Categories
Technology

ప్లే స్టోర్ నుంచి 11యాప్‌లను తొలగించిన గూగుల్..

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం దాని ప్లాట్‌ఫామ్‌లను మరింత సురక్షితంగా ఉంచే చర్యలను బలోపేతం చేస్తూ, గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 11 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఈ యాప్‌లన్నింటిలో జోకర్ మాల్‌వేర్‌ అనే వైరస్‌ను గూగుల్ గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెక్‌ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది.

యాజర్ల భద్రతాపరంగా మరింత మెరుగైన సేవలు అందిచడంలో భాగంగా గూగుల్‌ సంస్థ ప్లేస్టోర్‌ నుంచి ఈ 11 యాప్‌లను తొలగించింది. అందేతకాదు ఈ యాప్‌లను ఇప్పటికే వాడుతున్న వినియోగదారులు కూడా వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని వారు సూచనలు చేసింది.

ఈ మాల్వేర్ యూజర్లకు తెలియకుండానే ప్రీమియం సేవలకు సభ్యత్వాన్ని పొందగలదు. మరియు యూజర్లు వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లలోకి ప్రవేశించినప్పుడు, వాటిని Google Play ప్రొటెక్షన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కూడా గుర్తించలేదని తెలిపారు.

జోకర్ మాల్వేర్ కారణంగా తొలగించిన యాప్‌ల పూర్తి లిస్ట్ ఇదే:

com.imagecompress.android
com.contact.withme.texts
com.hmvoice.friendsms
com.relax.relaxation.androidsms
com.cheery.message.sendsms (two different instances)
com.peason.lovinglovemessage
com.file.recovefiles
com.LPlocker.lockapps
com.remindme.alram
com.training.memorygame

ఇమేజ్ ఎడిటర్లు, వీడియో ఎడిటర్లు, వాల్‌పేపర్ అనువర్తనాలు, ఫ్లాష్‌లైట్ యాప్‌లు, ఫైల్ మేనేజర్లు మరియు మొబైల్ గేమ్‌ యాప్‌లకు యూజర్ల నుంచి ఎక్కువ ఆదరణ ఉండటంతో అటువంటి వాటి నుంచే మాల్‌వేర్‌ వ్యాప్తి జరుగుతుందని పలు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Categories
Technology

ఇండియాలో ‘Taka Tak’ కొత్త యాప్… టిక్‌టాక్‌కు ధీటైన ఫీచర్లు ఇవిగో..!

చైనా పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. వీడియో ప్లేయర్ Void టెక్ దిగ్గజం MX Player టిక్ టాక్ మాదిరి యాప్‌ను రూపొందించింది. అదే.. ‘Taka Tak’ యాప్. భారత యూజర్ల కోసం ఎంఎక్స్ ప్లేయర్ ఈ యాప్ లాంచ్ చేసింది.

ఇటీవలే చైనా యాప్స్ లో టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో లోకల్ యాప్స్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. టిక్ టాక్ యూజర్లను ఆకర్షించేందుకు ‘Taka Tak’ అనే యాప్‌ను Void కంపెనీ క్రియేట్ చేసింది.

MX అందించే Taka Tak ఆఫర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫన్నీ వీడియోలను వీక్షించడమే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో షేర్ చేసుకోవచ్చు. సోషల్ ప్లాట్ ఫాంల్లో Dialogue Dubbing, Comedy, Gaming, DIY, Food, Sports, Memes వంటి అన్ని ఫార్మాట్ల వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు. Taka Tak అనే యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ఎలా వాడాలో తెలుసునే ప్రయత్నం చేద్దాం..

Taka Tak అనే యాప్ ద్వారా షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. డాన్స్ వీడియోలు, డబ్ మూవీ డైలాగ్స్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ ప్లాట్ ఫాంల్లోనూ షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. షార్ట్ వీడియోలను ఎడిట్ చేసుకుని వాటికి ఎడిటింగ్ ఫీచర్లలో ఎఫెక్ట్ లను యాడ్ చేయవచ్చు. ఈ యాప్ లోని మెయిన్ ఫీచర్లు ఏమి ఉన్నాయో ఓసారి చూద్దాం..

Trending Videos : ఈ యాప్‌లో ట్రెండింగ్ అమెజింగ్, ఫన్ షార్ట్ వీడియోలను బ్రౌజ్ చేసుకోవచ్చు.

Save and share status: 10వేల వరకు స్టేటస్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

Shoot and edit: ఎడిటింగ్ ఫీచర్ల ద్వారా యూజర్లు షూట్ చేసిన క్రియేటివ్ వీడియోలను ఆన్ లైన్ లో షేర్ చేసుకోవచ్చు.

Beauty cam: బ్యూటీ ఎఫెక్టులు, ఫిల్టర్లను యూజర్లు ఎంచుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు.

