Categories
International National

నేను..నా ఫ్యామిలీ ఇండియాలోనే ఉంటాం అనుమతి ఇవ్వమని కోరుతున్న అమెరికన్

టూరిస్ట్ గా వచ్చి భారత్ లో ఉంటున్న 74 సంవత్సరాల అమెరిక్ వ్యక్తి తిరిగి తన దేశం వెళ్లానుకోవటంలేదు. ఇక్కడే భారత్ లోనే ఉండపోవాలని ఆకాంక్షిస్తున్నారు. కారణం.. కరోనా. అమెరికాలో కరోనా కేసుల సంఖ్యలో లక్షల్లో ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా లక్ష దాటిపోయింది.
దీంతో టూరిస్ట్ వీసాతో అమెరికా నుంచి భారత్ వచ్చిన 74 సంవత్సరాల అమెరికన్ జానీ పియర్స్ ఇక తాను ఇండియాలోనే ఉండిపోవాలనుకుంటున్నానని తెలిపారు. గత ఐదు నెలల నుంచి కేరళలో ఉంటున్న జానీ పియర్స్ తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని కోరుతూ కేరళలోని హైకోర్టును కోరారు.

కేరళలోని కొచ్చిలో ఉంటున్న జానీ పియర్స్ తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని కోరుతూ కేరళ కోర్టుకు అప్లై చేసుకున్నారు. యుఎస్ లో కరోనా కకావికలంగా ఉండటం..ఇండియా ప్రభుత్వంలాగా తమ అమెరికా ప్రభత్వం కరోనా విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధిగా వ్యవహరించటంలేదని ఇటువంటి పరిస్థితుల్లో తాను అమెరికా వెళ్లాలనుకోవటంలేదని అన్నారు. అంతేకాదు.. తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని..అలాగే అమెరికాలో ఉన్న తన కుటుంబ సభ్యులను ఇండియా వచ్చేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ కేరళ కోర్ట్ ను అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకున్నానని జానీ పియర్స్ తెలిపారు.

Categories
International

COVID-19 ప్రభావానికి పెద్దల కంటే పిల్లలు సేఫే..

పిల్లల్లోని ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థల మధ్య బేధాలు పిల్లలను పలు వ్యాధులబారిన పడకుండా ఎలా కాపాడతాయి. కొవిడ్ 19 కారణంగా పెద్ద వాళ్లలో వచ్చే సమస్యలకు వీరికి తేడా ఏంటి. ఈ ప్రాణాంతక వ్యాధి వెనుక జరిగే బయోలాజికల్ ప్రోసెస్ గురించి రీసెర్చ్ ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

అమెరికాలోని హూస్టన్‌లో ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ ప్రకారం.. అమెరికా జనాభాలో 18ఏళ్లు కంటే తక్కువ ఉన్నవాళ్లే 22శాతం ఉన్నారు. దాంతో పాటు ఈ ఏజ్ గ్రూప్ ఉన్నవారిలో అంటే లక్షా 49వేల 82మందిలో కేవలం 1.7శాతం మాత్రమే COVID-19మహమ్మారి బారిన పడ్డారు.

సంక్రమించే రోగ లక్షణాలు, హాస్పిటలైజేషన్, మరణాల శాతం ఊహించిన దానికంటే తక్కువ ఉన్నట్లు గుర్తించాం. దీని కోసం మరిన్ని వైద్య పరీక్షలు చేయాలి. థెరఫీ చేసే ఏజెంట్లను గుర్తించాలి’ అని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియోలజీ రీసెర్చర్స్ ఊపిరితిత్తుల కణ వ్యవస్థ, అణువుల పరిణామ వ్యవస్థపై ఓ కథనం రాశారు.

మనుషుల్లో ఉండే అణువులను ఏంజియోటెన్సిన్ ఎంజైమ్ 2లుగా మార్చేవి లేదా ACE2లు అని అంటారు. ఇవే నోవల్ కరోనావైరస్ కు డోర్లుగా పనిచేస్తాయి. ఇవి పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నపిల్లల్లోనే తక్కువగా కనిపిస్తాయి. ACE2లు వైరస్ ఎంటర్ అవడానికి చాలా కీలకం. పిల్లల్లో ఇవి తక్కువ. అవి వయస్సును బట్టి పెరుగుతుంటాయని యూటీ హెల్త్ సహ రచయిత మాథ్యూ హార్టింగ్ అన్నారు.

ACE2ల కథనం ప్రకారం.. పిల్లల్లోని వ్యాధినిరోధక వ్యవస్థ పెద్దవాళ్ల కంటే భిన్నంగా రెస్పాండ్ అవుతుంది. ఇదే పిల్లల్లో వ్యాధి రావడానికి తక్కువ అవకాశం ఉండేలా చేస్తుంది. పిల్లల్లో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ టీ సెల్స్ తిరిగి పుంజుకుని కరోనా నుంచి పోరాడేందుకు ఉపయోగపడుతుంది.

శరీరంలో ఉండే టీ సెల్స్ పరిణామం బట్టి కణాల మధ్య సిగ్నలింగ్ వ్యవస్థను ఇంటర్‌ల్యూకిన్ 10(IL-10) అంటారు. దీన్నే హ్యూమన్ సైటోకిన్ సింథసిస్ ఇన్హిబిటరీ కారకం అంటారు. సైంటిస్టుల నమ్మకం ప్రకారం.. పెద్ద వాళ్లు, పిల్లలతో పోలిస్తే.. వైరస్ ప్రవర్తనా తీరు పిల్లల కంటే పెద్దల్లోనే ప్రమాదకరమని.. వయస్సు పైబడ్డ వారిలో మరింత డేంజర్ అని అంటున్నారు.

Categories
International

నేపాల్ లో భారీ వర్షాలు, 22 మంది మృతి

నేపాల్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మరణించారు. కస్కీ జిల్లాలో భారీవర్షాల కారణంగా ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో ఇల్లు కూలి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్ర గాయాలవడంతో వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింధు పాల్చోక్‌ ను వరదలు ముంచెత్తాయి. వరదల దాటికి వందలాది ఇళ్ల కొట్టుకుపోయాయి. పలువురు గల్లంతయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 10 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

లాంజంగ్ జిల్లాలో వరదలకు ముగ్గురు కన్నుమూయగా… రుకుం జిల్లా అత్ బిస్కట్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించారు. జాజర్ కోట్ జిల్లాలో 12 మంది గల్లంతయ్యారు. గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్ లోని నారాయణి, ఇతర ప్రధాన నదులు విపరీతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. రాగల 48 గంటల్లో రుతుపవనాల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

Categories
International National

ప్రపంచ జనాభా దినోత్సవం 2020: మన దేశ జనాభా 307 కోట్లు ఉండేది!

ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని తొలిసారి 11 జూలై 1989 న ప్రకటించారు. 1987లో దేశ జనాభా సంఖ్య 5 బిలియన్లుగా ఉన్నప్పుడు, పెరుగుతున్న జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.

ఈ రోజున జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యకలాపాలు జరుగుతాయి. తద్వారా ప్రజలకు అవగాహన ఏర్పడి జనాభాను నియంత్రించవచ్చు అనేది అభిప్రాయం. ప్రపంచంలోని అనేక దేశాల ముందు జనాభా పెరుగుదల పెద్ద సమస్య రూపంలో ఉంది.

‘జనాభా పెరుగుదల’ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భారతదేశంలో కూడా జనాభా పెరుగుదల అనేది సమస్యగా ఉంది. దేశంలో కుటుంబ నియంత్రణ లేకపోతే, నేడు మన జనాభా 307 కోట్లకు పైగా ఉండేదని నిపుణులు అంచనా వేశారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో జనాభాపై పరిశోధనలు చేస్తున్న జెఎన్‌యూ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గోలీ పరిశోధన ప్రకారం 1990 నుంచి 2016 వరకు భారతదేశంలో 169 కోట్ల మంది పిల్లలు పుట్టేవారని చెప్పారు. అంటే, నేటి జనాభా 138 కోట్లు కాదు 307 కోట్లుగా ఉండేది.

కుటుంబ నియంత్రణ 2016 నుంచి 2061 వరకు 45 సంవత్సరాలలో దేశంలో 1.90 బిలియన్ ప్రజలను నిరోధిస్తుందని ప్రొఫెసర్ గోలీ చెప్పారు. జనాభా నియంత్రణ బలవంతపు విధానాల గురించి చింతిస్తున్నట్లు ఆయన చెప్పారు. యూరప్, జర్మనీ, జపాన్‌లో జనాభా పెరగట్లేదు. ఆ దేశాలలో పిల్లలను ప్రసవించడానికి ప్రోత్సహిస్తున్నారు.

జనాభా గణనలో సరైన జనాభా భర్తీ సంతానోత్పత్తి సూత్రం చాలా ముఖ్యమైనది. ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలలో పని చేయడానికి తగినంత మంది లేరు. ఈ దేశాలలో భారతదేశం నుండి నర్సులు లేకపోతే అక్కడ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పడిపోతుంది. అందుకే ఇద్దరు పిల్లల వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. 2061 నాటికి, భారతదేశంలో జనన రేటు 1.8 కన్నా తక్కువగా ఉంటుందని అంచనా.

Categories
International National

శాశ్వత నిషేధం…చైనా యాప్స్ కు కేంద్రం మరో షాక్

చైనా యాప్స్ ‌కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ ‌టాక్ ‌తో సహా 59 చైనా యాప్ ‌లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్‌ కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 79 ప్రశ్నలతో శుక్రవారం(జులై-10,2020)నోటీసులు జారీ చేసింది.

ఆ ప్రశ్నలకు జూలై 22లోగా స్పందించాలని గడువు ఇచ్చింది. ఒకవేళ అప్పట్లోగా సమాధానం ఇవ్వకపోతే యాప్స్‌ని శాశ్వతంగా బ్యాన్ చేస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ యాప్స్‌ పనితీరుపై ఇండియన్‌ ఇంటెలిజన్స్‌ ఏజన్సీలు, గ్లోబల్‌ సైబర్‌ వాచ్‌ డాగ్‌లు కూడా భారతప్రభుత్వానికి రిపోర్టులను అందించనున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు ఇచ్చే సమాచారం ఈ ఏజన్సీలు ఇచ్చే రిపోర్టుతో సరిపోవాలి. అందుకు భిన్నంగా ఏం జరిగిన ఈ కంపెనీలు భారీ నష్టాన్ని భరించకతప్పవని ఉన్నతాధికారులు తెలిపారు.

కంపెనీల పుట్టుక, మాతృ సంస్థలు, నిధుల రాక, డేటా మేనేజ్‌మెంట్, కంపెనీ కార్యకలాపాలు, సర్వర్ల నిర్వహణ లాంటి అంశాలతో 79 ప్రశ్నలున్నాయి. అనధికారికంగా డేటా యాక్సెస్ చేయడం, సెక్యూరిటీ ఫీచర్లు, నిఘా కోసం డేటాను దుర్వినియోగం చేయడం లాంటి అంశాలపైనా ప్రశ్నలున్నాయి. భారత ప్రభుత్వం రూపొందించిన 79 ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలపైనే ఆ యాప్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఈ 79 ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వానికి సరైన వివరణ ఇవ్వగలిగితే మళ్లీ ఈ యాప్‌లు ఇండియాలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ ఇచ్చే సమాధానాలు ఒక కమిటీకి పంపిస్తారు. వారు వీటిని పరిశీలించి ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన రిపోర్టులను అందజేస్తారు.

