకోగా.. న్యూఢిల్లీలో బంగారం ధర రూ. 50,184గా, ముంబైలో రూ. 49,239గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం.. ఇన్వెస్టర్లు ఎక్కువగా డబ్బులు బంగారంపై పెట్టడం బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,800 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 18 డాలర్లను మించిపోయింది. బంగారం ధరల పెరుగుదల మరికొంతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండగా.. కొనుగోళ్లు పెరగొచ్చునని సమాచారం.

Read Here>>ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన: సెప్టెంబర్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

Categories
Business

హాంకాంగ్ ఫైనాన్స్ రంగ నిపుణులను ముంబై ఆకర్షిస్తుందా?

ముంబైని ఫైనాన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా వచ్చాయి. కానీ , అందుకు ఫైనాన్స్ రంగంలో సంస్కరణలు అవసరం అయ్యాయి. అందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదు. అందుకే ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి. ఇప్పుడు హాంకాంగ్ నుంచి ఫైనాన్స్ రంగ నిపుణులను ముంబై ఆకర్షిస్తుందా? అందుకు ముంబై సిద్ధంగా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.వాస్తవానికి ఆసియాలో ముంబైని ఫైనాన్సియల్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలు గతంలోనే జరిగాయి. పెర్సీ మిస్త్రీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ 2007లో దీనిపై తన రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేసింది. గ్లోబల్ ఫైనాన్సియల్ హబ్‌గా ఎదగడానికి అవసరమైన నిపుణులు ముంబైలో ఉన్నారు. కానీ, అందుకు అవసరమైన మౌలిక వసతులు మాత్రం ముంబై‌లో లేవు.

ముంబై గ్లోబల్ ఫైనాన్సియల్ హబ్‌గా ఎదగాలంటే ముందు ఫైనాన్స్ రంగం‌లో సంస్కరణలు అమలు చేయాలని ఆ రిపోర్ట్ సిఫార్సు చేసింది. లండన్ లేదా న్యూయార్క్ తరహాలో వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. అమలు చేస్తే రిజర్వు బ్యాంకు స్థాయి తగ్గించాల్సి ఉంటుంది. అంతే కాదు అత్యధిక బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కానీ అవన్నీ అప్పుడు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు. దాంతో గ్లోబల్ ఫైనాన్సియల్ హబ్‌గా ముంబైని తీర్చిదిద్దాలన్న అప్పటి కల చెదిరింది. అప్పటికీ ఇప్పటికీ ముంబై పెద్దగా మారలేదు. కాకపోతే టెలీకమ్యూనికేషన్ల వ్యవస్థ, డేటా సముపార్జన మెరుగయ్యింది. హాంకాంగ్‌కు ముంబైకి కొన్ని పోలికలున్నాయి. కొన్ని తేడాలున్నాయి.

ముంబై కన్నా హాంకాంగ్ జనాభా అధికమన్నారు. ముంబైకన్నా హాంకాంగ్‌లో యువకుల సంఖ్య అధికంగా ఉంటుంది. హాంకాంగ్‌లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. హాంకాంగ్‌లో గృహ వసతి చౌక. ముంబైలో అది అత్యధికంగా ఉంది. హాంకాంగ్‌లో జీవన వ్యయం తక్కువ. ముంబైలో జీవన వ్యయం ఎక్కువ. ముంబైకాన్నా హాంకాంగ్‌లో ఉష్ణోగ్రతలు అధికం. హాంకాంగ్‌లో తక్కువ ఖర్చుతో ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. ముంబైలో రవాణా ఖర్చు ఎక్కువ. పోలికలూ, తేడాలు పక్కన పెడదాం.

అప్పటికీ, ఇప్పటికీ మార్పుల సంగతి కూడా ప్రస్తుతానికి పక్కన పెడితే… హాంకాంగ్ ఎదుర్కుంటున్న పరిస్థితి దృష్ట్యా ముంబై మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. చట్ట బద్దమైన పాలన, స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశమంటున్నారు. ఇప్పుడు హాంకాంగ్ ఫైనాన్స్ రంగం కోల్పోతోంది. ముంబైలో పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెడితే సరిపోతుంది. మౌలిక వసతులు మెరుగుపడితే ముంబైని మించిన నగరం లేదనే వాదన వినిపిస్తోంది.

