‘ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేకపోతున్నాం’.. బాలుకు సినీ ప్రముఖుల నివాళి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SP Balasubramanyam – Celebrities Tribute: ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించిన ఆ గానగంధర్వుని స్వరం మూగబోయింది. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 01:4 నిమిషాలకు కన్నుమూసినట్లుగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.
బాలు మరణవార్త వినగానే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి. సంగీత ప్రియులు, బాలు అభిమానులు ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. బాలు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేస్తున్నారు. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు అర్పిస్తున్నారు.
చిత్ర, ఏ.ఆర్. రెహమాన్, హరిహరన్, మోహన్ లాల్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, మోహన్ బాబు, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, రవితేజ, నిఖిల్, రామోజీ రావు, విజయశాంతి, రాజమౌళి, రామ్, ఆర్.మాధవన్, జగపతి బాబు, అల్లరి నరేష్, శర్వానంద్, గుణశేఖర్, అజయ్ దేవ్‌గన్, సల్మాన్ ఖాన్, బోని కపూర్, కొరటాల శివ, సుమన్, రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి, శంకర్, లింగుస్వామి, జిబ్రాన్, థమన్, దేవిశ్రీప్రసాద్, మారుతి తదితరులు బాలు గారికి సంతాపం తెలియచేశారు.
Related Posts