రోజులు మారాయి… బయటికొస్తున్న సెలబ్రిటీలు, షూటింగులకు రెడీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

స్టార్లు బయటికొస్తున్నారు. 4 నెలల నుంచి కరోనాతో కంప్లీట్‌గా లాక్ అయిపోయిన హీరో, హీరోయిన్లు.. ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో వంటలు చేస్తూ.. ఇల్లు క్లీన్ చేస్తూ.. పెయింటింగ్స్ వేస్తూ.. ఇలా కంప్లీట్‌గా హౌస్ అరెస్ట్ అయిపోయిన స్టార్లు.. ఈ మధ్యే విడుదలై బయటి ప్రపంచాన్ని చూస్తున్నారు.

మొన్నటి వరకూ కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్‌తో కంప్లీట్‌గా ఇంటికే పరిమితం అయిపోయారు స్టార్లు. ఈ మధ్యే లాక్‌డౌన్ రిలాక్సేషన్స్ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే బయటపడి ప్రపంచాన్ని చూస్తున్నారు. రీసెంట్‌గా సీనియర్ హీరో నాగార్జున బయటికొచ్చారు. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ షూట్ కోసం బయటికొచ్చానని సోషల్ మీడియాలో చెప్పారు కింగ్ నాగ్.

మొన్నామధ్య బన్నీకూడా అంతే. చాలా కాలం నుంచి ఇల్లు తప్ప మరెక్కడికీ వెళ్లని అల్లు అర్జున్.. రీసెంట్‌గా మార్నింగ్ వాక్ కోసం భార్య స్నేహతో కలిసి బయటికొచ్చారు. మై ఫేవరెట్ మార్నింగ్ వాక్స్ అంటూ తొలిపొద్దుని బాగా ఎంజాయ్ చేశారు బన్నీ.

స్టార్ హీరోయిన్ తమన్నా కూడా చాలా కాలం నుంచి ఇంట్లో ఉండి ఈ మధ్యనే బయటికొచ్చింది. సరదాగా అలా షోల్డర్ బ్యాగ్ తగిలించుకుని ఫారెస్ట్‌లోకి వాకింగ్ వెళ్తున్నా అంటూ పిక్స్ పోస్ట్ చేసింది తమన్నా.

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా ఈ మధ్యే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఇల్లు వదిలి బయటికెళ్లా. ఇన్నాళ్లు ఇంట్లో ఉండి.. నాలుగు గోడల్ని చూసి బోర్ కొట్టింది. నా ఫేవరెట్ స్పోర్ట్.. గోల్ఫ్ ఆడాను అంటూ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

బాలీవుడ్ కూడా చాలా కాలం తర్వాత బయటికొస్తున్నారు. అసలే ముంబై.. ఆ పై కరోనా ఫుల్‌గా ఉన్న రాష్ట్రం. ఎందుకొచ్చిన రిస్క్ అని ఇన్నాళ్లు బయటికి రాలేదు. కానీ లేటెస్ట్‌గా కత్రినా కైఫ్.. రిలాక్సేషన్ కోసం బయటికొచ్చింది. బ్లాక్ జిమ్ సూట్ లో సరదాగా మార్నింగ్ సైక్లింగ్ చేసుకుంటూ రోడ్డుమీద వెళుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా లాక్‌డౌన్ తర్వాత బయటికొచ్చారు. ముంబై, జుహులోని డబ్బింగ్ స్టూడియోలో తన సినిమాకు సంబంధించి డబ్బింగ్ కంప్లీట్ చేస్తున్నారు అక్షయ్. అంతేకాదు .. త్వరలోనే అప్ కమింగ్ మూవీ బెల్ బాటమ్‌కి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ చెయ్యబోతున్నారు అక్షయ్.

మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా బ్యాక్ టూ వర్క్ అంటూ వరుసగా ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఈ మద్యనే అలా చల్లగాలికోసం బయటికొచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

READ  కొరటాల, చిరు సినిమాలో అనసూయ!

నార్త్ ఫైర్ బ్రాండ్ కంగనా కూడా .. హమ్మయ్య ఇన్నాళ్లకి బయటికొచ్చే ఛాన్సొచ్చింది అంటూ ఫ్యామిలీ మెంబరస్ తో కలిసి సరదాగా ట్రిప్ కి వచ్చాను అంటూ కొండకోనల్లోకి వెళ్లిన వీడియో ని పోస్ట్ చేసింది. ఆ గ్రీనరీ మీద కిందపడి దొర్లుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

4నెలల నుంచి కటింగ్ షాప్స్ లేక ..గడ్డాలు ,మీసాలు , జుట్టు పెరిగిపోయి మాంత్రికుల్లా మారిపోయారు కొంతమంది హీరోలు. కొంతమందికి ఇంట్లోనే హెయిర్ కట్ చేసేస్తే..కొంతమంది మాత్రం సెలూన్ ఓపెన్ అయ్యేవరకూ వెయిట్ చేశారు. అలా చాలా కాలం తరవాత సెలూన్ కి హెయిర్ కట్ కోసం వెళ్‌లానోచ్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు అర్జున్ కపూర్.

వీళ్లతో పాటు కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్.. తమ కొడుకు తైమూర్ ని తీసుకుని వాకింగ్ కోసం అనిల్ కపూర్ డబ్బింగ్ కోసం, తాప్సీ ఫోటో షూట్ కోసం, టైగర్ ష్రాఫ్ ఫిట్ నెస్ కోసం.. ఇలా చాలా కాలం తర్వాత ఇల్లు వదిలి బయటికి వచ్చారు స్టార్లు.

Related Posts