Categories
Trending Viral

స్పోర్ట్స్ మ్యాగజైన్‌‌ కవర్‌కెక్కిన మొదటి ట్రాన్స్ జెండర్ మోడల్!

స్పోర్ట్స్ ఇల్లిస్ట్రేటేడ్ స్విమ్ స్యూట్ సంచికలో మొదటి ట్రాన్స్‌జెండర్ మోడల్‌గా Valentina Sampaio చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌కు SI స్విమ్‌సూట్ 2020 రూకీ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా సంపాయో మాట్లాడుతూ.. వెబ్‌సైట్‌లో రాసిన నోట్‌లో ఆమె ఉత్సాహంగా, ఎంతో గౌరవంగా ఉందని చెప్పారు.

ఫోటోగ్రాఫర్ Josie Cloughతో కలిసి బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని స్క్రబ్ ద్వీపంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫోటోషూట్ జరిగింది. దీనిపై మోడల్ సంపాయో మాట్లాడుతూ… ‘నేను ఉత్తర బ్రెజిల్‌లోని మారుమూల ప్రాంతంలోని ఫిషింగ్ గ్రామంలో ట్రాన్స్‌లో జన్మించాను.

బ్రెజిల్ ఒక అందమైన దేశం. ప్రపంచంలో ట్రాన్స్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా అత్యధిక హింసాత్మక నేరాలు జరిగే ప్రాంతం కూడా. యుఎస్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.

ట్రాన్స్ అవ్వడం అంటే.. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంటుంది. అవమానాలతో పాటు శారీరక ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నామని తెలిపింది. అంతకుముందు ఆగస్టు 2019లో విక్టోరియా సీక్రెట్ మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ మోడల్‌గా మోడల్ Sampaio చరిత్ర సృష్టించింది.

 

View this post on Instagram

 

 💜🧡💛❤️💚

A post shared by Valentina Sampaio (@valentts) on

Categories
Trending Viral

హెయిర్ స్టైల్ తో ఫోజులు కొడుతున్న ఏనుగు : ఆహా..ఏమి స్టైల్ గజరాజా..అంటున్న నెటిజన్స్

కొత్త కొత్త హెయిర్ స్టైల్ తో అబ్బాయిలు ఫోజులు కొడుతుంటారు. కానీ ఓ ఏనుగు సూపర్ హెయిల్ స్టైల్ తో ఫోజులు కొట్టటం మీరెప్పుడైనా చూశారా? బహుశా చూసి ఉండరులెండి. హా..ఏనుగేంటీ..హెయిర్ స్టైట్ ఏంటీ ఏనుగుకి ఎక్కడన్నా జుట్టు ఉంటుందా? ఉంటే కొద్దిగా ఉందా లేదా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇది నిజ్జంగా నిజం..నుదిటిన చక్కగా నామం పెట్టుకున్న ఏనుగుల్ని దేవాలయాల్లో చూసే ఉంటారు. కానీ ఓ దేవాలంలో ఉన్న ఏనుగు చక్కగా హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రెండ్లీ హెయిర్ స్టైల్ తో ఈ గజరాజు పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది.

తమిళనాడు రాష్ట్రం అంటేనే హైందవ దేవాలయాలకు పెట్టిందిపేరు. అక్కడి దేవాలయాల్లో ఏనుగులు కూడా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు ఆలయాల్లో ఆస్థాన కైంకర్యాల నిమిత్తం ఏనుగులను పెంచి పోషిస్తుంటారు. అటువంటి ఏనుగులన్నీ ఒకెత్తయితే మన్నార్ గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉన్న ‘సెంగమాలమ్’ అనే ఏనుగు వెరీ వెరీ స్పెషల్.

ఈ ‘సెంగమాలమ్’ ఏనుగు చక్కని హెయిర్ స్టయిల్ తో ఆకట్టుకుంటోంది. అది కూడా బాబ్డ్ కట్ హెయిర్ స్టైల్ తో. తన ముఖానికి చక్కగా సెట్ అయ్యింది ఈ క్రాఫింగ్. ఇక చూడాలీ…ఈ సెంగమాలం ఏనుగు ఆ అందం చూసి తీరాల్సిందే.’సెంగమాలమ్’కు సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘సెంగమాలమ్’ ఫొటో పోస్టు చేస్తే చాలు… లైకులు పోటెత్తుతాయి. బాబ్డ్ కట్ ‘సెంగమాలమ్’ అంటే సోషల్ మీడియాలో మాంచి క్రేజ్ ఏర్పడింది.

