Categories
Latest National

ఇక కుక్క మాంసం తినం..అమ్మం.. అక్కడి గవర్నమెంట్ నిర్ణయం

ఇకపై మేము కుక్క మాంసం తినం..కుక్క మాంసం వ్యాపారాలు చేయం అంటూ నాగాలాండ్ ప్రభుత్వం చెబుతోంది. కరోనా కాలంలో కుక్క మాంసాలు తినవద్దని ఎంతమంది ఎన్నివిధాలుగా చెప్పినా వినని నాగాలాండ్ ప్రభుత్వం దారికి వచ్చింది. ఇకపై కుక్కమాంసం అస్సలు తినమని చెబుతోంది. నాగాలాండ్‌కి కుక్క మాంసం దిగుమతి, వ్యాపారం, అమ్మకం ఇకపై ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి టెంజెన్ టాయ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

నాగాలాండ్‌లో కుక్కలు,కుక్కల మాంసాన్ని విక్రయించడానికి వ్యతిరేకంగా ఇటీవల ఆన్‌లైన్ ప్రచారం విపరీతంగా జరిగింది. వీటిలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా),ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ జంతు సంరక్షణ సంస్థ (FIAPO)కూడా ఉంది.కాగా..నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక దేశంలోని కుక్కలు బతికిపోయినట్టే అని జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా..కుక్క మాంసంపై నిషేధం విధించటంతో నాగాలాండ్‌లోని ఓ వర్గం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

కుక్కల్ని తినడం తరాలుగా సంప్రదాయంగా వస్తోందనీ.. తమ ఆచారాల్ని మంట కలిపే కుట్ర జరుగుతోందని వాదిస్తున్నారు..ఇది ముమ్మాటికి కావాలని చేసే కుట్రేనని వారు ఆరోపిస్తున్నారు.కాగా..నాగాలాండ్‌ ప్రభుత్వం సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం కూడా ఉంది. నాగాలాండ్‌లోని ఓ వెట్ మార్కెట్లో సంచుల్లో కుక్కల్ని తాళ్లతో కట్టి అమ్మకానికి పెట్టారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చైనాలో ఇలాంటి వెట్ మార్కెట్ కారణంగానే కరోనా పుట్టిందని..అటువంటి కుక్కల మార్కెట్ నాగాలాండ్ లో ఉందనీ దీన్ని నిషేధించాలని చాలా మంది కామెంట్లు చేశారు.

ఈ క్రమంలో నాగాలాండ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం కావటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నాగాలాండ్‌కి ఏటా 30,000 కుక్కల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. వాటిని వెట్ మార్కెట్లలో చితకబాది..హింసలు పెట్టి.. ప్రాణం తీస్తున్నారు. ఆ తరవాత వాటిని మేకల్ని కోసినట్టు కోసి వాటి మాంసాన్ని అమ్ముతున్నారు.

అలాగే ఈ సంవత్సరం కరోనా విజృంభిస్తున్న క్రమంలో మిజోరం ప్రభుత్వం కూడా కుక్కల అమ్మకాలపై నిషేధం విధించింది.

Categories
Latest National

రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తాం : ప్రైవేట్ ఆస్పత్రి బేరాలు

రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తా..లేదంటే లేకపోయినా..ఉందని రిపోర్ట్ లో రాస్తానంటూ బేరాలు ఆడుతున్న ఓ ఆస్పత్రి సిబ్బంది బేరాల బేరం వెలుగులోకి వచ్చింది. కరోనా సీజన్ పలు ప్రైవేటు ఆస్పత్రులకు బంగారు బాతు గుడ్డులా మారిపోయింది. కరోనా టెస్ట్ ల పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అంతే లేకుండా పోయింది. ఎంతగా అని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏదో కూరగాయాలు బేరం ఆడినట్లుగా కరోనా టెస్టుల విషయంలో కూడా బేరాలు మొదలుపెట్టారు.రూ. 2500 ఇస్తే..కరోనా లేదనీ నెగిటివ్ అని రిపోర్టుఇస్తానంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది బేరమాడుతున్న విషయం ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

