సరస్వతి పుత్రిక : 600కి 600 మార్కులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రమ, పట్టుదల ఉంటే..ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. తాజాగా కష్టపడి..పట్టుదలతో చదవి..CBSE 12th పరీక్షల్లో 100 శాతం మార్కులను సాధించి రికార్డు నెలకొల్పింది. ARTS విభాగంలో ఈ ఘనత సాధించింది. ఈ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశ తొలిసారి అని విద్యావేత్తలు అంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రా రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్ (18)..సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 12వ తరగతి పరీక్ష రాసింది. ఈ ఫలితాలు 2020, జులై 13వ తేదీ సోమవారం విడుదలయ్యాయి. ఇందులో జైన్ కు 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించింది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

పేరెంట్స్, కుటుంబసభ్యులు, టీచర్ల మార్గనిర్దేశం వల్లే..తాను ఈ ఘనతను సాధించానని జైన్ వెల్లడించింది. హిస్టరీలో బీఏ సీటు కోసం ఢిల్లీ యూనివర్సిటీకి తాను దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపింది.

ఈ ఏడాది CBSE 12వ తరగతి పరీక్షలకు 11.92 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే మొదటిస్థానంలో నిలిచారు. బాలికల ఉత్తీర్ణత 92.15% కాగా, బాలురు 86.19% ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షను ట్రాన్స్‌జెండర్ల కూడా రాశారు. వీరి ఉత్తీర్ణత శాతం 66.67గా ఉన్నది. మొత్తంగా పరీక్షల్లో ఉత్తీర్ణత 88.78%గా నమోదైంది. కరోనా నేపథ్యంలో బోర్డు ఈ ఏడాది మెరిట్‌ జాబితాను విడుదల చేయలేదు.

Related Posts