Categories
Movies Slider Uncategorized

బన్నీ పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటూ గీతా ఆర్ట్స్‌ పేరుతో అమ్మాయిలకు వల: నిందితుడ్ని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింత్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్‌ పేరుతో ఓ యువకుడు అమ్మాయిలకు వల వేశాడు. అల్లు అర్జున్న (బన్నీ)పక్కన సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటు నమ్మిస్తూ ఓ యువకుడు పలువురు ఇద్దరు అమ్మాయిలకు మెజేస్ లు పంపిస్తూ మోసాలవల వేశాడు శ్రవణ్అనే వ్యక్తి. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు.

గీతా ఆర్ట్స్‌లో తాను డిజైనర్, మేకప్ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిల‌కి అనేక మాట‌లు చెప్పి మోసం చేశాడు. ఈ విష‌యం గీతా ఆర్ట్స్ బేన‌ర్ దృష్టికి రావ‌డంతో వెంట‌నే గీతా ఆర్ట్స్ మేనేజ‌ర్ స‌త్య సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మోసం చేసిన వ్య‌క్తి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడ‌డంతో అత‌ని లోకేష‌న్ ట్రేసింగ్ చేశారు. ఆ మెసేజ్ లు కేరళ,తిరుచ్చి నుంచి వస్తున్నాయని గుర్తించారు. వెంటనే సదరు ఘరానా మోసగాడు శ్రవణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు.

కాగా..ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి పేరు చెప్పి అమ్మాయిల‌ని మోసం చేసిన విష‌యం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమాల్లో నటించాలనేకోరికతో ఇటువంటి మోసగాళ్ల బారిన పడవద్దంటూ పోలీసులు సూచించారు.

Read Here>>‘రాధే శ్యామ్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..

Categories
National Slider

మాస్క్ లతో కరోనా కమెండోలు..సూపర్ స్ప్రెడర్లను గుర్తించడానికి కమెండోలు

కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ఇందుకోసం ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది. తిరువనంతపురంలో ఉండే పుంథూరాలో గస్తీ కాస్తున్న తీరుతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి చర్యలను పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతోఎక్కడ చూసినా కమాండోల గస్తీ గురించే ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో కరోనా కేసులు పెరిగాయి. పుంథూరా ప్రాంతంలో 600 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఏకంగా 119 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రతి ఆరుగురికిలో ఒకరికి కరోనా సోకిందని తేలింది. దీనికి తోడు పాజిటివ్ వచ్చిన ఓ మత్స్యకారుడికి ఇటీవల 120 మందిని కలిశాడని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో పరీక్షలను పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నట్టు కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.

స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసు విభాగానికి చెందిన 25 మంది కమాండోలను రంగంలోకి దించారు. పుంథూరా నుంచి బయటకు, బయటి నుంచి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. నిత్యావసరాలను కూడా నేరుగా అధికారులే సరఫరా చేస్తున్నారు. పుంథూరా, తమిళనాడు మధ్య ఫిషింగ్ బోట్ల రాకపోకలను కూడా నిలిపివేశారు.

కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్లో అవసరమైనన్ని పడకలు ఉన్నాయని, పాజిటివ్ వచ్చినవారిని తక్షణమే హాస్పిటల్‌కు తరలిస్తున్నట్టు మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,559 మంది కోలుకున్న సంగతి తెలిసిందే.

Categories
Andhra Pradesh Slider

ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జూన్27 శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నారు.

 

జూన్ 27 24,458 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 740మందికి పాజిటివ్ అని తేలింది.గత 24 గంటల్లో 263 మంది కరోనా వైరస్ బారినుంచి చికిత్స పొంది ఇళ్లకు తిరిగి వెళ్ళారు.

 

కోవిడ్ బారిన పడి కర్నూల్ జిల్లా లో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరూ, విజయనగరం జిల్లాలో ఒక్కరూ మరణించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 6,648 మంది కోవిడ్ కు చికిత్స పొందుతున్నారు.