Read:వర్క్ ఫ్రమ్ హోమ్ తో వచ్చే ఆరోగ్య సమస్యలు మీకు తెలుసా..?

Categories
Business

కరోనా ఎఫెక్ట్: 7500 ఉద్యోగాల కోత

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయుక్తంగా 7,500 ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఆగిపోయాయి. విమాన ప్రయాణాలకు కూడా అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఉద్యోగాలు తియ్యక తప్పని పరిస్థితి అని కంపెనీ ప్రకటించింది.

ఈ క్రమంలోనే ఎయిర్‌ ఫ్రాన్స్‌ 6500 మందిని, హాప్‌లో వెయ్యిమందిని తొలగించనున్నామని వెల్లడించాయి. ఎయిర్‌ ఫ్రాన్స్‌లో మొత్తం 41వేలమంది ఉద్యోగులుండగా, హాప్‌లో 2400మంది పని చేస్తున్నారు. కరోనా దెబ్బకు మూడు నెలల్లో తమ ట్రాఫిక్ 95 శాతం పడిపోగా.. రోజుకు 15 మిలియన్ యూరోల నష్టం వచ్చిందని ఎయిర్‌ ఫ్రాన్స్‌ ప్రకటించింది. 2024 వరకు కోలుకునే ఆశలు లేవని చెబుతున్నారు.

సిబ్బంది ప్రతినిధులతో ఒక రోజు చర్చలు జరిపిన తరువాత, 2022 నాటికి ఎయిర్ ఫ్రాన్స్‌లో 41,000 ఉద్యోగాల్లో 6,500, హాప్‌లో 2,400 ఉద్యోగాల్లో 1,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. తొలగింపులను విధించే ముందు స్వచ్ఛంద నిష్క్రమణలు మరియు ముందస్తు పదవీ విరమణలను ప్రోత్సహిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ఈ ఏడాది 84 బిలియన్ల నష్టాన్ని అంచనా వేస్తున్నాయి, ఆదాయం సగానికి తగ్గింది. పరిశ్రమ కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోరోవైరస్ మహమ్మారి కారణంగా మూడు నెలల్లో దాని ట్రాఫిక్ 95% పడిపోయిందని, రోజుకు 15 మిలియన్ యూరోలను కోల్పోగా.. 2024 వరకు కోలుకునే అవకాశం లేదని ఎయిర్ ఫ్రాన్స్ తెలిపింది.

Read:జేఈఈ, నీట్-2020 సెప్టెంబర్ వరకు వాయిదా

Categories
Business Technology

Zoomకు పోటీగా JioMeet వచ్చేసింది.. 24 గంటలు ఫ్రీ మీటింగ్స్ కూడా!

భారత అతిపెద్ద టెలికం ఆపరేటర్ రూపొందించిన JioMeet అనే కొత్త మీటింగ్ యాప్ ఆన్ లైన్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రముఖ పాపులర్ మీటింగ్ యాప్ Zoomకు పోటీగా భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇందులోని ఫీచర్లు, అచ్చం Zoom యాప్ మాదిరిగానే పనిచేస్తోంది. అంతేకాదు… 24 గంటల పాటు యూజర్లు ఉచితంగా మీటింగ్స్ కనెక్ట్ అయ్యేందుకు అనుమతి ఇస్తోంది.

JioMeet: A true-blue Zoom copy :
జియో మీట్ యాప్.. అచ్చం చూడటానికి దీని ఇంటర్ ఫేస్… ఫీచర్లు అచ్చం Zoom Copy మాదిరిగానే కనిపిస్తాయి. ట్రూ బ్లూ జూమ్ డిజైన్ తో కొత్తగా ఆకర్షణీయంగా ఉంది. బ్లూ లోగోపై వైట్ కలర్ ఉంది. మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల అడ్రస్ ద్వారా Sign Up అవ్వొచ్చు.

