Categories
Sports

ప్రపంచకప్‌కు అడుగు దూరంలో ఆగిన రోజు.. భారత జెర్సీలో ధోని కనిపించి ఏడాది

జూలై 10, 2019… 130కోట్ల భారతీయులు ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్న రోజు.. ఇదే రోజు.. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన రోజు ఈరోజే. దీంతో భారత జట్టు టోర్నమెంట్‌కు దూరం అయ్యింది. కోట్లాది మంది అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సెమీ-ఫైనల్స్‌లో కివీస్ ముందు చతికిలపడింది.

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుని భారత్‌కు 240 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఇది రిజర్వ్ డేలో తర్వాత రోజు పూర్తయింది.

మొత్తం ప్రపంచ కప్‌లో అధ్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత జట్టులోని టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను న్యూజిలాండ్ బౌలర్లు అలవోకగా పెవిలియన్ పంపేశారు. భారత జట్టులో సిరీస్ మొత్తం అధ్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అవగా.. అందరూ వెంటవెంటనే అవుటయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. తర్వాత హార్దిక్ పాండ్యా కొంతసేపు క్రీజులో ఉన్నాడు. పాండ్యా కూడా 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ విధంగా భారత్ 100 పరుగుల వ్యవధిలో 6 వికెట్లను కోల్పోయింది.

ఆ సమయంలో బాధ్యత మొత్తం మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జెడేజా భుజాలపై పడింది. ఇద్దరు ఆటగాళ్ళు ఒత్తిడితో కూడిన పరిస్థితిలో భారత ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ముందుకు సాగించారు. జడేజా క్రీజులో అడుగు పెట్టిన వెంటనే, న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడడం ప్రారంభించాడు. మరో చివర ధోని స్ట్రైకింగ్ ఇస్తున్నాడు. ధోని, జడేజా వ్యూహం పనిచేసింది. మ్యాచ్లో భారత జట్టు తిరిగి మంచి పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో దురదృష్టవశాత్తు జడేజా బోల్ట్ బంతికి పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో 77 పరుగులకే అవుటయ్యాడు. ఈ వికెట్‌తో భారత జట్టు మరోసారి ఒత్తిడిలోకి పడింది.

అవుట్ అయ్యే ముందు, జడేజా ధోనితో 116 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు, కానీ మార్టిన్ గుప్టిల్ అద్భుతమైన త్రో చెయ్యడంతో ధోని(50) రనౌట్ అయ్యాడు. అంతే భారత జట్టుకు అతిపెద్ద షాక్. దీంతో భారత జట్టు ఆశలన్నీ ఆవిరైపోయాయి. ధోని అవుట్ అయిన తరువాత, భారత్ 9 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ భువనేశ్వర్ కుమార్ (0), యుజ్వేంద్ర చాహల్ (5), జస్ప్రీత్ బుమ్రా (0) ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. మొత్తం భారత జట్టు 49.3 ఓవర్‌లో 221 పరుగులు చేసిన తర్వాత భారత్ ఆలౌట్ అయ్యింది. దీనితో 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది.

భారత జట్టు జెర్సీలో ధోని కనిపించడం ఇదే చివరిసారి. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్ తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం పొందాడు. ఇంక తిరిగి ఆడలేదు.

Categories
Sports

బోల్ట్‌ కూతురిని దీవెనలతో ముంచెత్తుతున్న నెటిజన్లు

సోషల్ మీడియా మొత్తం ఉస్సేన్ బోల్ట్ కూతురికి విషెస్ చెబుతుంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బోల్ట్ కూతురి క్యూట్ ఫొటోస్ నిండిపోయాయి. దాంతో పాటుగా ఒలింపియా లైట్నింగ్ బోల్ట్ అనే పర్ఫెక్ట్ పేరు పెట్టినట్లు ప్రకటించాడు బోల్ట్. ప్రపంచమంతా ఫ్యాన్స్ సంపాదించుకున్న బోల్ట్ గర్ల్ ఫ్రెండ్ కాసీ బెన్నెట్ పుట్టినరోజున కూతురి ఫొటోలను పంచుకున్నాడు.

ఇప్పుడు మేమిద్దరం కలిసి కొత్త చాప్టర్ మొదలుపెట్టాం. మా కూతురు ఒలింపియా లైట్నింగ్ బోల్ట్ తో భవిష్యత్ కలలు కంటున్నాం. కుటుంబం కోసం నేను మళ్లీ రాకింగ్ చేస్తానని ఇన్‌స్టాగ్రామ్ లో అన్నాడు.