Read: ఏపీ ఆర్టీసీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు.. క్లారిటీ ఇచ్చిన ఎండీ

Categories
National Slider

3రూపాయల 46 పైసల అప్పు కోసం రైతును 15 కి.మీ. నడిపించిన బ్యాంకు అధికారి

కర్ణాటక షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో బ్యాంకులు రైతుల పట్ల చూపించే వివక్షకు ఉదాహరణగా ఓ దారుణ ఘటన జరిగింది. కేవలం 3 రూపాయల 46 పైసల అప్పు చెల్లించడం కోసం ఓ బ్యాంకు ఉద్యోగి ఓ రైతును దాదాపు 15 కిలో మీటర్ల దూరం నడిపించాడు.

 

వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు చెక్కేసి బ్యాంకులకు టోపీలు వేస్తున్న ఆర్థిక నేరగాళ్ల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయలేని బ్యాంకులు..వ్యవసాయం కోసం తీసుకున్న అప్పులు తీసుకున్న రైతన్నలను మాత్రం బెదిరించి మరీ వసూలు చేస్తున్న ఘటనలకు ఈ దారుణం సందర్భం ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

 

అమాదే లక్ష్మీనారాయణ అనే చిన్న రైతు వక్కల పెంపకం వ్యవసాయం చేస్తుంటాడు. అతను సమీపంలోని పట్టణంలో ఉన్న కెనరా బ్యాంకు నుంచి రూ. 35 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో రూ.32 వేలు మాఫీ అయింది. మిగిలిన రూ.3 వేలను కూడా ఆ రైతు బ్యాంకుకు చెల్లించేశాడు. దీంతో రుణం మొత్తం తీరిపోయింది.

 

పాత అప్పు కట్టేశాను కాబట్టి బ్యాంకు నుంచి మరోసారి లోనుతీసుకోవచ్చని అనుకున్నాడు. కానీ..ఒకరోజు ఆ రైతుకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు తీసుకున్న లోను మొత్తం కట్టలేదని వెంటనే రావాలని బ్యాంకు అధికారి చెప్పాడు. దీంతో రైతు గాబరా పడిపోయాడు. అదేంటీ మొత్తం బాకీ కట్టేశానే అనుకుంటూ లక్ష్మీనారాయణ ఆదరాబాదరాగా బ్యాంకు వెళ్లడానికి రెడీ అయ్యాడు.

 

కానీ..కరోనా లాక్ డౌన్ తో బస్సులు తిరగటంలేదనే విషయం గుర్తుకొచ్చింది. దీంతో వేరే దారిలేక నడుచుకుంటూ బ్యాంకు వెళ్ళాడు. బ్యాంకు అధికారి రూ.3 రూపాయల 46 పైసల అప్పు బాకీ ఉందని..వెంటనే కట్టేయాలని పీకమీద కూర్చున్నాడు. దీంతో లక్ష్మీనారాయణ షాక్ అయ్యాడు.

 

ఈ మాత్రం అప్పు కోసం ఈ లాక్ డౌన్ సమయంలో 15 కిలోమీటర్లు నడిపించారని వాపోయాడు. తనకు ఫోన్ చేసిన బ్యాంకు అధికారి ఫోన్ లోనే ఈ మాట చెప్పొచ్చుకదా అంటూ ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ 3 రూపాయల 46పైసల అప్పు బ్యాంకు అధికారుల అప్పును ఇచ్చి (కోపంతో ముఖాన నట్లుగా ఇచ్చి) వెళ్ళిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎల్ పింగ్వా స్పందిస్తూ.. కొత్తగా మళ్లీ అప్పు ఇవ్వడానికి వీలవుతుందనీ అందువల్లే ఆ డబ్బుని అడిగామని తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read: ఆన్ లైన్ క్లాసుల పేరుతో కార్పొరేట్ స్కూల్స్ అధిక ఫీజుల దందాలు

 

Categories
National Slider

2నెలలకు సరిపడ వంట గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు, భయాందోళనలో ప్రజలు, జమ్మూకాశ్మీర్‌లో అసలేం జరుగుతోంది

2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. జమ్మూకాశ్మీర్ లో ఏం జరగనుంది? అని అంతా కంగారుపడ్డారు. అసలే చైనా, భారత్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల హింసాత్మక ఘర్షణ తర్వాత ఉద్రిక్తత మరింత పెరిగింది. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ తరుచుగా కాల్పులకు తెగబడుతోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు జారీ చేసిన ఈ ఆదేశాలు మరింత టెన్షన్ పెట్టాయి. చైనాతో యుద్ధానికి భారత్ రెడీ అవుతోందా? పాక్ పై మరోసారి దాడి చేయనుందా? అనే అనుమానాలు రేకేత్తించాయి.

బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు ముందు ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు:
గత ఏడాది (2019) పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేయడానికి ముందు కూడా అధికారులు ఇలాంటి ఆదేశాలే జారీ చేశారని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే సమయంలోనూ అధికారులు ఇలాంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి తరహా ఆర్డర్స్ ఇవ్వడంతో ఏదో జరగబోతోందని ప్రజలు వర్రీ అవుతున్నారు.

ప్రజలను ఎందుకు భయపెడుతున్నారు?
ఈ ఆదేశాలపై విపక్షాలు కూడా మండిపడ్డాయి. అధికారుల ఆదేశాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. అసలు మీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పండి, దీనిపై వివరణ ఇవ్వండి, ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇచ్చి, ప్రజల్లో ఆందోళన తొలగించండి అంటూ ట్వీట్ లో డిమాండ్ చేశారాయన.

ఎల్పీజీ నిల్వ చేయాలని చెప్పడానికి కారణం ఇదే:
ఎల్పీజీ స్టాక్, స్కూల్ భవనాల సిద్ధంకి సంబంధించి ప్రజల్లో ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. దీనిపై స్పష్టత ఇచ్చాయి. ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు. రానున్నది శీతాకాలం. దాన్ని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ సిలిండర్లు స్టాక్ లో ఉంచుకోవాలని చెప్పాము. అంతే తప్ప మరో కారణం లేదు అని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు ఫరూక్ ఖాన్ చెప్పారు. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిందిగా వినియోగదారు వ్యవహారాల డైరెక్టర్ ని ఆదేశిస్తామని ఆయన వెల్లడించారు.

అమర్ నాథ్ యాత్ర విధులకు వచ్చే భద్రతా బలగాల వసతి కోసం:
ఇక స్కూల్ భవనాలను సిద్దం చేయాలన్న దానిపైనా పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. దాని కోసం డ్యూటీలో పాల్గొనేందుకు భద్రతా దళాలు వస్తున్నాయి. వారికి వసతి కల్పించేందుకు స్కూల్ భవనాలు సిద్ధం చేస్తున్నాం అంతే అని పోలీసు ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు.

Categories
Latest Movies Slider

వైరస్ మాత్రమే కాదు వైర్‌లెస్ నెట్‌వర్క్ కూడా ప్రమాదకరమే..Welcome To Digital India

యాక్షన్ హీరో విశాల్ మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఎమ్.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో, విశాల్ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘చక్ర’.. శ్రద్ధా శ్రీనాధ్, రెజీనా, సృష్టి డాంగే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..తాజాగా ‘చక్ర’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. సైబర్ హ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ప్రస్తుతం సొసైటీలో సగటు మనిషిని ముప్పుతిప్పలు పెడుతున్న హ్యాకింగ్ అనే అంశాన్ని కథాంశాంగా తీసుకుని, హీరోకి హ్యాకర్‌కి, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు హ్యాకర్‌కి మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మైండ్ గేమ్‌ని దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటోంది. విశాల్ యాక్టింగ్, బాలసుబ్రమణియణ్ విజువల్స్, యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి. ‘కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్‌లెస్ నెట్‌వర్క్ కూడా ప్రమాదకరమే.. Welcome To Digital India’.. అంటూ ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. కె.ఆర్.విజయ, మనోబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Video Link : https://youtu.be/N8B3chilPxI

Read: షూటింగులో వ్యక్తికి కరోనా.. ఉలిక్కిపడ్డ టీవీ పరిశ్రమ..

