Categories
Jobs National

ఆన్ లైన్ డిగ్రీ కోర్సు ప్రారంభించిన మద్రాస్ IIT

ఇండియన్ ఇన్ సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ కోర్సును ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి తెలిపారు. మంగళవారం(జూన్ 30, 2020) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కోర్సును కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారి ఆన్ లైన్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులు ఇవి.

ఈ కోర్సులకు ప్రవేశార్హత కేవలం ఇంటర్మీడియెట్‌ పాసైతే చాలు. అంటే ఇంటర్ పాస్ అయితే చాలు ఈ కోర్సులో చేరిపోవచ్చు. అంతేకాదు ఇప్పటికే పలుకోర్సులు చేసి.. ఉద్యోగాలు చేసుకునేవాళ్లు కూడా ఈ కోర్సులను నేర్చుకునే వెలుసుబాటు ఉంది.మూడేళ్లపాటు డిగ్రీ చదివి తీరాలనే నిబంధన కూడా లేదు. కొన్ని నెలలు, కొన్ని అంశాలను చదవుకుంటే సర్టిఫికెట్‌ కోర్సు..తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తరువాత మొత్తం సబ్జెక్టులను కలుపుకుని చదువుకుని డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లు అందించటం ఈ కోర్సు ప్రత్యేకత.

ఈ కోర్సుల ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేరుకోవడమే ఈ సంస్థ లక్ష్యంమని భాస్కర్ రామ్మూర్తి తెలిపారు.ఐటీ పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాక, వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తూ ఐటీ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కోర్సును ఆన్‌లైన్‌ కోర్సును ప్రారంభించిన అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ మాట్లాడుతూ లక్షల మంది ఐఐటీ విద్యార్థులు ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని..భారతదేశపు విద్యార్ధుల మేథస్సును దేశానికే ఉపయోగపడేలా చేయాలనేది ఈ కోర్సుల లక్ష్యమని అన్నారు. ఇటువంటి మేధోవలసకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఐఐటీ మద్రాస్‌ సిద్ధంచేసిన బీఎస్సీ ఇన్‌ ప్రోగ్రామింగ్‌/డేటా సైన్సెస్‌ ఇందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

ఈకోర్సుల్లో ప్రతీసంవత్సరం జనవరి, మే, సెప్టెంబర్‌లో విద్యార్థులను చేర్చుకుంటారు. వారానికి 2 – 3 గంటల వీడియో పాఠాలు, క్విజ్‌లు.. దగ్గరలోని సెంటర్‌ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. క్వాలిఫయర్‌ పరీక్ష సాయంతో కోర్సులోకి ఎవరు చేరవచ్చో నిర్ణయిస్తారు. ఫౌండేషన్‌ సర్టిఫికెట్‌ కోర్సులో లెక్కలు..కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లెసెన్స్ వంటి ఎనిమిది కోర్సులుంటాయి.

ఈ 8 సబ్జెక్టులను పూర్తిచేసి కోర్సు మానేసేవారికి కూడా ఫౌండేషన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. కోర్సులను కొనసాగిస్తే.. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌లలో డిప్లొమా కూడా చేయవచ్చు. కంపెనీల్లో పనిచేస్తూ స్కిల్క్స్ డెవలప్ చేసుకోవాలనేవారు నేరుగా డిప్లోమా ఈ కోర్సులో చేరవచ్చు. వారానికి పది గంటల చొప్పున ఆన్‌లైన్‌ లెస్సన్స్ ..ఎగ్జామ్స్ లు ఉంటాయి.
సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల్లో తొలి విడత కోర్సులను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన వారికి ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌ సబ్జెక్టుల్లో విడివిడిగా డిప్లొమా అందిస్తారు. రెండు సబ్జెక్టుల్లోనూ డిప్లొమా అందుకునే అవకాశం కూడా ఉంది. డిగ్రీ కోర్సు పూర్తి చేయాలనునుకునే వారు కోర్సును కొనసాగించవచ్చు.