ఈ పోస్టుపై సెరెనా విలియమ్స్ రెస్పాన్స్ ఇచ్చింది. ఎందుకంటే విలియమ్స్ కూతురు పేరుకు కూడా దగ్గరి పోలిక ఉంది. ఆమె రెండేళ్ల కూతురి పేరు అలెక్సిస్ ఒలింపియానే అని గుర్తు చేసింది. ఓసారి కరోనావైరస్ లాక్‌డౌన్ ఎత్తేశాక రెండు బేబి ఒలింపియాలు కలుసుకుంటారని.. వారి పవర్ దేనికా సరిరాదని చెప్పుకొచ్చింది.

Categories
Sports

143ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ ఇదే తొలిసారి

కొద్ది నెలల క్రితం క్రికెట్ గ్రౌండ్ లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగడం ఊహకు కూడా రాలేదేమో. కానీ, ప్రస్తుతం హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అదే జరిగేలా ఉంది. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్-వెస్టిండీస్ ల మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ క్లోజ్‌డ్ డోర్స్ మధ్యనే జరిగేలా కనిపిస్తుంది. చరిత్రలో లేనటువంటి ఫీట్ జరగనుంది.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ ప్లేయర్లు సౌతాంప్టన్ లోని ఏజిస్ బౌల్ లో మ్యాచ్ ఆడనున్నారు. కానీ, ఆ ఇరు జట్లకు వెల్ కమ్ చెప్పేందుకు స్టాండ్స్ లో ఫ్యాన్స్ కనిపించరు. బ్యానర్లు, పోస్టర్లు, స్లోగన్లు, అభిమాన ప్లేయర్ ప్లకార్డులు, క్రికెట్ లో హుర్రెత్తించే స్టంట్లు ఏమీ లేకుండానే మ్యాచ్ జరగనుంది.

బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో మ్యాచ్ లు జరగాలని భావిస్తున్నారు. అంపైర్లు, ప్లేయర్లు, రిఫరీలు మాత్రమే కనిపించనుండగా ఫేవరేట్ ప్లేయర్లకు చీర్ కొట్టే అభిమానులు కనిపించరు. ప్రపంచమంతా కొవిడ్ మయం అయిపోగా తొలిసారి కీలకమైన మార్పులతో గేమ్ ఆరంభించేందుకు సిద్ధమవుతున్నారు. బంతి మెరుస్తూ ఉండడానికి ప్లేయర్లు తమ సెలైవాను ఉపయోగించడానికి వీల్లేదు. దాని నుంచే కరోనా వ్యాప్తి జరుగుతుందనే కారణంతో ఐసీసీ కూడా ఆ పద్ధతిని నిషేదించింది.

ప్లేయర్ ఎవరైనా బాల్ కు సెలైవా అప్లై చేస్తే అది అంపైర్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ముందు ప్లేయర్ కు వార్నింగ్ ఇస్తారు. రిపీట్ అయితే మాత్రం టీం మొత్తంపై చర్యలు తీసుకుంటారు. ఇన్నింగ్స్ మొత్తంలో జట్టుకు రెండు వార్నింగ్ లు మాత్రమే ఉంటాయి. బాల్ పై సెలైవా రుద్దితే దానికి బదులుగా 5పరుగుల పెనాల్టీ విధిస్తారు. దాంతో పాటు సెలైవా అప్లై చేసిన వ్యక్తే దానిని శుభ్రం చేయాలి.

Categories
Sports

ధోని అంటే అతనే అనుకునేలా.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 5 నిర్ణయాలు

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకోవడం అంటే మాటలా? ఊహకు కూడా కష్టం అనిపించే నిర్ణయాలను తీసుకున్నాడు కాబట్టే ఎంఎస్ ధోనికి ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యేకమైన పేరు. భారత క్రికెట్ కెప్టెన్సీకి కొత్త గుర్తింపు ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోని, భారత్‌కు మాత్రమే కాకుండా, ప్రపంచంలోని విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు.

ధోని వంటి కెప్టెన్, వికెట్ కీపర్ ఇద్దరూ ఇప్పటివరకు భారత్‌కు లేరు. చూడలేదు. ఇకపై చూడలేరేమో. ధోని ఏమి చేయగలడో అనేది ఎవరూ ఊహించలేరు. మైదానంలో తన నిర్ణయంతో ప్రత్యర్థి ఆటగాళ్లను మరియు మైదానంలో అభిమానులను అనేకసార్లు ఆశ్చర్యపరిచాడు.