Categories
Movies Slider Viral

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్

సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ వివాహం పీటర్ పాల్‌తో నేడు(జూన్ 27) చెన్నైలో ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అతికొద్ది మంది సన్నిహితుల మధ్య క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. 1999లో ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన వనిత.. మొదట 2000 వ సంవత్సరంలో తమిళ

Vanitha Vijaykumar Wedding [Click and drag to move]

2007లో ఆకాష్‌తో విడాకులు తీసుకున్న వనిత 2007లో ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప సంతానం. కొంత కాలానికి అతనితో కూడా విడిపోయింది. విడాకులు, కిడ్నాప్ ఇలా నానా హంగామా చేసి కోర్టులు, కేసులు అంటూ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల పాటు కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో సహజీవనం కూడా చేసింది. తాజాగా మూడో పీటర్ పాల్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. పీటర్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. వనిత సిస్టర్స్ ప్రీతి, శ్రీదేవి, బ్రదర్ అరుణ్ విజయ్ కూడా నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Vanitha Vijaykumar Wedding

టీవీ నటుడు ఆకాష్‌ను పెళ్లాడింది. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు.

Categories
Movies Slider Viral

పవన్ బయోపిక్: ఆర్జీవీ పవర్ స్టార్‌ని చూశారా!

వివాదం ఆయనకి వోడ్కాతో పెట్టిన విద్య.. బయోపిక్స్ తీయడం ఆయనకు టూత్ పిక్‌తో పళ్లు గుచ్చుకున్నంత తేలిక.. నేనుండే సిటీ ఏదైనా కావొచ్చుకానీ నాకు పబ్లిసిటీ అంటే పిచ్చి అంటాడు.. నా సినిమాలు ఆడకపోయినా నేను తీయడం మాత్రం మానను అంటాడు.. కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. రిలీజ్ సంగతి పక్కన పెడితే ఆయన సినిమా తీయడానికి బోలెడన్ని పాయింట్స్ తగులుతూనే ఉంటాయి. మైండ్‌లో పురుగు అలా కదలగానే.. ఇదే నా నెక్స్ట్ సినిమా అని అనౌన్స్ చేసేస్తుంటాడు.

ఇప్పుడు వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ తెరకెక్కించనున్నాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు ఆర్జీవీ. ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అనే పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు.

అక్కడితో ఆగితే ఆయన ఆర్జీవీ ఎందుకవుతాడు? పనిలో పనిగా ‘పవర్ స్టార్’లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్‌కి సంబంధించిన ఓ వీడియో కూడా విడుదల చేశాడు.
‘‘నా కొత్త సినిమా ‘పవర్ స్టార్’లో హీరో ఇతనే . అతను మా ఆఫీస్‌కి వచ్చినప్పుడ ఈ వీడియో షూట్ చేశాం. సాధారణంగా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉండడం అన్నది యాదృచ్ఛికం కాని యాదృచ్ఛికం.. ఉద్దేశపూర్వకం కాని ఉద్దేశపూర్వకం’’ అంటూ తన స్టైల్లో ట్వీటాడు వర్మ. ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో కాంట్రవర్సీ పీక్స్‌కి తీసుకెళ్లిన ఆర్జీవీ ఇప్పుడు పవన్ బయోపిక్‌తో ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.

Categories
National Slider

పేదింటిలో బకాసురుడు : అన్నంమంతా ఒక్కడే తినేస్తున్నాడని కొడుకుని గొలుసులతో కట్టేసిన తండ్రి

కన్నబిడ్డలు అన్నం సరిగ్గా తినకపోతే..ఇంకో ముద్ద తినమ్మా..మళ్లీ ఆకలేస్తుంది..అంటూ తినిపిస్తాం. కానీ ఓ తండ్రి కొడుకు అన్నం ఎక్కువగా తినేస్తున్నాడని కన్నకొడుకుని ఇనుప గొలుసులతో కట్టేసి కడుపు మాడ్చేసిన విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌ కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారణం ఆ కొడుకుపై తండ్రికి ఉన్నది కోసం కాదు..ఓపేద తండ్రి దుస్థితి అది. ఇంట్లో అందరికీ వండిన అన్నం ఒక్కడే తినేస్తున్న కొడుకుపై ఆ పేద తండ్రి దారుణ దుస్థితికి అద్దం పట్టే ఘటన ఇది.

