Categories
Latest National

పేడను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం : కిలో ఎంతంటే..

ఇంట్లో పశువుల పేడను ఏం చేస్తాం అంటే..పిడకలు చేస్తాం..లేదా చేపల చెరువలకు అమ్మేస్తాం అని చెబుతారు. కానీ ఇకనుంచి ఆ పేడను గవర్నమెంటుకే అమ్ముకోవచ్చు. ఇదేదో జోక్ అనుకోవద్దు. నిజమే. గవర్నమెంటే స్వయంగా పేడను కొనటానికి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 25న ప్రారంభించిన ‘గోధన్ న్యాయ్’ పథకం కింద ప్రభుత్వం ప్రజలనుంచి పేడను కొనుగోలు చేయనుండి. ఈ పథకం జులై 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ పథకంలో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వం కిలో ఆవు పేడను రూ.1.5కి కొంటుంది. పేడే కదా అని చులకనగా చూడకండి. పేడ కూడా మీకు ఆర్థికంగా అండగా ఉండే రోజులు రాబోతున్నాయంటోంది చత్తీస్ గఢ్ ప్రభుత్వం.

పశు సంపదపై ఆధారపడి జీవించే గ్రామీణ ప్రజలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 25న ప్రారంభించింది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘గోధన్ న్యాయ్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కిలో ఆవుపేడను రూ. 1.5కి కొనుగోలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే పేడను వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించనుంది.

ఈ సందర్భంగా సీఎం భూపేశ్ భాగేల్ మాట్లాడుతూ..ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందనీ..స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి ఆవు పేడను సేకరిస్తారని తెలిపారు. ఈ పథకం కోసం ఓ కార్డును కూడా జారీ చేస్తామని… పేడ కొనుగోలు చేసిన తారీఖు..వంటి వివరాలను ఇందులో నమోదు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు గ్రామ స్థాయిలో గోధన్ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామని..అదే పట్టణాలు, నగరాల్లో ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు.

ఆవుల నుంచి పాలు తీసుకున్న తరువాత వాటి యజమానులు వాటిని విచ్చలవిడిగా వదిలివేస్తున్నారనీ..దీంతో అవి రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలబారిన పడుతున్నాయనీ..అంతేకాదు అలా విచ్చలవిడిగా వదిలివేసిన జంతువులు పంటలను నాశనం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కానీ అలా వదిలివేస్తున్న ఆవులు రోడ్లమీదనే పేడను వేస్తుంటాయి. దీంతో పారిశుద్ధం కూడా దెబ్బతింటోంది. ఈక్రమంలో ఆవుల పెంపకం దారులకు లాభసాటిగా మార్చటానికి వాటి యజమానులు సంరక్షించే దిశగా చూస్తారని భావిస్తున్నామని తెలిపారు.

ఆవులను పెంపకాన్ని సంరక్షించడం..వాటిని మరింతగా మెరుగుపరచడం, వర్మి కంపోస్ట్ ఉత్పత్తిని ప్రోత్సహించడం..గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అనే లక్ష్యంతో ఆవు పేడను 1.5 కిలోల చొప్పున సేకరించాలని కమిటీ నిర్ణయించిందని వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన కమిషనర్ ఎం గీతా చెప్పారు.

దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ్యులు మాట్లాడుతూ..ఈ పథకం ఎంతమాత్రం ఆచరణ కాదనీ విమర్శిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో రైతులు ఆవుపేడను అస్సలు అమ్మరు. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేయాలని అనుకుంటే ఆవుపేడను సేకరించిన తరువాత దాన్ని వర్మి కంపోస్ట్ గా చేయటానికి గల ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. ఆవుపేడ కొనుగోలుకు సంబంధించి బడ్జెట్ గురించి కూడా ప్రభుత్వం చెప్పాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Read Here>>ఈ ప్లానెట్ చాలా హాట్ గురూ, ప్రతి 36 గంటలకు 4 సీజన్లు, 2 వేసవులు-2 శీతాకాలాలు

