Categories
Movies

సినీ తారలతో జతకట్టిన పవర్‌ఫుల్ పార్టనర్స్

చాలామంది యాక్టర్లు తమ భాగస్వాములను సినిమా సెట్ లలోనే వెతుక్కుంటారు. ఫీల్డ్ రీత్యా తిరిగే ప్రపంచం ఒకటే కావడంతో ఇద్దరూ సెట్ అవుతారని ఫీలవుతుంటారు. అందులో కొందరు మాత్రం వేరే దారి, వేరే జోడీలతో కుదిరిపోవడం చూస్తేనే ఉన్నాం. ఇది బాలీవుడ్, హాలీవుడ్ లవ్ స్టోరీల్లో చాలా స్పెషల్ మ్యారేజెస్ గా నిలిచిపోయిన ప్రేమకథలివి. మనం మచ్చుకుగా ఓ 8పవర్ ఫుల్ కపుల్స్ గురించి మాట్లాడుకుంటే అందులో ముందుండేది విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలే.

విరుష్కా జోడీ:
విరాట్ కోహ్లీ నాన్ సెలబ్రిటీ హోదాలో ఉన్నాడంటే అది కచ్చితంగా అబద్ధమే. స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ.. అనుష్క శర్మను 2013లో యాడ్ షూటింగ్ కోసం కలిసి.. వివాహ బంధంతో ఒకటైయ్యారు. ‘మొదటిసారి నేను తనని కలిసినప్పుడు చాలా భయపడ్డా. అప్పుడేం చేయాలో తెలియక ఓ జోక్ చేశా’ అని కోహ్లీ అమెరికన్ స్పోర్ట్స్ రిపోర్టర్ గ్రాహం బెన్ సింగర్ తో అన్నారు.

ఈ కపుల్ డిస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా ఇటలీలోని టుకానీలో పెళ్లి చేసుకున్నారు. ‘సమయం తెలియకుండా గడిచిపోతూ ఉంటే దీనిని స్వర్గం అనే అంటారు. మంచి మనిషిని పెళ్లి చేసుకుంటే అలాగే ఉంటుంది’ అని వారి వివాహబంధం గురించి అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.

షాహిద్ కపూర్-మీరా రాజ్‌పుత్
షాహిద్ కపూర్.. సినీ ఇండస్ట్రీలో పలువురితో ఎఫైర్ల అనంతరం మీరా రాజ్ పుత్ ను ట్రేడిషనల్ రొమాన్స్ చపకరాకు.. 2014లో పెళ్లి చేసుకున్నారు. ‘నా మైండ్ లో ఉన్న ఆలోచన ఒకటే. చివరి 15నిమిషాలు మిస్ అయిపోతామేమో అనుకున్నాం’ అని షాహిద్ అన్నాడు. తొలిసారి వాళ్లు కలుసుకున్నప్పుడు ఏడు గంటలపాటు మాట్లాడుకున్నారు. జులై 2015లో న్యూఢిల్లీలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఐదేళ్ల క్రితం ఓ అదృష్టకరమైన రోజున పరిచయమైన మాకు మిషా, జైన్ లు పుట్టారు.

సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా
ముంబైకు చెందిన యాక్టర్… సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీగా దూసుకుపోతున్నాడు. లండన్ కు చెందిన వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజా.. భానె అండ్ ఫౌండర్ ఆఫ్ వెజ్ నాన్ వెజ్, మల్టీ బ్రాండ్ స్నీకర్ స్టోర్ ను 2016లో ప్రారంభించారు.

ఒకరోజు రాత్రి స్నాప్ చాట్ లో మేమిద్దరం చాట్ చేసుకున్నాం. నాతో చాటింగ్ చేయొద్దు. మాట్లాడు. అని చెప్పింది. అప్పుడు రెండు గంటలసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు మా స్నేహబంధం బలపడింది. వేగన్ చాక్లెట్లు, స్నీకర్స్ గురించి డీప్ గా మాట్లాడుకున్నాం. అని ఆనంద్ అహుజా అన్నారు. రెండు నెలల పాలో టు లండన్ లో కలుసుకున్న మేము తర్వాత పెళ్లి చేసుకున్నాం. మే 2018లో పెళ్లి చేసుకుని వీరు ఒక్కటవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
శిల్పా శెట్టి కుంద్రా.. రాజ్ కుంద్రాను ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలిశారు. 2017లో బిగ్ బ్రదర్ రియాలిటీ విజేతగా నిలిచింది శిల్పాశెట్టి. పర్‌ఫ్యూమ్ లేబుల్ s2 ప్రమోషన్స్ లో ఆమెకు సాయం చేస్తూ వచ్చారు. నవంబరు 2009లో దాంపత్య బంధంలోకి అడుగుపెట్టాు. వీరికి వియాన్, సమీషా పిల్లలు కూడా ఉన్నారు.

షారూఖ్ ఖాన్-గౌరీ ఖాన్
మూడు దశాబ్దాల క్రితం వివాహ బంధం వీరిది. బాలీవుడ్ పెయిర్లలోనే ఫుల్ ఫ్యామస్. 80వ దశకంలో 18ఏళ్లు వయస్సున్నప్పుడే షారూఖ్ ఆమెతో ప్రేమలో పడ్డారు. ఢిల్లీ యువకుడైన షారూఖ్.. గౌరీని పార్టీలో పూల్ వద్ద కూర్చొని ఉండగా కలిశారు. గౌరీ నెంబర్ తీసుకుని తన పేరు షహీన్ అని చెప్పుకుని ఇంటికి వెళ్లి కలిశారు. ఆరేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపిన వీళ్లు 1991 అక్టోబరు 25లో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

రాజు బన్ గయా జెంటిల్ మన్ సెట్స్ నుంచి సూట్ అద్దెకు తీసుకుని పెళ్లి చేసుకున్నారట. ఈ రోజున గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఆర్యన్, సుహానా, అబ్రం.

మాధురీ దీక్షిత్-శ్రీరాం
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ లో మాధురీ కూడా ఒకరు. ముంబైకి చెందిన వ్యక్తి డా.శ్రీరాం నేనే(కార్డియో సర్జన్)ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు బాలీవుడ్.. ఇంకొకరు లాస్ ఏంజిల్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. 1999అక్టోబరు 17న పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఆరంభించారు. మాధురీ అమెరికాలోని డెన్వర్ కు వెళ్లిపోయారు. ఓ దశాబ్ద కాలం వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేసి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ జంటకు ఆరిన్, ర్యాన్ అనే ఇద్దరు కొడుకులు.

జాన్ అబ్రహం-ప్రియా రుంచాల్
మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా 2010లో కలిసిన వీళ్లు 2014 జనవరి 3న ఒక్కటయ్యారు. రుంచాల్ అనే ఎన్నారై ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ను ముంబైలో కలిశారు జాన్. జిమ్ లో కలిసి ఫ్రెండ్స్ అయిన వీళ్లు లైఫ్ పార్టనర్స్ అయ్యారు. లాస్ ఏంజిల్స్ వివాహం భారీ సెలబ్రేషన్ మధ్య వివాహం చేసుకున్నారు.

మ్యాట్ డామన్-లూసియన్ బర్రాసో
మియామీలో స్టక్ ఆన్ యూ షూటింగ్ జరుగుతున్న సమయంలో లూసియానోను కలిశాడు మ్యాట్ డామన్. షూటింగ్ అయిన తర్వాత డ్రింక్ తాగడానికి వెళ్లాడు మ్యాట్. ‘ఎనిమిదేళ్ల క్రితం ఆమెను గుంపు ఉన్న గదిలో కలిశాను. మా దారులు ఎలా కలుస్తాయో ఊహించలేదు. నేను చాలా అదృష్టవంతుణ్ని. ఆమెతో ప్రేమలో పడ్డాను’ అని మ్యాట్ అంటున్నాడు.