Categories
International Uncategorized

కడుపు నిండా తినండి బిల్లు సగమే కట్టండి..ప్రభుత్వం బంపర్ ఆఫర్

బ్రిటన్ లో లాక్ డౌన్ తరువాత కొన్ని నిబంధనలు పాటిస్తూ నెమ్మది నెమ్మది హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ లు పెట్టుకుని..భౌతిక దూరం పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యజమానులు కష్టమర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అయినా ప్రజల నుంచి పెద్దగా స్పందన రావటంలేదు. దీంతో యజమానులు అల్లాడిపోతున్నారు.

దీంతో బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ హోటల్స్‌లో భోజనం చేసినా కేవలం 50 శాతం మాత్రం బిల్లు చెల్లించవచ్చు..దానికి ఆయా యజమానులకు ప్రభుత్వం నుంచి ట్యాక్స్ వసూలు రాయితీలు ఉంటాయని ప్రకటించింది.
ఆగస్టు నెల మొత్తం ఈ ఆఫర్ ఉంటుందని బుధవారం (జూలై 8,2020)బ్రిటన్ పార్లమెంట్ అత్యవసర మినీ బడ్జెట్‌లో సమావేశంలో మంత్రి రిషి సునక్ తెలిపారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఈ ఆఫర్ కేవలం జూలై 15 నుండి అమల్లోకి వచ్చి 12 జనవరి 2021 లో కొనసాగుతుంది.

ఈ ఆఫర్ బ్రిటన్‌లోని 1,29,000 కేఫ్‌లు, రెస్టారెంట్లలో చెల్లుబాటు అవుతుందని..2.4 మిలియన్ల మంది ఉద్యోగాలు రక్షించటానికి ఈ రాయితీ ప్రకటించామని ఛాన్సలర్ తెలిపారు. మాస్కులు, ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. ఆయా హోటళ్లకు వచ్చి భోజనం చేసి బంపర్ ఆఫర్ పొందాలని సూచించారు. మరి ఈ కష్టకాలంలో ఆఫర్ ఎంత మేర పని చేస్తుందో చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా..కరోనా వైరస్ ప్రతీ దేశంపైనా ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యాలు సైతం కరోనా కొట్టిన దెబ్బకు కుదేలైపోయాయి. వాటిని తిరిగి పునరుద్ధరించటానికి తిరిగి కోలుకోవటానికి పలు యత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో ఉద్యోగాలను రక్షించడానికి, కరోనావైరస్ తో వచ్చిన ఆర్థిక ప్రభావాన్ని తగ్గించటానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు.

Read Here>>అపార్ట్ మెంట్ లో మంటలు..చిన్నారిని మూడంతస్తుల భవనం నుంచి విసిరేసిన తల్లి..

Categories
International Viral

అపార్ట్ మెంట్ లో మంటలు..చిన్నారిని మూడంతస్తుల భవనం నుంచి విసిరేసిన తల్లి.. కాపాడిన ఫుట్‌బాల్ ప్లేయర్..

అరిజోనాలోని ఫినిక్స్ ‌లోని ఓ అపార్ట్ మెంట్ శుక్రవారం (జులై 9,2020)లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తన బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలు తాను చనిపోయినా పరవాలేదనుకుంది ఓ తల్లి తన మూడేళ్ల కొడుకుని మూడో అంతస్తు ఫ్లాట్‌ కిటికీలోంచి కిందకు విసిరేసింది. అది గమనించిన ఓ ఫుట్‌బాట్‌ ఆటగాడు ఫిలిప్ బ్లాంక్‌ ఆ బాలుడిని క్యాచ్‌ పట్టి ప్రాణాలు కాపాడాడు.

