Categories
Crime National

సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ఐదుగురి మృతి

సరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జలపాతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

పాల్గర్ జిల్లా జవహర్ టౌన్ సమీపంలోని కాల్మండ్వి జలపాతం చూడటానికి 13 మంది సభ్యుల బృందం గురువారం అక్కడకు చేరుకుంది. అందులోని ఇద్దరు వ్యక్తులు సెల్ఫీలు తీసుకునే క్రమంలో కొంచెం నీటి లోపలకు వెళ్ళారు. అప్పటికే అక్కడ నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. నీటిలోకి వెళ్లిన వారు ఉధృతి తట్టుకోలేక కిందపడిపోయి నీటిలో కొట్టుకు పోసాగారు.

వారిని రక్షించేందుకు నీటిలోకి దూకిన మరో ముగ్గురు కూడా నీటి ప్రవాహా వేగానికి కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్ధలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశాయి. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

 

Categories
Crime Latest

మాయమాటలు చెప్పి బాలికను రేప్ చేసి హత్య చేసిన దుండగుడు

తమిళనాడులోని పుదుక్కోటైలో దారుణం జరిగింది. ఏడేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, హత్యచేశాడో దుండగుడు. పుదుక్కోటై జిల్లాలోని ఎంబాల్ గ్రామంలోని చెరువులో ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు.  బాలిక హత్య కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల ఎం.రాజా అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మంగళవారం, జూన్ 30 వ తేదీ సాయంత్రం తమ కుమార్తె కనిపించటం లేదని బాలిక తండ్రి ఎంబాల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం నాడు బాలిక మృతదేహాన్ని స్ధానికంగా ఉన్న ఎండిపోయిన చెరువులో కనుగొన్నారు. పోలీసులు బాలిక శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.

బాలికను చివరిసారిగా గ్రామంలో ఆమె ఇంటి సమీపంలో ఉండే రాజా అనే వ్యక్తితో చూసినట్లు స్ధానికులు తెలిపారు. పోలీసులు రాజాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. బాలికను ఊళ్లోని దేవాలయానికి  తీసుకువెళ్లి అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.  అక్కడ బాలికపై అత్యాచారం చేయబోగా బాలిక కేకలు వేసింది. దీంతో నిందితుడు సమీపంలోని చెక్కతో బాలికను చావ బాది పారిపోయాడు.

నిందితుడు రాజాపై ఐపీసీ సెక్షన్ 364, 376,302 సెక్షన్లు కింద పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ చట్టం.. సెక్షన్ 3 (2) (వి) కింద కేసులు నమోదు చేశారు. కాగా… బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని బాధితురాలి సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం ఈ.కే. పళని స్వామి ప్రకటించారు.

Read:యూపీ పోలీసులను చంపిన వ్యక్తి వెనుక ఉంది ఎవరు.. 60 మర్డర్ కేసుల్లో నిందితుడు?

Categories
Crime Latest National

రేప్ ని ప్రతిఘటించినందుకు సజీవంగా కాల్చేశాడు

చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి తగల బెట్టాడు ఒక రాక్షసుడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మరణించింది. చత్తీస్ ఘడ్ లోని ముంగేలి జిల్లాలోని కొత్వాలి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

గ్రామంలోని ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు బబ్లూ భాస్కర్ అనే 30 ఏళ్ల యువకుడు. గతంలో కొన్నిసార్లు ఆమెను లైంగికంగా వేధించిన భాస్కర్… జూన్ 30 వ తేదీ మంగళవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న బాలికను బలాత్కరించబోయాడు. తన మానాన్ని కాపాడుకోపాటానికి భాస్కర్ ప్రయత్నాలను బాలిక అడ్డుకుంది. శాయశక్తులా ప్రయత్నించి అతడి ప్రయత్నాన్ని విఫలం చేసింది.  కోపంతో రగిలిపోయిన భాస్కర్ ఇంటిలోని కిరోసిన్ బాలికపై పోసి నిప్పంటించాడు.

వంటిపై మంటలు వ్యాపించటంతో బాలిక అరుచుకుంటూ బయటకు పరిగెత్తుకు వెళ్లి…రక్షించమని గట్టిగా కేకేలు వేసింది. బాలిక కేకలు విన్న గ్రామస్తులు ఆమె ఒంటిపై మంటలను ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక బుధవారం మరణించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బబ్లూ భాస్కర్ ను అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 506 (క్రిమినల్ బెదిరింపు) మరియు 354  పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ముంగేలి సబ్ డివిజనల్ పోలీసు అధికారి తేజ్రామ్ పటేల్ చెప్పారు.

Read:మూఢ నమ్మకాలతో గుడ్లగూబను బలిచ్చే 11 మంది ముఠా అరెస్ట్

Categories
Crime Latest National

మూఢ నమ్మకాలతో గుడ్లగూబను బలిచ్చే 11 మంది ముఠా అరెస్ట్

సంపద రావాలని, ఆరోగ్యంగా ఉండాలని కొంతమంది జంతువులను బలి ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. బలి ఇవ్వడం వల్ల అంతా మేలు జరుగుతుందని నమ్ముతుంటారు. ఇలాగే..కొంతమంది గుడ్లగూబను బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పంచమహల్స్, మహిసాగర్, సబర్కాంత జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ ఘటన వడోదరలో చోటు చేసుకుంది.

వీరి నుంచి గుడ్లగూబ, తాబేళ్లు, ఓ ముళ్ల పందిలను రక్షించారు. వీరిని అధికారికంగా అరెస్టును ప్రకటించలేదని తెలుస్తోంది. వీరికి కోవిడ్ -19 పరీక్షల తర్వాత…రిమాండ్ కోరుతామని వడోదర ఫారెస్టు డిప్యూటి కన్వర్జేటర్ WL వాఘేలా వెల్లడించారు. వారి ఫోన్లను పరిశీలించగా..జంతువులను పట్టుకొనే వీడియోలు ఉన్నాయన్నారు. కానీ బలి ఇచ్చేందుకు చేశారా ? అనేది తెలియాల్సి ఉందన్నారు.

తమకు వచ్చిన సమాచారం మేరకు…వీరిని పట్టుకొనేందుకు వ్యూహాలు రచించామన్నారు. 22 మంది పోలీసు టీంను ఏర్పాటు చేసి పంచమహల్స్ లో మొదటి నిందితుడిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఇతని విచారించగా…అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కలోల్ నుంచి పోలీసు టీం బయలుదేరి…కదనా తాలూకాలో దీనితో సంబంధం ఉన్న ఇద్దరిని, ఇలా..ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

తాము రక్షించిన మూడు జంతువులు మినహా ఇతర జంతువులు కనిపించలేదని, ప్రాథమిక విచారణలో అటవీ ప్రాంతాల నుంచి జంతువులను పట్టుకున్నారని తేలిందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యం..లాక్ డౌన్ తర్వాత..చాలా మందికి ఉపాధి పోయిందని తెలిపారు. ఈ రాకెట్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read:రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లి.. కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి

Categories
Crime Latest

దుష్టశక్తులు పారదోలతానని, వివాహితపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో దారుణం జరిగింది. దుష్ట శక్తులు పారదోలతానని చెప్పి ఓ మంత్రగాడు వివాహితపై(20) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె భర్తను బెదిరించాడు. బాధితురాలి భర్త ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

భార్య దేహంలోకి దుష్ట శక్తులు చేరాయని అనుమానం:
నోయిడాలో నివాసం ఉండే ఓ వ్యక్తికి ఫిబ్రవరిలో పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన తర్వాతి రోజు నుంచి ఇంట్లో పరిస్థితులు బాగోలేవు. ఇంట్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. అతడికి తన భార్యపై అనుమానం వచ్చింది. ఆమెలోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని దాని వల్లే ఇదంతా జరుగుతోందని అనుమానించాడు. ఈ క్రమంలో మంత్రగాడి దగ్గరికి తన భార్యను తీసుకెళ్లి చూపించాలని నిర్ణయించాడు.

ఆ వెంటనే ఆ వ్యక్తి స్థానికంగా ఉండే మంత్రగాడిని కలిశాడు. జరిగిన విషయం చెప్పాడు. ఆ మంత్రగాడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇళ్లంతా తిరిగాడు. ఆ వ్యక్తి భార్య శరీరంలోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని చెప్పాడు. దాని వల్లే ఇలా జరుగుతోందన్నాడు. ఆ దుష్ట శక్తిని తాను తొలగిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత నువ్వు, నీ భార్య నేను చెప్పిన చోటుకి రావాలన్నాడు. దానికి ఆ వ్యక్తి సరే అన్నాడు. అలాగే మంత్రగాడు రూ.5వేలు కూడా తీసుకున్నాడు.

మత్తు మందు ఇచ్చి వివాహితపై అత్యాచారం:
మంత్రగాడి మాయమాటలు నమ్మిన ఆ వ్యక్తి తన భార్యను తీసుకుని అతడికి దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఏదో పదార్ధాన్ని ఆ ఇద్దరికి మంత్రగాడు ఇచ్చాడు. అది తిన్న వెంటనే భార్య, భర్త స్పృహ కోల్పోయారు. ఇదే అదనుగా ఆ మంత్రగాడు వివాహితపై అత్యాచారం చేశాడు. కాసేపటికి ఇద్దరూ స్పృహ లోకి వచ్చారు. జరిగిన ఘోరం వారికి అర్థమైంది. వారు నోరు తెరిచేలోపే, మంత్రగాడు వారిని బెదిరించాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా అన్నాడు. అయితే ధైర్యం చేసిన భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆ మంత్రగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు మంత్రగాడిని అరెస్ట్ చేశారు. దుష్ట శక్తులు, దెయ్యాలు, భూతాలు మూఢ నమ్మకాలే అని పోలీసులు చెప్పారు. అలాంటివి నమ్మితే ఇలానే మోసపోవాల్సి ఉంటుందన్నారు.

Read:స్వీట్ల ఆశ చూపి పొలాల్లోకి తీసుకెళ్లి 9ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం

Categories
Crime Latest

కామాంధుడు, స్వీట్ల ఆశ చూపి పొలాల్లోకి తీసుకెళ్లి 9ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం

పంజాబ్ రాష్ట్రం పటియాలాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. స్వీట్ల ఆశ చూపి 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. మాయమాటలతో నమ్మించి బాలికను పొలాల్లో తీసుకెళ్లిన ఆ నీచుడు దురాఘాతానికి పాల్పడ్డాడు.

స్వీట్ల ఆశ చూపి చిన్నారిపై అత్యాచారం:
పటియాలా జిల్లా సామ్నాలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు కూలీలు. బాలిక ఇంటికి ఎదురుగా యువకుడు నివాసం ఉంటున్నాడు. బాలికపై కన్నేసిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. నీకు స్వీట్లు కొనిస్తాను రా అంటూ బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లిన యువకుడు అక్కడ అత్యాచారం చేశాడు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక భయపడింది.

కామంతో కళ్లు మూసుకుపోయి:
కాగా బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పాపను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన డాక్టర్లకు జరిగిన దారుణం గుర్తించారు. వెంటనే వారు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. వారు బాలికతో మాట్లాడగా జరిగిన విషయాన్ని ఆ పాప చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి అభంశుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

వదినపై అత్యాచారం:
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో మరో దారుణం జరిగింది. 30 ఏళ్ల వ్యక్తి తన వదినపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. కాగా ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది.

Read:కానిస్టేబుల్ పెళ్లి ఊరేగింపులో మొదటిభార్య ఎంట్రీ..షాక్ అయిన వరుడు..తెల్లబోయిన వధువు

Categories
Crime Latest

కావాలనే మర్డర్ చేసి జైలుకెళ్లాడు, రేప్ చేసినోడిని చంపేశాడు.. చెల్లికి అన్యాయం చేసినవాడిపై ప్రతీకారం తీర్చుకున్న అన్న

టైటిల్ చూస్తే సినిమా కథలా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైల్లో ఈ ఘటన జరిగింది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ నరరూప రాక్షసుడిని ఓ అన్న వెంటాడి వేటాడి మరీ హతమార్చాడు. తన మైనర్ సోదరిపై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉండగా, అతడిని హతమార్చేందుకు మర్డర్ చేసి మరీ జైలుకెళ్లాడు. అక్కడ ఆ రాక్షసుడి అంతు చూశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన సెన్సేషనల్ గా మారింది.

2014లో జాకీర్ చెల్లిపై అత్యాచారం చేసిన మెహతాబ్:
ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన జాకీర్(21)కు ఒక్కగానొక్క చెల్లెలు. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. 2014లో దారుణం జరిగిపోయింది. నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) జాకీర్ మైనర్ చెల్లిపై అత్యాచారం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహతాబ్‌కు శిక్ష పడేలా చేశారు. అతడిని తీహార్ జైలుకి తరలించారు. కాగా, అత్యాచారం ఘటనతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు జరిగిన అన్యాయాన్ని అన్నకి చెప్పుకుని బోరున విలపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆత్మహత్య చేసుకుంది.

చెల్లి మరణానికి కారణమైన వాడిపై పగ పెంచుకున్న అన్న:
పోలీసులు మెహతాబ్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపినా.. సోదరి మరణాన్ని అన్న జాకీర్ తట్టుకోలేకపోయాడు. తన చెల్లెలిని రేప్ చేసి, మరణానికి కారణమైన మెహతాబ్‌ పై పగ, ప్రతీకారం పెంచుకున్నాడు. తన చెల్లికి తీరని అన్యాయం చేసిన ఆ నరరూప రాక్షుసుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ… మెహతాబ్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. దీంతో అతడిని ఎలా చంపాలో అర్థం కాలేదు. సరైన అవకాశం కోసం ఎదురుచూశాడు. ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి. ప్రతి రోజూ… అదే ఆలోచన. ఇలా ఏళ్లు గడిచాయి. జాకీర్ మైనర్ నుంచి మేజర్ అయ్యాడు. పక్కా ప్రణాళికను రచించాడు.

తీహార్ జైలుకి వెళ్లేందుకు మర్డర్ చేసిన జాకీర్:
తీహార్ జైల్లోనే మెహతాబ్‌ను మర్డర్ చేయాలని జాకీర్ డిసైడ్ అయ్యాడు. అయితే ఆ జైల్లోకి ఎంటర్ కావాలంటే తానూ ఓ నేరం చేయాల్సిందే అని తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ నేరం చేశాడు. 2018 జులైలో కావాలనే రిక్షా డ్రైవర్ ను హత్య చేసి అరెస్ట్ అయ్యాడు. అప్పుడు జాకీర్ వయసు 20 ఏళ్లు. పోలీసులు అతన్ని కూడా తీహార్ జైలుకి తరలించారు. అయితే మెహతాబ్ ఉంటున్న వార్డు.. జాకీర్ ఉంటున్న వార్డు వేర్వేరు. క్రూరమైన, తీవ్రమైన నేరం చేసిన వారిని ఉంచే వార్డులో మెహతాబ్ ను పోలీసులు ఉంచారు. జాకీర్ వయసు 20 ఏళ్లే కావడంతో పోలీసులు అతడిని వేరే వార్డులో ఉంచారు. దీంతో జాకీర్ సమయం కోసం వేచి ఉన్నాడు. ఇలా మరో ఏడాది గడిచింది. జాకీర్ కి 21 ఏళ్లు వచ్చాయి. దీంతో అతడిని మెహతాబ్ ను ఉంచిన వార్డు సమీపంలోని వార్డులోకి షిఫ్ట్ చేశారు.

పథకం ప్రకారమే తోటి ఖైదీలపై దాడి:
ఎలాగైనా మెహతాబ్ ఉంటున్న వార్డులోకి వెళ్లేందుకు జాకీర్ మరో ప్లాన్ వేశాడు. తన వార్డులో ఉన్న తోటి ఖైదీలపై దాడి చేశాడు. జాకీర్ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. జాకీర్ ను క్రూరమైన, తీవ్ర ఖైదీగా జైలు అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని మెహతాబ్ వార్డులోకి మార్చారు. దీంతో జాకీర్ చాలా ఆనందించాడు. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంబరపడ్డాడు. అక్కడ తన శత్రువుని చూసిన జాకీర్ తెగ ఖుషీ అయ్యాడు. ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురుచూశాడు. ఇంతలో ఓ పదునై ఆయుధాన్ని(మెటల్ స్ట్రిప్) కూడా సంపాదించాడు. ఈ క్రమంలో జూన్ 27న ఉదయాన ఖైదీలంతా ప్రార్థనలు చేసే సమయంలో మెహతాబ్‌ పై జాకీర్ దాడి చేశాడు. అతడిని కసితీరా కసాకసా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మెహతాబ్‌ను జైలు అధికారులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఇలా తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఓ అన్న పగ తీర్చుకున్నాడు.

ఆ నరరూప రాక్షసుడిని చంపి పగ తీర్చుకున్నా:
జాకీర్ తీరుతో పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఎందుకిలా చేశావని ప్రశ్నించగా, జాకీర్ చెప్పిన సమాధానం విని వారు మరింత విస్తుపోయారు. “పగ తీర్చుకున్నా” అని జాకీర్ చెప్పాడు. ఏంటా పగ అని పోలీసులు అడిగితే… అసలు విషయం చెప్పాడు జాకీర్. ఇప్పుడు నా చేతిలో చచ్చిన మెహతాబ్… 2014లో తన సోదరిని రేప్ చేశాడని, ఆమె మరణానికి కారణం అయ్యాడని తెలిపాడు. తన చెల్లి మరణానికి కారణమైన ఆ నరరూప రాక్షసుడిని జైల్లోనే చంపి ప్రతీకారం తీర్చుకున్నా అని జాకీర్ చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.

చెల్లికి అన్యాయం చేసినోడిపై ప్రతీకారం తీర్చుకున్న అన్న:
పథకం ప్రకారమే జాకీర్ ఓ మర్డర్ చేసి జైలుకి వచ్చాడని, ప్రణాళిక ప్రకారమే జైల్లో తోటి ఖైదీలతో గొడవ పడి మెహతాబ్ ఉంటున్న వార్డులోకి మారాడని తెలిసి పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది. కాగా ఈ రియల్ రివెంజ్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చెల్లికి అన్యాయం చేసిన వాడిపై ప్రతీకారం తీర్చుకున్న ఆ అన్న ఇప్పుడు హీరో అయ్యాడు. అన్న అంటే ఇలా ఉండాలి, శభాష్ జాకీర్ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read:టాప్-12 ఉగ్రవాదుల కొత్త హిట్ లిస్ట్

Categories
Crime National

మూగ యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మాటలు రాని 20 ఏళ్ల మూగ యువతిపై నలుగురు మైనర్లు అత్యాచారం చేశారు. వారిలో 11 ఏళ్ల చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు. వీరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో బహిర్భూమికి వెళ్ళిన 20 ఏళ్ల యువతిపై నలుగురు మైనర్లు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. బహిర్భూమికి వెళ్ళిన యువతి ఎంతకూ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతకగా రోడ్డు పక్కన గాయాలతో ఆమె కనిపించింది.

వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె చెప్పిన ఆధారాలతో కుటుంబ సభ్యులు గౌరీహార్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు చెప్పిన ఆధారాలతో పోలీసులు నిందితులను అరెస్టు చేయగా బాధితురాలు వారిని గుర్తించింది. నిందింతుతలంతా 11 నుంచి 18 ఏళ్ల లోపు వారని పోలీసులు చెప్పారు.నిందితులు నేరం ఒప్పుకున్నారని పోలీసు సూపరింటెండెంట్ సచిన్ శర్మ తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

Read:అతనితో ఎలాంటి సంబంధం లేదు.. విచారణ తర్వాత మీడియా ముందుకు వస్తా: షమ్నా ఖాసిం(పూర్ణ)

Categories
Crime National

చెల్లెల్ని రేప్ చేసిన వాడ్ని జైల్లోనే చంపిన అన్న

తన చెల్లెని అత్యాచారం చేసినవాడ్ని వెంటాడి పగ తీర్చుకున్నాడో అన్నయ్య. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ రియల్ స్టోరీ తీహార్ జైలులో జరిగింది.

నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) అనే వ్యక్తిఅంబేద్కర్ నగర్ కి చెందిన జాకీర్(21) అనే యువకుడి మైనర్ చెల్లెలిని 2014 లో అత్యాచారం చేశాడు. ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేసి మెహతాబ్ కి శిక్ష పడేలా చేశారు. దీంతో మొహతాబ్ ను తీహార్ జైలుకు తరలించారు.

చెల్లెలిని రేప్ చేసినందుకు, ఆమె మరణానికి కారణమైన మెహతాబ్ పై జాకీర్ పగ పెంచుకున్నాడు. తీహార్ జైలులో శిక్ష అనుకభవిస్తున్న మెహతాబ్ ను ఎలాగైనా చంపాలని పగతో రగిలి పోయాడు. అందుకు ప్లాన్ వేశాడు. తాను కూడా మరో నేరం చేశాడు. హత్యా నేరం రుజువుకావటంతో2018 లో జాకీర్ తీహార్ జైలుకువెళ్లాడు. తీహార్ జైలులో తానుఉంటున్నవార్డు, మెహతాబ్ ఉంటున్నవార్డు, రేపిస్టు మెహతాబ్ ఉంటున్నవార్డు వేరు కావటంతో మాస్టర్ ప్లాన్ వేశాడు.

తన వార్డులో ఉంటున్న ఖైదీలతో గొడవ పెట్టుకుని వాళ్లను చితకొట్టాడు. దీంతో జైలు వార్డెన్ అతడిని వార్డు మార్చి రేపిస్టు మెహతాబ్ ఉండే వార్డులో వేశారు. ఇదే చాన్స్ కోసం ఎదురు చూసిన జాకీర్ సమయం కోసం వేచి చూశాడు. సోమవారం, జూన్ 27 ఉదయం ఖైదీలందరూ ప్రార్ధన కోసం బయటకు వచ్చినప్పుడు అప్పటికే రెడీగా ఉంచుకున్న కత్తిలాంటి పదునైన ఆయుధంతో జాకీర్, మెహతాబ్ పై దాడి చేసాడు.

అతని మెడపై ఒంటిపై విచక్షణా రహితంగా పొడిచేయచటంతో తీవ్ర గాయాలై కింద పడిపోయాడు. జైలు అధికారులు వెంటనే అతడిని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. జాకీర్ పై హరినగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Read:వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

Categories
Andhra Pradesh Crime

చిత్తూరు జిల్లాలో కొత్త తరహా మోసం

టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే  ఈ యాప్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్ లు పంపించుకోవచ్చు.  దీని ద్వారా వస్తువులు కొనుగోలు తమ సరదాలు తీర్చుకున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం ఓబుల్‌రెడ్డిగారిపల్లెకు చెందిన అఖిల్‌(23), పృథ్వి(19), పుంగనూరు మండలం బోడేవారిపల్లె వాసి భరత్‌కుమార్‌(19), పీఅండ్‌టీ కాలనీకి చెందిన హరీష్‌(22), దిగువ కురవంక వాసి అజయ్‌కుమార్‌(22), కురవంకకు చెందిన సాయిచరణ్‌(22), వికాస్‌(21), చౌడేపల్లె మండలం అప్పినపల్లె వాసి ఎం.చిరంజీవి(22), గురికాయలకొత్తూరుకు చెందిన చిన్నారెడ్డి(22), మరో యువతి కలిసి బృందంగా ఏర్పడ్డారు. విలాసాలకు అలవాటు పడిన వీరంతా డింగ్‌టోన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

తమ సరదాలు తీర్చుకోటానికి మదనపల్లెలోని ఆరుగురు వ్యాపారుల నుంచి సెల్ ఫోన్ లు, బట్టలు, బేకరీ నుంచి ఫుట్ ఐటెమ్స్ కొనుగోలు చేశారు. వాటికి డబ్బులు చెల్లించేందుకు … ఫోన్‌పేలో డబ్బు వేసినట్లు డింగ్‌టోన్‌ యాప్‌ ద్వారా నకిలీ మెసేజ్‌లను వ్యాపారుల సెల్‌ ఫోన్లకు పంపించారు. వారు పంపించినప్పుడు వచ్చినట్లు తెలిసేది. ఖాతాలో చూసుకుంటే నగదు జమ కాకపోయే సరికి బాధితులు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేసి 9మందిని మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 8 సెల్ ఫోన్ లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ఫేస్‌బుక్‌ ద్వారా కూడా మోసాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండేవారిని బోల్తా కొట్టించేందుకు అమ్మాయిల పేరిట నకిలీ ఖాతాలు తెరచి… యువకులు, వ్యాపారుల నుంచీ వీరు డబ్బు దోచుకుంటున్నారని ఆయన తెలిపారు.

Read:16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి సోకిన కరోనా