  • 100 మంది సభ్యుల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ వీడియో కాల్స్ చేసుకోవచ్చు.  వాస్తవానికి ఈ ప్లాట్ ఫాం.. వినియోగదారులను నిరంతరాయంగా 24 గంటల పాటు సుదీర్ఘ మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. అన్ని మీటింగ్స్ ఉచితంగా అందిస్తోంది.
  • అదే Zoom యాప్ ప్లాట్ ఫాంలో మాత్రం గరిష్టంగా 40 నిమిషాల వరకు ఉచితంగా కనెక్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది. మిగతా జియో మీట్ ఫీచర్లు జూమ్ మాదిరిగానే ఉన్నాయి. పాస్ వర్డ్ ప్రోటెక్టడ్ మీటింగ్ లింక్స్ షేరింగ్ చేసుకోవచ్చు.
  • Waiting Rooms క్రియేట్ చేసుకోవచ్చు. Screens షేర్ చేసుకోవచ్చు. కాల్స్ సమయంలోనూ Chat చేసుకోవచ్చు. జూమ్ మాదిరిగానే ఇతర జూమ్ సభ్యులకు కంట్రోలింగ్ ఎబిలిటీ ఇవ్వొచ్చు.

ప్రస్తుతం.. Jio Meet యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ డివైజ్ ల్లో సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. Legacy Video కాన్ఫరెన్సింగ్ సిస్టమ్స్ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక Jio Meet యూజర్ ఒకే సమయంలో 5 వేర్వేరు డివైజ్ ల్లో నుంచి లాగిన్ అవ్వొచ్చు. కాల్స్ మాట్లాడుతున్న సమయంలోనూ ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ మధ్య Switch అవ్వొచ్చు.
JioMeet is a Zoom copy that allows 24-hour-long meetings for free

ఇంతకీ.. ఇది సెక్యూరేనా? :
ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే… JioMeet కాల్స్ encrypted చేయడం జరిగిందని తన వెబ్ సైట్లో కంపెనీ వెల్లడించింది. కానీ, end-to-end encryption వినియోగం ఉందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.

* అదే Zoom ప్లాట్ ఫాంలో మాత్రం Upgraded తో పాటు encryption మౌలిక సదుపాయాలతో సెక్యూర్ కలిగి ఉంది. జూమ్ మాదిరిగా జియో మీట్ కూడా ఇతర వీడియో కాలింగ్ సర్వీసులకు గట్టి పోటీదారునిగా మార్కెట్లోకి వచ్చింది.

Where is JioMeet available?
Zoom వీడియో ప్లాట్ ఫాం మాదిరిగా Jio Meet కూడా గ్లోబల్ సర్వీసు లేదా ఇండియాలో మాత్రమే వర్క్ చేస్తుందా అనడానికి స్పష్టత లేదు. ప్రపంచంలోని ఇతర దేశాల్లోని యూజర్లు కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ యాక్సస్ చేసుకున్నామని అంటున్నారు. ఈ విషయంలో రిలయన్స్ జియో స్పష్టత ఇవ్వాల్సి  ఉంది.

Categories
Business Technology

పేటీఎం నుంచి ఫ్లిప్ కార్ట్ : చైనా పెట్టబడులతో భారతీయ యాప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?

దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత దృష్ట్యా  అత్యంత పాపులర్ అయిన టిక్‌టాక్, UC బ్రౌజర్‌తో సహా 59 యాప్స్ చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభన, గల్వాన్ లోయలో చైనా దళాలతో 20 మంది భారత ఆర్మీ సిబ్బందిపై దాడి చేయడంతో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దేశీయ యాప్‌లతో పాటు, భారతీయ స్టార్టప్‌లు, డిజిటల్ టెక్ కంపెనీలైన పేటీఎం నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు అనేక రంగాలలో చైనా పెట్టుబడులు పెట్టాయి. భారత ఆర్థిక వ్యవస్థలో చైనా లోతుగా పాతుకుపోయిందనడంలో సందేహం అక్కర్లేదు.

ఒక్క 2019 ఏడాదిలోనే చైనా టెక్ కంపెనీలు ఇండియాలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి సుమారు 19 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాయని విదేశీ పెట్టుబడి మానిటర్ ‘FD Markets’ వెల్లడించింది. చైనా పెట్టుబడి దిగ్గజాలు అలీబాబా గ్రూప్, Tencent, Steadview క్యాపిటల్, Didi Chuxing భారతదేశంలోని 30 Unicorn కంపెనీలలో 18కి  పైగా పెట్టుబడులతో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఇండియాలో ఈ 18 Unicorn కంపెనీలు బిగ్‌బాస్కెట్, జోమాటో, Delhivery, Byju’s Flipkart, Make my trip, Paytm వరకు 3,500 మిలియన్ డాలర్ల వరకు చైనా పెట్టుబడులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. అంతగా చైనా తన మార్కెట్‌ను భారతదేశంలో విస్తరించింది.

చైనా పెట్టుబడి పెట్టిన యాప్స్ జాబితా :

1. Paytm (Pay Through Mobile) :
2010లో విజయ్ శేఖర్ శర్మ ఈ పేటిఎమ్ యాప్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రీపెయిడ్ మొబైల్, DTH, Dat Card కోసం ఆన్‌లైన్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌గా పేటీఎం ప్రారంభమైంది.  ఈ పేటీఎం యాప్ కోసం వ్యవస్థాపకుడి నుంచి 2 మిలియన డాలర్ల ప్రారంభ పెట్టుబడితో మొదలైంది. ప్రస్తుతం తన సొంత సంస్థలో 20శాతం కన్నా తక్కువ వాటా కలిగి ఉన్నారు వ్యవస్థాపకుడు విజయ్ శర్మ. చైనా టెక్నాలజీ దిగ్గజం అలీబాబా పేటీఎంలో 40శాతం వాటాను కలిగి ఉంది. అలీబాబా, SAIF భాగస్వాములు ఇద్దరూ కలిసి Paytmలో 60శాతం వాటా పెట్టారు. చైనీస్ ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా నుంచి నిధులు పొందిన మొదటి భారతీయ సంస్థ కూడా ఇదే. ఇప్పుడు 625 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తోంది.

Ola :
2010లో భవిష్ అగర్వాల్, అంకిత్ భాటి OLA యాప్ ప్రవేశపెట్టారు. 2014లో స్టీడ్‌వ్యూ క్యాపిటల్ నుంచి మొదటి చైనా పెట్టుబడిగా పొందింది. 2018లో చైనీస్ గేమింగ్ behemoth టెన్సెంట్ హోల్డింగ్స్ సాఫ్ట్‌బ్యాంక్, RNT క్యాపిటల్‌తో పాటు 1.1 బిలియన్ డాలర్ల భారీ నిధులను సమకూర్చింది. దాంతో ఒక ప్రధాన వాటాదారుగా నిలిచింది ఓలాలో 10.4శాతం వాటాను కలిగి ఉంది.

Swiggy :
2014లో శ్రీహర్ష మెజెటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమిని స్విగ్గి ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఓలా మొదటి సంస్థ హాంగ్ కాంగ్‌కు చెందిన SAIF పార్టనర్లతో పాటు అమెరికాకు ఆధారిత Accelతో కలిసి 2015లో తన మొదటి సంస్థాగత నిధుల్లో 2 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. అప్పటి నుంచి చైనా కంపెనీలు Meituan-Dianping, Tencent Holdings and Hillhouse Capital Group 500 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ఇప్పటివరకూ Swiggy మొత్తం 1.6 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టారు.

Hike Messenger :
స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టంట్ మెసేజ్ సర్వీసుల కోసం చైనా ఇంటర్నెట్ దిగ్గజం Tencent హోల్డింగ్స్, తైవాన్ Foxconn టెక్నాలజీ గ్రూప్ నిధులు సమకూరుస్తున్నాయి. ఈ సంస్థ  విలువ సుమారు 1.4 బిలియన్ డాలర్లు. ఇప్పటివరకు సేకరించిన మొత్తం నిధులు 261 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

Snapdeal :
2010లో కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ చేత ఈ Snapdeal యాప్‌ను స్థాపించారు. స్నాప్ డీల్ విలువ-కేంద్రీకృత ఆన్‌లైన్ మార్కెట్, భారతదేశం అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటి.. మొత్తం 1.8 బిలియన్ డాలర్లకు సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్, కలరి క్యాపిటల్, నెక్సస్ వెంచర్స్, ఈబే ఇంక్ పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఉన్నాయి.