కౌశాంబి జిల్లాలోని సైనీ ప్రాంతంలో కందైలాల్‌ అనే నిరుపేద కుటుంబం కష్టం చేసుకుని జీవిస్తోంది. వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ వచ్చే అతి కొద్దిపాటి ఆదాయంతో బ్రతికే కుటుంబం కందైలాల్ ది. పని చేస్తేనే పూట గడుస్తుంది. లేదంటే పస్తులే. నీళ్లు తాగి పడుకోవాల్సిందే. అది ఈ ఇంట్లో పరిస్థితి.
కానీ దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్లుగా.. ఇంట్లో వారంతా పని చేస్తున్నా అతని కొడుకు విజయ్ మాత్రం ఏపనీ చేయకుండా బలాదూర్‌గా తిరిగే వాడు. తండ్రి పని చేయాలని ఎంత చెప్పినా వినిపించుకునే వాడు కాదు. కానీ కన్నకొడుకే కదాని ఏమీ అనేవాడు కాదు. పనిచేయటం ఎంత అవసరమో చెబుతుండేవారు.

కానీ వినకుండా తినటం తిరగటం తప్ప మరో పనిలేని కొడుకు మాత్రం చక్కగా ఇంట్లో వండిన అన్నాన్ని మొత్తం తినేసేవాడు. కష్టపడి పనిచేసేవారికి తినటానికి ఏమన్నా ఉందో లేదో చూసుకునేవాడు కాదు. అలా ఓ రోజు అతడు ఇంటికి వచ్చి ఎవరికి అన్నం మిగల్చకుండా తినేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇంటికి వచ్చినవారకి తినటానికి ఏమీ లేదు. వండుకోవటానికి ఇంట్లో బియ్యం కూడా లేవు. దీంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఆకలితో మాడిపోయారు. ఎన్నో రోజులుగా బలాదూర్ కొడుకుని భరిస్తున్న ఆ తండ్రి కోపంతో ఊగిపోయాడు.

నీకు ఎంత చెప్పినా బుద్ది రాదురా..నీ పని చెబుతానుండు..అంటే ఓ ఇనుప గొలుసు పట్టుకొచ్చి కొడుకుని గొలుసులతో కట్టిపడేశాడు. ఆకలి బాధ అంటే ఏంటో నీకుతెలియాలి అంటూ అన్నం పెట్టకుండా కడుపు మాడ్చాడు. అలా అతను ఆకలితో అలమటించిపోతూ నీరసించిపోయాడు. ఇది చూసిన స్థానికులు అతనికి అన్నం పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కందైలాల్ ఇంటికి వచ్చిన పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఇంట్లో ఆర్థిక కష్టాలకు తోడు పని చేయకుండా ఎక్కువ అన్నం తింటున్నాడని..అన్నం తిన్నా తనకు బాధ లేదని కానీ, పని చేసే వారంతా ఆ రోజు ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సి వచ్చిందని అందుకే కట్టేయాల్సి వచ్చిందని కన్నీటితో ఆ తండ్రి చెప్పిన మాటలకు వారి దుస్థితి చూసి పోలీసులు కూడా చలించిపోయారు. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనుకుంటూ..నీరసంగా ఉన్న కొడుకుని హాస్పిటల్ కు తరలించారు. పేదలకు ఆహారం అందిస్తున్నామని చెప్పుకునే పాలకులకు ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Categories
National Slider

విద్యార్ధులకు మైకుల్లో పాఠాలు చెబుతున్న మాస్టారు: కరోనా క్లాసుల్లో..హలో హలో.. మైక్ టెస్టింగ్

