ఆన్ లైన్ లోనే శ్రీకృష్ణ జన్మష్టమి వేడుకలు వీక్షించండి : ఇస్కాన్ టెంపుల్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏడాది శ్రీ కృష్ణ జన్మష్టమి అంటే కిట్టయ్య పుట్టిన రోజు రేపే. ఆగస్టు 11న శ్రీ కృష్ణ జన్మష్టమి వేడుకలకు భారతదేశ వ్యాప్తంగా 150కి పైగా ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ ముస్తాబయ్యాయి. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఇస్కాన్ టెంపుల్ వేడుకలను డిజిటల్ రూపంలోనే దర్శించుకోవాలని ఎవ్వరూ ఆలయాలకు రావద్దని ఇస్కాన్ టెంపుల్స్ యాజమాన్యం తెలిపింది. ఆన్ లైన్ లోనే ఈ వేడుకలను అందుబాటులోకి తీసుకొచ్చిమని దయచేసి అందరూ శ్రీకృష్ణుడు జన్మష్టామి వేడుకలను ఆన్ లైన్ లోనే సందర్శించుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లోనే దర్శించుకోవాలని కోరారు. కానీ దర్శనానికి హాజరు కావాలనుకునేవారు మాత్రం ముందుగానే అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలని తెలిపారు.శ్రీకృష్ణుడు పుట్టిన ద్వారకలోనే కాక దేశ వ్యాప్తంగా ఉండే 150 ఇస్కాన్ టెంపుల్స్ లోనే ఈ ఏడాది జన్మష్టమి వేడులకు ఆన్ లైన్ లోనే భక్తులు సందర్శించుకోవాలని తెలిపారు. ఇప్పటికే బెంగళూరు..ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఒడిశాలలో జన్మష్టమి వేడుకలకు దేవాలయాలు ముస్తాబయ్యాయి. ఆన్ లైన్ దర్శనాలకు సన్నాహాలు చేస్తున్నాయి.ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 12 వరకూ కొనసాగుతాయని..కానీ భక్తుల ప్రవేశం కరోనా కారణంగా బాగా కుదించామని దయచేసి ఈ పరిస్థితిని కృష్ణ భక్తులంతాఅర్థం చేసుకోవాలని ఢిల్లీ ఇస్కాన్ టెంపు వైస్ ప్రెసిడెంట్ వ్రేజేంద్ర నందన్ దాస్ తెలిపారు. యాజమాన్యం తెలిపింది. కానీ..టెంపుల్ కు హాజరు కావాలని అనుకునే భక్తులు కంపల్సరిగా ముందుగా దర్శనం బుక్ చేసుకోవాలని సూచించారు.

Related Posts