లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే పిల్లులకు, కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే

Published

on

COVID vaccine: కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. పిల్లులు, కుక్కలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని సైంటిస్టులు చెబుతున్నారు. జంతువుల్లో వైరస్ ప్రబలుతున్న క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేస్తున్ానరు. ఈస్ట్ ఏంజిలా యూనివర్సిటీ రీసెర్చర్స్ పెంపుడు జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా పబ్లిక్ హెల్త్ ను కాపాడుకోవచ్చని చెప్తున్నారు.

జంతువుల్లో వ్యాక్సిన్ వేయాలనేది ఆలోచించకుండా వదిలేయకూడదు. ఇన్ఫెక్షన్ ను అడ్డుకోవడానికి తప్పనిసరి అని మెడికల్ జర్నల్ నిపుణులు అంటున్నారు. నిజానికి పెంపుడు జంతువులకు వ్యక్తుల నుంచి కొవిడ్ 19 వ్యాప్తి చెందినట్లు వివరాలు లేవు.

పెంపుడు జంతువులకు, దేశీవాలీ జంతువులకు వ్యాక్సిన్ వేయాల్సిన సమయం వచ్చిందని తెలుస్తోంది. రిస్క్ తగ్గించడానికి ముందస్తు జాగ్రత్త చర్య తీసుకోవాలి. హ్యూమన్ సొసైటీ కింద మనం కచ్చితంగా కొవిడ్ వ్యాప్తి గురించి ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇది పిల్లులకు, కుక్కలకు జరిగితే లాంగ్ టర్మ్ రిస్క్ నుంచి కాపాడినట్లు అవుతుంది.

SARS-CoV-2/Covid-19ల గురించి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతుంటే.. కొత్త వైరస్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇటువంటి సమయంలో వైరస్ ను సమూలంగా నాశనం చేయాలంటే పెంపుడు జంతువులకు తప్పకుండా టీకాలు వేయించాలి. ప్రభుత్వాలు పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరి, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే అని చెప్తున్నా.. కొత్త కొవిడ్ వేరియంట్ల వ్యాప్తి జరుగుతూనే ఉంది.