Categories
Latest Movies

ఆమె నా తొలి కొరియోగ్రాఫర్.. సరోజ్ ఖాన్ మృతి పట్ల సంతాపం తెలిపిన బన్నీ..

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో యావత్‌ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేలకు పైగా సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. తెలుగులోనూ పలు సినిమాల్లో సూపర్ హిట్ పాటలకు ఆమె అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారు.

Allu Arjun

సరోజ్ ఖాన్ మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సరోజ్ ఖాన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు. ‘డాడీ’ సినిమా కోసం ఆమెతో కలిసి పనిచేశానని, సరోజ్ ఖాన్ తన తొలి కొరియోగ్రాఫర్ అని, ఆమె మరణం తీరని లోటు.. ఆమె ఆత్మకు శాంతి, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు కలగాలని కోరుకుంటున్నట్లు బన్నీ ట్వీట్ చేశారు.

Allu Arjun Tweet

Read:సరోజ్ ఖాన్ కన్నుమూత..

Categories
Latest Movies

డిజిటల్ సూపర్ హిట్: ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ’ చిత్ర యూనిట్‌కు తలసాని అభినంద‌న‌లు..

‘అందాల రాక్ష‌సి’ నుండి న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్క‌రించుకుంటూ వ‌స్తున్న న‌వీన్ చంద్ర హీరోగా స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి అండ్‌ రామ‌కృష్ణ‌’. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మరార్ స‌మ‌ర్ప‌ణ‌లో క్రిషివ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ డిఫ‌రెంట్ ల‌వ్ జ‌ర్నీని శ్రీకాంత్ నాగోతి తెర‌కెక్కించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ప‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భానుమతి అండ్ రామ‌కృష్ణ‌’ చిత్రం సూపర్‌హిట్ కంటెంట్‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రూపొందింద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హీరో న‌వీన్ చంద్ర‌, చిత్ర స‌మ‌ర్ప‌కుడు శ‌ర‌త్ మ‌రార్‌, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత య‌శ్వంత్ ములుకుట్ల త‌దిత‌రులు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ను ప్ర‌త్యేకంగా క‌లిశారు. చిత్ర‌యూనిట్‌ను త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ప్ర‌త్యేకంగా అభినందించారు.

Bhanumathi & Ramakrishna-Digital Super Hit Talasani

ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ : ‘‘నవీన్ చంద్ర హీరోగా యంగ్ టీమ్ చేసిన ప్రయత్నమే ఈ ‘భానుమతి అండ్ రామకృష్ణ’. ఓ మంచి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్ ములుకుట్ల, సమర్పకుడు శరత్ మరార్‌ గారిని అభినందిస్తున్నాను. అల్లు అరవింద్‌ గారికి సంబంధించిన ‘ఆహా’ ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో పనిచేసిన హీరో, హీరోయిన్స్ సహా యూనిట్‌ అందరికీ అభినందనలు. ప్రస్తుతం కరోనా వల్ల చిత్ర పరిశ్రమ చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా విడుదలకు సిద్ధమైన సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సినిమా రంగానికి సంబంధించిన సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తూనే ఉంది. ‘ఆహా’ యాప్‌లో వచ్చిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

Read:30లో ప్రేమ.. ఆసక్తికరంగా ‘భానుమతి & రామకృష్ణ’..

Categories
Latest Movies

ఈ నటిని గుర్తుపట్టారా?

కంగనా రనౌత్.. ఆమె మంచి నటి అని కొత్తగా చెప్పక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిత్యం వివాదాలతో వార్తల్లో నిలవడం కంగనాకు కొత్తేం కాదు. ఈ బాలీవుడ్ బోల్డ్ క్వీన్ తాజాగా సరికొత్త లుక్‌తో ప్రేక్షకులకు షాకిచ్చింది. కంగన నటించిన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమా కోసం నిర్వహించిన లుక్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె టీమ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Kangana Ranaut

