Home » భారత ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్..కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు
Published
1 month agoon
CBI case files against Cambridge Analytics : యుకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 5 లక్షల 62 వేల మంది ఇండియన్ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేంబ్రిడ్జ్ ఎనలిటాకాతో సహా బ్రిటన్‌కు చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసర్చ్ ఏజెన్సీపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
భారత్‌లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి కన్సల్టింగ్ సంస్థలు ఫేస్బుక్ డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డేటా లీక్ వ్యవహారాలకు కేంబ్రిడ్జ్ ఎనలిటికా కేంద్రబిందువుగా నిలుస్తోంది. గతంలోనూ ఈ సంస్థపై అనేక ఆరోపణలు ఉండగా..2016లో అమెరికాలో దొషిగా కూడా తేలింది.
2016లో ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికా లీక్ చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు దోహదం చేసింది. భారత్ సహా వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు డేటాను అందించిందన్న ఆరోపణలు అప్పట్లోనే ప్రకంపనలు సృష్టించాయి.
Koo ప్రత్యేకతలేంటీ ? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ?
ఫేస్బుక్ వాడే వారికి వార్నింగ్, అలా చేస్తే మోసపోయినట్లే
వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్న మహిళలు, అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి
మీ పేరు కమలా.. అయితే ఈ ఆఫర్ మీకే
చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లు..17 గంటలు నాన్‌స్టాప్‌గా విమానాన్ని నడిపి రికార్డు క్రియేట్
ఇంటి అద్దె కట్టడానికి డబ్బుల్లేని స్థితి నుంచి యూఎస్ ఆర్మీ ఫస్ట్ సీఐఓగా ఇండియన్-అమెరికన్