2007 టీ20 ఫైనల్‌లో జోగిందర్ శర్మను చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయించడం అయినా.. ఆస్ట్రేలియా పర్యటనలో మిడిల్ సిరీస్‌లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవడం.. ధోని ఆకస్మిక నిర్ణయాలు ప్రజలను ఆశ్చర్యపోయేలా చేశాయి.

మహేంద్ర సింగ్ ధోని 5ఆశ్చర్యకరమైన నిర్ణయాలు:

2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్:
2007లో ఒక యువ జట్టుతో ధోని టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. అనుకోకుండా అప్పుడే ధోని ఆశ్చర్యపరిచాడు. మైదానంలో ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించేందుకు చివరి ఓవర్లో మిస్బా ఉల్ హక్ ఉండగా.. ఆల్ రౌండర్ జోగిందర్ శర్మకు బౌలింగ్ బాధ్యతను ఇచ్చాడు భారత కెప్టెన్. అంతే ప్రేక్షకుల ఊపిరి ఆగిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ గెలిచింది, ధోని నిర్ణయం సరైనదని నిరూపించబడింది.

మొత్తం జట్టుతో విలేకరుల సమావేశానికి:
భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, ధోనిల మధ్య విభేదాల వార్తలను టీవీ ఛానెల్‌లలో బాగా చూపించారు. 2009లో ఇంగ్లాండ్‌లో ఆడిన టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ధోని మొత్తం జట్టుతో మీడియా ముందుకు వచ్చాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో యువరాజ్ కంటే ముందే బ్యాటింగ్‌కు:
2011లో యువరాజ్ సింగ్ కంటే ముందే మైదానంలోకి వచ్చి ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై ధోని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ధోని మైదానంలో ప్రమాదకర ఆటగాడు అని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై ప్రయోగాలు చేయడమే కాకుండా సరైన నిర్ణయం అని నిరూపించాడు. 28ఏళ్ల తరువాత భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు.

2014 ఆస్ట్రేలియా పర్యటనలో మిడిల్ టెస్ట్ సిరీస్‌లో రిటైర్మెంట్:
తన కెరీర్ బాగా సాగుతున్నప్పుడు 2014 లో టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ధోని. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత నిస్వార్థ క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మిడిల్ సిరీస్‌లో టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ధోని అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోయారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడవ మ్యాచ్ ముగిసిన వెంటనే, అతను టెస్ట్‌లకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత వైట్ జెర్సీలో భారతదేశం తరపున ఎప్పుడూ ఆడలేదు.

వన్డే, టి20 కెప్టెన్సీలను వదులుకోవడం:
2017 సంవత్సరంలో, ధో మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీని ఇచ్చిన కెప్టెన్ అకస్మాత్తుగా కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 4 జనవరి 2017 న, టి 20, వన్డే కెప్టెన్సీలను వదులుకోవడానికి ధోని నిర్ణయించుకోవటం క్రికెట్ ప్రపంచంలో సంచలనం అయ్యింది.

Read Here>>నీ బుగ్గలంటే నాకు ఇష్టం, వాటిని పట్టుకోవచ్చా… రోహిత్‌ని ట్రోల్ చేసిన యువీ

Categories
Sports

Happy Birthday Mr.Cool MS Dhoni: ఈ 11 రికార్డులు ధోని సత్తా ఏంటో చెబుతాయి

మిస్టర్ కూల్.. దశాబ్దాల ప్రపంచకప్ కలలను నెరవేర్చిన క్రికెట్ సారధి.. ఎంఎస్ ధోని పుట్టినరోజు నేడు.. ధోని ఇవాళ(07 జులై 2020) 39వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సంధర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2004లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ధోని, కొంత కాలంగా వరల్డ్ కప్ తర్వాత మైదానానికి దూరంగా ఉన్నారు. కానీ ధోనిని ఇప్పటికీ గ్రేట్ ఫినిషర్ అని పిలుస్తారు.

2008 మరియు 2009 సంవత్సరాల్లో ధోనికి ఐసిసి వన్డే ప్లేయర్ అవార్డ్ లభించింది.

ధోనిని కెప్టెన్ కూల్‌గా మార్చిన రికార్డులు:

1. ధోని సారధిగా ఐసిసికి చెందిన మూడు పెద్ద ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. ఇందులో 2007 ప్రపంచ టీ20, 2011 ప్రపంచ కప్, మరియు 2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ధోని టీమ్ ఇండియాను అగ్రస్థానానికి తీసుకువెళ్ళాడు.

2. ధోని వారి 500 మ్యాచ్‌ల్లో 780 మంది ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపిన మూడవ అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్. ఇందులో మొదటి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్, రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నారు.

3. అత్యధిక స్టంపింగ్ చేసిన రికార్డు కూడా ధోని పేరిట ఉంది. ఇప్పటివరకు ధోని మొత్తం 178 స్టంపింగ్‌లు చేశాడు.

4. ధోని టి 20 లో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్, అక్కడ అతని పేరు మీద 82 మంది బాధితులు ఉన్నారు.

5. ఎంఎస్ ధోని పాకిస్థాన్‌పై తొలి వన్డే, టెస్ట్ సెంచరీ కొట్టాడు, అక్కడ అతను 148 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

6. ధోనీ ఇప్పటివరకు వన్డేల్లో మొత్తం 217 సిక్సర్లు కొట్టాడు. ఈ లిస్ట్‌లో ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా ధోని అత్యధిక సిక్సర్లు కొట్టాడు.

7. ధోని తన పేరిట మరో ప్రత్యేకమైన రికార్డు ఉంది. అర్ధ సెంచరీ కొట్టకుండా అత్యధిక పరుగులు చేసిన రికార్డు. ధోని ఏ అర్ధ సెంచరీ చేయకుండా 1000 పరుగులు చేశాడు.

8. 7 వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ధోని అత్యధిక సెంచరీలు చేశాడు. ఈ ఆర్డర్‌పై బ్యాటింగ్ చేసిన ధోని పేరు మీద మొత్తం 2 సెంచరీలు ఉన్నాయి.

9. ధోని 2009 లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి వికెట్ తీశాడు. మొత్తం 9 సార్లు ధోని బౌలింగ్ చేశాడు.

10. ఆఫ్రో ఏషియన్ కప్‌లో మహేలా జయవర్ధనేతో 218 పరుగుల భాగస్వామ్యం అతిపెద్ద భాగస్వామ్యం, ఇది ప్రపంచ రికార్డు.

11. వరుసగా రెండుసార్లు ఐసిసి వన్డే క్రికెటర్‌గా ఎంపికైన తొలి ఆటగాడు ధోనినే.

Read Here>>IPL ఆతిథ్యానికి రెడీ అంటున్న న్యూజిలాండ్‌

Categories
Sports

IPL ఆతిథ్యానికి రెడీ అంటున్న న్యూజిలాండ్‌

IPL.jpgరికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి29న ప్రారంభమవ్వాల్సిన IPL 13వ సీజన్‌ను లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

BCCI ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే IPL కరోనా  కారణంగా ఈ ఏడాది భారత్‌లో జరిగే అవకాశం కనిపించకపోడంతో… ఐపీఎల్ 2020 సీజన్‌ని విదేశాల్లోనూ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే ఇప్పటికే ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని యూఏఈ, శ్రీలంక దేశాలు ముందుకు రాగా.. తాజాగా ఈ జాబితాలోకి న్యూజిలాండ్‌ కూడా చేరింది.

బీసీసీఐ ముందుకొస్తే ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని న్యూజిలాండ్‌ తెలిపింది. న్యూజిలాండ్‌లో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో టోర్నీ నిర్వహించేందుకు ఆ దేశం ముందుకొచ్చింది.

దీనిపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. IPL టోర్నీని ఇండియా నిర్వహించాలనే మా మొదటి ప్రాధాన్యత. ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో విదేశాల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తాం. యూఏఈ, శ్రీలంక తర్వాత న్యూజిలాండ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. భాగస్వాములందరితోనూ సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్ల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమైనది. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. కాగా గతంలోనూ పలుసార్లు ఐపీఎల్‌ టోర్నీని విదేశాల్లో నిర్వహించారు.

Categories
Sports Viral

నీ బుగ్గలంటే నాకు ఇష్టం, వాటిని పట్టుకోవచ్చా… రోహిత్‌ని ట్రోల్ చేసిన యువీ

కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో భారత క్రికెటర్లు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ యూవీలకు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ఫోటో పై యువరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. రోహిత్ శర్మ తన భార్యతో కలిసిన దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ‘మీరు ప్రేమించే దానిని ఎల్లప్పుడు పట్టుకునే ఉండండి’ అనే క్యాప్షన్ తో పంచుకున్నాడు.

ఈ క్యాప్షన్ తో ద్వారా భార్య పై తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు రోహిత్. ఈ ఫోటో పై యువరాజ్ కాస్తా వెరైటీగా స్పందించాడు. ‘రోహిత్.. నీ బుగ్గలు అంటే నాకు చాలా ఇష్టం, వాటిని నేను పట్టుకోవచ్చా’అంటూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ ను ట్రోల్ చేశాడు. దానికి ఓ అభిమాని రితికా పర్మిషన్ తీసుకోవాలంటూ యువీకి కౌంటర్ వేశాడు. ఒకవైపు రోహిత్ తన భార్యతో ఉన్న ఫోటో వైరల్ అవుతుండగా, ఇంకా యువీ కామెడీతో నెటిజన్లు నవ్వులు పూయిస్తోంది.

యువరాజ్ సింగ్, రోహిత్ తరచుగా ఒకరినొకరు సోషల్ మీడియాలో ఆటపట్టించుకుంటూనే ఉంటారు. గత మే నెల 1, 2020 న తేదీన యువీని రోహిత్ ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30, 2020 న రోహిత్ 33వ బర్త్ డే సందర్భంగా అతనికి ప్రస్తుత జట్టు సభ్యులు, మాజీ క్రికెటర్లందరు విషెస్ తెలిపారు. దీనికి రోహిత్ స్పందిస్తూ‘థాంక్యూ సో మచ్ గయ్స్.. కానీ యువీకి లాక్ డౌన్ ఎఫెక్ట్ బాగా తగిలినట్టుగా ఉంది. అతని హెయిర్ లో కనిపిస్తుందని’సెటైర్లు వేశాడు రోహిత్. ప్రస్తుతం యువీ సెటైర్ కి రోహిత్ ఏవిధంగా సమాధానం చెబుతాడో చూద్దాం.

 

View this post on Instagram

 

Always hold on to what you love ❤️

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

Read Here>>భారత డిజిటల్ రంగంలో చైనా కంపెనీల ఆధిపత్యం ఎంతలా ఉందంటే? 

Categories
Latest Sports

వెస్టిండీస్ జట్టు లెజండరీ బ్యాట్స్‌మన్ కన్నుమూత

వెస్టిండీస్ జట్టు లెజండరీ బ్యాట్స్‌మన్ ఎవర్టన్ వీక్స్ కన్నుమూశారు. ఎవర్టన్ వయసు 95 సంవత్సరాలు. ఎవర్టన్ కరేబియన్ జట్టు బలమైన టెస్ట్ బ్యాట్స్‌మాన్. క్లైడ్ వాల్కాట్, ఫ్రాంక్ వొరెల్, ఎవర్టన్ వీక్స్ ముగ్గరు వెస్టిండీస్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లుగా ఉన్నారు. ముగ్గురు ఆటగాళ్ళ ఇంటిపేరులో W ఉన్నందున ఈ ముగ్గురు జెయింట్స్ 3 Ws అని పిలిచేవారు. ఎవర్టన్ 1 జూలై 2020 న మరణించారు. ఆయన మరణంపై వెస్టిండీస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

ఎవర్టన్ వీక్స్ 26 ఫిబ్రవరి 1925న పుట్టారు. వెస్టిండీస్ కోసం 48 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1948 నుండి 1958 వరకు దాదాపు 10 సంవత్సరాలు క్రికెట్ ఆడిన విక్స్, ఆ యుగంలో విజయవంతమైన బ్యాట్స్ మెన్లలో ఒకడు. 48 టెస్టుల్లో 58.61 సగటుతో 4455 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 58 కంటే ఎక్కువ సగటుతో 4 వేల లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఎవర్టన్ విక్స్ ఇప్పటికీ 5వ స్థానంలో ఉన్నాడు.

విక్స్ వరుసగా టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు సాధించాడు. అతను 1948లో ఇంగ్లాండ్ మరియు ఇండియాపై ఐదు సెంచరీలు చేశాడు. ఆశ్చర్యకరంగా ఇది టెస్ట్ క్రికెట్లో అతని మొదటి సంవత్సరం. కరేబియన్ జట్టు యొక్క 3 Ws విత్ ఎవర్టన్ వీక్స్‌లో పాల్గొన్న ఫ్రాంక్ వొరెల్ 1967 లో కేవలం 42 సంవత్సరాల వయసులో మరణించగా, క్లైడ్ వాల్కాట్ 2006 లో 80 సంవత్సరాల వయసులో మరణించాడు.