‘మీరు మునుపెన్నడూ చూడని లుక్. ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమాలోని బాబీ పాత్ర కోసం చేసిన లుక్‌టెస్ట్‌ ఇది. అప్పుడు రిజెక్ట్ చేశారు ఈ లుక్.. మీరేం అనుకుంటున్నారు? కంగన ఇలా పిక్సీ కట్‌తో బాగుందా? సినిమాలో కనిపించినట్టుగా గుబురైన ఉంగరాల జుట్టుతో బాగుందా? కింద కామెంట్‌ చేయండి’ అని పోస్ట్ చేశారు కంగన టీమ్. ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కేవలం 4 గంటల్లోనే 7 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. చాలా మంది సినిమాలో కనిపించిన ఉంగరాల జుట్టు లుక్కే బాగుందంటూ కామెంట్స్ చేయడం విశేషం.

Read:భార్యతో బన్నీ వాకింగ్.. వైరల్ అవుతున్న పిక్స్..

Categories
Latest Movies

తేజ‌స్వి ‘క‌మిట్‌మెంట్‌’ చూశారా!

కొద్ది రోజుల క్రితం ‘క‌మిట్‌మెంట్‌’ వెబ్ అంథాల‌జీ సిరీస్‌లోని న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ విడుద‌ల చేసిన స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌లుగురి క‌థ‌గా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో తేజ‌స్వి మ‌దివాడ, ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. “ల‌వ్‌.. డ్రీమ్‌.. హోప్‌.. ఫైట్” అనేది ట్యాగ్‌లైన్‌.

శుక్ర‌వారం(జూలై 3) తేజ‌స్వి మ‌దివాడ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘క‌మిట్‌మెంట్‌’ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో తేజ‌స్వి మ‌డివాడ హాట్‌గా క‌న‌ప‌డుతోంది. న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థాంశాల‌తో ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది.

Commitment

ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క‌రికీ సంబంధించిన క‌థాంశం ఉంటుంది. ‘హైద‌రాబాద్ న‌వాబ్స్’ ఫేమ్ ల‌క్ష్మీకాంత్ చెన్నా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం అందిస్తోన్న ఈ చిత్రానికి న‌రేష్ కుమ‌ర‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌జీష్ రాజేంద్ర‌న్‌, న‌రేష్ రాణా సినిమాటోగ్రాఫ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. ‘క‌మిట్‌మెంట్‌’ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు తెలిపారు.

Read:గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3: ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు దేశాయ్..

Categories
Latest Movies

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3: ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు దేశాయ్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో హీరోయిన్, దర్శకురాలు రేణు దేశాయ్ మొక్కలు నాటారు .

ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ: ‘ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడ్డాం. మన చిన్నతనంలో స్వంత గృహాలలో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం లేదు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య మరియు కూతురు స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. వారి వయసు 10 సంవత్సరాలు. వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి.. మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటి.. అనే విషయాన్ని తెలపడం కోసం వాళ్ళిద్దర్నీ తీసుకురావడం జరిగింది.

ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్నా కూడా భవిష్యత్ తరాలకు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాటిన మొక్క యొక్క ఉపయోగం ఉంటుంది. దాని ఫలాలు భవిష్యత్ తరాలవారు అందుకుంటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురుతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత’ అని తెలిపారు.

Green India Challenge

Read:తన పేరుతో అమ్మాయిలకు వల.. పోలీసులను ఆశ్రయించిన ‘RX 100’ దర్శకుడు..

Categories
Latest Movies

తన పేరుతో అమ్మాయిలకు వల.. పోలీసులను ఆశ్రయించిన ‘RX 100’ దర్శకుడు..

సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిన త‌ర్వాత మోసాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. వివిధ రూపాల్లో అమ‌యాకుల‌ను మోసం చేస్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీ విషయానికి వ‌స్తే.. సినిమాల్లో అవ‌కాశాలు క‌ల్పిస్తామంటూ మోసం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘ‌ట‌న ఒక‌టి హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ కేటుగాడు ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల వివరాలు సేకరించి వారితో వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ.. తాను ‘ఆర్‌.ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి అని చెప్పి పరిచయం పెంచుకున్నాడు.

RX 100

త్వరలో తాను హీరో విజయ్ దేవరకొండ, విశాల్‌లతో తీయబోయే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. కొంద‌రి నుండి న్యూడ్ పిక్స్ కూడా సేక‌రించాడు. తర్వాత వారిని వేధించ‌డం మొద‌లు పెట్టాడు. ఈ విష‌యం డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి వ‌ర‌కు వెళ్లింది. తన పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గురువారం హైద‌రాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు దర్శకుడు అజ‌య్ భూప‌తి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.

Read:ఆన్‌లైన్‌లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..

Categories
Latest Movies

భార్యతో బన్నీ వాకింగ్.. వైరల్ అవుతున్న పిక్స్..

కరోనా వైరస్ దెబ్బకు అందరి జీవితాలూ ప్రభావితమయ్యాయి. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమ్యారు. వర్కవుట్లు చేయడానికి జిమ్‌లు, వాకింగ్ చేయడానికి పార్కులు కూడా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు తమ ఇళ్లకు సమీపంలోని రోడ్లపై వాకింగ్ చేస్తున్నారు.

Pushpa

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అతని భార్య స్నేహా రెడ్డి వాకింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేబీఆర్ పార్క్ మూసి వేయడంతో వీరిద్దరూ దాని వెలుపల వాకింగ్ చేస్తున్నారు. జన సందోహం తక్కువగా ఉంటుందనే కారణంతో తెల్లవారుజామునే వీరిద్దరూ వాకింగ్ పూర్తి చేసుకుంటున్నారు. బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో నటించనున్న ‘పుష్ప’ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read:30లో ప్రేమ.. ఆసక్తికరంగా ‘భానుమతి & రామకృష్ణ’..

Categories
Latest Movies

ఆన్‌లైన్‌లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..

కరోనా కారణంగా చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా ఆన్‌లైన్‌లో థియేటర్ల కంటే మందే విడుదల అవుతతున్నాయి. మరికొన్ని రోజులు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కూడా లేకపోవడంతో లేటెస్ట్‌గా తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబ‌లి సినిమా నిర్మించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని తీసిన `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌` సినిమాని ఆన్‌లైన్‌లో విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేష్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ఇది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. తెలుగులో స‌త్య‌దేవ్ హీరోగా ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

జులై 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. నరేష్‌, హరి చందన, జబర్దస్త్‌ రాంప్రసాద్‌, టీఎన్‌ఆర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్‌ ఈ సినిమాకి సంగీతం అందించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. గ్రామీణ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. స‌త్య‌దేవ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని లుక్‌తో క‌న‌ప‌డుతున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఫొటోగ్రాఫ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నారు. అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు.

Read:అమ్మాయిల్ని బతకనివ్వరారా.. IPC 376 ట్రైలర్..

Categories
Latest Movies

అమ్మాయిల్ని బతకనివ్వరారా.. ‘IPC 376’- ట్రైలర్..

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘IPC 376’. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశారు. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతాయి. ఆధునిక యుగంలో సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటూ చెబుతూనే, అటు అతీంద్రియ శక్తుల ఉనికిని విజువల్స్ లో చూపించారు. రేప్ చేస్తారు, ప్రాణాలతో తగలబెడతారు, అమ్మాయిలను బతకనివ్వరా అంటూ నందిత శ్వేతా చెప్పిన ఎమోషనల్ పవర్ ఫుల్ డైలాగ్ తో IPC 376 చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది.

ట్రైలర్ లోని వివిధ ఇంట్రెస్టింగ్ షాట్స్ చిత్ర కథ గత థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో ఉందని తెలుపుతున్నాయి. పోలీస్ అధికారి పాత్రలో నందిత శ్వేత ఫుల్ స్వింగ్ లో నటించిందని ట్రైలర్ చూపిస్తోంది. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సి.కళాధర్ సాహిత్యం అందిస్తున్నారు. తెలుగు & తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.

Read:సరోజ్ ఖాన్ కన్నుమూత..