కరోనా కాలంలో విద్యార్ధులు పాఠాలు నేర్చుకునే తీరే మారిపోయింది. స్కూల్ కు వెళ్లే పనేలేకుండా పోయింది. పొద్దున్నే లేవటం..స్నానాలు..హోమ్ వర్కులు..ప్రాజెక్టులు ఇలా అన్నీ పోయాయి. ఒకప్పుడుఅంటే కరోనాకు ముందు విద్యార్దులు క్లాసులో కూర్చుంటే టీచర్లు వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు..రేడియోల్లో పాఠాలు చెబుతున్నారు మాస్టార్లు. అంతేకాదు ఇప్పుడు మరోరకంగా కూడా పాఠాలు చెప్పేస్తున్నారు మాస్టార్లు. ఎలాగంటే మైకుల్లో క్లాసులు..! ఊరందరికీ విషయం చెప్పాలంటే మైకుల్లో  (లౌడ్ స్పీకర్లు)చెప్పేవారు. ఇప్పుడు కరోనా కాలం. క్లాసుల ట్రెండే మారిపోయింది. భౌతిక దూరం పేరుతో పాఠాలు చెప్పేస్టైల్ మారిపోయింది.

లాటిన్ అమెరికా ప్రాంతంలోని కొలంబియాలో రేడియో పాఠాలు చెబుతున్నారు. ఆ దేశంలో ఇంటర్నెట్‌ పెద్దగా అందుబాటులో లేకపోవడంతో లాటిన్ అమెరికా ప్రభుత్వం రేడియోలో పాఠాలు చెప్పేలా ఏర్పాటు చేసింది. టీచర్లు రేడియో స్టేషన్‌కు వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలను పిల్లలు పెద్దల సహకారంతో
వింటున్నారు.

ఇదిలావుండగా ఇంటర్నెట్‌, లాప్‌టాప్‌, స్మార్ట్‌‌ఫోన్లు లేని విద్యార్థుల కోసం జార్ఖండ్‌లోని బంకతి మిడిల్‌ స్కూల్‌ హెడ్‌‌మాస్టర్‌ శ్యామ్‌ కిషోర్‌ గాంధీ స్కూల్‌ చుట్టూ..మైక్‌లు పెట్టించారు. ఐదుగురు టీచర్లు స్కూల్ నుంచి  పాఠాలు చెబుతుంటే పిల్లలు వినేలా ఏర్పాట్లు చేశారు. పిల్లలకు ఏదైనా డౌట్స్ వస్తే తమ ఫోన్‌కు కానీ..స్కూల్ స్టాఫ్‌ ఫోన్‌కు మెసేజ్‌ చేస్తే డౌట్స్ తీర్చేలా ఏర్పాటు చేశారు.

మెజేస్ చూసుకున్న వారు మరునాడు ఆ డౌట్స్ క్లియర్ చేస్తారు. ఏప్రిల్‌ 16 నుంచి ప్రతిరోజూ రెండు గంటల పాటు మైకుల్లో పాఠాలు చెబుతూ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. దీనిపై ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు మాస్కూల్లో  246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

వారిలో 204 మందికి స్మార్ట్‌‌ఫోన్‌లు లేవు. ఉన్నా చాలామందికి ఇంటర్ నెట్ సదుపాయం లేదు. దీంతో వారి కోసం ఇటువంటి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ క్లాసులకు 100 శాతం మంది హాజరవుతున్నారని..తెలిపారు. కరోనా కాలంలో ఇటువంటి తంటాలు మాకెందుకులే అనుకుండా ఇటువంటి ఐడియాతో పిల్లలకు పాఠాలు చెబుతునన ఈ  హెడ్ మాస్టర్‌ ని అందరితో పాటు  డుమ్కా జిల్లా విద్యాశాఖాధికారి పూనం కుమారి ప్రశంసించారు.

ఇటువంటి ఐడియాలో పాఠాలు చెబుతున్న తీరు అభినందనీయమనిఅన్నారు. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తరువాత ఏడాది చదువుకు ఒకే చెప్పటం చాలా కష్టమనీ అది టీచర్లకే కాకుండా విద్యార్దులకు మంచిది కాదనీ ఇటువంటి ఐడియాతో క్లాసులు చెప్పటం చాలా బాగుందని ప్రశంసించారు. ఇటువంటి మాస్టార్ల అంకిత భావం ఉంటే విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు.