Categories
Hyderabad Telangana Uncategorized

5 ఏళ్లు దాటిన చిన్నారులకూ హెల్మెట్ తప్పనిసరి : కొత్త ట్రాఫిక్ రూల్స్ షురూ..

హెల్మెట్..హెల్మెట్. హైదరాబాద్ లో బైక్ ఎక్కే ప్రతీవారు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇది ఎప్పటి నుంచో వస్తున్న రూల్.కానీ ఇప్పుడు బైక్ నడిపేవారే కాదు వెనుక కూర్చున్నవారుకూడా తప్పనిసరిగి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. వాహనదారుల భద్రత గురించే ఇటువంటి రూల్స్ పెట్టినా..ఈ హెల్మెట్ పెట్టుకోవటం అదీ వెనుక కూర్చున్నవారు కూడా పెట్టుకోవాల్సిందేననే రూల్ ఇబ్బందిగా మారింది. కానీ తప్పదు. లేకుండా ఫైన్ పడిపోద్ది అంటున్నారు అధికారులు.

ఇంతేకాదండోయ్..ఇప్పుడు మరో కొత్త రూల్ కూడా వచ్చింది. అదేమంటే..బైక్ మీద కూర్చుకుని ప్రయాణించే చిన్నారులు కూడా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందేనంటున్నారు అధికారులు. ఐదు సంవత్సరాలు దాటిని ప్రతీచిన్నారి హెల్మెట్ పెట్టుకోవాలి. లేదంటే చలానాలు మీఇంటికే వచ్చేస్తాయి.

ఇప్పటికే ఇటువంటి రూల్స్ అమలు చేస్తున్న అధికారులు టక్ టక్ మంటూ ఛలానాలు బాదేస్తున్నారు. బండిలో కొట్టించుకునే పెట్రోలు జేబులు ఖాళీ చేస్తుంటే..కొత్తగా వచ్చిన హెల్మెట్ తప్పనిసరి (వెనుక కూర్చున్నవారు కూడా) రూల్ మొత్తం డబ్బుల్ని లాగేసుకుంటోంది. దీంతో ప్రతీ ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తోంది ఎన్నిఇబ్బందులు ఎదురైనా సరే.

ఈరూల్ ప్రజల భద్రత కోసమే. ఎందుకంటే బైక్ యాక్సిడెంట్స్ లో ఎక్కువగా వెనుక కూర్చున్నవారే మరణాలకు గురవుతున్నారు. ఎందుకంటే వారు హెల్మెట్ పెట్టుకోవట్లేదు కాబట్టి. అందుకే వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ పెట్టారు అధికారులు.

Categories
Hyderabad Telangana

కరోనా పేరుతో దోపిడీ చేసే ప్రైవేటు ఆస్పత్రులకు టీఎస్ హైకోర్టు నోటీసులు

కరోనా పేరుతో బాధితులను దారుణంగా దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం (జులై7,2020)న వార్నింగ్ ఇచ్చింది. కరోనా టెస్టులు..చికిత్సల పేరుతో లక్షలకు లక్షలు దోచుకుంటున్నారనీ..బిల్లులు చెల్లించకపోతే పేషెంట్లను హాస్పిటల్ లోనే నిర్భంధించటంపై తెలంగాణ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. అటువంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది.

తెలంగాణ రాజధాని హైదరాబాదు లోని కొన్ని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా టెస్టింగ్, చికిత్సకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకుని బాధిత పేషెంట్ల నుంచి భారీ దోపిడికి ప్రైవేట్ ఆసుపత్రులు పాల్పడుతున్నాయని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్,జస్టిస్ బి.వియజేన్స్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం..నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన కేర్, యశోద, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు నోటీసులను జారీ చేసింది.

ఎంత చార్జీలను వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ… ఆసుపత్రులు పట్టించుకోకుండా బాధితుల నుంచి దోపిడీలు చేస్తోందనీ ఇది దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపింది. అటువంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అనంతరం ఈ విషయంపై 14వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Read Here>>15రోజుల చికిత్సకు రూ.12లక్షల బిల్లు, హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రి దోపిడీ

Categories
Hyderabad Telangana

తెలంగాణ నూతన సచివాలయం ఇదే.. ఫొటో విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు సోమవారం (జులై6,2020) నుంచి కొనసాగుతున్నాయి. కొత్త సెక్రటేరియట్ కట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం పట్టు నెరవేర్చుకుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే రెడీ అయిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సచివాలయం భవన నమూనాను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన నమూనా ఫొటోను సీఎం కార్యాలయం తాజాగా విడుదల చేసింది. దీనికి సీఎం కేసీఆర్ త్వరలోనే ఆమోద ముద్ర వేయనున్నారు.

చూడడానికి రాజప్రాసాదంలా ఠీవీగా కనిపిస్తున్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తూ ఠీవీగా రాజప్రసాదంలా వెలిగిపోతోంది. నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభుత్వం పట్టుపట్టి అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసింది. దీంట్లో భాగంగా పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఉదయం భవనం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో తెలంగాణలో కొత్త సచివాలయం రూపుదిద్దుకోవటం అతి త్వరలో ప్రారంభం కానుంది.

Read Here>>పేదలకు మాత్రమే.. అందరికీ అదే ఫీజు అంటే కుదరదు

Categories
Birthday Party covid regulations Hyderabad Park Hyatt Hotel Telangana violation

ఏమాత్రం భయం లేదు…కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బర్త్ డే పార్టీ

కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరికలుు జారీ చేస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది అవేమీ పట్టన్నట్లు ఇష్టానుసారంగా పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతూ, వేడుకలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది యువకులు పార్టీ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు హోటల్ పై దాడి చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్ పరిధిలో ఉన్న పార్క్ హయత్ హోటల్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఓ బర్త్ డే పార్టీ జరిగినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం. అర్ధరాత్రి సమయంలో హోటల్ లో బర్త్ డే పార్టీ హంగామాగా జరిగింది. పార్టీకి సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆకస్మికంగా దాడి చేసి ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. గతంలో జూబ్లిహిల్స్ లో రేవ్ పార్టీ నిర్వహించిన సంతోష్ రెడ్డి మళ్లీ ఈ బర్త్ డే పార్టీకి సూత్రధారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసుల అదుపులో నలుగురు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. పార్టీలో జర్మనీకి చెందిన యువతి కూడా ఉన్నట్లు పోలీసులు సమాచారం. గతంలో రేవ్ పార్టీలకు సంబంధించి నిర్వహించిన సంతోష్ రెడ్డి ఈ పార్టీని కూడా అరెంజ్ చేసినట్లు సమాచారం.

Categories
Hyderabad

GHMC కార్యాలయంలో పెరిగిపోతున్న కరోనా కేసులు :అడిషనల్ కమిషన్ అడ్మిన్ ఉగ్యోగికి పాజిటివ్

GHMC కార్యాలయంలో కరోనా కేసులు రోజురోజుపెరుగిపోతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయంలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అడిషనల్ కమిషన్ అడ్మిన్ పేషీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతని కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు.

కొన్ని రోజుల క్రితం ఇదే డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈక్రమంలో మరో ఉద్యోగికి పాజిటివ్ రావటంతో ఇప్పటి వరకూ GHMC కార్యాలయంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా తెలంగాణలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గటంలేదు. రోజురోజుకు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తూ..ఈరోజుకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 14వేల 419కు చేరింది. దీంట్లో సగం అంటే 20వేలు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావటం గమనించాల్సిన విషయం. ఎక్కువ జనాభా కలిగిన హైదరాబాద్ లో కరోనా కేసులు నమోదు రోజు రోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read:జులై 3 నుంచి మరింత కఠినంగా హైదరాబాద్‌లో 15రోజులు లాక్‌డౌన్‌?

Categories
Crime Hyderabad

మ్యారేజి బ్యూరో పేరిట రూ.15 కోట్లు మోసం

మ్యారేజ్ బ్యూరో లో డబ్బులు పెడితే బాగా లాభాలు ఆర్జించవచ్చని… రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు 5రూపాయల వడ్డీతో పాటు.. ఏడాది తర్వాత అసలు తిరిగి తీసుకోవచ్చని ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన మోసగాడి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.

టోలీ చౌక్ లో ఉండే షేక్ మహమూద్ మూడేళ్ళకిందట అల్ మదీనా మ్యారేజి బ్యూరో పేరిట పెళ్ళి సంబంధాలు చెప్పే సంస్ధను స్ధాపించాడు. అది బాగా ప్రాచుర్యంలోకి రావటంతో అల్ సునత్ మ్యారెజ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో మ్యారేజి బ్యూరోను స్టార్ట్ చేశాడు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను కూడా ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా ఆదాయం బాగా పెరగటంతో బాగా లాభాలు ఆర్జించాడు. ఇంతటితో ఆగకుండా మరింత డబ్బు సంపాదించాలనే తపనతో ప్రజలనుంచి డిపాజిట్లు సేకరించటం మొదలెట్టాడు.

తన మ్యారేజి బ్యూరోలో పెట్టుబడి పెడితే లాభాలు బాగా వస్తాయని ప్రకటనలిచ్చాడు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 5 వేలు రూపాయలు ఇస్తానని ఏడాది తర్వాత అసలు తీసుకోవచ్చని భరోసా కల్పించాడు. ఈ ప్రకటన చూసి ప్రజలు సంస్ధలో డబ్బు డిపాజిట్ చేయటం మొదలెట్టారు. క్రమేపీ డిపాజిట్ దారుల సంఖ్య పెరిగి 15 కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చినట్లు తెలిసింది.

ఈ ఏడాది జనవరి వరకు డిపాజిట్ దారులందరికీ చెల్లిస్తూ వచ్చాడు. కొందరు డిపాజిట్ దారులు ఇటీవల అతని సంస్ధకు వెళ్లి చూడగా సంస్ధకు తాళం వేసి ఉంది. మహమూద్ భార్యను ప్రశ్నించగా ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవటంతో వారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read:బ్యాంకు రుణాలిప్పిస్తామని మోసం చేసిన పాత నేరస్థులు

Categories
Hyderabad

ఇంటి అద్దె కోసం వేధిస్తే 100కి డయల్ చేయండి

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయం

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయం లేకుండా పోయింది. కొందరు పేదలు తినడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఇక అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కిరాయి కట్టేందుకు డబ్బులేక, ఓనర్ కి సమాధానం చెప్పుకోలేక నరకయాతన చూస్తున్నారు. చాలా మంది ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గొప్ప ఊరటనిచ్చారు. ఉపాధి కోల్పోయి జీవనం సాగించడం కష్టంగా మారడంతో వారి పరిస్థితులను సీఎం కేసీఆర్ అర్ధం చేసుకున్నారు. 

మూడు నెలలు అద్దె అడగొద్దు::
ఆదివారం(ఏప్రిల్ 19,2020) మంత్రివర్గం సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి యజమానులు.. కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్‌, మే నెలల అద్దె వసూలు చేయొద్దని ఆదేశించారు. తర్వాత నెలల్లో వాయిదాల వారీగా వసూలు చేసుకోవాలని సూచించారు. ఇది అప్పీల్‌ కాదని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని చెప్పారు. ఎవరైనా కిరాయి కోసం ఇబ్బంది పెడితే 100కి డయల్ చేసి చెప్పాలని కేసీఆర్ తెలిపారు. అద్దె కోసం సతాయిస్తే ఇంటి యజమానులపై కఠిన చర్యలుంటాయన్నారు. 

వడ్డీ వసూలు చేస్తే ఊరుకోను:
అంతేకాదు మరో వార్నింగ్ కూడా ఇచ్చారాయన. కిరాయి వాయిదా వేశామంటూ వడ్డీ వసూలు చేయాలని చూస్తే ఊరుకోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పెద్ద మనసుతో అర్థం చేసుకుని అండగా నిలవాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అద్దె కోసం వేధించడం కరెక్ట్ కాదన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని రోజులు పోయాక అద్దెను కొంత మొత్తంలో విడతల వారీగా చెల్లించాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

”డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం.. ఇళ్ల కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలు వసూలు చేయవద్దు. తర్వాత దానిని వాయిదాల పద్థతిలో తీసుకోవాలని ఆదేశిస్తున్నాం. ఎవరినైనా ఇబ్బందులు పెడితే 100కి డయల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. వెంటనే చర్యలు ఉంటాయి. వీలైనప్పుడు కట్టించుకోవాలి. అలాగే తర్వాత కట్టారని వడ్డీలు లాంటివి వసూలు చేయొద్దు” అని కేసీఆర్ అన్నారు.