ఆ తరువాత ఆ తల్లి మంటల్లో చిక్కుకున్న ఎనిమిదేళ్ల కూతుర్ని కూడా రక్షించడం కోసం మంట్లోకి దూసుకెళ్లింది. కూతుర్ని రక్షించుకోగలిగింది. కానీ దురదృష్టవశాత్తు తల్లి రచెల్‌లాంగ్‌ ఆ మంటల్లో పడి ప్రాణాలు కోల్పోయింది. సురక్షితంగా బైటపడ్డ ఆ చిన్నారులిద్దరు తల్లిని కోల్పోయిన ఘటనతో అరిజోనాలోని ఫినిక్స్ ‌లోని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.

అనంతరం చిన్న చిన్న గాయాలుఅయిన బాలుడిని, బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. ఇక ఆటగాడు ఆ బాలుడిని కాపాడిన సమయంలో తీసిన వీడియో బయటకు వచ్చింది. ఆయన ఫుట్‌బాల్‌ స్కిల్స్ బాలుడిని కాపాడేందుకు ఉపయోగపడ్డాయని స్థానికులంతా ఫిలిప్ బ్లాంక్‌ ప్రశంసిస్తున్నారు.

Read Here>>ఇండియాలో ‘Taka Tak’ కొత్త యాప్… టిక్‌టాక్‌కు ధీటైన ఫీచర్లు ఇవిగో..!

Categories
International

పాకిస్తాన్ విమానాల‌పై అమెరికా నిషేధం

అమెరికాకు చార్టర్ విమానాలు నడపడానికి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పిఐఎ) అనుమతి రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. పాకిస్తాన్ పైలట్ల ధృవీకరణకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఎఎఎ) ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. పాకిస్తాన్ గత నెలలో జరిపిన దర్యాప్తులో మూడింట ఒక వంతు పైలట్లు తమ అర్హత కేసులను తారుమారు చేశారని కనుగొన్నారు.

యూరోపియన్ యూనియన్ నిషేధం:
యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ఇప్పటికే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ క్యారియర్ కార్యకలాపాలను ఆరు నెలల పాటు నిషేధించింది. మూడు విమానాశ్రయాలలో పిఎఐలను బ్రిటన్ నిషేధించగా, వియత్నాం దేశంలో పనిచేస్తున్న పాకిస్తాన్ పైలట్లందరినీ నిషేధించింది.

అదేవిధంగా పాకిస్తాన్ లైసెన్స్ పొందిన పైలట్లను మలేషియా కూడా తాత్కాలికంగా నిషేధించింది. పాకిస్తాన్ సిబ్బందిపై యుఏఈ కూడా దర్యాప్తు ప్రారంభించింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అమెరికా ఫ్లైట్‌లు నిలిపివేయడంపై ఇంకా ఏం మాట్లాడలేదు.

మేలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం విమానాశ్రయంలో దిగేటప్పుడు కూలిపోయి 97 మంది మరణించారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పైలట్ల అర్హత గురించి ప్రశ్నలు తలెత్తాయి. ఉగ్రవాదంతో సహా పలు అంశాలపై ప్రపంచంలో తన ఇమేజ్‌ను తీవ్రంగా కోల్పోతున్న పాకిస్థాన్‌కు ఇది మరో మచ్చ. నకిలీ మరియు ప్రశ్నార్థకమైన లైసెన్సుల కారణంగా ప్రభుత్వ సంస్థ ఇప్పటికే తన పైలట్లలో మూడవ వంతును తొలగించింది.

ఆ దేశంలోని 860 యాక్టివ్ పైలట్లలో 262 లైసెన్సులు నకిలీవని తేలగా.. వారు మోసం చేసి పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు గుర్తించారు. వీరిలో సగానికి పైగా పిఐఎ పైలట్లు ఉన్నారు. ఇక 434 పైలట్లలో 141 మందిని సంస్థ వెంటనే తొలగించింది. కరోనా వైరస్ ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది.

Categories
International National

కరోనా వైరస్ గాలిలో తిరుగుతున్నట్లు ఆధారాలు లేవు: సౌమ్య స్వామినాథన్

కరోనా వైరస్ గాలిలో విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంగీకరించింది, అయితే రద్దీగా ఉండే బహిరంగ మరియు మూసివేసిన ప్రదేశాలలో వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాన్ని తిరస్కరించలేమని ప్రకటించింది.

ఈ క్రమంలోనే గాలి నుంచి కరోనా వ్యాప్తి గురించి, WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. ఎవరైనా దగ్గుతున్నప్పుడు, మాట్లాడేటప్పుడు లేదా పాడినప్పుడు, నోటి నుండి వచ్చే చిన్న కణాలు(బిందువులు) కూడా వైరస్ కలిగి ఉంటాయి. పరిమాణంలో పెద్ద వైరస్‌లు (10 మైక్రాన్ల కంటే ఎక్కువ) మూడు అడుగుల లోపు ప్రయాణిస్తాయి. కానీ చిన్న కణాలు 15 నుండి 30 నిమిషాలు గాలిలో ఉండిపోతాయి.

ఎవరైనా సోకిన వ్యక్తితో మూడు అడుగుల దూరంలో మాట్లాడుతుంటే, ఈ వైరస్ శ్వాస ద్వారా మీ ఊపిరితిత్తులలోకి వెళ్తుంది. ఇది ప్రసారానికి ప్రధాన మోడ్ అని, సమీపంలో మాట్లాడేవారు లేదా కలిసి తిరిగే వ్యక్తులు మరియు కిటికీలు, తలుపులు మూసివేసి ఉంటే సమస్యలు వస్తున్నాయని ఆమె చెప్పారు.

అయితే వైరస్‌లు గాలిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయనడానికి కచ్చితమైన ఆధారాలు లేవని, కానీ దూరం లేకుంటే మాత్రం వ్యాధి బారిన పడతారని, తప్పనిసరిగా మూడు అడుగుల దూరం, మాస్క్‌లు పెట్టుకోవడం ద్వారా వ్యాధి బారిన పడే అవకాశాలు తక్కువ అని ఆమె అన్నారు. వ్యాక్సిన్ రానంతవరకు, ఈ వైరస్‌ను ఈ విధంగానే ఎదుర్కోవాలని అన్నారు.

6 నెలల్లో వ్యాక్సిన్ రావడం కష్టం:

ఆగస్టు 15 లోగా వ్యాక్సిన్ వస్తుందా? అనే ప్రశ్నపై సౌమ్య స్వామినాథన్ కష్టమనే సమాధానం ఇచ్చారు. టీకా రావడానికి 12 నుండి 18 నెలల సమయం పడుతుందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ 2021 మొదటి త్రైమాసికం నాటికి లభిస్తుందని అన్నారు. భారతదేశంలో, ఆగస్టు 15 వరకు టీకాపై తదుపరి దశ -1 మరియు 2 చేయవచ్చు. ప్రపంచంలో 20 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అన్ని దేశాల ప్రజలు దీనిని తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికి మాస్క్‌లు మరియు సామాజిక దూరాలే వైరస్ నుంచి కాపాడుతాయి.

239 మంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే?

కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) కు రాసిన లేఖలో తెలియజేశారని చెప్పారు. WHO ప్రకారం, కోవిడ్ -19 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ బిందువులు మరియు సంప్రదింపు మార్గాల ద్వారా ప్రజలలో వ్యాపిస్తుంది. శాస్త్రవేత్తలు రాసిన ఒక లేఖలో మాత్రం ‘ఏరోసోల్ ట్రాన్స్‌మిషన్’ కూడా కావచ్చు, అంటే గాలి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు అని అన్నారు.

కరోనా వైరస్ కేసులలో పెరుగుదల ఉందని, పేస్ ఒకేలా ఉంటే, రాబోయే కొద్ది రోజుల్లో మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. పరీక్ష పెరుగుతున్న కొద్దీ కొత్త కేసులు వస్తాయని WHO అంగీకరించింది. గత ఐదు వారాల్లో పరీక్షలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అందుకే ఎక్కువ కరోనా కేసులు వస్తున్నాయని చెబుతుంది.

Categories
International

లాక్‌డౌన్ మీలోనూ ఈ మానసిక సమస్యలు తెచ్చిందా.. చెక్ చేసుకోండి

మార్చి నుంచి లాక్‌డౌన్ రెండు నెలల పాటు ఇంట్లోనే పని. వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడిన వారు ఆఫీసులుకు వెళ్లి మళ్లీ నార్మల్ జీవితాన్ని గడపగలరా.. పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా కష్టమైపోతుంది. సైకియాట్రిక్ కండిషన్ కారణంగా అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్ అనేది రావొచ్చు. సూపర్ డ్రగ్ వారు చేసిన రీసెర్చ్ లో చాలా మంది నార్మల్ అవడానికి స్ట్రగుల్ అవుతున్నట్లు తేలింది.

3వేల మంది కస్టమర్లపై సర్వే నిర్వహించగా 22శాతం మందిలో గుంపులో ఉన్నప్పుడు ఆత్రుతతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 21శాతం మంది సమాజంలో కలవడానికి ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నారు. 43శాతం మంది నిబంధనలు ఎత్తేయడంతో భయపడిపోతున్నట్లుగా తెలిసింది. మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో అందరిలోనూ విపరీతమైన ఒత్తిడి కనిపించింది.

ఇది కొవిడ్ 19 కారణంగా వారి ఉద్యోగాలు పోయి ఆర్థిక పరిస్థితి మీద ఎఫెక్ట్ అవుతుందేమోననే అనుమానం వల్ల కూడా అయి ఉండొచ్చు. మానసిక ఆరోగ్యంపై ఈ సమయంలో చాలా ఎఫెక్ట్ కనిపించింది. రీసెర్చర్స్ ప్రజల మానసిక ఆరోగ్యాలపై పెద్ద తుఫాన్ నే తెచ్చిపెట్టిందని అన్నారు. అసలు మనలోనూ ఈ సమస్య ఉందా అని ఎలా తెలుసుకోవాలి. అంటే ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి.

1. ఆతురతగా అనిపించడం
మీలో కారణం లేకుండానే ఆతురతగా అనిపిస్తుందంటే లాక్ డౌన్ అడ్జస్ట్ మెంట్ డిజార్డర్ ఉన్నట్లే. ఇటీవలి నిబంధనలు, నియమాలు డిజార్డర్ కు కారణాలు అయి ఉండొచ్చు. పరిసరాలను త్వరగా ఇముడ్చుకోలేకపోవడం మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపించి ఇలాంటి సమస్యలకు దారితీయొచ్చు.

2. కష్టపడి పనిచేయాల్సి రావడం
వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చేస్తున్న పనే. అయినా మనం ఏదైనా పని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుందంటే మనకు డిజార్డర్ ఉన్నట్లే. పరిధి దాటి మనుషులతో కలుస్తుండటం. సోషల్ ఇంటరాక్షన్ పెంచుకోవడం, మానసిక ఆరోగ్యం అవగాహన పెంచుకోవడం వంటివి మెంటల్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయొచ్చు.

3. చుట్టు పక్క ప్రాంతాలతో ఇబ్బంది పడడం.
చుట్టూ ఉన్న వారితో కలుసుకునేందుకు ఇబ్బందిపడతుండటం వైరస్ నుంచి కాపాడుకోవడానికి వచ్చినదే కావొచ్చు. మీ స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండటం కూడా దీనికి ఓ కారణం.

మనుషుల మధ్య దూరం పెంచుకుని మానసిక ఆరోగ్యాన్ని ప్రమాదాల్లోకి నెట్టొద్దని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ అనేది రిస్క్ తో కూడిన వ్యవహారమైనప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ పలకరింపులు అనేవి అప్పుడప్పుడూ జరుగుతుండాలని నిపుణులు చెబుతున్నారు.