Video editor: వీడియోలను కంబైన్ చేయవచ్చు.. టైమింగ్ తో పాటు వీడియో సైజును కూడా సరిచేయొచ్చు..

Photo editor: నచ్చిన ఫొటోలను యూజర్లు ఎంచుకోవచ్చు.. స్టోరీ మాదిరిగా వాటితో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.

Music library: ఫ్రెష్ ఎడిటర్ ఫిక్ తో ఒక మ్యూజిక్ లైబ్రరీ అందిస్తోంది. నచ్చిన మ్యూజిక్ ఎంచుకోవడం ఎడిట్ చేసుకోవడమే..

Languages supported: ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠి, పంజాబీ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

Categories
Technology

ఇకపై మేడ్ ఇన్ ఇండియా Samsung గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లు

గెలాక్సీ స్మార్ట్ వాచ్ లు.. అదీ ఇండియాలో తయారైనవి లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. దీంతో పాటుగా శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4జీ అల్యూమినియం ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. ఇండియాలో తయారైన శాంసంగ్ ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే. ఇండియన్ మార్కెట్ లో ఫిక్స్ డ్ పొజిషన్ కోసం శాంసంగ్ ప్రయత్నిస్తుంది. పైగా ఇది రూ.28వేల 490కు అందుబాటులో ఉంటుంది.

జులై11 నుంచి అన్ని రిటైల్ స్టోర్లలో ఇది దొరుకుతుందని అంటున్నారు. శాంసంగ్ ఒపెరా హౌజ్, శాంసంగ్.కామ్ తో పాటు మరికొని ఆన్ లైన్ పోర్టళ్లలో కొనుగోలు చేయొచ్చు. ఈ వాచ్ తో ఫోన్ కాల్స్ తో పాటు, జనరల్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కనెక్ట్ చేశారు. ఇది 9రంగుల్లో విడుదల చేయనున్నారు. 3సైజుల్లో 42, 44, 46మి.మీల డయామీటర్లలో యూనిక్ డిజైన్ టెంప్లేట్స్ తో వాచ్ 4జీ, వాచ్ యాక్టివ్ 2లలో రెడీ అవుతోంది.

గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 రెండింటిలో కొనుగోలు చేయడానికి ఎఫ్పర్డబుల్ గా ఉండనుంది. డిజిటల్ బెజెల్ తో పాటు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. కాకపోతే ఇది ఇండియాలో కేవలం స్టెయిన్‌లెస్ స్టీల్ తో మాత్రమే దొరకనుంది. దీని స్పెసిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

Display: 1.4-inch Super AMOLED curved
1.5GB RAM, 4GB internal storage, Battery: 340mAh
Bluetooth 5.0, NFC, GPS, fitness tracking, monitoring

Categories
Technology

స్పెషల్ ఫర్ ఇండియా.. ఇన్‌స్టాగ్రామ్‌లో TikTok షార్ట్ వీడియో ఫీచర్లు!

ఫేస్‌బుక్ సొంత షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. చైనా పాపులర్ యాప్ టిక్‌టాక్ లాంటి కొత్త ఫీచర్‌ను ఇన్ స్టాగ్రామ్ టెస్టింగ్ చేస్తోంది. ప్రత్యేకించి భారత యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ Reels అనే ఫీచర్ ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ భారతదేశంలో టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిపింది. టిక్‌టాక్‌ను భర్తీ చేయడమే లక్ష్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ తీసుకొస్తోంది. వారం రోజుల క్రితం ప్రభుత్వం నిషేధించిన 58 ఇతర చైనా యాప్‌లతో పాటు టిక్‌టాక్‌ను ప్రభుత్వం నిషేధించింది.

బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్‌లలో పరీక్షించిన తర్వాత భారతదేశానికి వచ్చిన రీల్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలను షేర్ చేసుకోవచ్చు. రీల్స్‌ ఫీచర్‌లో యూజర్లు ఆడియో, ఎఫెక్ట్స్, కొత్త క్రియేటివీ టూల్స్‌తో 15 సెకన్ల మల్టీ-క్లిప్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అవసరమైతే వాటిని మార్పులు చేయొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో వీడియోలను తమ ఫాలోవర్లకు షేర్ చేసుకోవచ్చు. వారికి పబ్లిక్ అకౌంట్ ఉంటే.. ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ప్లోర్ ఫీచర్ ద్వారా ‘Reels’ ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీకి అందుబాటులో ఉంటుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి 7:30 గంటల నుంచి Reels భారతదేశంలోని యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. Ammy Virk, Gippy Grewal, Komal Pandey, Arjun Kanungo, Jahnavi Dasetty aka Mahathalli, Indrani Biswas aka Wondermunna, Kusha Kapila, Radhika Bangia, RJ Abhinav, Ankush Bhaguna వంటి పబ్లిక్ ఫీగర్స్, క్రియేటర్ల నుంచి కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు.

రీల్‌ను ఎలా సృష్టించాలి:
* ఇన్‌స్టాగ్రామ్ కెమెరా కిందిభాగంలో ఉన్న Reels ఎంచుకోండి.
* వివిధ రకాల క్రియేటీవ్ ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి.

Audio : రీల్ ఫీచర్ కోసం ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ నుంచి పాట సెలెక్ట్ చేసుకోండి. మీ స్వంత అసలైన ఆడియోను కూడా యాడ్ చేసుకోవచ్చు.

AR Effects : విభిన్న ప్రభావాలతో మల్టీ క్లిప్‌లను రికార్డ్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లు సృష్టించిన AR లైబ్రరీలో అనేక ఎఫెక్ట్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి.

Timer – Countdown : మీ క్లిప్‌లలో దేనినైనా హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి టైమర్‌ను సెట్ చేయండి.

Align : మరో వీడియో రికార్డ్ చేయడానికి ముందు మీ మునుపటి క్లిప్ నుంచి వస్తువులను వరుసలో ఉంచండి.

* దుస్తుల్లో మార్పులు లేదా కొత్త స్నేహితులను మీ రీల్‌లో చేర్చుకోవచ్చు.

Speed : మీరు ఎంచుకున్న వీడియో లేదా ఆడియోలో కొంత భాగాన్ని స్పీడ్ చేయొచ్చు. లేదా వేగాన్ని తగ్గించుకోవచ్చు.
* మీకు బీట్‌లో ఉండటానికి లేదా స్లో మోషన్ వీడియోలను చేసేందుకు సహాయపడుతుంది.

రీల్‌ను ఎలా పంచుకోవాలి:
రీల్స్‌ను మీ ఫాలోవర్లకు షేర్ చేసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీకి చేరుకోవచ్చు.

మీకు పబ్లిక్ అకౌంట్ ఉంటే:
మీ రీల్‌ను ఎక్స్‌ప్లోర్‌లోని ప్రత్యేక స్థలానికి పంచుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ చూసేందుకు అవకాశం ఉంది. మీరు ఫీడ్‌కు కూడా షేర్ చేయవచ్చు మీ ఫాలోవర్లు మీ రీల్‌ని చూడగలరు. మీరు కొన్ని పాటలు, హ్యాష్‌ట్యాగ్‌లు లేదా ప్రభావాలను కలిగి ఉన్న రీల్‌లను షేర్ చేసుకోవచ్చు. పాట, హ్యాష్‌ట్యాగ్ లేదా ప్రభావంపై ఎవరైనా క్లిక్ చేసినప్పుడు మీ రీల్ డెడికేటెడ్ పేజీలలో కూడా కనిపిస్తుంది.

మీకు ప్రైవేట్ అకౌంట్ ఉంటే :
మీరు ఫీడ్‌కు షేర్ చేయవచ్చు. మీ ఫాలోవర్లు మీ రీల్‌ని చూడగలరు. మీరు స్టోరీలు లేదా ప్రత్యక్షంగా కూడా షేర్ చేయవచ్చు. మీ రీల్ 24 గంటల తర్వాత అదృశ్యమవుతుంది..

రీల్స్ చూడటానికి :
ఇన్‌స్టాగ్రామ్‌లో డైవర్స్ కమ్యూనిటీ క్రియేట్ చేసిన రీల్‌లను ఆస్వాదించడానికి రీల్స్ ఇన్ ఎక్స్‌ప్లోర్ అవసరం. వర్టికల్ ఫీడ్‌లో మీ ఇష్టమైన హాస్యనటుడు, న్యాయవాది, ట్రెండింగ్ డ్యాన్స్ లేదా బ్యూటీ ట్రెండ్ కనుగొనండి. రీల్‌ ద్వారా సులభంగా  మీ స్నేహితులతో షేర్ చేయొచ్చు.

Categories
Technology

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు… చెక్ చేశారా?

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ లో మరొన్ని కొత్త ఫీచర్లు వచ్చాయి. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్.. కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది.. గత వారమే వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS ఆధారిత యాప్‌లో animated stickers కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది.

ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నప్పుడు కంపెనీ తన వాట్సాప్ స్టోర్‌లో Playful Piyomaru అనే ఒక స్టిక్కర్ ప్యాక్‌ను చేర్చింది. ఈ లిస్టులో మరిన్నింటిని యాడ్ చేయాలని వాట్సాప్ భావిస్తోంది. ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ తన స్టోర్‌లో మరో 4 స్టిక్కర్ ప్యాక్‌లను చేర్చనుంది.

ఈ జాబితాలో Chummy Chum Chums, Rico’s Sweet Life, Bright Days and Moody Foodies పేరుతో స్టిక్కర్లు ఉన్నాయి. ఈ స్టిక్కర్ ప్యాక్‌లు Android, iOS ఆధారిత యాప్‌ల్లో రెండింటిలోనూ లభిస్తాయి. ఈ స్టిక్కర్లు వాట్సాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వాట్సాప్ స్టోర్‌లో యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలో యూజర్లకు అందుబాటులోకి వస్తాయని నివేదిక తెలిపింది.

వాట్సాప్‌లో కొత్త యానిమేటెడ్ స్టిక్కర్లను యాడ్ చేయడమే కాకుండా మెసెంజర్‌ను కూడా ఇంటిగ్రేట్ చేయనుంది. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌కు వాట్సాప్ ఇంటిగ్రేషన్‌ను తీసుకురావాలని భావిస్తోంది. గత ఏడాది, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ యాప్‌ల్లో interoperabilityని ప్రకటించింది.

ఈ ఆలోచన ఒక డెవలప్‌మెంట్‌ను మెసెంజర్ చాట్స్ రూపంలో చూశాము. మరొకటి మెసెంజర్‌లో వాట్సాప్ ఇంటిగ్రేషన్ అవుతుందని భావిస్తున్నారు. ఇతర వాట్సాప్ యూజర్లలో మెసేజ్‌లు, సర్వీసులను నిర్వహించడానికి ఫేస్‌బుక్ ‘స్థానిక డేటాబేస్‌లో’ కొన్ని పట్టికలను సృష్టిస్తోందని తెలిపింది.

వాట్సాప్ కాంటాక్ట్ బ్లాక్ చేస్తే.. పుష్ నోటిఫికేషన్ల సౌండ్స్, నిర్దిష్ట గ్రూపులోని మెంబర్స్ ప్రొఫైల్ పిక్చర్స్ వంటి వివరాలను కంపెనీని అనుమతిస్తుంది. చాట్ విషయాలు ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటాయి.

ఆయా వివరాలను గోప్యంగా ఉంచుతుంది. రెండు వేర్వేరు యాప్ యూజర్లను కూడా అనుమతిస్తుంది.  మెసెంజర్, వాట్సాప్ ఆయా ప్లాట్‌ఫారమ్‌ల్లో నుంచే మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి డెవలప్ మెంట్ స్టేజ్‌లో ఉందని నివేదిక తెలిపింది.

Categories
Technology

UV-C కిరణాలతో బ్రష్.. మీ టాయిలెట్‌ను క్షణాల్లో శుభ్రం చేసేస్తుంది..!

అసలే కరోనా కాలం.. ఏది తాకాలన్నా భయమే. ఏదైనా వస్తువు తాకాలంటే వణికిపోతున్నారు. కరోనా భయం ప్రతిఒక్కరిని వెంటాడుతోంది. ప్రతిఒక్కరి ఇంట్లో టాయిలెట్ వాడకం కామన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో టాయిలెట్ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి టాయిలెట్ క్లీన్ చేసేందుకు వాడే బ్రెష్ ల విషయంలోనూ జాగ్రత వహించాలంటోంది ఓ బ్రెష్ ల కంపెనీ. చాలావరకు టాయిలెట్స్ శుభ్రం చేసేందుకు బ్లీచ్ వాడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటోంది Goodpapa అనే కంపెనీ. ప్రపంచంలోనే తొలిసారిగా టాయిలెట్‌ను ఆటోమాటిక్ గా శానిటైజ్ చేసే బ్రష్‌ను అందించనుంది.

టాయిలెట్ ను శుభ్రం చేసిన తరువాత గుడ్ పాపా బ్రష్ తిరిగి మళ్లీ కంటైనర్ లోకి వెళ్తుంది. ఈ బ్రష్‌ను యువీ కిరణాలతో తయారు చేశారు. టాయిలెట్ ను శుభ్రం చేసిన తర్వాత బ్రష్ లో ఉన్న బాక్టీరియాను చంపుతుంది. Goodpapa ప్రకారం..  UV-C కిరణాలు 120 సెకన్లలో 99.9శాతం బాక్టీరియాను చంపుతాయని కంపెనీ  తెలిపింది. ఏమైనా నీటి బిందువులు ఉంటే వెంటిలేషన్ , గాలి ద్వారా వెంటనే ఆరిపోయేలా చేస్తుంది. అంతేకాదు.. బాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. బ్రష్ ను మృదువుగా ఉండేలా తయారు చేసింది.

బ్రష్ ను ఉపయోగించి ఈజీగా టాయిలెట్ ను శుభ్రం చేయవచ్చు. బ్రష్ ను 300 RPM స్పీడ్ తో టాయిలెట్ ని స్పిన్నింగ్ చేస్తుంది. మెుండి మరకలు ఉన్న ప్రదేశంలో బ్రష్‌ను నొక్కి ఉంచాలి.  బ్రష్ కి ఉన్న హ్యాండిల్ ద్వారా బ్రష్ ను ప్లగ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 2000 mAhతో ఒక్క సారి ఛార్జీ చేస్తే 3 నెలల పాటు వస్తుంది.