యూపీలోని మీరట్‌కు చెందిన ఓ ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఈ దారుణానికి ఒడిగట్టారు. డబ్బులు ఇస్తే కరోనా లేదని రిపోర్టు ఇస్తామని చెబుతూ.. ఓ వ్యక్తితో మాట్లాడుతుండగా తీసిన వీడియో బైటకు రావటం సంచలన కలిగించింది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. వెనువెంటనే ఆ ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేశారు. దానికి సీల్ వేసి కేసు నమోదు చేశారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. డబ్బు సంపాధించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని..ఇటువంటి ముఠాలపై నిఘా కూడా పెంచామని అధికారులు తెలిపారు. కాగా ఆస్పత్రుల నిర్వాహకులు ఇలా ఉన్నవి లేనట్లుగా..లేవని ఉన్నట్లుగా చేస్తే..ప్రజల పరిస్థితి ఏంటి అంటూ వాపోతున్నారు ప్రజలు. అసలే కరోనా భయంతో ఛస్తుంటే ఇటువంటి ఆస్పత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటీ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

Categories
National

చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన అజిత్ దోవల్… LAC వెంట దళాల ఉపసంహరణకు అంగీకారం

తూర్పు ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేప‌థ్యంలో భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు( అజిత్ ధోవ‌ల్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామ‌ర‌స్యం విల‌సిల్లాల‌న్న ల‌క్ష్యంతో చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవ‌ల్ మాట్లాడారు.

ఆదివారం ఇద్ద‌రూ వీడియో కాల్ ద్వారా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తున్న‌ది. స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించాల‌న్న నేప‌థ్యంలో ఇద్ద‌రూ సంభాషించారు. చ‌ర్చ‌లు చాలా సానుకూలంగా సాగిన‌ట్లు అధికారులు తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ గాల్వ‌న్ లాంటి ఘ‌ర్ష‌ణ‌లు పున‌రావృత్తం కాకూడ‌ద‌ని ఇద్ద‌రూ చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం.

రెండు దేశాల సైన్యాలు వివాదాస్ప‌ద ప్రాంతం నుంచి వైదొలుగుతున్న‌ట్లు ఇవాళ‌ చైనా విదేశాంగ ప్ర‌తినిధి జావోలిజియాన్ కూడా తెలిపారు. ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు.. ఫ్రంట్‌లైన్ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించ‌డానికి కావాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మూడ‌వ‌సారి జ‌రిగిన క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌ల్లో కుదిరిన ఒప్పందాల ప్ర‌కారం ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ జ‌రుగుతున్న‌ట్లు జావో లిజియాన్ తెలిపారు.

ఎల్ఏసీ నుంచి సుమారు రెండు కిలోమీట‌ర్ల మేర వెన‌క్కి చైనా ద‌ళాలు వెళ్లిన‌ట్లు భార‌త సైన్యం ప్ర‌క‌టించిన వెంట‌నే చైనా త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఫ్రంట్‌లైన్ ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌లో పురోగ‌తి సాధించిన‌ట్లు జావో లిజియాన్ తెలిపారు. దీంతో ఉద్రిక్త‌త‌ల‌ను కూడా త‌గ్గనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

గత ఏడు వారాలుగా, తూర్పు లడఖ్‌లోని పలు చోట్ల భారత- చైనా సైన్యాల మధ్య ఘోరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ వ్యాలీలో 20 మంది సైనికులు అమరవీరులైన తర్వాత భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరువర్గాల మధ్య గత కొన్ని వారాలలో అనేక దౌత్య మరియు సైనిక చర్చలు జరిగాయి.

Categories
National

బాస్మతి బియ్యానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వండి.. మధ్యప్రదేశ్ సీఎం

మధ్యప్రదేశ్ లో పండే బాస్మతి బియ్యానికి భౌగోళిక గుర్తింపు (GI) ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. తమ రాష్ట్రంలో పండించే బాస్మతి బియ్యం విశిష్ఠతను శివరాజ్ సింగ్ చౌహాన్ తోమర్‌కు వివరించారు.

అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ… మధ్యప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం అమెరికా, కెనడా దేశాలకు నాణ్యమైన బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. తమ రాష్ట్రంలో పండించే బాస్మతి బియ్యానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి ఈ అంశంపై చర్చించినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. భౌగోళిక గుర్తింపు (geographical indication) అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (భౌగోళిక గుర్తింపు-జీఐ). ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే.

Read Here>>చైనాకు భూటాన్‌తో మరోసారి సరిహద్దు గొడవ. ఈ సారి టార్గెట్ అరుణాచల్‌ప్రదేశ్

Categories
Latest National

పేడను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం : కిలో ఎంతంటే..