చివరగా డిగ్రీ కోర్సు పూర్తికి మూడు నుంచి ఆరేళ్లు పడుతుంది. తొలి రెండు దశలు పూర్తిచేసిన వారు లేదా నేరుగా డిప్లొమా కోర్సులో చేరి పూర్తిచేసిన వారు డిగ్రీ కోర్సు పూర్తి చేసేందుకు అర్హులు. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి పలు ఆప్షన్లలో రెండింటిని ఎంచుకుని కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫౌండేషన్‌ కోర్సుకైతే రూ.32 వేలు, డిప్లొమా కోర్సుకు రూ.1.10 లక్షలు, డిగ్రీ కోర్సుకు రూ.లక్ష ఫీజు. అంటే, ఇంటర్మీడియట్‌ తరువాత బీఎస్సీ ఇన్‌ ప్రోగ్రామింగ్‌/డేటా సైన్సెస్‌ డిగ్రీ కోర్సు పూర్తికి రూ.2.42 లక్షలు ఖర్చవుతాయన్నమాట. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్దులు వివరాల కోసం వెబ్‌సైట్‌ onlinedegree. iitm. ac. in చూడవచ్చు.

Read:చైనాకు ధీటుగా పవర్‌ఫుల్ ఉక్కు పడవలను లడఖ్‌‌కు పంపుతున్న భారత్

Categories
Jobs

RCFLలో 393 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

భారత్ ప్రభుత్వానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL)లో వివిధ విభాగాల్లో 393 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది.

ఈ నెల (జూన్ 29, 2020) నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. వచ్చే నెల (జులై 15, 2020)న దరఖాస్తుకు చివరి తేదీ. వేతనం  నెలకు 30వేలు. విద్యార్హతలు బట్టి వేతనం ఉంటుంది.

విద్యార్హతలు: BE, B-TECH, BSC,  SSC

Categories
Jobs

దరఖాస్తు చేసుకోండి : APVVPలో 723 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) హాస్పిటల్స్ లో కాళీగా ఉన్న 723 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అందులో గైనకాలజీ, పీడియాట్రిక్, అనేస్థియా, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెర్మటాలజీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు అభ్యర్థికి 42 ఏళ్లు మించకూడదు. అకడమిక్ మెరిట్ మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు తేదీ: జూన్ 10, 2020.
దరఖాస్తు ఆఖరి తేదీ: జులై 18, 2020.
వేతనం: నెలకి 50వేలు.

Categories
Jobs Slider Telangana

TS ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువు పెంపు 

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్ష సమాధాన పత్రాల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్,  సమాధాన పత్రాల స్కానింగ్‌ కాపీలు పొందేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్ నెల 30 వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా పేర్కొన్న ప్రకారం దీని గడువు జూన్24, బుధవారంతో ముగిసింది. కాగా, ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో తలెత్తిన  సాంకేతిక సమస్యల కారణంగా గత రెండు మూడు రోజులుగా అనేకమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.

కాగా,  మరోవైపు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఇద్దరు అధికారులు కరోనా బారినపడటంతో అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. అత్యవసరం అయితేనే విధులకు హాజరు కావాలని కార్యాలయ ఉద్యోగులను కోరినట్లు తెలిసింది. మరోవైపు విద్యార్థుల రీకౌంటింగ్‌ ప్రక్రియలో జాప్యం జరగకుండా బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అలాగే వివిధ సమస్యలపై వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, సందర్శకుల కోసం కార్యాలయం గేటు బయట గ్రీవెన్స్‌ బాక్సు ఏర్పాటు చేశారు.విద్యార్ధులు  నిర్దేశిత ఫీజు ఆన్ లైన్ లో  చెల్లించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. రీకౌంటింగ్‌ ఒక పేపర్‌కు అయితే రూ.100 చొప్పున.. ఆన్సర్ బుక్‌లెట్ స్కాన్డ్ కాపీతో పాటు రీవెరిఫికేషన్‌కు అయితే ఒక పేపర్‌కు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌ అయిన  https://tsbie.cgg.gov.in ‌ లో  స్టూడెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్‌లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ చేయించాలనుకునే సబ్జెక్ట్‌ను  పొందుపరచాలి. పూర్తి అడ్రస్, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తెలపాలి.మీ దరఖాస్తును ప్రిన్సిపాల్ ద్వారా లేదా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా లేదా వ్యక్తిగతంగా లేదా డీడీ తీసి పోస్టు ద్వారా పంపొచ్చు.
 

Read: హరితహారం పండుగ : నర్సాపూర్ కు సీఎం కేసీఆర్

Categories
Andhrapradesh Jobs

ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఖరారు

ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం (జూన్ 22, 2020)న విడుదల చేసిన ప్రకటనలో పరీక్షల తేదీల వివరాలను పేర్కొన్నారు. 

(సెప్టెంబర్‌ 15, 2020)న ప్రారంభించనుంది. (నవంబర్‌ 13, 2020) వరకు పలు తేదీల్లో వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. నవంబర్ 2వ తేది నుంచి 13 వరకు గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ప్రకటనలో పేర్కొన్నారు. 

పరీక్షల తేదీలు
సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు 
సెప్టెంబర్‌ 21, 22, 23, 24 తేదీల్లో గెజిటెడ్‌ ఉద్యోగాల నియామక పరీక్షలు 
సెప్టెంబర్‌ 21, 22 అసిస్టెంట్‌ బీసీ, సోషల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షలు
సెప్టెంబర్‌ 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ మైనింగ్‌ సర్వీస్‌ ఉద్యోగ నియామక పరీక్ష
సెప్టెంబర్‌ 23న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల నియామక పరీక్ష
సెప్టెంబర్‌ 23న పోలీస్‌ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామక పరీక్ష 
సెప్టెంబర్‌ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు
సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
 

 

Categories
Andhrapradesh Jobs Latest

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ 

ఏపీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగాల నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13 వరకు పలు విభాగాలకు పరీక్షలు నిర్వహించనుంది.

నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూపు 1 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్ స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీసు ఉద్యోగ నియామక పరీక్షలు, సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్ష, సెప్టెంబర్ 23న పోలీసు విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష నిర్వహించనుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ విభాగంలో డైరెక్టర్ పోస్టులు, అదే తేదీల్లో ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్షలు, సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో  నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

Categories
Jobs Latest Telangana

పరీక్షలు లేకుండానే యూజీ, పీజీ విద్యార్థులు పాస్! 

కరోనా నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ యూనివర్శిటీ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. పరీక్షలు రాయకుండా పట్టాలు పొందనున్నారు. యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ గ్రేడ్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగాల కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగదని HCU వీసీ ప్రొ.పొదిలె అప్పారావు స్పష్టం చేశారు. 

విద్యార్థులకు ఇచ్చిన మొత్తం మార్కుల్లో 50 శాతానికి గత సెమిస్టర్లలోని మార్కుల ఆధారంగా సగటు తీసినట్టు తెలిపారు. మిగిలిన 50 శాతానికి ఇంటర్నల్ పరీక్షలకు కేటాయించారు. అప్పటికే కేటాయించిన మార్కుల సగటు తీసి అందించినట్టు ఆయన చెప్పారు. గత సెమిస్టర్లు, ఇంటర్నల్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి మంచి గ్రేడ్లు దక్కాయని అంటున్నారు విద్యార్థులు. HCU ఎంట్రన్స్ టెస్టు ప్రతి ఏడాది మే నెలలో జరగాల్సి ఉంది.

కరోనా కారణంగా పరీక్షను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది యూనివర్శిటీ. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసి విద్యా సంస్థలు తెరుచుకుంటే పరీక్ష జరిగే వీలుండేది. కానీ, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఎంట్రన్స టెస్టు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జులైలో పరిస్థితులు మెరుగవకపోతే ఆగస్టు మొదటివారంలో ప్రవేశ పరీక్ష జరిగే పరిస్థితుల్లేవు. బ్యాక్ లాక్ విద్యార్థుల విషయంలో అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి అభ్యర్థనలపై చర్చించేందుకు పరీక్షల విభాగం అధికారులు, విద్యార్థి సంఘం నేతలతో త్వరలో సమావేశం కానుంది. 

Categories
International Jobs Latest

భారతీయులకు ట్రంప్ షాక్.. H1-B వీసాల రద్దు?

కరోనావైరస్ మహమ్మారితో అగ్రరాజ్యమైన అమెరికాలో భారీ నిరుద్యోగం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయ ఐటి నిపుణులలో ఎక్కువగా అభ్యర్థించే H -1Bతో సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. అనేక కొత్త వీసాలు జారీ చేసిన తరుణంలో ప్రతిపాదిత సస్పెన్షన్ అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ కొత్త ఆర్థిక సంవత్సరంలో విస్తరించే అవకాశం కనిపిస్తోందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది.

‘ఈ ప్రతిపాదిత సస్పెన్షన్.. దేశానికి వెలుపల ఉన్న కొత్త H-1B వీసాదారులను సస్పెన్షన్ ఎత్తివేసే వరకు పని చేయకుండా నిరోధించగలదు. ఇప్పటికే దేశంలో వీసా ఉన్నవారిపై ప్రభావితం అవకాశం లేదని న్యూస్ పేపర్ నివేదించింది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ నిపుణులకు H-1B అత్యంత ఇష్టపడే విదేశీ వర్క్ వీసాలుగా పేరొంది. 

ట్రంప్ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటి నిపుణులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హెచ్ -1బి వీసాలలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. కరోనావైరస్ సమయంలో వారంతా తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే తుది నిర్ణయం తీసుకోలేదని, పరిపాలన వివిధ ప్రతిపాదనలను పరిశీలిస్తోందని వైట్ హౌస్ పేర్కొంది. 

ప్రస్తుతం అమెరికన్ నిపుణులు, ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారు ముఖ్యంగా వెనుకబడిన తక్కువ వయస్సు గల పౌరులను రక్షించడానికి కెరీర్ నిపుణులచే రూపొందించిన అనేక రకాల ఎంపికలను అంచనా వేస్తోంది. కానీ, దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వైట్ హౌస్ ప్రతినిధి Hogan Gidley ఒక ప్రకటనలో తెలిపారు. H-1B వీసాలతో పాటు, స్వల్పకాలిక కాలానుగుణ వర్కర్లకు H-2B వీసా, క్యాంప్ కౌన్సెలర్లు సహా స్వల్పకాలిక కార్మికులకు J-1 వీసా, అంతర్గత  L-1 వీసాకు సస్పెన్షన్ వర్తించవచ్చునని నివేదించింది.

యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సీఈఓ Thomas Donohue గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాశారు. తాత్కాలిక పని వీసాలపై ఆయన నివేదించిన చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు.. అమెరికన్ వ్యాపారాలకు తమ శ్రామిక శక్తి అవసరాలను తీర్చగలరని హామీ ఇవ్వాలని అన్నారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి ప్రతిభకు తగినట్టుగా యాక్సస్ చాలా ముఖ్యమని డోనోహూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

The Hill News Paper ప్రకారం.. అమెరికన్ వ్యాపారాలకు అవసరమైన నైపుణ్యం కోసం తక్కువ సమయంలో చెల్లుబాటు అయ్యే వర్క్ వీసా ఉన్న L -1 వీసా హోల్డర్లు అవసరమని డోనోహ్యూ చెప్పారు. టెక్నాలజీ, అకౌంటింగ్, తయారీదారులతో సహా వివిధ పరిశ్రమలకు పలు సంవత్సరాలు చెల్లుబాటు అయ్యే వర్క్ వీసా ఉన్న హెచ్ -1B వీసా హోల్డర్ల ప్రాముఖ్యతను గుర్తించారు.

Categories
Jobs National

పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ ట్రైనీ Jobs

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 125 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 26, 2020 చివరి తేది. 

విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ – 25
గ్రాడ్యుయేట్ సివిల్ – 5
ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ(హెచ్ఆర్) – 5
డిప్లొమా ఎలక్ట్రికల్ – 40
డిప్లొమా సివిల్ – 10
ఐటీఐ ఎలక్ట్రికల్ – 40

విద్యార్హత : పోస్టులను బట్టి బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ ఉత్తీర్ణత.
 
ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్దులకు పోస్టులను బట్టి నెలకు రూ11వేల నుంచి రూ.15వేల వరకు స్టైఫెండ్ వస్తుంది.

Read: యురేనియం కార్పొరేషన్‌లో 150 ట్రైనీ Jobs

Categories
Business Jobs Latest

జియో మరో బంపర్ ఆఫర్, ఏడాది పాటు ఫ్రీ

సంచలన ఆఫర్లతో టెలికాం రంగంలో టాప్ పొజిషన్ కి చేరిన రిలయన్స్ జియో, తాజాగా తన కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ప్రిపెయిడ్

సంచలన ఆఫర్లతో టెలికాం రంగంలో టాప్ పొజిషన్ కి చేరిన రిలయన్స్ జియో, తాజాగా తన కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ప్రిపెయిడ్ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. రూ.401 నెలవారీ రీచార్జి ప్లాన్ లేదా రూ.2599 వార్షిక ప్లాన్ లేదా రూ.612, రూ.1208 డేటా వోచర్లు.. వీటిలో ఏదో ఒక ప్లాన్ ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. శనివారం(జూన్ 6,2020) రాత్రి వివరాలతో పాటు ప్లాన్ ను లాంచ్ చేసింది జియో. ఇక 28 రోజులు ముగిశాక క‌స్ట‌మ‌ర్లు ఏ ప్లాన్‌ను అయినా రీచార్జి చేసుకోవ‌చ్చు. కాక‌పోతే ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా పొందాలంటే మాత్రం నెల నెలా 12 నెల‌ల పాటు ఏదైనా ఒక ప్లాన్‌ను యాక్టివ్‌గా ఉంచాలి. దీంతో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది.

కాగా ఈ తరహా ఆఫర్ ను ఇప్పటికే ఎయిర్ టెల్ అందిస్తోంది. రూ.401తో రీచార్జి చేసుకునే వారికి ఏడాది పాటు డీస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తోంది. ఎయిర్ టెట్ కు పోటీగా ఇప్పుడు జియో కూడా ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. హాట్‌స్టార్ యాప్‌లో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే దానికే రూ.399 అవుతుంది. ఈ క్ర‌మంలో జియో కేవ‌లం మ‌రో రూ.2 అద‌నంగా వేసి రూ.401కు ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందించ‌డంతోపాటు మొద‌టి నెల రోజుల వ‌ర‌కు ఉచిత రీచార్జి ప్లాన్‌ను కూడా అందిస్తోంది.

రూ.401 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే:
* ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం
* 90 జీబీ డేటా
* 3జీబీ చొప్పున 28 రోజుల పాటు వాడుకోవ‌చ్చు. 
* మ‌రో 6జీబీ డేటా ఉచితం. 
* 28 రోజుల వ‌ర‌కు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. 
* అలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్. 
* జియో టు నాన్ జియో 1000 ఉచిత నిమిషాలు. 

రూ.2599 పేరిట ఇదే త‌ర‌హాలో మ‌రో వార్షిక ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది జియో.
* 740 జీబీ డేటా. 
* 365 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున ఉప‌యోగించుకోవ‌చ్చు. 
* రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. 
* మ‌రో 10 జీబీ ఉచిత డేటా అద‌నం. 
* జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్
* జియో టు నాన్ జియో 12వేల ఉచిత నిమిషాలు. 
* ఈ ప్లాన్ వాలిడిటీ ఏడాది 
* ఏడాది పాటు డిస్నీ + హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితం.

ఇక జియో క‌స్ట‌మ‌ర్లు డేటా అయిపోతే కాంబో ప్యాక్‌ల‌ను రీచార్జి చేసుకుని డేటాను పొందొచ్చు. వీటిని కూడా కొత్త‌గా లాంచ్ చేశారు. రూ.612 మొద‌లుకొని రూ.1004, రూ.1206, రూ.1208 టారిఫ్‌లలో ఈ ప్యాక్‌లు ల‌భిస్తున్నాయి. వీటి ద్వారా కూడా క‌స్ట‌మర్లు ఏడాది పాటు డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా పొందొచ్చు.