‘సెంగమాలమ్’ స్వస్థలం కేరళ. 2003లో సెంగమాలమ్ ను మన్నార్ గుడి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. దీని మావటి రాజగోపాల్ దీనికి ప్రత్యేకమైన క్రాఫ్ చేసి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ముఖంపై తిరునామాలు, ఆపైన అందమైన హెయిర్ స్టయిల్… ‘సెంగమాలమ్’ ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి.

Read Here>>పేడను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం : కిలో ఎంతంటే..

Categories
Technology Trending

Orkut గుర్తుందా? 2020లో ట్రెండింగ్.. నెటిజన్లందరూ గుర్తుచేసుకుంటున్నారు!

సాంకేతికపరంగా ఎన్నో విప్లమాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన ఎన్నో సోషల్ ప్లాట్ ఫాంలు కాలక్రమేణా పోటీతత్వ వాతావరణంలో అంతరించిపోతున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన అనేక సర్వీసుల్లో చాలావరకు షట్ డౌన్ చేసేసింది. ఫేస్‌బుక్ రాక ముందు అప్పట్లో Orkut అంటే ఆ క్రేజే వేరు. గూగుల్ జీమెయిల్ ఉన్న ప్రతిఒక్కరూ Orkut సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు. కొత్త, పాత స్నేహితులను అందరిని ఒకే వేదికపై కలిసే వారదిలా Orkut ఉండేది.


ఈ సర్వీసును 2008లో ప్రవేశపెట్టారు. ఈ వెబ్‌సైట్‌ క్రియేటర్ గూగుల్ ఉద్యోగి Orkut Büyükkökten పేరు దీనికి పెట్టారు. 2008లో భారతదేశం, బ్రెజిల్‌లో అత్యధికంగా విజిట్ చేసిన వెబ్‌సైట్లలో Orkut ఒకటిగా నిలిచింది. ఆ తర్వాతి రోజుల్లో ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్క్ లు అందుబాటులోకి రావడంతో గూగుల్ ఈ Orkut సర్వీసును 2014 సెప్టెంబర్ 30న షట్ డౌన్ చేసేంది. అప్పటినుంచి Orkut అంతరించిపోయింది.
Netizens now remember Orkut after 6 Years Netizens are sharing memes and Tweets

ఇన్నేళ్ల తర్వాత 2020లో మళ్లీ Orkut ట్రెండింగ్ అవుతోంది. అప్పట్లో ఆన్ లైన్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకున్న Orkut మధుర క్షణాలను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఈ Orkut అకౌంట్ వినియోగించిన వారంతా ఇప్పుడు 13 ఏళ్ల నాటి ఈ Orkut నాటి అందమైన క్షణాలను 2020లో నెమరవేసుకుంటున్నారు.

ఆన్ లైన్‌లో Orkut అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అప్పటి Orkut మెమెరీలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మెమెలను ట్విట్టర్ వేదికగా ట్వీట్లను షేర్ చేస్తున్నారు. ఆనాటి Orkut ప్లాట్ ఫాంను మిస్ అవుతున్నామనే భావనతో మెమీలను షేర్ చేస్తున్నారు.


సోషల్ మీడియాలో Orkut భారత దేశంలో ఒక విప్లవమనే చెప్పాలి.. Orkut ద్వారా సోషల్ మీడియా పునాదులు ఇండియాలో పడితే.. Facebook ద్వారా సోషల్ మీడియా అగ్ర స్థాయికి దూసుకెళ్లిందనే ప్రతిఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో జీవితం ఎంతో కష్టంగా ఉండేవి.. డేటా మాత్రం ఖరీదైనది.. సోషల్ మీడియా కూడా పరిమితంగానే ఉండేది.. అప్పుడు Orkut అనే సోషల్ ప్లాట్ ఫాం అందరిని అలరించిందని గుర్తుచేసుకుంటున్నారు. అంతేకాదు.. ఇలాంటి మరెన్నో అంశాలకు సంబంధించి నెటిజన్లు ఫన్నీ మెమీలను షేర్ చేస్తున్నారు.

Categories
Latest Trending Viral

చెట్టు ఆకులను అందుకోవడానికి దున్నపోతును నిచ్చెనలా వాడుకొందీ ఈ మేక.. నిజంగా స్మార్టే..!

ఇదో తెలివైన మేక.. ఆకలి వేసింది.. చెట్ల ఆకులు చూడగానే నోరూరింది. కానీ, అందనంత పైనా ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు ఆ మేకకు.. అప్పుడే ఐడియా తట్టింది. వెంటనే ఆ చెట్టుకు కట్టేసిన గేదెను చూసింది. తన పని సులభమని భావించింది. వెంటనే ఆ గేద తలపై నుంచి దానిపైకి ఎక్కేసింది. చెట్లు కొమ్మలను కిందికి లాగి ఆకులను ఆరగించింది.

చెట్టు కొమ్మలను అందుకునేందుకు గేదెను నిచ్చెనలా వాడింది. ఎంతైనా తెలివైనా మేక కదా… అలా తన ఆకలి తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక అవసరం ఒకరితో ఏమైనా చేయిస్తుందని.. అలాగే ఆ అవసరాన్ని తీర్చుకునేందుకు ఏదో దారి వెతుకునేలా చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.. ఈ వీడియో, ఇటీవల ట్విట్టర్‌లో బాగా వైరల్ అవుతోంది.


వీడియో పాతదే అయినప్పటికీ.. ఇటీవల ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక మేక, ఒక గేదె చెట్టు ముందు నిలబడినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. చూస్తుండగానే.. క్షణాల్లో ఆ మేక గేదె వెనుకభాగం నుంచి పైకి ఎక్కింది. పెద్ద బోవిన్‌ నిచ్చెనగా ఉపయోగించుకుంది. చివరికి చెట్టు ఆకులను ఆరగించిన మేక సంతోషంగా కిందికి దిగిపోయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ‘స్మార్ట్ మేక’ అని వీడియోను షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకూ వీడియోకు 12,000 వ్యూస్, 1,200 మంది లైక్‌లు వచ్చాయి. వీడియోను చూసిన వారంతా నవ్వు ఆపులేకపోతున్నారు. జంతువులు మనుషులు అనుకున్నదానికంటే తెలివిగా ఉంటాయని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

Categories
Latest National Trending

ఒకే ప్రయాణికుడితో చెన్నైకి స్పెషల్‌ ఫ్లయిట్..!

ఒక ప్రయాణికుడితో విమానం కదిలింది. కోల్ కత్తా నుంచి ఒకే ప్రయాణికుడితో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చెన్నైకు చేరుకుంది. సింగపూర్‌లో చిక్కుకున్న 145 మంది భారతీయులతో ఎయిర్‌ ఇండియా స్పెషల్ ఫ్లయిట్ కోల్‌కతా మీదుగా చెన్నైకు చేరుకుంది. విమాన ప్రయాణికులను స్వాగతించేందుకు ప్రభుత్వ అధికారులు, వైద్య బందం, ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ శాఖ అధికారులు అంతా సిద్ధంగా ఉన్నారు. కానీ, విమానంలో నుంచి వారు ఊహించినట్టుగా ప్రయాణికులు ఇతర ప్రయాణికులు ఎవరూ లేరు..

ఒక ప్రయాణికుడు మాత్రమే ఉన్నాడు. మెల్లగా కిందికి దిగొచ్చాడు. మిగతా వారంతా ఏరని అక్కడి అధికారులు విచారించగా… సింగపూర్ నుంచి 145 మంది వచ్చినట్టు చెప్పాడు. కోల్ కతాలో 144 మంది దిగి వెళ్లారని తెలిపాడు. తాను మాత్రం చెన్నైకి వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అధికారులంతా అతడికి వెల్ కమ్ చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించారు.

కొద్ది రోజుల క్రితం అతడి భార్య గుండెపోటుతో కన్నుమూసింది. 35 ఏళ్ల వాసుకి మరణించిన సమయంలో అతడు స్వదేశానికి రాలేకపోయాడు. కొన్నిరోజుల తర్వాత ఇప్పుడు ఇంటికి తిరిగి ఒంటరిగా ప్రయాణించాడు. కానీ తల్లిని పోగొట్టుకున్న తన ముగ్గురు పిల్లల కోసం వచ్చినట్టు చెప్పాడు.

మొత్తం విమానంలో ఇది తన ఏకైక ఆలోచనగా కూతన్ అన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సింగపూర్‌లో మేసన్‌గా పనిచేస్తున్నాడు. తాను తన భార్యకు అంత్యక్రియలకు హాజరు కాలేదు. కానీ ఆ తరువాత, అక్కడ ఉన్న తన స్నేహితులు కొందరు సాయం చేయడంతో తాను టికెట్ కొని తిరిగి ఇంటికి వచ్చినట్టు వాపోయాడు.