BigBasket :
2011 ఏడాదిలో అభినయ్ చౌదరి, హరి మీనన్, విపుల్ పరేఖ్, V.S. సుధాకర్ బిగ్‌బాస్కెట్ స్థాపించారు. భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్, కిరాణా ఆన్‌లైన్ స్టోర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు, బిగ్‌బాస్కెట్ 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. వీటిలో ఎక్కువ భాగం విదేశీ పెట్టుబడిదారుల నుంచే నిధులు వచ్చాయి. 2018లో E సిరీస్ రౌండ్లో 300 మిలియన్ డాలర్లను సేకరించింది. ఈ కంపెనీకి సాయం చేసిన అలీబాబా.. బిగ్‌బాస్కెట్ అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. 2019 నాటికి అలీబాబా గ్రూప్ ఇప్పటికీ కంపెనీలో 26.26శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది.

Zomato :
2008 ఏడాదిలో దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా స్థాపించారు. భారత ఆన్‌లైన్ దిగ్గజం Info Edge నిధులు సమకూర్చింది. అలీబాబా ఆర్థిక సేవల సంస్థ  యాంట్ ఫైనాన్షియల్ 2018లో 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో Zomatoలో వాటాదారుగా ఉంది. అదే సంవత్సరం నుంచి యాంట్ ఫైనాన్షియల్ మరో 210 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. జోమాటో మొత్తం 914.6 మిలియన్ డాలర్లను సేకరించింది.

OYO :
2012 ఏడాదిలో 18 ఏళ్ల కాలేజీ డ్రాప్-అవుట్ రితేష్ అగర్వాల్ OYO సంస్థను ప్రారంభించారు. తన పెట్టుబడిదారుల నుంచి OYO కోసం 3.2 బిలియన్ డాలర్లను సేకరించారు. జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ 48శాతం యాజమాన్యంతో మెజారిటీ వాటాదారుగా ఉంది.

Flipkart :
ప్రముఖ దిగ్గజ వ్యాపారులైన సచిన్, బిన్నీ బన్సాల్ సంయుక్తంగా Flipkart స్థాపించారు. ఈ ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో 81శాతం వాల్‌మార్ట్ కలిగి ఉంది. కంపెనీలో మైనారిటీ వాటాను కలిగిన చైనా పెట్టుబడిదారులు ఇప్పటికీ ఇందులో ఉన్నారు. ఇప్పటి వరకు, ఫ్లిప్‌కార్ట్ మల్టీపుల్ ఇన్వెస్టర్ల నుంచి 7.7 బిలియన్ డాలర్లను సేకరించింది. చైనా పెట్టుబడిదారుల్లో టెన్సెంట్ హోల్డింగ్స్, స్టీడ్‌వ్యూ క్యాపిటల్ పెట్టుబడిదారులకు కూడా వాటా ఉంది.

Make My Trip :
భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థలలో ఒకటిగా Make My Trip అవతరించింది. ఇటీవల Ibibo గ్రూప్‌ను కొనుగోలు చేసింది. Naspers (దక్షిణాఫ్రికా బేస్డ్) టెన్సెంట్ (చైనీస్ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ కంపెనీ) సంయుక్తంగా Ibiboలో 91శాతం, 9శాతం వాటాతో కొనసాగుతున్నాయి.

Categories
Business Latest

ఇంటెల్-జియో భారీ డీల్: 11వారాల్లో 12వ పెట్టుబడి..

అమెరికన్ ఇంటెల్ క్యాపిటల్ 0.39% ఈక్విటీ కోసం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1,894.5 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇంటెల్ అత్యుత్తమ కంప్యూటర్ చిప్‌లను తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందగా.. ఇప్పుడు జియోలో పెట్టుబడి పెట్టింది.

జియో ప్లాట్‌ఫామ్‌లలో ఇంటెల్ క్యాపిటల్ 1,894.50 కోట్లు రూపాయల పెట్టుబడి పెట్టనుండగా.. వరుస పెట్టుబడులతో రికార్డు క్రియేట్‌ చేస్తున్న ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.39 శాతం ఈక్విటీ వాటా ఇంటెల్ క్యాపిటల్‌కు దక్కనుంది.

జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు ఏప్రిల్ 22న ఫేస్‌బుక్‌తో ప్రారంభం అవగా.. తరువాత సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబాడ్లా మరియు సిల్వర్ లేక్ అదనపు పెట్టుబడులు పెట్టాయి. తరువాత పెట్టుబడిని అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఎడిఐఎ), టిపిజి, ఎల్ కాటర్టన్ మరియు పిఐఎఫ్ కూడా ప్రకటించాయి.

ఇంటెల్ క్యాపిటల్.. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు 5జి వంటి టెక్నాలజీ రంగాలలో పనిచేస్తుంది. వినూత్న సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టింది. ఇంటెల్ క్యాపిటల్ ఇంటెల్ కార్పొరేషన్ రెండు దశాబ్దాలుగా భారతదేశంలో పనిచేస్తోంది. బెంగుళూరు మరియు హైదరాబాద్‌లో అత్యాధునిక డిజైన్ సౌకర్యాలతో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, ప్రపంచ సాంకేతిక నాయకులతో మా సంబంధాన్ని మరింతగా పెంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ సమాజంగా మార్చాలనే లక్ష్యంలో ఇవి మాకు సహాయపడతాయి.

ఇంటెల్ క్యాపిటల్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో విలువైన భాగస్వామిగా నిలిచిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలను శక్తివంతం చేసేందుకు 130 కోట్ల మంది భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో భారతదేశ సామర్థ్యాలను ముందుకు తీసుకురావడానికి ఇంటెల్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. కొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న నిజమైన పరిశ్రమ లీడర్‌ ఇంటెల్‌ అని అంబానీ అన్నారు.

Read:INDIGO ఆఫర్..ఛార్జీలపై 25 శాతం తగ్గింపు..వారికి మాత్రమే

Categories
Business Latest

ముంబై ఎయిర్ పోర్టు స్కాంలో GVK గ్రూప్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ కేసు!

దేశంలో విద్యుత్, నిర్మాణ రంగంతో పాటు పలు కీలక రంగాల్లో సేవలందిస్తున్న జీవీకే గ్రూప్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి పనుల్లో అవినీతికి సంబంధించి సీబీఐ జీవీకే అధినేత కృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిపైనా కేసు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కీలక రంగాల్లో పేరు ప్రతిష్టలున్న కృష్ణారెడ్డి కుటుంబంపై కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధ మియాల్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది.

జీవీకే గ్రూప్ లోని ఇతర సంస్ధలకు ఆర్ధిక సాయం చేసే పేరుతో మరో రూ. 395 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఈ కేసులో గుర్తించింది. ప్రస్తుతం జీవీకే కృష్ణారెడ్డి గ్రూప్ ఛైర్మన్ గా ఉండగా.. ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ ఎండీగా ఉన్నారు. వీరిద్దరు ప్రమోటర్లుగా ఉన్న గ్రూప్ లోని ఇతర కంపెనీల కోసమే ఈ మొత్తాన్ని దారి మళ్లించినట్లు CBI ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఇందులో మరో 9 సంస్ధలతో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని పలువురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సీబీఐ నిర్ధారించింది. వీరందరినీ త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ది కాంట్రాక్టు దక్కించుకున్న జీవీకే గ్రూప్ కు చెందిన ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ కు అందులో 38.07 శాతం వాటా ఉంది. అలాగే ఎయిర్ పోర్ట్ ఆథారిటీకి 26 శాతం వాటా ఉంది. 2012 నుంచి ఎయిర్ పోర్టు అభివృద్ధికి వెచ్చించాల్సిన రూ.395 కోట్ల రిజర్వు ఫండ్స్ ను తన గ్రూప్‌ కంపెనీలకు జీవీకే అధినేత, ఆయన కుమారుడు మళ్లించినట్లు సీబీఐ తమ FIRలో ఆరోపించింది. బోగస్ కాంట్రాక్టుల ద్వారా కూడబెట్టిన రూ.310 కోట్లు, రూ.395 కోట్ల దారి మళ్లింపు మొత్తం కలిపి రూ.705 కోట్లు అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదు చేసింది.