లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

లంచగొండులుగా దొరికిపోయిన నలుగురు సీబీఐ అధికారులు

Published

on

CBI: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తమ సొంత హెడ్ క్వార్టర్ లోనే రైడింగ్ జరిపి నలుగురు అధికారులను బుక్ చేసింది. ఓ కంపెనీ నుంచి లంచం తీసుకునేందుకు మరో ఏజెన్సీ హెల్ప్ చేసిందని తేలింది. 14లొకేషన్లలో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించిన అధికారులకు చార్టెర్డ్ అకౌంటెంట్స్ పట్టుబడ్డారు.

‘డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, స్టెనో, ప్రైవేట్ పర్సన్/ఇతరులు కలిపి మొత్తం నలుగురు అధికారులపై సీబీఐ కేస్ రిజిష్టర్ చేసింది. ఢిల్లీ, ఘాజియాబాద్, నోయిడా, గుర్‌గావ్, మీరట్, కాన్పూర్ పరిధుల్లో సెర్చింగ్ నిర్వహించారు. గురువారం రాత్రి కూడా కొన్ని ఆఫీసులు సెర్చింగ్ చేసిన అధికారులు సీజీఓ కాంప్లెక్స్ లోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేశారు.

ఇద్దరు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసులు ఆర్కే రిషీ, ఆర్కే సంగ్వాన్, స్టెనోగ్రాఫర్ సమీర్ కుమార్ సింగ్, ఇన్‌స్పెక్టర్ కపిల్ ధాంకడ్ లను అదుపులోకి తీసుకున్నారు. ఒకరు బ్యాంకింగ్ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ సెల్ లో పనిచేస్తున్నట్లుగా చెప్పారు. గురువారం రాత్రి సమయంలో ఆఫీసులన్నీ సెర్చ్ చేసి వారిని పట్టుకున్నాం. ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీతో చేసిన రూ.3వేల 500 బ్యాంక్ ఫ్రాడ్ కేసుతో వీరికి సంబంధమున్నట్లు తెలిసింది.

కంపెనీ ప్రమోటర్లతో, మధ్య వర్తులతోనూ అధికారులకు సంబంధాలున్నాయి. సీబీఐ స్పెషల్ యూనిట్ ప్రకారం.. అనుమానితులపై ప్రత్యేక నిఘాపెట్టేసరికి దొరికేశారు. రెండేళ్ల క్రితం సీబీఐ ఐదుగురిపై యాంటీ కరప్షన్ యూనిట్స్ ప్రకారం.. అనుమానితులకు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి.

2018 ఆగష్టులో చేసిన సెర్చెస్ లో సీబీఐ 20రోలెక్స్ లగ్జరీ వాచ్ లు, రూ.3.6కోట్ల నగదు, రూ.1.6కోట్ల విలువైన బంగారం తివారీ అనే వ్యక్తి ఇంట్లోని కప్ బోర్డు నుంచి స్వాధీన పరచుకున్నారు. సీబీఐ డాక్యుమెంట్లతో సహా హవాలా నగదు లావాదేవీలను నిరూపించింది. తివారీ సర్వీసెస్ పేరిట విదేశాలకు అక్రమంగా నగదు తరలిస్తున్నట్లుగా తేల్చారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినైనా నేర నిరూపితమవలేదని.. ఇద్దరిపై మాత్రమే యాక్షన్ తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.