బ్రష్  IPX7 రేటింగ్ ప్రకారం.. బ్రష్ లోపలికి నీరు ప్రవేశించినా మోటారు చెడిపోకుండా ఉండేలా దీన్ని కంపెనీ తయారు చేసింది. ప్రస్తుతం గుడ్ పాపా టాయిలెట్ బ్రష్ Kickstarter లో అందుబాటులో ఉంది. గుడ్ పాపా టాయిలెట్ బ్రష్ ఒక వినూత్నమైన ఆవిష్కరణగా కంపెనీ చెబుతోంది.  టాయిలెట్ క్లీనింగ్ కి తయారు చేసిన డివైజ్‌ల్లో  షైన్ బాత్రూమ్ అసిస్టెంట్(కెమికల్ ఫ్రీ టాయిలెట్ బౌల్ క్లీనర్) ఒకటి.  మీరు మీ టాయిలెట్ ను ఎలాంటి చికాకు లేకుండా శుభ్రం చేసుకోవాలనుకుంటే ఒకసారి Goodpapa టాయిలెట్ బ్రష్‌ను ప్రయత్నించి చూడండి.

Categories
Technology

Sony నుంచి ultra-wide ఫుల్ ఫ్రేమ్ లెన్స్ కెమెరా .. ధర ఎంతంటే?

ప్రపంచ టెక్ దిగ్గజం సోనీ కంపెనీ.. కెమెరా మార్కెట్లో ఉత్తమమైన ఫుల్-ఫ్రేమ్ కెమెరాను రూపొందిస్తోంది.  వాస్తవానికి ఆల్ఫా-సిరీస్ మిర్రర్‌లెస్ సిస్టమ్ లెన్స్ ఉందో లేదో స్పష్టత లేదు. సోనీ నుంచి రిలీజ్ అయిన కొత్త 12-24mm f/ 2.8 G మాస్టర్ ఈ విషయాన్ని ప్రూవ్ చేసేలా ఉంది. ఇతర బ్రాండ్ కెమెరాల మాదిరిగా కాకుండా f / 2.8 ఫుల్-ఫ్రేమ్ జూమ్‌తో వస్తోంది.

దీని ధర మార్కెట్లో 3,000 డాలర్ల వరకు ఉండొచ్చు. 12-24mm సోనీ 11th లెన్స్‌ను హై-ఎండ్ G మాస్టర్ లైన్‌ ఆగస్టు 13న మార్కెట్లోకి తీసుకురానుంది. సోనీ ప్రస్తుత f/ 2.8 Wide Zoom, 16-35mm f / 2.8 కన్నా గణనీయమైన వైడ్ ఫిల్డ్ అందిస్తుంది. సిగ్మా 14-24mm f/ 2.8 DNతో తలపడుతుంది. లెన్స్‌లో అల్ట్రా-వైడ్ జూమ్‌ల కోసం కొత్త బార్‌ను సెట్ చేస్తుంది.

సిగ్మాపై వైడ్ ఎండ్‌లో అదనంగా 2mm ఉండటం సోనీ ప్రైమరీ బెనిఫెట్ గా చెప్పవచ్చు. సోనీ 14తో పోల్చితే 12mm వద్ద 10-డిగ్రీల వ్యూ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 14mm చాలా విశాలంగా ఉంది. ప్రకృతి దృశ్యాలకు, ఇంటీరియర్స్ కు మధ్య 12mm షాట్‌ మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది.12-24mm G మాస్టర్ అద్భుతమైన లెన్స్‌గా చెబుతోంది. వ్యూ యాంగిల్ మాత్రమే కాదు. ఆప్టికల్ డిజైన్ మూడు extreme aspherical (XA) ఎలిమెంట్లు కలిగి ఉంది. ఇందులో ఫ్రంట్ ఆబ్జెక్టివ్ లెన్స్‌తో సహా సోనీ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన అతిపెద్ద XA ఎలిమెంట్. సోనీ ప్రస్తుత లెన్స్ లేయర్లకు ఇంటిరియర్ కర్వేచర్ ఎక్కువగా ఉంది.

కొత్త రకమైన యాంటీ రిఫ్లెక్టివ్ లేయర్ అవసరం. రెండు ఫోకస్ చేసే గ్రూపుల మధ్య విభజించిన 4 లీనియర్ ఫోకస్ మోటార్లు కలిగి ఉంది. లీనియర్ మోటార్లు ఉపయోగించిన మొట్టమొదటి పూర్తి-ఫ్రేమ్ అల్ట్రా-వైడ్, వేగంగా ఫోకస్ పెట్టడమే కాకుండా పనితీరు, నిరంతర ఆటో ఫోకస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. క్రీడలు, యాక్షన్ ఫోటోగ్రాఫర్‌లకు మెరుగైన ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది.

ఈ కెమెరా బరువు కేవలం 29 ఔన్సులు ఉంటుంది. సిగ్మా 14-24mm DN కంటే కేవలం 4 ఔన్సుల బరువు ఉంటుంది. సాధ్యమైనంత కాంపాక్ట్ తేలికైనదిగా ఉండటానికి ఉద్దేశించింది. సిగ్మాకు 1,400 డాలర్ల మాత్రమే ఖర్చవుతుంది. ఈ సోనీ f/ 2.8 కానిస్టెంట్ apertureతో మొదటి ఫుల్-ఫ్రేమ్ 12-24mm వరకు ఉంటుంది. f/2.8, APS-C X- సిరీస్ కెమెరాల కోసం.. ఫుజిఫిల్మ్ కానిస్టెంట్ 8-16mm (12-24mm ఫుల్-ఫ్రేమ్ సమానమైన) చేస్తుందని కెమెరా టెక్ గీక్స్ పేర్కొంది.

ఇందులో ఆసక్తికరమైనది ఏమిటంటే… లీనియర్ ఫోకస్ మోటారును కూడా ఉపయోగిస్తుంది. ఏదేమైనా, APS-C, f / 2.8 ఫుల్-ఫ్రేమ్‌లో f / 4 కు సమానం. సోనీ టూల్ కూడా ఆకట్టుకునేదిగా ఉంది. కానీ ఈ కొత్త లెన్స్ బాగుంది, సోనీ నుంచి అధికారిక ప్రకటన రావల్సి ఉంది. A7S II కెమెరాకు కూడా రుమర్లు రాగా ఈ వేసవిలో కంపెనీ ధ్రువీకరించింది. ఈ కెమెరా విషయంలో కూడా అధికారికంగా సోనీ ప్రకటించాల్సి ఉంది.

Categories
Technology

ఫేస్‌బుక్, వాట్సప్ లకు ధీటుగా పనిచేస్తున్న మేడ్ ఇన్ ఇండియా యాప్

ఫేస్‌బుక్, వాట్సప్ లకు ధీటుగా ఓ యాప్ పనిచేస్తుంది. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆదివారం ఆరంభమైన సోషల్ మీడియా యాప్ ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో భాగంగా మొదలైంది. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ సిస్టమ్, ఐఓఎస్ లలోనూ వాడుకోవచ్చు. యాంటీ చైనా సెంటిమెంట్ బలపడటానికి గానూ 59చైనా యాప్ లను ఇండియా గవర్నమెంట్ నిషేదించింది.

ఇక దేశంలోని 8రాష్ట్ర భాషల్లో అందుబాటులో ఉన్న మేడ్ ఇన్ ఇండియా యాప్.. ఫుల్ ఫ్యామస్ అయింది. దీని సహాయంతో ఆడియో, వీడియో కాల్స్ ఫ్రీగా చేసుకోవడంతో పాటు కాన్ఫిరెన్స్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. మరొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ప్రాంతీయ భాషలో కమాండ్ లు ఇచ్చినా యాప్ కమాండ్ రిసీవ్ చేసుకుంటుంది.

చాలా లోకల్ యాప్ లతో వచ్చిన సమస్య ప్రైవసీ మాత్రమే. డేటా సెక్యూరిటీతో పాటు తమ ఇన్ఫర్మేషన్ ను ఇతరులతో పంచుకోకూడదని అనుకుంటున్నారు. పర్సనల్ పర్మిషన్ లేకుండా వివరాలు మొత్తం థర్డ్ పార్టీ వ్యక్తులకు వెళ్లకూడదని తాపత్రయమంతా.

యాప్ ఫీచర్లు:
సుమేరు సొల్యూషన్స్ దీనిని క్రియేట్ చేసింది. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ లకు ఉన్నట్లుగా న్యూస్ ఫీడ్, సెలబ్రిటీ, అథ్లెట్ పొలిటీషియన్ ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవచ్చు. మన పోస్టులకు పెట్టిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్, లైక్స్, కామెంట్స్ లకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. ఫొటోలు క్లిక్ చేసేటప్పుడు డైరక్ట్ గా వాటిని ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్‌లోనూ పోస్టు చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది.

యాంటీ చైనా సెంటిమెంట్ పెరుగుతున్న వేళ ఇండియా బ్రాండింగ్ తో మార్కెట్ లోకి యాప్ రావడం స్పెషల్. యాప్ స్టోర్ లో 4/5రేటింగ్ కొట్టేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో 4.4/5వచ్చింది. 24గంటల్లో 1.3మిలియన్ డౌన్ లోడ్లు వచ్చాయి.

Categories
Technology

Prime Videoలో 6 Viewer ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు! ఇదిగో ప్రాసెస్!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వ్యూ ప్రొఫైల్స్‌ను కొత్తగా అప్‌డేట్ చేసింది. ఇప్పటివరకూ ఉన్న లిమిట్ పెంచుతూ ఆరుగురు యూజర్లకు అనుమతి ఇస్తుంది. ఒక సింగిల్ అమెజాన్ అకౌంట్లో సొంత ప్రొఫైల్ నుంచి ఆరుగురు వరకు లిమిట్ పెంచేసింది. వీరిలో ఒక్కో యూజర్ వాచ్ చేసే ఫేవరెట్ పర్సనలైజడ్ కంటెంట్ ఆధారంగా ప్రొఫైల్ ద్వారా ఆఫర్ చేస్తోంది.

గత మార్చి నెల నుంచి భారతదేశంలో ప్రైమ్ వీడియోలో Viewer Profiles అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న రోజుల్లో నెమ్మదిగా కస్టమర్లందరికి అందించనుంది. ప్రతి ప్రైమ్ వీడియో ప్లాట్ ఫాంలోని వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఫైర్ టీవీ, ప్లే స్టేషన్ 4 అన్నింటిపై ఈ ప్రొఫైల్‌ను యాక్సస్ చేసుకోవచ్చు.

ప్రైమ్ వీడియోలో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసే ప్రక్రియ సులభం. వెబ్ ప్లాట్ ఫాంలో ప్రైమ్ వీడియో వెబ్ సైట్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లో టాప్ రైట్ కార్నర్‌లో అకౌంట్ ఫస్ట్ నేమ్ కనిపిస్తుంది. ముందుగా.. Add New Option సెలెక్ట్ చేసుకోండి. Profile Name ఎంటర్ చేయండి. మీ పిల్లల కోసం Kids toggle కు స్విచ్ అవ్వచ్చు. Save Chanages పై క్లిక్ చేయండి.

మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్‌లో కింది భాగంలో My Stuff section విజిట్ చేయాలి. టాప్ కార్నర్‌లో యూజర్ నేమ్ Tap చేయండి. Create Profile to Add సెలెక్ట్ చేయండి. New Viewer profile లేదా Manage Profiles లోకి వెళ్లి ప్రస్తుతం ఉన్న యూజర్ నేమ్ మార్చుకోవచ్చు. ఈ తరహా ప్రొఫైల్స్ Viewer Profiles అమెజాన్ ప్రైమ్ వీడియో పోటీదారు ప్లాట్ ఫాంలైన Netflix ప్లాట్ ఫాంపై కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, Netflix మాదిరిగా మీ ప్రొఫైల్ PIN లేదా డిస్ ప్లే పిక్చర్ సెట్ చేయడం కుదరదు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే పరిమితమైన యూజర్ల కోసం చివరికి వ్యూయర్ ప్రొఫైల్‌లను యాడ్ చేయాలని అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఎంటరైన్మెంట్ కోసం స్ట్రీమింగ్ సర్వీసులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం.. అమెజాన్ యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రైమ్ వీడియోలో స్నేహితులతో రిమోట్‌గా మూవీలు, టీవీ షోలను చూసేందుకు అనుమతినిచ్చింది.

వ్యూయర్స్.. గతంలో యూజర్లు థర్డ్ పార్టీ extensions లపై ఆధారపడాల్సి వచ్చేది. విండోస్ PCల కోసం ఇప్పుడు ప్రైమ్ వీడియో యాప్ అందుబాటులో ఉంది. మీ కంప్యూటర్‌లో ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Here>>TikTok Pro పేరుతో మేసేజ్ వచ్చిందా, క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

Categories
Technology

TikTok Pro పేరుతో మేసేజ్ వచ్చిందా, క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

టిక్‌టాక్ బ్యాక్ లేదా టిక్ టాక్ ప్రో పేరుతో మీ ఫోన్ కు ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేశారంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం గ్యారెంటీ. అవును, సైబర్‌ నేరగాళ్లు రూటుమార్చారు. కొత్త ఎత్తుగడ వేశారు.

ఆ లింక్‌లో మాల్ వేర్, క్లిక్ చేస్తే ఖతం:
ఇటీవల ఆరోగ్యసేతు, పీఎం కేర్స్‌ పేరిట నకిలీ రిక్వెస్టులు పంపి ఖాతాలు ఖాళీ చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు తమ మోసాలకు భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్‌ను ఎంచుకున్నారు. టిక్‌టాక్‌ యూజర్లే లక్ష్యంగా సెల్‌ఫోన్లకు యూఆర్‌ఎల్‌ మాల్‌వేర్‌ లింకులను ఎస్సెమ్మెస్‌ రూపంలోనూ, వాట్సాప్ లోనూ పంపుతున్నారు. టిక్‌టాక్‌ రూపుమారిందని, టిక్ టాక్ ఈజ్ బ్యాక్ అని, దీని కోసం ‘టిక్‌టాక్‌ ప్రో’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అందుకు కింది నీలంరంగు లింకును క్లిక్‌ చేయాలని సూచిస్తున్నారు. వీటిని నిజం అని నమ్మిన కొందరు నెటిజన్లు గుడ్డిగా ఆ లింక్ ను గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కానీ అది చాలా ప్రమాదకరం అంటున్నారు సైబర్ పోలీసులు. ఆ లింకులో వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం దొంగిలించే మాల్‌వేర్‌ ఉంటుంది. క్లిక్‌ చేస్తే మాల్‌వేర్‌ వ్యక్తిగత కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోకి చొరబడుతుందని, బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందని తెలంగాణ పోలీసుశాఖ చెబుతోంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది.

టిక్‌టాక్‌ పేరుతో వచ్చే మేసేజ్‌లకు, రిక్వెస్టులకు స్పందించొద్దు:
టిక్‌టాక్‌ పేరుతో వచ్చే రిక్వెస్టులకు స్పందించొద్దని, సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ వినియోగం పెరిగింది. పీఎం కేర్స్, ఆరోగ్యసేతు యాప్‌ల డౌన్‌లోడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఇది గమనించిన సైబర్‌ నేరగాళ్లు వాటి పేరుతో ప్రభుత్వోద్యోగులకు రకరకాల లింకులు పంపి అంతర్గత రహస్యాలు తస్కరించేందుకు, బ్యాంకు ఖాతాలకు కన్నమేసేందుకు యత్నించారు. పలుచోట్ల రూ.కోట్లు కొల్లగొట్టారు.

టిక్‌టాక్ పిచ్చిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు:
తాజాగా టిక్‌టాక్‌ వినియోగదారులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను పడింది. ఇటీవల భారత ప్రభుత్వం చైనాకు చెందిన ఈ యాప్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ ఆదాయంలో 30 శాతం భారత్‌ నుంచే వస్తోంది. భారత్‌లో 2016 నుంచి ఈ యాప్‌ను 24 మంది కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా, యాప్‌ నిషేధానికి గురైన జూన్‌ 29 నాటికి 12 కోట్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. రాత్రికి రాత్రి యాప్‌ ఆగిపోవడంతో యూజర్లు షాక్‌తిన్నారు. టిక్‌టాక్‌ లేకపోవడంతో ముఖ్యంగా దీనిపై ఆధారపడిన యువత, నటులు, మోడళ్లకు ఊపిరాడటం లేదు. వీరంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో టిక్‌టాక్‌ యాప్‌ కోసం అన్వేషిస్తున్నారు. ఇది గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు ‘టిక్‌టాక్‌ ప్రో’ పేరుతో ఎరవేస్తున్నారు.

సెలబ్రిటీలు, ప్రభుత్వోద్యోగులు చిక్కితే:
టిక్‌టాక్‌ యాప్‌ వినియోదారుల్లో యువతతోపాటు సెలబ్రిటీలు, నటులు, ఉద్యోగులు ఉన్నారు. టిక్‌టాక్‌ వల్ల కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారారు. టిక్‌టాక్‌కు బానిసలైన వీరికి ‘టిక్‌టాక్‌ ప్రో’ ప్రత్యామ్నాయ యాప్‌ అంటూ సైబర్‌ నేరగాళ్లు గాలమేస్తున్నారు. వారికి తెలియకుండా రహస్య మాల్‌వేర్‌ను లింకుల్లో చొప్పిస్తున్నారు. వెంటనే సదరు వ్యక్తుల స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్‌ కంప్యూటర్లలోని సమాచారం, రహస్యాలు, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. వ్యక్తిగత రహస్యాలు చేజిక్కితే.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. ప్రభుత్వంలోని కీలకశాఖల్లో పనిచేసే వారి కంప్యూటర్లలోకి ఈ వైరస్‌ జొరబడితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహస్యాలు విదేశీయుల చేతికి చిక్కినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినోదం కోసమంటూ వెళ్తే చివరికి విషాదమే మిగులుతుందని వార్నింగ్ ఇచ్చారు. సో, వాట్సాప్ లో లేదా సోషల్ మీడియాలో ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేయొద్దని సైబర్ పోలీసులు, టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

దేశ భద్రత కోసం చైనా యాప్స్ పై బ్యాన్:
దేశ భద్రత, ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యత కోసం చైనా కంపెనీలకు చెందిన 59 మొబైల్ యాప్స్ ను ఇటీవలే భారత ప్రభుత్వం నిషేధించింది. భారత ప్రభుత్వం నిషేధించిన యాప్స్ లో టిక్ టాక్ ఒకటి. టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో కొందురు యూజర్లు తీవ్రంగా నిరాశ చెందారు. వారు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. కాగా, కొందరు ఇతర దేశీయ షార్ట్ మేసేజింగ్ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకునే పనిలో పడ్డారు.