ఇంట్లో పశువుల పేడను ఏం చేస్తాం అంటే..పిడకలు చేస్తాం..లేదా చేపల చెరువలకు అమ్మేస్తాం అని చెబుతారు. కానీ ఇకనుంచి ఆ పేడను గవర్నమెంటుకే అమ్ముకోవచ్చు. ఇదేదో జోక్ అనుకోవద్దు. నిజమే. గవర్నమెంటే స్వయంగా పేడను కొనటానికి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 25న ప్రారంభించిన ‘గోధన్ న్యాయ్’ పథకం కింద ప్రభుత్వం ప్రజలనుంచి పేడను కొనుగోలు చేయనుండి. ఈ పథకం జులై 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ పథకంలో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వం కిలో ఆవు పేడను రూ.1.5కి కొంటుంది. పేడే కదా అని చులకనగా చూడకండి. పేడ కూడా మీకు ఆర్థికంగా అండగా ఉండే రోజులు రాబోతున్నాయంటోంది చత్తీస్ గఢ్ ప్రభుత్వం.

పశు సంపదపై ఆధారపడి జీవించే గ్రామీణ ప్రజలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 25న ప్రారంభించింది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘గోధన్ న్యాయ్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కిలో ఆవుపేడను రూ. 1.5కి కొనుగోలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే పేడను వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించనుంది.

ఈ సందర్భంగా సీఎం భూపేశ్ భాగేల్ మాట్లాడుతూ..ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందనీ..స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి ఆవు పేడను సేకరిస్తారని తెలిపారు. ఈ పథకం కోసం ఓ కార్డును కూడా జారీ చేస్తామని… పేడ కొనుగోలు చేసిన తారీఖు..వంటి వివరాలను ఇందులో నమోదు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు గ్రామ స్థాయిలో గోధన్ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామని..అదే పట్టణాలు, నగరాల్లో ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు.

ఆవుల నుంచి పాలు తీసుకున్న తరువాత వాటి యజమానులు వాటిని విచ్చలవిడిగా వదిలివేస్తున్నారనీ..దీంతో అవి రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలబారిన పడుతున్నాయనీ..అంతేకాదు అలా విచ్చలవిడిగా వదిలివేసిన జంతువులు పంటలను నాశనం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కానీ అలా వదిలివేస్తున్న ఆవులు రోడ్లమీదనే పేడను వేస్తుంటాయి. దీంతో పారిశుద్ధం కూడా దెబ్బతింటోంది. ఈక్రమంలో ఆవుల పెంపకం దారులకు లాభసాటిగా మార్చటానికి వాటి యజమానులు సంరక్షించే దిశగా చూస్తారని భావిస్తున్నామని తెలిపారు.

ఆవులను పెంపకాన్ని సంరక్షించడం..వాటిని మరింతగా మెరుగుపరచడం, వర్మి కంపోస్ట్ ఉత్పత్తిని ప్రోత్సహించడం..గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అనే లక్ష్యంతో ఆవు పేడను 1.5 కిలోల చొప్పున సేకరించాలని కమిటీ నిర్ణయించిందని వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన కమిషనర్ ఎం గీతా చెప్పారు.

దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ్యులు మాట్లాడుతూ..ఈ పథకం ఎంతమాత్రం ఆచరణ కాదనీ విమర్శిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో రైతులు ఆవుపేడను అస్సలు అమ్మరు. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేయాలని అనుకుంటే ఆవుపేడను సేకరించిన తరువాత దాన్ని వర్మి కంపోస్ట్ గా చేయటానికి గల ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. ఆవుపేడ కొనుగోలుకు సంబంధించి బడ్జెట్ గురించి కూడా ప్రభుత్వం చెప్పాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Read Here>>ఈ ప్లానెట్ చాలా హాట్ గురూ, ప్రతి 36 గంటలకు 4 సీజన్లు, 2 వేసవులు-2 శీతాకాలాలు

Categories
Latest National

ఆన్‌లైన్‌లో గొర్రెలు, మేకల అమ్మకాలు : దటీజ్ కరోనా బిజినెస్ ట్రెండ్

వస్తువు ఉన్నచోటికే కొనుగోలుదారులు రావాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ మార్కెట్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కరోనా తోడు కావడంతో బయటకు వెళ్లకుండానే చాలా మంది అన్నీ ఆన్ లైన్ లోనే కొనుక్కోవటం పరిపాటిగా మారిపోయింది. ఎలక్ట్రానిక్, ఫుడ్, బట్టలు..నిత్యావసర వస్తువులతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ ఆన్ లైన్ అమ్మాకాలలిస్ట్ లోకి జంతువులు కూడా చేరిపోయాయి. బక్రీదు పండుగ సందర్భంగా..ఆన్‌లైన్ ద్వారా గొర్రెలు, మేకలు అమ్మకాలు షురూ అయిపోయాయి.

అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఐదుగురు ఓల్డ్ స్టూడెంట్స్  జంతువుల అమ్మకాల కోసం ప్రత్యేకించి ఓ వెబ్ సైట్ రూపొందించారు. ఈ ఏడాది జులై 31న బక్రీద్ పండగ నేపథ్యంలో మేకలు, గొర్రెలను ఆన్ లైన్ లోనే కొనుక్కోవచ్చు అంటూ.. Netlivestock.com లో ఆర్డర్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న మేకను..లేదా గొర్రెలను మీ ఇంటికి పంపిస్తామంటున్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఈ ఆన్ లైన్ యానిమల్ మార్కెట్‌కు వెళ్లేందుకు భయపడుతున్న క్రమంలో ఈ కొత్త పద్ధతిని రూపొందించామని అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ అలూమ్నీ వెబ్ సైట్ సభ్యుడు ఖలీదా రాజా తెలిపారు.

ఈ సందర్భంగా ఖలీదా రాజా మాట్లాడుతూ..కోవిడ్-19తో ప్రజలు జంతుమార్కెట్ కు రావటానికి భయపడుతున్నారనీ..దీంతో ఈ ఆన్ లైన్ మార్కెట్ ను రూపొందించామని తెలిపారు. మరో సభ్యుడు మసూద్ ఉల్ హాసన్ మాట్లాడుతూ..బక్రీదు పండుగ సందర్భంగా మొరాబాద్ డివిజన్ లోని జంతు మార్కెట్ లో ప్రత్యేకంగా ఢిల్లీ..ముంబై వంటి పలు ప్రాంతాల నుంచి మేకలను..గొర్రెలను అమ్ముతుంటారు. కానీ లాక్ డౌన్ వల్ల ఈ మార్కెట్ పెద్దగా కొనుగోలు జరిగే అవకాశం లేదు. దీంతోఈ ఆన్ లైన్ ద్వారా జంతువులను అమ్మేలా ప్లాన్ చేశామని అన్నారు.
పైగా దీంట్లో దళారీల ప్రసక్తే ఉండదు కాబట్టి ఈ వెబ్ సైట్ ద్వారా అమ్మేవారికి..కొనేవారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ వెబ్ సైట్ లో అమ్మే జంతువులకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయని..వాటి బరువు..వయస్సు..కొమ్ములు, చెవుల కొలతలు…వాటి పళ్లు ఎలా ఉన్నాయి వంటి అన్ని వివరాలు ఉంటాయని తెలిపారు. ఈ ఆన్ లైన్ మార్కెట్ ద్వారా ద్వారా రైతులు, వినియోగదారులను అనుసంధానం చేస్తూ విక్రయలు జరపనున్నట్టు చెప్పారు. మొత్తానికి కరోనా పుణ్యమా అని ఇప్పుడు గొర్రెలు, మేకలు కూడా ఆన్‌లైన్‌లో లభిస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read Here>>మహిళ పొట్టపై ఎన్ని తేనేటీగలో చూశారా… 

Categories
Latest National

మత నాయకుడి అంత్యక్రియలకు 10వేలమంది: ఆ పరిధిలోని గ్రామాల్లో మళ్లీ లాక్ డౌన్

కరోనా మహమ్మారి కాలంలో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకేచోట ఉండటానికే ప్రజలు హడలిపోతున్నారు. సొంత బంధువులు చనిపోతేనే వెళ్లటం లేదు. కానీ..కరోనా నిబంధలను ఏమాత్రంఖాతరు చేయకుండా ..అసోంలోని నాగావ్ జిల్లాలో ఓ మతబోధకుడి అంత్యక్రియలకు ఏకంగా 10 వేల మంది హాజరు కావడం కలకలం రేపింది.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంత్యక్రియలకు హాజరు కావటానికి కేవలం 20 మంది మాత్రమే హాజరవ్వాలని నిబంధనలు విధించింది. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా..కరోనా వ్యాపిస్తుందనే భయం గానీ..బాధత్యగానీ లేకుండా అఖిల భారత జమైత్‌ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్‌–ఇ–షరియత్‌ అయిన మౌలానా ఖైరుల్‌ ఇస్లాం ముఫ్తీ (87) వృద్ధాప్యంతో గురువారం మృతి చెందగా జులై 2న కుటుంబ సభ్యులు నిర్వహించిన అంత్యక్రియలకు ఏకంగా 10వేల మందికిపైగా హాజరయ్యారు. అలా హాజరైనవారు ఏమాత్రం భౌతిక దూరాన్ని కూడా పాటించలేదు.

ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఇస్లాం కుమారుడు, ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీకి చెందిన అమీనుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ విధించారు. మరోవైపు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 10వేలకు చేరుకుంది.

Read Here>>కరోనాతో చనిపోయిన నాయకుడి మృతదేహం కోసం పోలీసుల్ని కిడ్నాప్ చేసిన గిరిజనులు

Categories
Latest National

స్పానిష్‌ ఫ్లూ కాలంలో 4ఏళ్లున్న బాలుడు..ఇప్పుడు కరోనాను జయించిన 106 ఏళ్ల యోధుడు

దేశ రాజధాని ఢిల్లీలో అద్భుతం జరిగింది. కరోనా సోకి చాలామంది ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ ఏకంగా 106 ఏళ్లున్న తాతయ్య..కాదు కాదు ముత్తాత ఒకరు కరోనాను జయించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని కోలుకుని డిశ్చార్జయ్యారు. ఇంత పెద్ద వయస్సులో ఆయన కోలుకోవటమే ఓ అద్భుతమనుకుంటే ఈ 106 ఏళ్ల తాతయ్య విషయంలో మరో విశేషం కూడా ఉంది.

అదేమిటంటే..1918-19 మధ్య ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ వైరస్ దడదడలాడిస్తున్న సమయానికి ఈ 106 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్ల బాలుడు కావటం విశేషం. అంటే ఈ 106ఏళ్ల వయస్సులో ఆయన ఎన్ని చూసిఉంటారో కదా..అనుకుంటూ ఆశ్చర్యానందాలకు లోనయ్యారు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు.

కాకపోతే ఆ స్పానిష్ ఫ్లూ మహమ్మారి ఈయనకు అప్పట్లో సోకిందా? లేదా? అన్నదానిపై సరైన ఆధారం లేదు. కానీ..వేలాది మందిని బలిగొన్న స్పానిష్‌ ఫ్లూ.. ప్రభావం నుంచి తప్పించుకున్నవాడిగా..ఈనాడు కరోనా వైరస్ మహమ్మారిని జయించిన యోధుడిగా ఆయన గురించి డాక్టర్లు అబ్బురంగా చెబుతున్నారు.

కాగా..ఢిల్లీకి చెందిన ఈ 106ఏళ్ల వృద్ధుడితో సహా ఆయన కుటుంబం అంతా వైరస్‌ బారినపడింది. ఇప్పుడు 70 ఏళ్ల వయసున్న ఈ వృద్ధుడి కుమారుడు ఇంకా చికిత్స పొందుతున్నారు. కానీ..ఈ వృద్ధుడు మాత్రం కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావటం గమనించాల్సిన విషయం. వృద్ధుడి భార్యతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా కోలుకున్నారు.

Must Read >>కువైట్‌లో కొత్త బిల్లు.. 8లక్షల మంది భారతీయులు ఇంటికే!

Categories
Latest National

ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం

ఒడిశా CM నవీన్ పట్నాయక్ చెప్పిన శుభవార్త రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లలో సంతోషాన్ని నింపింది. సామాజిక సంక్షేమ పథకంలో ట్రాన్స్‌జెండర్లకు చోటు కల్పించింది. ప్రతీ నెలా పెన్సన్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్‌జెండర్ సంఘ సభ్యులను చేర్చడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సామాజిక భద్రత, వికలాంగ ప్రజా సాధికారత (ఎస్‌ఎస్‌ఈపీడీ) మంత్రి అశోక్ పాండా ప్రకటించారు.

వికలాంగులు, నిరాశ్రయులైన వృద్ధులు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టిన మధుబాబు పెన్షన్ యోజన(ఎంబీపీవై) కింద ఈ ట్రాన్స్ జెండర్ సంఘ సభ్యులకు చోటు కల్పించాలనే ప్రతిపాదనకు సీఎం నవీన్ పట్నాయక్ ఆమోదం పలికారనీ మంత్రి అశోక్ పాండా తెలిపారు. సుమారు 5వేల మంది ట్రాన్స్‌జెండర్‌లకు వారి వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.900 వరకు పెన్షన్ అందిస్తామన్నారు. దీని కోసం అవసరమైన నిధులు ఇప్పటికే కేటాయించామని..లబ్ధిదారులకు త్వరలో ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని మంత్రి తెలిపారు.

అధికార బీజేడీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ పథకం కింద ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని..దీనికి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంకతో 5వేల మంది ట్రాన్స్‌జెండర్లు లబ్ధి పొందుతారని తెలిపారు. ‘ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ట్రాన్స్‌జెండర్ పెన్షన్‌ను ప్రజా సంఘాలు..స్వచ్ఛంద సంస్థలు స్వాగతించాయి. కోవిడ్ -19 సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 48 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,000 అదనపు సహాయం అందించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మరికొన్ని రాష్ట్రాలు ట్రాన్స్‌జెండర్ల కోసం ఇటువంటి సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు కూడా వారికి పెన్షన్లను ప్రకటించాయి’ అని మంత్రి పాండా వివరించారు.

Read Here>>రూ.35 లక్షలు లంచం కేసులో మహిళా ఎస్సై అరెస్ట్

Categories
National

వరుసగా నాల్గవ రోజు 20వేలకు పైగా కరోనా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవే!

ప్రపంచంలో కరోనా వైరస్ కారణంగా ప్రభావితం అయిన దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది భారత్. అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, గరిష్ట కరోనా కేసులు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి. కరోనా కేసుల విషయంలో రష్యాను భారత్ అదిగమించింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 6 లక్షల 97 వేల మందికి కరోనా సోకింది. వీరిలో 19,693 మంది మరణించగా, నాలుగు లక్షల 24 వేల మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో, కొత్తగా 24 వేల 248 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 425 మరణాలు సంభవించాయి. భారతదేశంలో వరుసగా నాలుగవ రోజు, 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, జూలై 5 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య ఒక కోటికి దగ్గరగా ఉంది, వీటిలో 1,80,596 నమూనాలను నిన్న పరీక్షించారు. అమెరికా, బ్రెజిల్ తరువాత, భారతదేశంలో ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (2,981,009), బ్రెజిల్ (1,604,585) లో ఉన్నాయి. అదే సమయంలో రష్యాలో భారతదేశం (681,251) తక్కువ కేసులు ఉన్నాయి.

రాష్ట్రాలవారీగా గణాంకాలు:

క్రమ సంఖ్య రాష్ట్రం పేరు కరోనా కేసులు
కోలుకున్నవారు చనిపోయినవారు
1 అండమాన్ నికోబార్ 125 72 0
2 ఆంధ్రప్రదేశ్ 18697 8422 232
3 అరుణాచల్ ప్రదేశ్ 269 78 1
4 అస్సాం 11388 7125 14
5 బీహార్ 11876 8765 95
6 చండీగఢ్ 466 395 6
7 ఛత్తీస్గఢ్ 3207 2601 14
8 ఢిల్లీ 99444 71339 3067
9 గోవా 1761 936 7
10 గుజరాత్ 36037 25892 1943
11 హర్యానా 17005 12944 265
12 హిమాచల్ ప్రదేశ్ 1063 737 11
13 జమ్మూ కాశ్మీర్ 8429 5255 132
14 జార్ఖండ్ 2781 2045 19
15 కర్ణాటక 23474 9847 372
16 కేరళ 5429 3174 25
17 లడఖ్ 1005 826 1
18 మధ్యప్రదేశ్ 14930 11411 608
19 మహారాష్ట్ర 206619 111740 8822
20 మణిపూర్ 1366 688 0
21 మేఘాలయ 62 43 1
22 మిజోరం 186 130 0
23 ఒడిషా 9070 6224 36
24 పుదుచ్చేరి 802 331 12
25 పంజాబ్ 6283 4408 164
26 రాజస్థాన్ 20164 15928 456
27 తమిళనాడు 111151 62778 1510
28 తెలంగాణ 23902 12703 295
29 త్రిపుర 1568 1202 1
30 ఉత్తరాఖండ్ 3124 2524 42
31 ఉత్తర ప్రదేశ్ 27707 18761 785
32 పశ్చిమ బెంగాల్ 22126 14711 757
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 697413 424433 19693

దేశంలో ప్రస్తుతం 2 లక్షల 53 వేల కరోనా కేసులు ఉండగా.. అత్యంత చురుకైన కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో 86 వేలకు పైగా కరోనా సోకిన ప్రజలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రెండో స్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో, గుజరాత్ నాలుగవ స్థానంలో, ఉత్తర ప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యంత చురుకైన కేసులు ఉన్నాయి.

Read Here>>కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం