లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

50మంది చిన్నారులపై లైంగిక దాడి.. జూనియర్ ఇంజనీర్‌ని‌ అరెస్ట్ చేసిన CBI

Published

on

CBI Arrests Engineer: అన్నెం పున్నెం ఎరుగని పసి మొగ్గలపై కిరాతకంగా లైంగికదాడి చేసిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్‌ను అరెస్ట్ చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI). సుమారు 50 మంది చిన్నారులపై (ఐదు నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు గలవారు) లైంగిక దాడికి పాల్పడినందుకు ఉత్తర ప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన జూనియర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.నిందితుడు పదేళ్లకు పైగా ఇలా చేస్తున్నాడని అధికారులు వెల్లడించారు. నిందితుడు వీడియోలు మరియు ఫోటోలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిత్రకూట్, బండా మరియు హమీర్‌పూర్ మూడు జిల్లాల్లో ‘పిల్లలపై లైంగిక దాడి’ జరిగింది. జూనియర్ ఇంజనీర్‌ను బండా జిల్లాలో అరెస్టు చేయగా.. త్వరలో కోర్టులో హాజరుపరుస్తారు అధికారులు.అతని దగ్గర నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఎనిమిది లక్షల రూపాయల విలువైన డబ్బు, సెక్స్ బొమ్మలు, ల్యాప్‌టాప్‌లు మరియు పెద్ద మొత్తంలో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన వస్తువులను child sexual abuse material (CSAM) సీబీఐ స్వాధీనం చేసుకుంది. మొబైల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించి పిల్లలను ఆకర్షించినట్లుగా నిందితుడు అధికారులకు చెప్పాడు. బయటకు చెప్పకుండా పిల్లలను బెదిరించినట్లుగా ఒప్పుకున్నాడు.జనవరిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నుండి వచ్చిన సమాచారం ప్రకారం, భారతదేశంలో ప్రతిరోజూ 100 మందికి పైగా పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పడు సుమారు 22 శాతం పెరిగింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *