పాక్ విమానం క్రాష్..సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్

CCTV footage of Pakistan plane crash

పాకిస్థాన్‌లోని క‌రాచీలోని జిన్నా ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని మోడల్ కాలనీలో శుక్రవారం ఓ విమానం కూలిన విషయం తెలిసిందే. 97 మంది మరణించిన ఈ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన  సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. విమానం కూలిన ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌్లో ఆ ప్రమాద ఘటన రికార్డ్ అయింది. బిల్డింగ్‌ల‌పై విమానం కూలుతున్న‌ట్లు ఆ వీడియోలో ఉన్న‌ది. ల్యాండింగ్ స‌మ‌యంలో విమానం నేరుగా ఇండ్ల‌పై కూలినట్ల ఆ వీడియోలో క‌నిపిస్తోంది.

అయితే విమానం కూల‌డానికి ముందు.. ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో విమానం గాల్లో రెండుమూడు సార్లు చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు.  ప్ర‌మాదానికి ముందు పైల‌ట్‌.. ఏటీసీ అధికారుల‌తో సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తిన‌ట్లు అత‌ను చెప్పిన‌ట్లు  సమాచారం. స‌ర్ డైరెక్ట్‌గా వ‌స్తున్నాను, మా ఇంజిన్ ఫెయిల్ అయ్యింద‌ని పైల‌ట్ త‌న సంభాష‌ణ‌లో తెలిపాడు.

స‌ర్‌.. మేడే, మేడే, మేడే పాకిస్థాన్ 8303 అంటూ ఉండ‌గానే ట్రాన్స్‌మిష‌న్ కోల్పోయిన‌ట్లు ఏటీసీ అధికారులు చెప్పారు. అంత‌ర్జాతీయ విమానాల పైల‌ట్లు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో మేడే.. మేడే అంటూ ఏటీసీతో సంభాషిస్తుంటారన్న విషయం తెలిసిందే. రేడియో క‌మ్యూనికేష‌న్‌లో వాళ్లు ఇలా చెబుతుంటారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్ర‌యాణికులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. క్రాష్ అయిన విమానాన్ని ఎయిర్ బస్ A320గా గుర్తించారు.పాకిస్తాన్‌లోని లాహోర్ నగరం నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Read: పాక్ విమాన ప్రమాదంలో 97మంది మృతి...క్రాష్ అయ్యేముందు మేడే, మేడే అన్న పైలట్

మరిన్ని తాజా వార్తలు