Read:రోగ నిరోధక శక్తి కోసం : Pineapple, Lemon Free

Categories
Sports

పొలంలో ట్రాక్టర్ నడుపుతూ కనిపించిన ధోనీ.. వైరల్ వీడియో!

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. చాలాకాలం తర్వాత ధోనీని ఐపీఎల్‌లో చూడవచ్చు అని భావించిన అభిమానులకు కరోనా కారణంగా కుదరలేదు.  అయితే లేటెస్ట్‌గా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మిస్టర్ కూల్ ధోనీ, రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తుండగా.. తన సొంత పొలంలో ట్రాక్టర్ నడుపుతూ కనిపించారు. ఎంఎస్ ధోని ట్రాక్టర్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ధోని కొత్త రూపంలో కనిపిస్తున్నాడు.

వీడియోలో, ధోని తన పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా.. ఆ వీడియోను ధోని భక్త  ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. 2019 ప్రపంచ కప్ తర్వాత ధోని భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. 2019 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ధోని చివరిసారి భారత్ తరఫున ఆడాడు. అప్పటి నుంచి అతను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగా, భారతదేశంలోని క్రికెట్ నియంత్రణ మండలి కూడా అతన్ని వార్షిక ఒప్పందం నుంచి మినహాయించింది.

ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తారంటూ చాలాసార్లు వచ్చాయి. కానీ ధోని తన పదవీ విరమణ గురించి ఏమీ మాట్లాడలేదు. ఐపీఎల్ 2020 తర్వాత ధోని భారత జట్టులోకి తిరిగి వస్తాడని అందరూ భావించారు. కాని కరోనా వైరస్ కారణంగా, ఐపిఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్‌ బ్రేక్‌లు కారణంగా ధోని అంతర్జాతీయ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది.

Categories
Sports

కరోనా కారణంగా డేవిస్ కప్ మ్యాచ్‌లు వాయిదా

కరోనా సవాళ్ల కారణంగా ఫెడ్ కప్ టెన్నిస్ ఫైనల్స్ మరియు డేవిస్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఆటలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే పెద్ద పెద్ద ఈవెంట్లు వాయిదా వేయగా.. కొన్ని రద్దు చేయబడ్డాయి. టోక్యో ఒలింపిక్స్ 2020 ఒక సంవత్సరం వాయిదా వేయగా, వింబుల్డన్ 80 సంవత్సరాల తరువాత మొదటిసారి రద్దు చేయవలసి వచ్చింది.

కరోనా కారణంగా మరో పెద్ద ఈవెంట్ వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఇప్పుడు సమాచారం. కరోనాకు సంబంధించిన సవాళ్ల కారణంగా ఫెడ్ కప్ టెన్నిస్ ఫైనల్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. సెర్బియాకు చెందిన నోవాక్ జొకోవిచ్‌తో సహా జెయింట్స్ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌తో బారిన పడిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం టోర్నమెంట్ ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది కాని కరోనా కారణంగా వాయిదా పడింది.

భారతదేశానికి చెందిన డేవిస్ కప్ మ్యాచ్ వాయిదా:
అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. మాడ్రిడ్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్‌తో సహా అన్ని మ్యాచ్‌లను వాయిదా వేయడంతో ఫిన్‌లాండ్‌తో జరిగిన భారత డేవిస్ కప్ మ్యాచ్ 2021 వరకు వాయిదా పడింది. సెప్టెంబర్‌లో ఫిన్‌లాండ్‌లో జరిగే వరల్డ్ గ్రూప్ వన్ మ్యాచ్‌లో భారత్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ వచ్చే ఏడాది మార్చి లేదా సెప్టెంబర్‌కు వాయిదా వేసింది.

టోర్నమెంట్ ఆటగాళ్లకు కరోనా:
అడ్రియా టూర్ క్రొయేషియాలో నిర్వహించబడింది. అయితే ఇక్కడ చాలా మంది ఆటగాళ్లు ఇబ్బందుల్లో పడ్డారు. ఇక్కడ ఆడిన చాలా మంది ఆటగాళ్ళకు కరోనా సోకింది. ఈ పర్యటనలో ఉన్న జొకోవిచ్, అతని భార్య మరియు మరో ముగ్గురు ఆటగాళ్ళుకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో గ్రిగర్ డిమిట్రోవ్, బోర్నా కోరిక్ మరియు విక్టర్ ట్రోయికి ఉన్నారు.

Read: సచిన్ లాగే ధోనీని కూడా ఎత్తుకొని తిరగాలి