సడలింపులు లేవు, మే 7 వరకూ లాక్ డౌన్ పొడిగింపు:
సుదీర్ఘ మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ లాక్ డౌన్ సడలింపులు, పొడిగింపుపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం చెప్పినట్టు ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదన్న ఆయన.. రాష్ట్రంలో మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు. మే 5న మరోసారి కేబినెట్ భేటీ అవుతుందన్నారు. అప్పుడు పరిస్థితులను బట్టి లాక్ డౌన్ ఎత్తివేయాలా లేక కొనసాగించాలా అనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. కాగా, కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. నాలుగు రోజులు కష్టం ఓర్చుకుంటే సరిపోతుందన్నారు. ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదన్నారు. మే7 వరకూ కఠినంగా ఉండాలని, బయట నుంచి తినుబండారాలకు అనుమతుల్లేవని కేసీఆర్ చెప్పారు.

Categories
Hyderabad

హైదరాబాద్‌లో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్ నగరంలోని స్విగ్గీ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌లో పనిచేస్తున్న యువకుడికి COVID-19 పాజిటివ్‌గా తేలింది. మార్కాజ్‌కు వెళ్ళిన అతని తండ్రికి పాజిటివ్ అని తేలగా.. లేటెస్ట్‌గా డెలివరీ బాయ్ నమూనాలను ఏప్రిల్ మొదటి వారంలో సేకరించారు. 

యువకుడి తండ్రి మార్కాజ్‌కు వెళ్లి మార్చి 18న హైదరాబాద్‌కు తిరిగి వచ్చారని, ముఖ్యమంత్రి ఆదేశం తరువాత ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరినీ నిర్బంధించగా.. డెలివరీ బాయ్ తండ్రికి పాజిటివ్ అని తేలిందని, ఆ తరువాత కుటుంబాన్ని సరోజిని దేవి ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు తరలించినట్లు చెప్పారు.

తరువాత యువకుడి తండ్రికి COVID పాజిటివ్ తేలిందని డాక్టర్లు వెల్లడించారు. మార్చి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు డెలివరీ ఎగ్జిక్యూటివ్ పనిచేశారని, హైదరాబాద్ నగర పరిధిలో కనీసం 25 మందికి ఆహారాన్ని పంపిణీ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

నాంపల్లి ప్రాంతంంలో లక్ష్మి నగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అతనిని గుర్తించారు. స్విగ్గీలో సంవత్సరానికి పైగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. అత‌ను పనొచేసిన టైమ్‌లో ఏయే రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని సేక‌రించాడు? ఎక్క‌డెక్క‌డ ఫుడ్ డెలివ‌రీ చేశాడు? అనే వివ‌రాలను సేకరించి సదరు వ్యక్తులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు పోలీసులు. 

Also Read | ఈ ప్రభుత్వానికి హృదయం లేదు: చిదంబరం

Categories
Hyderabad

బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేనివారికి కూడా నగదు అందచేస్తాం

కరోనా లాక్ డౌన్ సమయంలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందిస్తామని  పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి బ్యాంకు ఎకౌంట్ లేక పోయినా,  బ్యాంకు ఎకౌంట్ తో ఆధార్ లింక్ కాకపోయినా వారందరికీ  నేరుగా నగదు అందచేస్తామని ఆయన తెలిపారు. 

బ్యాంక్‌ ఖాతాలతో, ఆధార్‌ కార్డు లింక్‌ లేని 5 లక్షల 21 వేల 640 కార్డుదారులకు నగదును బ్యాంకుల్లో  జమ చేయలేక పోయామని  వారందరికీ నేరుగా అందిస్తామని ఆయన వివరించారు. 

వలస కార్మికులందరికీ 12 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి బియ్యం, కుటుంబానికి రూ.500 అందజేశామని తెలిపారు. బ్యాంకులో పడిన నగదు తీసుకోకుంటే వెనక్కు వెళ్లిపోతుందన్న పుకార్లను నమ్మవద్దని ఆ నగదును ఎప్పుడైన తీసుకోవచ్చని తెలిపారు. బ్యాంకుల వద్ద జనం గుమికూడకుండా బౌతిక దూరం పాటించి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Categories
Hyderabad

ఉద్యోగులను తొలగించవద్దు : పారిశ్రామికవర్గాలకు కేటీఆర్ విజ్ఞప్తి

పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీలకు సూచించారు. లాక్‌డౌన్‌ తరువాత త్వరలోనే పరిశ్రమలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రతకు యాజమాన్యాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.