Categories
Latest National

ఆన్‌లైన్‌లో గొర్రెలు, మేకల అమ్మకాలు : దటీజ్ కరోనా బిజినెస్ ట్రెండ్

వస్తువు ఉన్నచోటికే కొనుగోలుదారులు రావాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ మార్కెట్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కరోనా తోడు కావడంతో బయటకు వెళ్లకుండానే చాలా మంది అన్నీ ఆన్ లైన్ లోనే కొనుక్కోవటం పరిపాటిగా మారిపోయింది. ఎలక్ట్రానిక్, ఫుడ్, బట్టలు..నిత్యావసర వస్తువులతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ ఆన్ లైన్ అమ్మాకాలలిస్ట్ లోకి జంతువులు కూడా చేరిపోయాయి. బక్రీదు పండుగ సందర్భంగా..ఆన్‌లైన్ ద్వారా గొర్రెలు, మేకలు అమ్మకాలు షురూ అయిపోయాయి.

అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఐదుగురు ఓల్డ్ స్టూడెంట్స్  జంతువుల అమ్మకాల కోసం ప్రత్యేకించి ఓ వెబ్ సైట్ రూపొందించారు. ఈ ఏడాది జులై 31న బక్రీద్ పండగ నేపథ్యంలో మేకలు, గొర్రెలను ఆన్ లైన్ లోనే కొనుక్కోవచ్చు అంటూ.. Netlivestock.com లో ఆర్డర్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న మేకను..లేదా గొర్రెలను మీ ఇంటికి పంపిస్తామంటున్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఈ ఆన్ లైన్ యానిమల్ మార్కెట్‌కు వెళ్లేందుకు భయపడుతున్న క్రమంలో ఈ కొత్త పద్ధతిని రూపొందించామని అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ అలూమ్నీ వెబ్ సైట్ సభ్యుడు ఖలీదా రాజా తెలిపారు.

ఈ సందర్భంగా ఖలీదా రాజా మాట్లాడుతూ..కోవిడ్-19తో ప్రజలు జంతుమార్కెట్ కు రావటానికి భయపడుతున్నారనీ..దీంతో ఈ ఆన్ లైన్ మార్కెట్ ను రూపొందించామని తెలిపారు. మరో సభ్యుడు మసూద్ ఉల్ హాసన్ మాట్లాడుతూ..బక్రీదు పండుగ సందర్భంగా మొరాబాద్ డివిజన్ లోని జంతు మార్కెట్ లో ప్రత్యేకంగా ఢిల్లీ..ముంబై వంటి పలు ప్రాంతాల నుంచి మేకలను..గొర్రెలను అమ్ముతుంటారు. కానీ లాక్ డౌన్ వల్ల ఈ మార్కెట్ పెద్దగా కొనుగోలు జరిగే అవకాశం లేదు. దీంతోఈ ఆన్ లైన్ ద్వారా జంతువులను అమ్మేలా ప్లాన్ చేశామని అన్నారు.
పైగా దీంట్లో దళారీల ప్రసక్తే ఉండదు కాబట్టి ఈ వెబ్ సైట్ ద్వారా అమ్మేవారికి..కొనేవారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ వెబ్ సైట్ లో అమ్మే జంతువులకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయని..వాటి బరువు..వయస్సు..కొమ్ములు, చెవుల కొలతలు…వాటి పళ్లు ఎలా ఉన్నాయి వంటి అన్ని వివరాలు ఉంటాయని తెలిపారు. ఈ ఆన్ లైన్ మార్కెట్ ద్వారా ద్వారా రైతులు, వినియోగదారులను అనుసంధానం చేస్తూ విక్రయలు జరపనున్నట్టు చెప్పారు. మొత్తానికి కరోనా పుణ్యమా అని ఇప్పుడు గొర్రెలు, మేకలు కూడా ఆన్‌లైన్‌లో లభిస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read Here>>మహిళ పొట్టపై ఎన్ని తేనేటీగలో చూశారా… 

Categories
Latest National

మత నాయకుడి అంత్యక్రియలకు 10వేలమంది: ఆ పరిధిలోని గ్రామాల్లో మళ్లీ లాక్ డౌన్

కరోనా మహమ్మారి కాలంలో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకేచోట ఉండటానికే ప్రజలు హడలిపోతున్నారు. సొంత బంధువులు చనిపోతేనే వెళ్లటం లేదు. కానీ..కరోనా నిబంధలను ఏమాత్రంఖాతరు చేయకుండా ..అసోంలోని నాగావ్ జిల్లాలో ఓ మతబోధకుడి అంత్యక్రియలకు ఏకంగా 10 వేల మంది హాజరు కావడం కలకలం రేపింది.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంత్యక్రియలకు హాజరు కావటానికి కేవలం 20 మంది మాత్రమే హాజరవ్వాలని నిబంధనలు విధించింది. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా..కరోనా వ్యాపిస్తుందనే భయం గానీ..బాధత్యగానీ లేకుండా అఖిల భారత జమైత్‌ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్‌–ఇ–షరియత్‌ అయిన మౌలానా ఖైరుల్‌ ఇస్లాం ముఫ్తీ (87) వృద్ధాప్యంతో గురువారం మృతి చెందగా జులై 2న కుటుంబ సభ్యులు నిర్వహించిన అంత్యక్రియలకు ఏకంగా 10వేల మందికిపైగా హాజరయ్యారు. అలా హాజరైనవారు ఏమాత్రం భౌతిక దూరాన్ని కూడా పాటించలేదు.

ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఇస్లాం కుమారుడు, ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీకి చెందిన అమీనుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ విధించారు. మరోవైపు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 10వేలకు చేరుకుంది.

Read Here>>కరోనాతో చనిపోయిన నాయకుడి మృతదేహం కోసం పోలీసుల్ని కిడ్నాప్ చేసిన గిరిజనులు

Categories
Andhrapradesh Latest

బాలికపై ఏడాది నుంచి ముగ్గురు సామూహిక అత్యాచారం

విశాఖపట్నం జిల్లాలో కామాంధుల అఘాయిత్యానికి మరో పసిమొగ్గ జీవితం బలైపోయింది. యలమంచిలి మండలం కొత్తల్లిలో ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. గత సంవత్సర కాలం నుంచి జరుగుతున్న ఈ దారుణానికి 15ఏళ్ల బాలిక నరక యాతన అనుభవించింది. కామంతో ఆ బాలికపై దారుణాతిదారుణంగా పశువుల్లా ప్రవర్తిస్తూ సంవత్సరం నుంచి హింసలకు గురిచేశారు ముగ్గురు కామాంధులు.

సంవత్సరం నుంచి ఆ ముగ్గురు చేస్తున్న అత్యాచారానికి ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని బామ్మ గుర్తించటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే..కొత్తలి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటోంది. తొమ్మిదో తరగతి వరకూ చదివి మానేసి ఇంట్లోనే ఉంటోంది. నాయనమ్మ, తాతయ్యలు రోజూ కూలిపనుల కోసం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగొస్తారు. దీంతో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు.

దీంట్లో భాగంగా ఆ ముగ్గురు యువకులు రోజు ఆమె దగ్గరు వచ్చేవారు. చనువు పెంచుకుంటూ మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. అలా సంవత్సరం నుంచి ఆమెను బెదిరిస్తూ శారీరకంగా లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఆమె శరీరంలో మార్పులు గమనించిన నాయనమ్మ తుని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా…ఆరు నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో నాయనమ్మ షాకైంది.

