cats-and-dogs-are-suffering-breathing-problems-after-catching-covid-study-claims1

కరోనా సోకిన పెంపుడు పిల్లులు, కుక్కల్లోనూ శ్వాసకోశ సమస్యలు.. అధ్యయనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి జంతువులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మనుషుల్లో మాదిరిగా జంతువుల్లోనూ కరోనా వ్యాపిస్తోంది. ప్రత్యేకించి పెంపుడు జంతువుల్లో పిల్లులు, కుక్కల్లోనూ కరోనా సోకిన తర్వాత శ్వాస పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయంట..



పిల్లులు, కుక్కలను పెంచుకునే యజమానుల నుంచి కరోనా వైరస్ వాటికి కూడా సోకే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.. అందుకే పెంపుడు జంతువుల యజమానులు వాటికి వైరస్ సోకకుండా ఉండేందుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు.. అంతేకాదు.. పెంపుడు జంతువులకు కరోనా సోకినా కూడా వాటి నుంచి వైరస్ యజమానులకు సోకే అవకాశం ఉందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.
Cats and dogs are suffering breathing problems after catching Covid, study claimsకరోనా నిర్ధారణ కోసం 17 పిల్లులు, 18 కుక్కలు, ఒక ఫెరట్ నుంచి స్వాబ్స్ (తెమడ) సేకరించారు.. అందులో ఒక పిల్లి మాత్రమే కరోనా అంతర్గత లక్షణాలు ఉన్నట్టుగా కనిపించింది. మిగిలిన వాటికి కరోనా నెగటీవ్ తేలింది.. అలాగే 8 పిల్లల నుంచి 10 కుక్కల నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు.. ఏడు పిల్లుల్లో 88 శాతం, రెండు కుక్కల్లో 20 శాతం మేర కోవిడ్ యాంటీబాడీస్ తయారైనట్టు రీసెర్చర్లు గుర్తించారు. అన్ని పిల్లుల్లో అనిశ్చిత లక్షణాలు లేదా పాజిటివ్ యాంటీబాడీలు ఉన్నాయని నిర్ధారించారు..



కానీ, వాటిలో శ్వాసపరమైన సమస్యలు ఉన్నాయని గుర్తించారు. వాటి యజమానుల కరోనా ఇన్ఫెక్షన్ సోకిన సమయం నుంచి అనారోగ్య సమస్యలు తలెత్తాయా లేదా అని పరిశోధకులు నిర్ధారించారు. రెండు కుక్కులకు IgG పాజిటివ్ యాంటీ బాడీలు ఉన్నాయని గుర్తించారు.



పెంపుడు జంతువుల నుంచి యజమానులకు కరోనా వ్యాప్తి చెందినట్టు ఎలాంటి నివేదికలు లేవు. కానీ, వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది.. మనుషుల నుంచి జంతువులకు వ్యాపించినట్టుగానే మళ్లీ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు.

Related Posts