దీంతో ఏం జరిగిందని బాలికను ప్రశ్నించింది.కానీ భయంతో నోరు విప్పలేదు. గట్టిగా అడిగినా ఏడ్చింది తప్ప ఏమీ చెప్పలేదు. దీంతో నానమ్మ మనుమరాలు భయపడటంతో అనునయించి అడగటంతో అసలు విషయం చెప్పింది. నిందితుల్లో ఒకరు పెయింటర్, మరొకరు వ్యవసాయ కూలీ, మూడో వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడని తేలింది. దీంతో నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో యలమంచిలి పోలీసులు ఆదివారం (జులై 5,2020) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read Here>>పిన్నితో వివాహేతర సంబంధం, వేరొకరితో చనువుగా ఉంటోందని హత్య

Categories
Latest National

స్పానిష్‌ ఫ్లూ కాలంలో 4ఏళ్లున్న బాలుడు..ఇప్పుడు కరోనాను జయించిన 106 ఏళ్ల యోధుడు

దేశ రాజధాని ఢిల్లీలో అద్భుతం జరిగింది. కరోనా సోకి చాలామంది ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ ఏకంగా 106 ఏళ్లున్న తాతయ్య..కాదు కాదు ముత్తాత ఒకరు కరోనాను జయించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని కోలుకుని డిశ్చార్జయ్యారు. ఇంత పెద్ద వయస్సులో ఆయన కోలుకోవటమే ఓ అద్భుతమనుకుంటే ఈ 106 ఏళ్ల తాతయ్య విషయంలో మరో విశేషం కూడా ఉంది.

అదేమిటంటే..1918-19 మధ్య ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ వైరస్ దడదడలాడిస్తున్న సమయానికి ఈ 106 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్ల బాలుడు కావటం విశేషం. అంటే ఈ 106ఏళ్ల వయస్సులో ఆయన ఎన్ని చూసిఉంటారో కదా..అనుకుంటూ ఆశ్చర్యానందాలకు లోనయ్యారు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు.

కాకపోతే ఆ స్పానిష్ ఫ్లూ మహమ్మారి ఈయనకు అప్పట్లో సోకిందా? లేదా? అన్నదానిపై సరైన ఆధారం లేదు. కానీ..వేలాది మందిని బలిగొన్న స్పానిష్‌ ఫ్లూ.. ప్రభావం నుంచి తప్పించుకున్నవాడిగా..ఈనాడు కరోనా వైరస్ మహమ్మారిని జయించిన యోధుడిగా ఆయన గురించి డాక్టర్లు అబ్బురంగా చెబుతున్నారు.

కాగా..ఢిల్లీకి చెందిన ఈ 106ఏళ్ల వృద్ధుడితో సహా ఆయన కుటుంబం అంతా వైరస్‌ బారినపడింది. ఇప్పుడు 70 ఏళ్ల వయసున్న ఈ వృద్ధుడి కుమారుడు ఇంకా చికిత్స పొందుతున్నారు. కానీ..ఈ వృద్ధుడు మాత్రం కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావటం గమనించాల్సిన విషయం. వృద్ధుడి భార్యతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా కోలుకున్నారు.

Must Read >>కువైట్‌లో కొత్త బిల్లు.. 8లక్షల మంది భారతీయులు ఇంటికే!

Categories
Latest National

ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం

ఒడిశా CM నవీన్ పట్నాయక్ చెప్పిన శుభవార్త రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లలో సంతోషాన్ని నింపింది. సామాజిక సంక్షేమ పథకంలో ట్రాన్స్‌జెండర్లకు చోటు కల్పించింది. ప్రతీ నెలా పెన్సన్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్‌జెండర్ సంఘ సభ్యులను చేర్చడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సామాజిక భద్రత, వికలాంగ ప్రజా సాధికారత (ఎస్‌ఎస్‌ఈపీడీ) మంత్రి అశోక్ పాండా ప్రకటించారు.

వికలాంగులు, నిరాశ్రయులైన వృద్ధులు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టిన మధుబాబు పెన్షన్ యోజన(ఎంబీపీవై) కింద ఈ ట్రాన్స్ జెండర్ సంఘ సభ్యులకు చోటు కల్పించాలనే ప్రతిపాదనకు సీఎం నవీన్ పట్నాయక్ ఆమోదం పలికారనీ మంత్రి అశోక్ పాండా తెలిపారు. సుమారు 5వేల మంది ట్రాన్స్‌జెండర్‌లకు వారి వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.900 వరకు పెన్షన్ అందిస్తామన్నారు. దీని కోసం అవసరమైన నిధులు ఇప్పటికే కేటాయించామని..లబ్ధిదారులకు త్వరలో ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని మంత్రి తెలిపారు.

అధికార బీజేడీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ పథకం కింద ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని..దీనికి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంకతో 5వేల మంది ట్రాన్స్‌జెండర్లు లబ్ధి పొందుతారని తెలిపారు. ‘ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ట్రాన్స్‌జెండర్ పెన్షన్‌ను ప్రజా సంఘాలు..స్వచ్ఛంద సంస్థలు స్వాగతించాయి. కోవిడ్ -19 సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 48 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,000 అదనపు సహాయం అందించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మరికొన్ని రాష్ట్రాలు ట్రాన్స్‌జెండర్ల కోసం ఇటువంటి సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు కూడా వారికి పెన్షన్లను ప్రకటించాయి’ అని మంత్రి పాండా వివరించారు.

Read Here>>రూ.35 లక్షలు లంచం కేసులో మహిళా ఎస్సై అరెస్ట్

Categories
International Latest

కరోనాతో చనిపోయిన నాయకుడి మృతదేహం కోసం పోలీసుల్ని కిడ్నాప్ చేసిన గిరిజనులు

కరోనా సోకి చనిపోతే సొంత బంధువులు..స్నేహితులు కూడా దగ్గరకు కూడా రావటంలేదు. కనీసం మృతదేహం అంత్యక్రియలకు కూడా రావటంలేదు ఈ నాగరిక ప్రపంచంలో. కానీ కరోనా సోకి చనిపోయిన తమ నాయకుడి మృతదేహాన్ని మాకు అప్పగించాలని అమెజాన్‌ తెగకు చెందిన గిరిజనులు ఏకంగా పోలీసులనే కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన ఈక్వెడార్‌లోని పెరువియన్ సరిహద్దుకు సమీపంలో గురువారం (జులై2) జరిగింది.

అలా కిడ్నాప్ చేసిన పోలీసులను గిరిజనులు బంధించారు. మా నాయకుడి మృతదేహాన్ని మాకు అప్పగిస్తేనే పోలీసులను విడిచిపెడతామని కుమయ్ గ్రామ గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజనులు కిడ్నాప్ చేసిన పోలీసుల్లో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఇద్దరు సైనికులు…ఇద్దరు సాధారణ పౌరులు కూడా ఉన్నారు.ఈ ఘటన ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆగ్రహంతో ఉన్న గిరిజనులు వారిని ఏమైనా చేస్తారని భావించారు. ఈ క్రమంలో గిరిజనులకు, ప్రభుత్వానికి చర్చలు జరిగాయి. చర్చల అనంతరం బంధించిన వారిని గిరిజనులు ఆదివారం విడుదల చేశారని ప్రభుత్వం వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే..ఆగ్నేయ ఈక్వెడార్‌లోని అమెజాన్‌ అడవిలో ఉన్న పాస్తాజా ప్రావిన్స్‌లోని కుమయ్ గ్రామంలోని గిరిజన నేతకు కరోనా సోకింది. దీంతో వైద్య బృందం చికిత్స చేసిన ఫలితం దక్కలేదు. సదరు గిరిజన నాయకుడు మృతిచెందాడు. ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు సదరు గిరిజన నాయకుడి మృతదేహాన్ని వారే ఖననం చేశారు. ఈ విషయం తెలిసిన గిరిజనులు ఒప్పుకోలేదు. మా  నాయకుడి పార్థివదేహాన్ని మాకే అప్పగించాలని కోరారు. కానీ ఖననం కార్యక్రమం పూర్తి అయిపోయింది ఇక మృతదేహాన్ని ఎలా ఇస్తాం అని అన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన గిరిజనులు మా సంప్రదాయం ప్రకారమే మేమే మా నాయకుడికి అంత్యక్రియలు చేస్తాం..మాకు మృతదేహాన్ని అప్పగించాలని పట్టుపట్టారు.కానీ అధికారులు దానికి ఒప్పుకోకపోవటంతో వారి నాయకుడి డెడ్ బాడీ కోసం పోలీసులతో పాటు సాధారణ పౌరులను కూడా గిరిజనులు కిడ్నాప్ చేయటంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖననం చేసిన గిరిజన నాయకుడి మృతదేహాన్ని వెలికి తీసి..కుమయ్ గ్రామానికి తరలించారు. దీంతో బంధించిన వారిని గిరిజనులు ఆదివారం వదిలిపెట్టారు. అనంతరం విడుదల అయినవారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ విషయాన్ని ఈక్వెడార్‌ అంతర్గత మంత్రి పౌలా రోమో ట్వీట్ ద్వారా వెల్లడించారు. పోలీసులతో పాటు ఆరుగురిని కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని తెలిపారు.బందీలైన పౌరులను విడిపించేందుకు పోలీసు కమాండర్ జనరల్ ప్యాట్రిసియో కారిల్లో చర్చలు జరిపారని.. బంధించిన వారిని వదిలిపెట్టిన అనంతరం గిరిజన నేత మృతదేహాన్ని కుమయ్ గ్రామానికి తరలించినట్లు తెలిపారు.

Read Here >>సిక్కుల ఊచకోత కేసులో దోషి కరోనాతో మృతి

Categories
Latest

సినీ నటిపై అత్యాచారం…బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోపిడీ

బెంగుళూరు కు చెందిన ఒక బహు భాషా నటిపై అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను రేప్ చేసి…వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడో కంపెనీ సీఈవో. దీంతో బాధితురాలు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధిత సినీ నటి జేజే నగర్ పరిధిలోని ఒక అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. ఆమె ఇప్పటికే పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించింది. ఈమెకు 2018లో బసవగుడి పరిధిలోని గాంధీ బజార్ లోని మోహిత్ అనే వ్యక్తి పరిచయ మయ్యాడు. తాను ఒక కంపెనీకి సీఈవో అని చెప్పుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. పరిచయమైన కొద్ది రోజులకు ఆమెను తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు. ఆమెతో కలిసి గోవా తదితర ప్రాంతాల్లో పర్యటించాడు. కొన్నాళ్ళకు తన సంస్ధ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని సహాయం చేయాలని కోరుతూ ఆమె వద్ద డబ్బు తీసుకున్నాడు.

గతేడాది 2019 జూన్ 22 న తన పుట్టిన రోజు ఉందని చెప్పి ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ మర్నాడే ఆమె పుట్టిన రోజు ఉండటంతో ఇద్దరూ కూడా పార్టీ చేసుకున్నారు.  ఆసమయంలోనే ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడని ఆమె ఆరోపించింది. తాను డ్రింక్ తాగి మత్తులోకి వెళ్ళిపోయాక తనపై అత్యాచారం చేశాడని..దాన్ని తన సెల ఫోన్ లో చిత్రికరించి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది.

గత ఏడాదిగా ఆ ఫోటోలు వీడియోలు చూపిస్తూ తనను బ్లాక్ మెయిల్ చేస్తూ తన వద్దనుంచి రూ.20 లక్షల వరకు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కోంది. మెహిత్ బెదిరింపులు ఎక్కువవుతున్న క్రమంలో అతని తల్లి తండ్రులకు విషయం చెపితే వారు కూడా అతడ్నే సపోర్టు చేస్తూ మాట్లాడి తనను బెదరించారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహిత్ కోసం గాలిస్తున్నారు. అతడికి మద్దతు ఇచ్చిన తల్లి తండ్రులు నాగమణి,మహదేవ్, మరోక కుటుంబ సభ్యుడు రాహుల్ ను పోలీసులు విచారిస్తున్నారు.

Categories
Latest National

ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమే

కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ? దీని నుంచి ఎప్పుడు బయటపడుతాం ? ఇలాంటి ఎనో ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. కానీ..తొందరలోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందని భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అందుకనుగుణంగా ప్రయోగాలు జరుపుతున్నారు.

ఆగస్టు 15వ తేదీ లోపు కరోనాకు మందు ఆవిష్కరిస్తామని CSIR ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..దీనిపై CSIR – CCMB సంచాలకులు రాకేష్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం కోవిడ్ – 19 వ్యాక్సిన్ రావడం కష్టమేనని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రావొచ్చని వెల్లడిస్తున్నారు. ఇందుకు భారీ స్థాయిలో క్లినిక్ ట్రయల్స్ చేపట్టాల్సి ఉందని తెలిపారు.

ఎవరికన్నా…అనారోగ్యం ఉందని తెలిస్తే..ఏదైనా మందు ఇచ్చి తగ్గిందా ? లేదా ? అని చూసేందుకు ఇదేమి డ్రగ్ కాదని స్పష్టం చేశారు. వ్సాక్సిన్ తయారు కావాలంటే..కొన్ని సంవత్సరాలు పడుతుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కరోనాకు వ్యాక్సిన్ ఇప్పుడు రాదని మరోసారి తేల్చిచెప్పారు. ప్రస్తుతం రోజుకు 400 – 500 కరోనా టెస్టులు చేయడం జరుగుతోందని, ఎక్కువ టెస్టులు చేసుకొనేందుకు అనుమతినివ్వాలని

ICMR కు ప్రతిపాదించామని, అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ఆగష్టు 15 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ICMR చేసిన ప్రకటనపై వైద్య, పరిశోధన నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే…అంతర్జాతీయ నిబంధనల మేరకే వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు సదరు సంసథ ప్రకటించింది.

Categories
Latest National

పిడుగులు పడి 20 మంది మృతి, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు

ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భోజ్‌పూర్‌ జిల్లాకు చెందినవారు తొమ్మిది మంది ఉండగా, శరన్‌ జిల్లాలో ఐదుగురు, కైమూర్‌లో ముగ్గురు, పట్నాలో ఇద్దరు, బక్సార్‌ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారని యూపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.

మృతుల కుటుంబాలకు యూపీ సర్కార్ ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం చొప్పున ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాలు పడుతున్నప్పుడు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణ విభాగం సలహాలను పాటించాలని సూచించారు. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు యూపీలో పిడుగుపాటుకు 130 మంది మరణించారు.

మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. ముంబైలో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ వంటి పలు ప్రాంతాలు అడుగు నుంచి రెండడుగుల వరకు నీరు నిలిచిపోయింది. శాంతాక్రుజ్, గొరెగావ్, మలద్, కాండివలి, బోరివలి, ఇతర పశ్చిమ ప్రాంత శివార్లలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి.

భారీ వర్షాలతో జన జీవనం స్తంభించిపోవడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. వర్షాలతో విరిగిపడిన చెట్లను రహదారులపై నుంచి తొలగిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీతోపాటు, ఎన్‌సీఆర్‌ పరిధిలోని చాలా ప్రాంతాల్లో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు భారీ వర్షాలు కురవచ్చని అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాలైన హన్సీ, హిస్సార్‌, రోహ్‌తక్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, బులంద్‌షహర్‌, పానిపట్‌, ముజఫర్‌నగర్‌, మహేందర్‌గఢ్‌, గురుగ్రామ్‌ మానెసర్‌, రెవారీ, నార్నాల్‌, మీరట్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.